హోషేయ
2 “మీ సహోదరులతో, ‘మీరు నా ప్రజలు’* అని,+
మీ సహోదరీలతో, ‘మీరు కరుణించబడిన స్త్రీలు’* అని అనండి.+
ఆమె తన వ్యభిచారాన్ని* విడిచిపెట్టాలి,
తన రొమ్ముల మధ్య నుండి వ్యభిచారాన్ని తొలగించాలి.
3 లేదంటే నేను ఆమె బట్టలు తీసేసి, ఆమె పుట్టినప్పుడు ఎలా ఉందో అలా చేస్తాను,
ఆమెను ఎడారిలా* చేస్తాను,
నీళ్లు లేని ప్రదేశంగా మారుస్తాను,
దాహంతో ఆమె చనిపోయేలా చేస్తాను.
4 నేను ఆమె కుమారుల్ని కరుణించను,
ఎందుకంటే వాళ్లు వ్యభిచారం* వల్ల పుట్టిన కుమారులు.
5 వాళ్ల అమ్మ వ్యభిచారం* చేసింది.+
వాళ్లను కడుపున మోసిన ఆమె అవమానకరంగా ప్రవర్తించింది.+ ఆమె ఇలా అనుకుంది:
‘నేను నా ప్రియుల వెంట వెళ్తాను,+
వాళ్లు నాకు ఆహారాన్ని, నీళ్లను,
ఉన్నివస్త్రాన్ని, నారవస్త్రాన్ని, నూనెను, ద్రాక్షారసాన్ని ఇస్తారు.’
6 కాబట్టి నేను నీ దారికి అడ్డంగా ముళ్లకంచె వేస్తాను;
ఆమె తన దారుల్ని కనుక్కోకుండా
ఆమెకు అడ్డంగా ఒక రాతి గోడ కడతాను.
7 ఆమె తన ప్రియుల వెనక పరుగులు తీస్తుంది, కానీ వాళ్లను కలుసుకోలేదు;+
ఆమె వాళ్ల కోసం చూస్తుంది, కానీ వాళ్లను కనుక్కోలేదు.
అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది, ‘నేను నా మొదటి భర్త దగ్గరికి తిరిగెళ్తాను,+
ఇప్పటికన్నా అప్పుడే నా పరిస్థితి బాగుండేది.’+
8 ఆమెకు ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను,
విస్తారమైన వెండిని, బంగారాన్ని ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు,+
9 ‘కాబట్టి, ఇప్పుడు నేను తిరిగొచ్చి
కోత సమయంలో నా ధాన్యాన్ని, సమకూర్చే కాలంలో నా కొత్త ద్రాక్షారసాన్ని తీసేసుకుంటాను.+
అలాగే ఆమె మానాన్ని కప్పే నా ఉన్నివస్త్రాన్ని, నా నారవస్త్రాన్ని లాగేసుకుంటాను.
11 నేను ఆమె సంతోషమంతటికీ,
ఆమె పండుగలకు,+ ఆమె అమావాస్య రోజులకు, ఆమె విశ్రాంతి రోజులకు,* ఆమె ఉత్సవ కాలాలన్నిటికీ ముగింపు పలుకుతాను.
12 ఆమె ద్రాక్షచెట్లను, అంజూర చెట్లను నాశనం చేస్తాను; వాటి గురించి ఆమె,
“ఇవి నా ప్రియులు నాకు ఇచ్చిన జీతం” అని అనుకుంది;
నేను వాటిని అడవిగా మారుస్తాను,
అడవి జంతువులు వాటిని మింగేస్తాయి.
13 ఆమె బయలు విగ్రహాలకు బలులు అర్పించిన రోజుల్ని బట్టి,+
ఉంగరాల్ని, ఆభరణాల్ని పెట్టుకుని తన ప్రియుల వెంట పరుగులు తీసిన రోజుల్ని బట్టి నేను ఆమెను లెక్క అడుగుతాను,
ఆమె నన్ను మర్చిపోయింది’+ అని యెహోవా అంటున్నాడు.
15 అప్పటినుండి నేను ఆమె ద్రాక్షతోటల్ని ఆమెకు తిరిగిస్తాను,+
ఆకోరు లోయను+ నిరీక్షణకు ద్వారంగా చేస్తాను;
ఆమె యువతిగా ఉన్నప్పటిలా అక్కడ నాకు జవాబిస్తుంది,
16 ఆ రోజు నువ్వు నన్ను “నా భర్త” అని అంటావు,
ఇకమీదట నువ్వు నన్ను “నా యజమాని”* అని అనవు’ అని యెహోవా అంటున్నాడు.
17 ‘నేను ఆమె నోటి నుండి బయలు విగ్రహాల పేర్లు రాకుండా చేస్తాను,+
వాటి పేర్లను ఇక ఎవ్వరూ గుర్తు చేసుకోరు.+
18 ఆ రోజు నేను వాళ్ల కోసం అడవి జంతువులతో,
ఆకాశపక్షులతో, నేలమీద పాకే ప్రాణులతో+ ఒక ఒప్పందం* చేస్తాను;+
విల్లు, ఖడ్గం, యుద్ధం అనేవి దేశంలో లేకుండా చేస్తాను,+
19 నువ్వు ఎప్పటికీ నా దానివి అయ్యేలా నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను;
నీతితో, న్యాయంతో, విశ్వసనీయ ప్రేమతో, కరుణతో+
నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను.
20 నమ్మకత్వంతో నేను నిన్ను ప్రధానం చేసుకుంటాను.
నువ్వు తప్పకుండా యెహోవాను తెలుసుకుంటావు.’+
21 యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఆ రోజు నేను జవాబిస్తాను;
నేను ఆకాశానికి జవాబిస్తాను,
అది భూమికి జవాబిస్తుంది,+
22 భూమి ధాన్యానికి, కొత్త ద్రాక్షారసానికి, నూనెకు జవాబిస్తుంది;
అవి యెజ్రెయేలుకు* జవాబిస్తాయి.
వాళ్లేమో, “నువ్వు మా దేవుడివి” అని అంటారు.’ ”+