కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

నిర్గమకాండం విషయసూచిక

      • చేతిపని చేసేవాళ్లు దేవుని పవిత్రశక్తితో నింపబడడం (1-11)

      • విశ్రాంతి రోజు దేవునికీ ఇశ్రాయేలీయులకూ మధ్య సూచన (12-17)

      • రెండు రాతి పలకలు (18)

నిర్గమకాండం 31:2

అధస్సూచీలు

  • *

    అక్ష., “పేరు పెట్టి పిలిచాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 35:30-34
  • +నిర్గ 37:1

నిర్గమకాండం 31:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:9-11
  • +2ది 2:13, 14

నిర్గమకాండం 31:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 38:23
  • +నిర్గ 36:1

నిర్గమకాండం 31:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 36:8
  • +నిర్గ 37:1
  • +నిర్గ 37:6

నిర్గమకాండం 31:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 37:10
  • +నిర్గ 37:17, 24
  • +నిర్గ 37:25

నిర్గమకాండం 31:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 38:1; 40:6
  • +నిర్గ 30:18; 38:8

నిర్గమకాండం 31:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 39:1, 27; లేవీ 8:7

నిర్గమకాండం 31:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:25, 35; 37:29

నిర్గమకాండం 31:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:30; కొలొ 2:16, 17

నిర్గమకాండం 31:14

అధస్సూచీలు

  • *

    లేదా “చంపేయాలి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:12
  • +నిర్గ 35:2; సం 15:32, 35

నిర్గమకాండం 31:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 16:23; 20:10

నిర్గమకాండం 31:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 88

నిర్గమకాండం 31:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 31:13
  • +ఆది 2:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2019, పేజీ 3

నిర్గమకాండం 31:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:12; 32:15; ద్వితీ 4:13; 9:15
  • +మత్త 12:28; లూకా 11:20; 2కొ 3:3

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

నిర్గ. 31:2నిర్గ 35:30-34
నిర్గ. 31:2నిర్గ 37:1
నిర్గ. 31:5నిర్గ 28:9-11
నిర్గ. 31:52ది 2:13, 14
నిర్గ. 31:6నిర్గ 38:23
నిర్గ. 31:6నిర్గ 36:1
నిర్గ. 31:7నిర్గ 36:8
నిర్గ. 31:7నిర్గ 37:1
నిర్గ. 31:7నిర్గ 37:6
నిర్గ. 31:8నిర్గ 37:10
నిర్గ. 31:8నిర్గ 37:17, 24
నిర్గ. 31:8నిర్గ 37:25
నిర్గ. 31:9నిర్గ 38:1; 40:6
నిర్గ. 31:9నిర్గ 30:18; 38:8
నిర్గ. 31:10నిర్గ 39:1, 27; లేవీ 8:7
నిర్గ. 31:11నిర్గ 30:25, 35; 37:29
నిర్గ. 31:13లేవీ 19:30; కొలొ 2:16, 17
నిర్గ. 31:14ద్వితీ 5:12
నిర్గ. 31:14నిర్గ 35:2; సం 15:32, 35
నిర్గ. 31:15నిర్గ 16:23; 20:10
నిర్గ. 31:17నిర్గ 31:13
నిర్గ. 31:17ఆది 2:2
నిర్గ. 31:18నిర్గ 24:12; 32:15; ద్వితీ 4:13; 9:15
నిర్గ. 31:18మత్త 12:28; లూకా 11:20; 2కొ 3:3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
నిర్గమకాండం 31:1-18

నిర్గమకాండం

31 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “ఇదిగో, యూదా గోత్రానికి చెందిన హూరు మనవడూ, ఊరి కుమారుడూ అయిన బెసలేలును+ నేను ఎంచుకున్నాను.*+ 3 నేను అతన్ని నా పవిత్రశక్తితో నింపి, అతనికి తెలివిని, అవగాహనను, జ్ఞానాన్ని, అన్నిరకాల చేతిపనులు చేసే నైపుణ్యాన్ని ఇస్తాను. 4 దానివల్ల అతను కళాత్మక రూపాల్ని చేయగలుగుతాడు; బంగారం పని, వెండి పని, రాగి పని చేయగలుగుతాడు; 5 అలాగే విలువైన రాళ్లను చెక్కి పొదగడం,+ అన్నిరకాల చెక్క వస్తువులు తయారుచేయడం అతనికి వస్తుంది.+ 6 అంతేకాదు, అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన అహోలీయాబును+ నేను నియమించాను. అలాగే, పనిలో నైపుణ్యం ఉన్న వాళ్లందరి హృదయాల్ని నేను తెలివితో నింపుతున్నాను. దానివల్ల వాళ్లు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతీది చేయగలుగుతారు.+ అంటే, 7 ప్రత్యక్ష గుడారాన్ని,+ సాక్ష్యపు మందసాన్ని,+ దాని మూతను,+ గుడారంలోని ఉపకరణాలన్నిటినీ, 8 బల్లను,+ దాని పాత్రల్ని, స్వచ్ఛమైన బంగారు దీపస్తంభాన్ని, దాని పాత్రలన్నిటినీ,+ ధూపవేదికను,+ 9 దహనబలులు అర్పించే బలిపీఠాన్ని,+ దాని పాత్రలన్నిటినీ, గంగాళాన్ని, దాని పీఠాన్ని,+ 10 నేర్పుతో అల్లిన వస్త్రాల్ని, యాజకుడైన అహరోను కోసం పవిత్ర వస్త్రాల్ని, యాజకులుగా సేవచేసేలా అతని కుమారుల కోసం వస్త్రాల్ని,+ 11 అభిషేక తైలాన్ని, పవిత్రమైన స్థలం కోసం పరిమళ ధూపద్రవ్యాన్ని,+ అలా నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతీదాన్ని వాళ్లు తయారుచేస్తారు.”

12 యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు: 13 “నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వాళ్లకు ఇలా చెప్పు: ‘ముఖ్యంగా మీరు నా విశ్రాంతి రోజుల్ని ఆచరించాలి.+ యెహోవా అనే నేనే మిమ్మల్ని పవిత్రపరుస్తున్నానని మీరు తెలుసుకునేలా మీ తరతరాలపాటు అది నాకు, మీకు మధ్య సూచనగా ఉంటుంది. 14 మీరు విశ్రాంతి రోజును తప్పకుండా ఆచరించాలి, ఎందుకంటే అది మీకు పవిత్రమైనది.+ దాన్ని అపవిత్రపర్చే ఏ వ్యక్తినైనా చంపేయాలి. ఆ రోజున ఎవరైనా ఏదైనా పని చేస్తే, తన ప్రజల్లో ఉండకుండా అతన్ని కొట్టేయాలి.*+ 15 ఆరు రోజులు మీరు పని చేసుకోవచ్చు, కానీ ఏడో రోజు పూర్తి విశ్రాంతి రోజు.+ అది యెహోవాకు పవిత్రమైనది. విశ్రాంతి రోజున పని చేసే ఏ వ్యక్తినైనా చంపేయాలి. 16 ఇశ్రాయేలీయులు తప్పకుండా విశ్రాంతి రోజును ఆచరించాలి; వాళ్లు తరతరాలపాటు ఎప్పటికీ దాన్ని ఆచరించాలి. ఇది శాశ్వతమైన ఒప్పందం. 17 అది నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఎప్పటికీ నిలిచివుండే సూచన.+ ఎందుకంటే యెహోవా ఆరు రోజుల్లో ఆకాశాన్ని, భూమిని సృష్టించి ఏడో రోజున విశ్రాంతి తీసుకొని సేదదీరాడు.’ ”+

18 దేవుడు సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడడం అయిపోగానే, సాక్ష్యంగా ఉండే రెండు పలకల్ని అతనికి ఇచ్చాడు;+ అవి దేవుని వేలితో రాయబడిన రాతి పలకలు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి