కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

రోమీయులు విషయసూచిక

      • పౌలు ఫీబేను శిష్యురాలిగా పరిచయం చేయడం (1, 2)

      • రోములోని క్రైస్తవులకు శుభాకాంక్షలు (3-16)

      • విభజనల విషయంలో హెచ్చరిక (17-20)

      • పౌలు తోటి పనివాళ్ల శుభాకాంక్షలు (21-24)

      • ఇప్పుడు పవిత్ర రహస్యం బయల్పర్చబడింది (25-27)

రోమీయులు 16:1

అధస్సూచీలు

  • *

    లేదా “సిఫారసు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2005, పేజీలు 21, 23

    7/15/1997, పేజీ 31

రోమీయులు 16:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 12:13; 1యో 3:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2005, పేజీలు 21, 23

    7/15/1997, పేజీ 31

రోమీయులు 16:3

అధస్సూచీలు

  • *

    ప్రిస్కిల్ల అని కూడా పిలవబడింది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:2, 24, 26; 2తి 4:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/1996, పేజీ 22

రోమీయులు 16:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1యో 3:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2013, పేజీలు 10-11

    12/15/1996, పేజీలు 22, 24

    11/15/1993, పేజీలు 20-21

రోమీయులు 16:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆసియాలో క్రీస్తుకు ప్రథమఫలాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 16:19; కొలొ 4:15; ఫిలే 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2002, పేజీ 7

రోమీయులు 16:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 16:11

రోమీయులు 16:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/15/2013, పేజీలు 28-29

రోమీయులు 16:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/1993, పేజీ 15

    8/1/1990, పేజీ 27

రోమీయులు 16:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 7:15; తీతు 3:10; 2యో 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2011, పేజీ 16

రోమీయులు 16:18

అధస్సూచీలు

  • *

    లేదా “కడుపులకు.”

  • *

    లేదా “అజాగ్రత్తగా ఉన్నవాళ్ల హృదయాల్ని.”

రోమీయులు 16:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 14:20

రోమీయులు 16:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 3:15; హెబ్రీ 2:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    No. 1 2021 పేజీ 12

    కావలికోట,

    1/1/2012, పేజీ 29

    ప్రకటన ముగింపు, పేజీ 287

రోమీయులు 16:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 16:7

రోమీయులు 16:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1997, పేజీలు 30-31

రోమీయులు 16:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 1:14

రోమీయులు 16:24

అధస్సూచీలు

  • *

    అనుబంధం A3 చూడండి.

రోమీయులు 16:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 1:9-12; కొలొ 1:26, 27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 3/2019, పేజీ 4

    కావలికోట,

    6/1/1997, పేజీ 13

రోమీయులు 16:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 11:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 176-178

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2023, పేజీలు 12-13

    కావలికోట,

    4/15/2009, పేజీ 15

    5/15/2007, పేజీలు 24-25

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

రోమా. 16:1అపొ 18:18
రోమా. 16:2రోమా 12:13; 1యో 3:17
రోమా. 16:3అపొ 18:2, 24, 26; 2తి 4:19
రోమా. 16:41యో 3:16
రోమా. 16:51కొ 16:19; కొలొ 4:15; ఫిలే 2
రోమా. 16:7రోమా 16:11
రోమా. 16:17మత్త 7:15; తీతు 3:10; 2యో 10
రోమా. 16:191కొ 14:20
రోమా. 16:20ఆది 3:15; హెబ్రీ 2:14
రోమా. 16:21రోమా 16:7
రోమా. 16:231కొ 1:14
రోమా. 16:25ఎఫె 1:9-12; కొలొ 1:26, 27
రోమా. 16:27రోమా 11:33
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
రోమీయులు 16:1-27

రోమీయులు

16 కెంక్రేయలోని+ సంఘంలో సేవ చేస్తున్న మన సహోదరి ఫీబేను మీకు పరిచయం* చేస్తున్నాను. 2 మీరు పవిత్రులకు తగ్గట్టు ప్రభువు శిష్యురాలిగా ఆమెను చేర్చుకుని, ఆమెకు కావాల్సిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను.+ ఎందుకంటే ఆమె కూడా చాలామంది సహోదరులకు, అలాగే నాకు సహాయం చేసింది.

3 క్రీస్తుయేసు సేవలో నా తోటి పనివాళ్లయిన ప్రిస్కను,* అకులను+ అడిగినట్టు చెప్పండి. 4 వాళ్లు నాకోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు.+ వాళ్లకు నేనే కాదు, అన్యజనులు ఉన్న సంఘాల వాళ్లంతా కృతజ్ఞతలు చెప్తున్నారు. 5 అదేవిధంగా, వాళ్ల ఇంట్లో ఉన్న సంఘానికి కూడా శుభాకాంక్షలు చెప్పండి.+ నా ప్రియ సహోదరుడు ఎపైనెటును అడిగినట్టు చెప్పండి, ఆసియాలో మొట్టమొదట క్రీస్తు శిష్యులైన వాళ్లలో అతను ఒకడు.* 6 మీకోసం కష్టపడి పనిచేసిన మరియను అడిగినట్టు చెప్పండి. 7 నా బంధువులు,+ నా తోటి ఖైదీలు అయిన అంద్రొనీకును, యూనీయను అడిగినట్టు చెప్పండి. అపొస్తలుల దగ్గర వాళ్లకు మంచిపేరు ఉంది. వాళ్లు నాకన్నా ముందు నుండి క్రీస్తు శిష్యులుగా ఉన్నారు.

8 నా ప్రియ సహోదరుడూ ప్రభువు శిష్యుడూ అయిన అంప్లీయతును అడిగినట్టు చెప్పండి. 9 క్రీస్తు సేవలో మన తోటి పనివాడైన ఊర్బానును, నా ప్రియ సహోదరుడైన స్టాకును అడిగినట్టు చెప్పండి. 10 క్రీస్తు ఆమోదం పొందిన అపెల్లెను అడిగినట్టు చెప్పండి. అరిస్టొబూలు ఇంటివాళ్లను అడిగినట్టు చెప్పండి. 11 నా బంధువైన హెరోదియోనును అడిగినట్టు చెప్పండి. నార్కిస్సు ఇంటివాళ్లలో ప్రభువు శిష్యులైన వాళ్లను అడిగినట్టు చెప్పండి. 12 ప్రభువు సేవలో కష్టపడి పనిచేస్తున్న త్రుఫైనా, త్రుఫోసా అనే సహోదరీల్ని అడిగినట్టు చెప్పండి. మన ప్రియ సహోదరి పెర్సిసును అడిగినట్టు చెప్పండి, ఆమె ప్రభువు సేవలో కష్టపడి పనిచేసింది. 13 ప్రభువు సేవకుల్లో శ్రేష్ఠుడైన రూఫును, వాళ్ల అమ్మను అడిగినట్టు చెప్పండి; ఆమె నాకూ అమ్మ లాంటిది. 14 అసుంక్రితును, ప్లెగోనును, హెర్మేను, పత్రొబను, హెర్మాను, వాళ్లతో పాటు ఉన్న సహోదరుల్ని అడిగినట్టు చెప్పండి. 15 పిలొలొగును, యూలియాను, నేరియను, అతని సహోదరిని, ఒలుంపాను, వాళ్లతో ఉన్న పవిత్రులందర్నీ అడిగినట్టు చెప్పండి. 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు పలకరించుకోండి. క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు చెప్తున్నాయి.

17 సహోదరులారా, ఇప్పుడు నేను మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరు నేర్చుకున్న బోధకు విరుద్ధంగా విభజనలు సృష్టించేవాళ్లను, తప్పుదోవ పట్టించేవాళ్లను ఓ కంట కనిపెడుతూ వాళ్లకు దూరంగా ఉండండి.+ 18 అలాంటివాళ్లు మన ప్రభువైన క్రీస్తుకు కాదుగానీ తమ సొంత కోరికలకు* దాసులు. వాళ్లు ఇంపైన మాటలతో, పొగడ్తలతో అజాగ్రత్తగా ఉన్నవాళ్లను* మోసం చేస్తారు. 19 మీ విధేయతను అందరూ గమనించారు, కాబట్టి మీ గురించి నేను సంతోషిస్తున్నాను. అయితే మీరు మంచివాటి విషయంలో తెలివిగలవాళ్లుగా, చెడ్డవాటి విషయంలో నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాను.+ 20 శాంతిని అనుగ్రహించే దేవుడు త్వరలోనే సాతానును మీ కాళ్ల కింద చితకతొక్కిస్తాడు.+ ప్రభువైన యేసు చూపించే అపారదయ మీకు తోడుండాలి.

21 నా తోటి పనివాడైన తిమోతి మీకు శుభాకాంక్షలు చెప్తున్నాడు. అలాగే నా బంధువులైన+ లూకియ, యాసోను, సోసిపత్రు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

22 ఈ ఉత్తరం రాసిపెట్టిన తెర్తియు అనే నేను కూడా ప్రభువు పేరున నా శుభాకాంక్షలు చెప్తున్నాను.

23 నాకు, సంఘమంతటికి ఆతిథ్యం ఇచ్చే గాయియు+ మీకు శుభాకాంక్షలు చెప్తున్నాడు. ఈ నగర కోశాధికారి ఎరస్తు, అతని సహోదరుడు క్వర్తు మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 24 *——

25 నేను ప్రకటించే మంచివార్త, అలాగే యేసుక్రీస్తు గురించిన సందేశం దేవుడు మిమ్మల్ని స్థిరపర్చగలడని చూపిస్తున్నాయి. ఈ మంచివార్త, ఎంతోకాలం పాటు దాచబడి ఇప్పుడు బయల్పర్చబడిన పవిత్ర రహస్యం+ గురించిన అవగాహనకు అనుగుణంగా ఉంది. 26 వెల్లడి చేయబడిన ఆ రహస్యం గురించి అన్నిదేశాల ప్రజలు లేఖనాల్లోని ప్రవచనాల ద్వారా తెలుసుకున్నారు. ఇది, అన్నిదేశాల ప్రజలు విశ్వాసంతో విధేయత చూపించేలా నిత్యదేవుడు ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా ఉంది. 27 ఆయన మాత్రమే అత్యంత తెలివిగలవాడు.+ యేసుక్రీస్తు ద్వారా దేవునికి నిరంతరం మహిమ కలగాలి, ఆమేన్‌.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి