కీర్తనలు
ఆసాపు+ శ్రావ్యగీతం.
2 పరిపూర్ణ సౌందర్యంగల సీయోనులో+ నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.
3 మన దేవుడు వస్తాడు, ఆయన మౌనంగా ఉండలేడు.+
ఆయన ముందు దహించే అగ్ని ఉంది,+
ఆయన చుట్టూ గొప్ప తుఫాను రేగుతోంది.
4 తన ప్రజలకు తీర్పు తీర్చడానికి,+
ఆయన పైనున్న ఆకాశాన్ని, భూమిని సాక్షులుగా పిలుస్తున్నాడు;+ ఆయన ఇలా అంటున్నాడు:
6 ఆకాశం ఆయన నీతిని ప్రకటిస్తోంది,
ఎందుకంటే న్యాయమూర్తి దేవుడే. (సెలా)
7 “నా ప్రజలారా వినండి, నేను మాట్లాడబోతున్నాను;
ఇశ్రాయేలూ, నేను నీ మీద సాక్ష్యం చెప్తాను.+
నేను దేవుణ్ణి, నీ దేవుణ్ణి.
8 నీ బలుల్ని బట్టో, ఎప్పుడూ నా ఎదుట ఉండే నీ సంపూర్ణ దహనబలుల్ని బట్టో+
నేను నిన్ను గద్దించడం లేదు.
10 ఎందుకంటే, అడవిలోని ప్రతీ జంతువు,
వేలాది పర్వతాల మీదున్న పశువులు నావే.+
11 పర్వతాల్లోని ప్రతీ పక్షి నాకు తెలుసు;+
మైదానంలో ఉన్న లెక్కలేనన్ని జంతువులు నావే.
12 ఒకవేళ నాకు ఆకలేస్తే, నేను నీతో చెప్పను,
ఎందుకంటే భూమి, దాని మీదున్న ప్రతీది నాదే.+
13 నేను ఎద్దుల మాంసం తింటానా?
మేకల రక్తం తాగుతానా?+
14 దేవునికి బలిగా కృతజ్ఞతలు అర్పించు,+
సర్వోన్నతునికి నీ మొక్కుబళ్లు చెల్లించు;+
15 కష్టకాలంలో నాకు మొరపెట్టు.+
నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు.”+
16 కానీ దుష్టుడితో దేవుడు ఇలా అంటాడు:
19 నీ నోటితో చెడ్డవాటిని వ్యాప్తి చేస్తావు,
నీ నాలుకతో మోసం చేస్తూ ఉంటావు.+
21 నువ్వు వీటిని చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను,
కాబట్టి నేనూ నీలాంటివాణ్ణే అని నువ్వు అనుకున్నావు.
కానీ ఇప్పుడు నేను నిన్ను గద్దిస్తాను,
నీ మీద నాకున్న వ్యాజ్యాన్ని చెప్తాను.+
22 దేవుణ్ణి మర్చిపోయేవాళ్లారా,+ దయచేసి దీని గురించి ఆలోచించండి,
లేకపోతే నేను మిమ్మల్ని ముక్కలుముక్కలుగా చీల్చేస్తాను, మిమ్మల్ని రక్షించేవాళ్లెవ్వరూ ఉండరు.