యోబు
15 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు+ ఇలా అన్నాడు:
3 కేవలం మాటలతో సరిదిద్దడం వల్ల ఉపయోగం ఉండదు,
వట్టి మాటల వల్ల ప్రయోజనం ఉండదు.
4 నువ్వు దేవుని పట్ల భయభక్తులు తగ్గిస్తున్నావు,
ఇతరులు దేవుని గురించి ధ్యానించకుండా చేస్తున్నావు.
5 నువ్వు ఏం మాట్లాడాలో నీ అపరాధమే నీకు నేర్పిస్తోంది,*
నువ్వు మోసకరమైన మాటలు ఎంచుకుంటున్నావు.
6 నేను కాదు, నీ నోరే నిన్ను తప్పుపడుతుంది,
నీ పెదాలే నీ మీద సాక్ష్యం చెప్తున్నాయి.+
7 మొట్టమొదట పుట్టిన మనిషివి నువ్వేనా?
నువ్వు కొండల కన్నా ముందే పుట్టావా?
8 నువ్వు దేవుని రహస్యాల్ని వినేవాడివా?
తెలివి నీకే సొంతమా?
9 మాకు తెలియనిది, నీకు తెలిసింది ఏమిటి?+
మాకు అర్థం కానిది, నీకు అర్థమైంది ఏమిటి?
10 మాలో తలనెరసిన వాళ్లు, వృద్ధులు,
మీ నాన్న కన్నా వయసులో చాలా పెద్దవాళ్లు ఉన్నారు.+
11 దేవుడిచ్చే ఓదార్పు, మృదువైన మాటలు నీకు సరిపోవా?
12 నీ హృదయం ఎందుకు నిన్ను అదుపు చేస్తోంది?
నీ కళ్లు ఎందుకు కోపంతో ఎర్రబడ్డాయి?
13 నువ్వు ఏకంగా దేవుని మీదే కోప్పడుతున్నావు,
అందుకే నువ్విలా మాట్లాడుతున్నావు.
16 అలాంటప్పుడు నీచుడి పరిస్థితి, అవినీతిపరుడి పరిస్థితి ఏంటి?+
నీళ్లు తాగినట్టుగా చెడు చేసే వ్యక్తి సంగతేంటి?
17 నేను నీకు చెప్తాను, విను!
నేను చూసినవాటిని నీకు వివరిస్తాను.
18 అవి జ్ఞానులు తమ తండ్రుల దగ్గర నేర్చుకున్నవి,+
వాళ్లు వాటిని దాచకుండా వివరించారు.
19 దేశం వాళ్లకు మాత్రమే ఇవ్వబడింది,
వేరేవాళ్లెవ్వరూ వాళ్ల మధ్య నివసించలేదు.
20 దుష్టుడు బ్రతికినంతకాలం వేదనలు అనుభవిస్తూనే ఉంటాడు,
నిరంకుశ పాలకుని సంవత్సరాలన్నీ ముగిసేవరకు అతను వేదన పడుతూనే ఉంటాడు.
21 అతని చెవుల్లో భయంకరమైన శబ్దాలు మారుమోగుతాయి;+
ప్రశాంతంగా ఉన్న సమయంలో బందిపోట్లు అతని మీద దాడిచేస్తారు.
22 చీకటి నుండి తప్పించుకుంటాననే నమ్మకం అతనికి ఉండదు;+
అతను ఖడ్గానికి నియమించబడ్డాడు.
23 అతను ఆహారం కోసం అటూఇటూ తిరుగుతూ “అది ఎక్కడ ఉంది?” అంటాడు.
చీకటి రోజు దగ్గర్లోనే ఉందని అతనికి బాగా తెలుసు.
24 కష్టాలు, వేదనలు అతన్ని భయపెడుతూ ఉంటాయి;
దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న రాజులా అవి అతని మీదికి వస్తాయి.
25 ఎందుకంటే, అతను ఏకంగా దేవుని మీదికే తన చెయ్యి ఎత్తుతున్నాడు,
సర్వశక్తిమంతుణ్ణి ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు;*
26 అతను దిట్టమైన, బలమైన తన డాలుతో
మొండిగా ఆయన మీదికి దూసుకెళ్తున్నాడు;
27 అతని ముఖం కొవ్వు పట్టింది,
అతని తుంట్లు కొవ్వుతో లావెక్కాయి;
28 అతను నాశనం కాబోయే నగరాల్లో,
ఎవరూ నివసించని ఇళ్లలో నివసిస్తాడు,
అవి రాళ్లకుప్పల్లా తయారౌతాయి.
29 అతను ధనవంతుడవ్వడు, అతని సంపదలు పెరగవు,
అతని ఆస్తిపాస్తులు దేశంలో విస్తరించవు.
30 అతను చీకటిని తప్పించుకోడు;
అగ్నిజ్వాల అతని లేత కొమ్మను* ఎండిపోజేస్తుంది,
31 అతను తప్పుదారి పట్టి వ్యర్థమైన వాటిని నమ్ముకోకూడదు,
వాటివల్ల అతనికి ఏమీ రాదు;
32 అతను బ్రతికుండగానే ఇదంతా జరుగుతుంది,
అతని కొమ్మలు ఎన్నడూ విస్తరించవు.+
33 అతను పిందెలు రాలిన ద్రాక్షచెట్టులా,
పూత రాలిన ఒలీవ చెట్టులా ఉంటాడు.
35 వాళ్లు చెడును కడుపున మోసి, దుష్టత్వాన్ని కంటారు,
వాళ్ల కడుపు నిండా మోసమే.”