కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • బాలాకు బిలామును పిలిపిస్తాడు (1-21)

      • బిలాము గాడిద మాట్లాడడం (22-41)

సంఖ్యాకాండం 22:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 33:48

సంఖ్యాకాండం 22:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 24:9; న్యా 11:25

సంఖ్యాకాండం 22:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 15:15; ద్వితీ 2:25

సంఖ్యాకాండం 22:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 31:7, 8; యెహో 13:15, 21

సంఖ్యాకాండం 22:5

అధస్సూచీలు

  • *

    యూఫ్రటీసు అని స్పష్టమౌతోంది.

  • *

    లేదా “దేశమంతటినీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 23:3, 4; యెహో 13:22; 2పే 2:15
  • +ఆది 13:14, 16

సంఖ్యాకాండం 22:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 23:7; యెహో 24:9; నెహె 13:1, 2

సంఖ్యాకాండం 22:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2పే 2:15; యూదా 11

సంఖ్యాకాండం 22:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:20

సంఖ్యాకాండం 22:11

అధస్సూచీలు

  • *

    లేదా “దేశమంతటినీ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:5, 6; 23:7, 11; 24:10

సంఖ్యాకాండం 22:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:1-3; 22:15, 17; ద్వితీ 33:29

సంఖ్యాకాండం 22:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 24:13

సంఖ్యాకాండం 22:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:8

సంఖ్యాకాండం 22:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:35; 23:11, 12

సంఖ్యాకాండం 22:21

అధస్సూచీలు

  • *

    ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2పే 2:15; యూదా 11

సంఖ్యాకాండం 22:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/1/2004, పేజీ 27

సంఖ్యాకాండం 22:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2పే 2:15, 16
  • +సం 22:32

సంఖ్యాకాండం 22:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 6:17

సంఖ్యాకాండం 22:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:12; 2పే 2:15, 16

సంఖ్యాకాండం 22:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:23, 25, 27

సంఖ్యాకాండం 22:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:16, 17; 24:10, 11

సంఖ్యాకాండం 22:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 23:26; 24:13

సంఖ్యాకాండం 22:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 23:13, 14

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 22:1సం 33:48
సంఖ్యా. 22:2యెహో 24:9; న్యా 11:25
సంఖ్యా. 22:3నిర్గ 15:15; ద్వితీ 2:25
సంఖ్యా. 22:4సం 31:7, 8; యెహో 13:15, 21
సంఖ్యా. 22:5ద్వితీ 23:3, 4; యెహో 13:22; 2పే 2:15
సంఖ్యా. 22:5ఆది 13:14, 16
సంఖ్యా. 22:6సం 23:7; యెహో 24:9; నెహె 13:1, 2
సంఖ్యా. 22:72పే 2:15; యూదా 11
సంఖ్యా. 22:9సం 22:20
సంఖ్యా. 22:11సం 22:5, 6; 23:7, 11; 24:10
సంఖ్యా. 22:12ఆది 12:1-3; 22:15, 17; ద్వితీ 33:29
సంఖ్యా. 22:18సం 24:13
సంఖ్యా. 22:19సం 22:8
సంఖ్యా. 22:20సం 22:35; 23:11, 12
సంఖ్యా. 22:212పే 2:15; యూదా 11
సంఖ్యా. 22:282పే 2:15, 16
సంఖ్యా. 22:28సం 22:32
సంఖ్యా. 22:312రా 6:17
సంఖ్యా. 22:32సం 22:12; 2పే 2:15, 16
సంఖ్యా. 22:33సం 22:23, 25, 27
సంఖ్యా. 22:37సం 22:16, 17; 24:10, 11
సంఖ్యా. 22:38సం 23:26; 24:13
సంఖ్యా. 22:41సం 23:13, 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 22:1-41

సంఖ్యాకాండం

22 తర్వాత ఇశ్రాయేలీయులు అక్కడి నుండి బయల్దేరి యొర్దాను ఇవతల, యెరికో ఎదురుగా, మోయాబు ఎడారి మైదానాల్లో డేరాలు వేసుకున్నారు.+ 2 సిప్పోరు కుమారుడైన బాలాకు+ ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసిందంతా చూశాడు; 3 దాంతో ఇశ్రాయేలీయులంటే మోయాబీయులకు చాలా భయం పట్టుకుంది, ఎందుకంటే వాళ్లు చాలామంది ఉన్నారు; నిజానికి వాళ్లు ఇశ్రాయేలీయుల్ని చూసి ఎంతో ఆందోళనపడ్డారు.+ 4 కాబట్టి మోయాబీయులు మిద్యాను పెద్దలతో+ ఇలా అన్నారు: “ఎద్దు పొలంలోని గడ్డిని మింగేసినట్టు ఈ సమాజం మన చుట్టూ ఉన్నవన్నీ మింగేస్తుంది.”

ఆ సమయంలో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబుకు రాజుగా ఉన్నాడు. 5 అతను పెతోరులో ఉన్న బెయోరు కుమారుడైన బిలాము+ దగ్గరికి సందేశకుల్ని పంపించాడు. ఈ పెతోరు అతని స్వదేశంలోని నది* ఒడ్డున ఉంది. అతను బిలామును పిలిపిస్తూ ఇలా కబురు పంపాడు: “ఇదిగో! ఐగుప్తు నుండి ఒక జనం బయటికి వచ్చింది. ఇదిగో! వాళ్లు భూమంతటినీ* కప్పేశారు.+ ఇప్పుడేమో వాళ్లు నా కళ్లముందే నివసిస్తున్నారు. 6 దయచేసి ఇప్పుడు నువ్వు వచ్చి నా కోసం ఆ ప్రజల్ని శపించు,+ ఎందుకంటే వాళ్లు నాకన్నా బలవంతులు. నువ్వు వాళ్లను శపించాక బహుశా నేను వాళ్లను ఓడించి దేశంలో నుండి తరిమేయగలుగుతానేమో. నువ్వు ఎవర్ని దీవిస్తే వాళ్లు దీవించబడినవాళ్లుగా, ఎవర్ని శపిస్తే వాళ్లు శపించబడినవాళ్లుగా ఉంటారని నాకు బాగా తెలుసు.”

7 కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదె కోసం డబ్బు చేత పట్టుకొని బిలాము+ దగ్గరికి వెళ్లి, బాలాకు సందేశాన్ని అతనికి తెలియజేశారు. 8 అప్పుడు బిలాము వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు ఏం చెప్తాడో వచ్చి మీకు చెప్తాను.” కాబట్టి మోయాబు అధికారులు బిలాముతో ఉండిపోయారు.

9 అప్పుడు దేవుడు బిలాము దగ్గరికొచ్చి, “నీతోపాటు ఉన్న ఈ మనుషులు ఎవరు?” అని అడిగాడు.+ 10 అందుకు బిలాము సత్యదేవునితో ఇలా అన్నాడు: “సిప్పోరు కుమారుడూ, మోయాబు రాజూ అయిన బాలాకు నా దగ్గరికి ఈ సందేశం పంపాడు: 11 ‘ఇదిగో! ఐగుప్తు నుండి బయటికి వస్తున్న ఈ ప్రజలు భూమంతటినీ* కప్పేస్తున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి నా కోసం వాళ్లను శపించు.+ అప్పుడు బహుశా నేను వాళ్లను ఓడించి దేశంలో నుండి తరిమేయగలుగుతానేమో.’ ” 12 అయితే దేవుడు బిలాముతో ఇలా అన్నాడు: “నువ్వు వాళ్లతో వెళ్లకూడదు. నువ్వు ఆ ప్రజల్ని శపించకూడదు, ఎందుకంటే వాళ్లు దీవించబడిన ప్రజలు.”+

13 బిలాము పొద్దున లేచి బాలాకు అధికారులతో ఇలా అన్నాడు: “మీరు మీ దేశానికి వెళ్లిపోండి, ఎందుకంటే మీతో వెళ్లొద్దని యెహోవా నాకు చెప్పాడు.” 14 కాబట్టి మోయాబు అధికారులు అక్కడి నుండి బయల్దేరి బాలాకు దగ్గరికి తిరిగొచ్చి, “బిలాము మాతో రానన్నాడు” అని చెప్పారు.

15 అయితే బాలాకు, ముందు వెళ్లిన వాళ్లకన్నా ఎక్కువమందిని, ఇంకా ప్రముఖుల్ని పంపించాడు. 16 వాళ్లు బిలాము దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు ఇలా అన్నాడు: ‘దయచేసి నా దగ్గరికి రాకుండా దేన్నీ నిన్ను అడ్డుకోనివ్వకు. 17 ఎందుకంటే, నేను నిన్ను గొప్పగా సన్మానిస్తాను, నువ్వు నన్ను ఏం చేయమంటే అది చేస్తాను. కాబట్టి దయచేసి ఇక్కడికి రా, వచ్చి నా కోసం ఈ ప్రజల్ని శపించు.’ ” 18 అయితే బాలాకు సేవకులతో బిలాము ఇలా అన్నాడు: “బాలాకు తన ఇంటినిండా పట్టే వెండిబంగారాలు ఇచ్చినా, నా దేవుడైన యెహోవా ఆదేశాన్ని మీరి నేను ఏ పనీ చేయలేను; అది చిన్నదే గానీ పెద్దదే గానీ.+ 19 అయితే ఈ రాత్రి కూడా దయచేసి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు ఏం చెప్తాడో నేను తెలుసుకుంటాను.”+

20 దేవుడు రాత్రిపూట బిలాము దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “ఈ మనుషులు నిన్ను తీసుకెళ్లడానికి వచ్చివుంటే, నువ్వు వాళ్లతో వెళ్లు. అయితే నేను చెప్పమన్న మాటలే నువ్వు చెప్పాలి.”+ 21 కాబట్టి బిలాము పొద్దున లేచి తన గాడిదకు జీను* కట్టి, మోయాబు అధికారులతో పాటు వెళ్లాడు.+

22 అయితే అతను వెళ్తున్నందుకు దేవుని కోపం అతని మీద రగులుకుంది, అతన్ని ఆపడానికి యెహోవా దూత వచ్చి దారిలో నిలబడ్డాడు. బిలాము తన గాడిద మీద వెళ్తున్నాడు, అతని సేవకులు ఇద్దరు అతనితో పాటు ఉన్నారు. 23 యెహోవా దూత తన చేతిలో ఖడ్గం పట్టుకొని దారిలో నిలబడి ఉండడం ఆ గాడిద చూసినప్పుడు, అది దారి నుండి పక్కకు మళ్లి పొలంలోకి వెళ్లడానికి ప్రయత్నించింది. దాన్ని తిరిగి దారిలోకి మళ్లించడానికి బిలాము దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. 24 అప్పుడు యెహోవా దూత రెండు ద్రాక్షతోటల మధ్య ఉన్న ఇరుకైన దారిలో నిలబడ్డాడు, ఆ దారికి రెండు వైపులా రాతి గోడలు ఉన్నాయి. 25 ఆ గాడిద, యెహోవా దూతను చూసినప్పుడు అది తనను తాను గోడకు అదుముకోవడం మొదలుపెట్టింది, దానివల్ల బిలాము పాదం ఇరుక్కుపోయింది. అప్పుడు బిలాము మళ్లీ దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు.

26 తర్వాత యెహోవా దూత ఇంకొంచెం ముందుకు వెళ్లి, కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరిగే అవకాశం లేని ఇరుకైన చోట నిలబడ్డాడు. 27 ఆ గాడిద, యెహోవా దూతను చూసినప్పుడు అది బిలాము కింద కూలబడింది. దాంతో బిలాముకు పిచ్చికోపం వచ్చి తన కర్రతో దాన్ని కొడుతూ ఉన్నాడు. 28 చివరికి యెహోవా ఆ గాడిదను మాట్లాడేలా చేశాడు,+ అప్పుడది అతనితో ఇలా అంది: “నేను ఏం చేశానని ఈ మూడుసార్లు నువ్వు నన్ను కొట్టావు?”+ 29 అప్పుడు బిలాము గాడిదతో ఇలా అన్నాడు: “ఎందుకంటే, నువ్వు నన్ను వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉండుంటే, నేను నిన్ను చంపేవాణ్ణి!” 30 దానికి ఆ గాడిద బిలామును, “నేను నీ గాడిదను కాదా? ఈ రోజు వరకు నీ జీవితమంతా నువ్వు తిరిగింది నా మీద కాదా? ఇంతకుముందు ఎప్పుడైనా నేను నీతో ఇలా ప్రవర్తించానా?” అని అడిగింది. అందుకతను “లేదు!” అన్నాడు. 31 అప్పుడు యెహోవా బిలాము కళ్లను తెరిచాడు,+ దాంతో అతను యెహోవా దూత తన చేతిలో ఖడ్గం పట్టుకొని దారిలో నిలబడి ఉండడం చూశాడు. వెంటనే అతను వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు.

32 అప్పుడు యెహోవా దూత అతనితో ఇలా అన్నాడు: “ఈ మూడుసార్లు నువ్వెందుకు నీ గాడిదను కొట్టావు? ఇదిగో! నేనే స్వయంగా నిన్ను ఆపడానికి వచ్చాను. ఎందుకంటే, నువ్వు వెళ్తున్న దారి నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉంది.+ 33 ఈ మూడుసార్లు, నీ గాడిద నన్ను చూసి పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించింది.+ అదే గనుక పక్కకు తప్పుకోకపోయుంటే, ఈపాటికి నేను నిన్ను చంపేసి నీ గాడిదను మాత్రం బ్రతకనిచ్చేవాణ్ణి!” 34 అప్పుడు బిలాము యెహోవా దూతతో ఇలా అన్నాడు: “నేను పాపం చేశాను, నన్ను కలవడానికి స్వయంగా నువ్వే దారిలో నిలబడి ఉన్నావని నాకు తెలియలేదు. నేను ఇలా వెళ్లడం నీ దృష్టికి చెడ్డదైతే, నేను వెనక్కి వెళ్లిపోతాను.” 35 అయితే యెహోవా దూత అతనితో ఇలా అన్నాడు: “నువ్వు ఆ మనుషులతో వెళ్లు, అయితే నేను చెప్పమన్న మాటలే నువ్వు చెప్పాలి.” కాబట్టి బిలాము బాలాకు అధికారులతో పాటు ప్రయాణం కొనసాగించాడు.

36 బిలాము వచ్చాడని విన్నప్పుడు బాలాకు వెంటనే అతన్ని కలవడం కోసం మోయాబు నగరానికి వెళ్లాడు. అది ఆ ప్రాంతం సరిహద్దు దగ్గర అర్నోను ఒడ్డున ఉంది. 37 బాలాకు బిలాముతో ఇలా అన్నాడు: “ఇంతకుముందు కూడా నీ కోసం మనుషుల్ని పంపించాను కదా, అప్పుడెందుకు రాలేదు? నేను నిన్ను గొప్పగా సన్మానించలేనని అనుకున్నావా?”+ 38 అప్పుడు బిలాము బాలాకుతో ఇలా అన్నాడు: “ఇప్పుడు వచ్చాను కదా. కానీ నా అంతట నేను ఏమీ మాట్లాడలేను. దేవుడు నా నోట ఏ మాటలు ఉంచితే అవే నేను మాట్లాడగలను.”+

39 కాబట్టి బిలాము, బాలాకుతో వెళ్లాడు; వాళ్లు కిర్యత్‌-హుచ్చోతుకు వచ్చారు. 40 బాలాకు కొన్ని పశువుల్ని, గొర్రెల్ని బలి అర్పించి కొంత భాగాన్ని బిలాముకు, అతనితో ఉన్న అధికారులకు పంపించాడు. 41 ఉదయం బాలాకు బిలామును తీసుకొని బామోత్బయలుకు వచ్చాడు; అక్కడి నుండి చూసినప్పుడు బిలాముకు ఇశ్రాయేలు ప్రజలందరూ కనిపించారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి