కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • సంఖ్యాకాండం 31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

సంఖ్యాకాండం విషయసూచిక

      • మిద్యాను మీద ప్రతీకారం (1-12)

        • బిలాము చంపబడ్డాడు (8)

      • దోపుడుసొమ్ము గురించి నిర్దేశాలు (13-54)

సంఖ్యాకాండం 31:2

అధస్సూచీలు

  • *

    మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:7; 25:1-3, 17, 18; 1కొ 10:8; ప్రక 2:14
  • +కీర్త 94:1; యెష 1:24; నహూ 1:2
  • +సం 27:12, 13; ద్వితీ 32:48-50

సంఖ్యాకాండం 31:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 26:51

సంఖ్యాకాండం 31:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:7, 8
  • +సం 10:2, 9

సంఖ్యాకాండం 31:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:12; 2పే 2:15; ప్రక 2:14

సంఖ్యాకాండం 31:10

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రాకారాలుగల శిబిరాలన్నిటినీ.”

సంఖ్యాకాండం 31:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 22:1

సంఖ్యాకాండం 31:14

అధస్సూచీలు

  • *

    అంటే, 1,000 మంది మీద అధిపతులు.

  • *

    అంటే, 100 మంది మీద అధిపతులు.

సంఖ్యాకాండం 31:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:17, 18; ద్వితీ 4:3; యెహో 22:17
  • +సం 25:1, 2; ప్రక 2:14
  • +సం 25:9; 1కొ 10:8

సంఖ్యాకాండం 31:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 31:35

సంఖ్యాకాండం 31:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 5:2; 19:11, 16
  • +సం 19:20

సంఖ్యాకాండం 31:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 19:9

సంఖ్యాకాండం 31:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 19:19, 20

సంఖ్యాకాండం 31:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 22:7, 8; 1స 30:24

సంఖ్యాకాండం 31:28

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

సంఖ్యాకాండం 31:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:20, 29

సంఖ్యాకాండం 31:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:6, 7; 18:2, 3; 1ది 23:32
  • +ద్వితీ 12:19

సంఖ్యాకాండం 31:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 31:18

సంఖ్యాకాండం 31:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 18:8, 19

సంఖ్యాకాండం 31:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:6, 7; 18:2, 3; 1ది 23:32
  • +ద్వితీ 12:19

సంఖ్యాకాండం 31:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 31:4

సంఖ్యాకాండం 31:49

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:27; లేవీ 26:7, 8

సంఖ్యాకాండం 31:52

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

సంఖ్యాకాండం 31:54

అధస్సూచీలు

  • *

    లేదా “జ్ఞాపికగా.”

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

సంఖ్యా. 31:2సం 22:7; 25:1-3, 17, 18; 1కొ 10:8; ప్రక 2:14
సంఖ్యా. 31:2కీర్త 94:1; యెష 1:24; నహూ 1:2
సంఖ్యా. 31:2సం 27:12, 13; ద్వితీ 32:48-50
సంఖ్యా. 31:5సం 26:51
సంఖ్యా. 31:6సం 25:7, 8
సంఖ్యా. 31:6సం 10:2, 9
సంఖ్యా. 31:8సం 22:12; 2పే 2:15; ప్రక 2:14
సంఖ్యా. 31:12సం 22:1
సంఖ్యా. 31:16సం 25:17, 18; ద్వితీ 4:3; యెహో 22:17
సంఖ్యా. 31:16సం 25:1, 2; ప్రక 2:14
సంఖ్యా. 31:16సం 25:9; 1కొ 10:8
సంఖ్యా. 31:18సం 31:35
సంఖ్యా. 31:19సం 5:2; 19:11, 16
సంఖ్యా. 31:19సం 19:20
సంఖ్యా. 31:23సం 19:9
సంఖ్యా. 31:24సం 19:19, 20
సంఖ్యా. 31:27యెహో 22:7, 8; 1స 30:24
సంఖ్యా. 31:29సం 18:20, 29
సంఖ్యా. 31:30సం 3:6, 7; 18:2, 3; 1ది 23:32
సంఖ్యా. 31:30ద్వితీ 12:19
సంఖ్యా. 31:35సం 31:18
సంఖ్యా. 31:41సం 18:8, 19
సంఖ్యా. 31:47సం 3:6, 7; 18:2, 3; 1ది 23:32
సంఖ్యా. 31:47ద్వితీ 12:19
సంఖ్యా. 31:48సం 31:4
సంఖ్యా. 31:49నిర్గ 23:27; లేవీ 26:7, 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
సంఖ్యాకాండం 31:1-54

సంఖ్యాకాండం

31 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: 2 “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసినదాన్ని+ బట్టి వాళ్లకు ప్రతీకారం చేయి.+ తర్వాత నువ్వు నీ ప్రజల దగ్గరికి చేర్చబడతావు.”*+

3 కాబట్టి మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “మిద్యానీయులతో యుద్ధం చేయడానికి, యెహోవా తరఫున వాళ్లకు ప్రతీకారం చేయడానికి మీలో నుండి మనుషుల్ని సిద్ధం చేయండి. 4 మీరు ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో ఒక్కో గోత్రం నుండి 1,000 మందిని సైన్యంలోకి పంపించాలి.” 5 కాబట్టి లక్షల్లో ఉన్న ఇశ్రాయేలీయుల్లో+ ఒక్కో గోత్రం నుండి 1,000 మంది చొప్పున నియమించబడ్డారు; మొత్తం 12,000 మందిని యుద్ధానికి సిద్ధం చేశారు.

6 తర్వాత మోషే ఒక్కో గోత్రం నుండి 1,000 మందిని సైన్యంలోకి పంపించాడు; అలాగే యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును+ వాళ్లతోపాటు పంపించాడు. అతని చేతిలో పవిత్రమైన పాత్రలు, అలాగే యుద్ధ ధ్వని చేసే బాకాలు+ ఉన్నాయి. 7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు మిద్యానీయులతో యుద్ధం చేసి, వాళ్లలో ప్రతీ పురుషుణ్ణి చంపేశారు. 8 వాళ్లు చంపినవాళ్లలో మిద్యాను ఐదుగురు రాజులు, అంటే ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ కూడా ఉన్నారు. బెయోరు కుమారుడైన బిలామును+ కూడా వాళ్లు కత్తితో చంపారు. 9 అయితే మిద్యానులోని స్త్రీలను, పిల్లల్ని ఇశ్రాయేలీయులు బందీలుగా తీసుకెళ్లారు. అలాగే వాళ్ల సాధు జంతువులన్నిటినీ, వాళ్ల పశువులన్నిటినీ, వాళ్ల సంపదలన్నిటినీ దోచుకున్నారు. 10 వాళ్లు స్థిరపడిన నగరాలన్నిటినీ, వాళ్ల శిబిరాలన్నిటినీ* తగలబెట్టారు. 11 మనుషులు, జంతువులతో సహా వాళ్లకు ఉన్నదంతా కొల్లగొట్టారు. 12 తర్వాత వాళ్లు ఆ బందీలను, దోపుడుసొమ్మును తీసుకొని యొర్దాను ఇవతల, యెరికో ఎదురుగా, మోయాబు ఎడారి మైదానాల్లో డేరాలు వేసుకొని నివసిస్తున్న+ మోషే దగ్గరికి, యాజకుడైన ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి వచ్చారు.

13 అప్పుడు మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ వాళ్లను కలుసుకోవడానికి పాలెం బయటికి వెళ్లారు. 14 దండయాత్ర చేసి తిరిగొస్తున్న సైనిక బలగాల్లోని నియమిత పురుషుల్ని చూసినప్పుడు, అంటే సహస్రాధిపతుల్ని,* శతాధిపతుల్ని* చూసినప్పుడు మోషేకు చాలా కోపం వచ్చింది. 15 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “స్త్రీలందర్నీ చంపకుండా వదిలేశారా? 16 ఇదిగో! బిలాము మాట విని, పెయోరు విషయంలో+ యెహోవాకు నమ్మకద్రోహం చేసేలా ఇశ్రాయేలీయుల్ని ప్రలోభపెట్టింది వాళ్లే కదా?+ అందుకే కదా, యెహోవా ప్రజల మీదికి తెగులు వచ్చింది?+ 17 కాబట్టి ఇప్పుడు మీరు ప్రతీ మగ పిల్లవాడిని, అలాగే పురుషుడితో లైంగిక సంబంధాలు పెట్టుకున్న ప్రతీ స్త్రీని చంపేయాలి. 18 అయితే పురుషుడితో ఎన్నడూ లైంగిక సంబంధం పెట్టుకోని యువతులందర్నీ+ మీరు బ్రతకనివ్వవచ్చు. 19 మీరు ఏడురోజుల పాటు పాలెం బయట డేరాలు వేసుకొని ఉండాలి. మీలో ఎవరైతే ఒక వ్యక్తిని చంపారో వాళ్లందరూ; మీలో, అలాగే మీరు బందీలుగా తీసుకొచ్చిన వాళ్లలో ఎవరైతే యుద్ధంలో చనిపోయిన వ్యక్తిని ముట్టుకున్నారో+ వాళ్లందరూ మూడో రోజున, అలాగే ఏడో రోజున తమను తాము శుద్ధీకరించుకోవాలి.+ 20 అంతేకాదు, ప్రతీ వస్త్రాన్ని, తోలుతో చేసిన ప్రతీదాన్ని, మేక వెంట్రుకలతో చేసిన ప్రతీదాన్ని, చెక్కతో తయారైన ప్రతీ వస్తువును పాపం నుండి శుద్ధీకరించాలి.”

21 తర్వాత యాజకుడైన ఎలియాజరు యుద్ధానికి వెళ్లొచ్చిన సైనికులతో ఇలా అన్నాడు: “యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలోని నియమం ఏమిటంటే, 22 ‘బంగారాన్ని, వెండిని, రాగిని, ఇనుమును, తగరాన్ని, సీసాన్ని, 23 అగ్నితో శుద్ధి చేయగలిగే ప్రతీదాన్ని మీరు మంటల్లో వేసి తీయాలి, అప్పుడది పవిత్రమౌతుంది. అయినాసరే, శుద్ధీకరించే నీళ్లతో+ కూడా వాటిని శుద్ధీకరించాలి. అయితే అగ్నితో శుద్ధి చేయలేని ప్రతీదాన్ని మీరు నీళ్లతో కడగాలి. 24 ఏడో రోజున మీరు మీ వస్త్రాలు ఉతుక్కొని పవిత్రులు అవ్వాలి, ఆ తర్వాత మీరు పాలెంలోకి రావచ్చు.’ ”+

25 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: 26 “బందీలుగా తీసుకొచ్చిన మనుషులు, జంతువులతో సహా దోపుడు సొమ్మంతటి జాబితా తయారుచేయి; యాజకుడైన ఎలియాజరుతో, ఇశ్రాయేలు సమాజపు పూర్వీకుల కుటుంబాల పెద్దలతో కలిసి దాన్ని తయారుచేయి. 27 ఆ దోపుడుసొమ్మును రెండు భాగాలు చేయి. యుద్ధం చేసి వచ్చిన సైనికులకు ఒక భాగం, మిగతా ప్రజలందరికీ ఒక భాగం.+ 28 యుద్ధానికి వెళ్లొచ్చిన సైనికుల దగ్గర యెహోవా కోసం నువ్వు పన్ను సేకరించు. ప్రజల్లో, పశువుల్లో, గాడిదల్లో, మందల్లో ప్రతీ 500 ప్రాణులకు* ఒక ప్రాణి చొప్పున తీసుకో. 29 వాళ్లకు చెందిన సగభాగంలో నుండి నువ్వు దాన్ని తీసుకొని యెహోవాకు కానుకగా యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి.+ 30 ఇశ్రాయేలీయులకు చెందిన సగభాగంలో నుండి కూడా నువ్వు పన్ను సేకరించాలి. ప్రజల్లో, పశువుల్లో, గాడిదల్లో, మందల్లో, అన్నిరకాల సాధు జంతువుల్లో ప్రతీ 50 ప్రాణులకు ఒక ప్రాణి చొప్పున తీసుకొని, వాటిని యెహోవా గుడారానికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే+ లేవీయులకు ఇవ్వు.”+

31 కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే చేశారు. 32 దండయాత్ర చేసిన సైనికులు తీసుకొచ్చిన మిగిలిన దోపుడుసొమ్ము మొత్తం 6,75,000 గొర్రెలు-మేకలు, 33 72,000 పశువులు, 34 61,000 గాడిదలు. 35 పురుషుడితో ఎన్నడూ లైంగిక సంబంధం పెట్టుకోని స్త్రీలు+ 32,000 మంది. 36 యుద్ధానికి వెళ్లొచ్చినవాళ్ల సగభాగంలో మొత్తం 3,37,500 గొర్రెలు-మేకలు ఉన్నాయి. 37 వాటిలో 675 యెహోవాకు పన్నుగా ఇచ్చారు. 38 అలాగే పశువుల్లో వాళ్లకు వచ్చినవి 36,000. వాటిలో 72 యెహోవాకు పన్నుగా ఇచ్చారు. 39 గాడిదల్లో వాళ్లకు వచ్చినవి 30,500. వాటిలో 61 యెహోవాకు పన్నుగా ఇచ్చారు. 40 అలాగే మనుషుల్లో వాళ్లకు వచ్చినవాళ్లు 16,000 మంది. వాళ్లలో 32 మందిని యెహోవాకు పన్నుగా ఇచ్చారు. 41 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే, పన్నుగా సేకరించిన వాటిని తీసుకొని యెహోవాకు కానుకగా యాజకుడైన ఎలియాజరుకు ఇచ్చాడు.+

42 యుద్ధం చేసి వచ్చిన వాళ్ల సగభాగం కాకుండా మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగభాగంలో 43 3,37,500 గొర్రెలు-మేకలు, 44 36,000 పశువులు, 45 30,500 గాడిదలు ఉన్నాయి; 46 అలాగే 16,000 మంది ప్రజలు ఉన్నారు. 47 తర్వాత మోషే ఇశ్రాయేలీయులకు చెందిన సగభాగంలోని ప్రజల్లో, జంతువుల్లో ప్రతీ 50 ప్రాణులకు ఒక ప్రాణి చొప్పున తీసుకొని, వాటిని యెహోవా గుడారానికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే+ లేవీయులకు ఇచ్చాడు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

48 తర్వాత, ఇశ్రాయేలీయుల సైన్యంలోని+ నియమిత పురుషులు, అంటే సహస్రాధిపతులు, శతాధిపతులు మోషే దగ్గరికి వచ్చి 49 ఇలా అన్నారు: “నీ సేవకులమైన మేము మా కింద ఉన్న సైనికుల లెక్క సేకరించాం. యుద్ధానికి వెళ్లిన వాళ్లలో ఒక్కరు కూడా తక్కువ కాలేదు.+ 50 కాబట్టి మాకు దొరికిన బంగారు వస్తువులు, పట్టీలు, కడియాలు, ముద్ర-ఉంగరాలు, చెవిపోగులు, ఇతర నగలు యెహోవాకు కానుకగా ఇచ్చి మమ్మల్నందర్నీ యెహోవా ముందు ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వు.”

51 కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు వాళ్లిచ్చిన బంగారాన్ని, అంటే ఆ నగలన్నిటినీ తీసుకున్నారు. 52 సహస్రాధిపతులు, శతాధిపతులు మొత్తం 16,750 షెకెల్‌ల* బంగారాన్ని యెహోవాకు కానుకగా ఇచ్చారు. 53 సైన్యంలోని ప్రతీ వ్యక్తి తన కోసం దోపుడుసొమ్ము తీసుకున్నాడు. 54 మోషే, యాజకుడైన ఎలియాజరు సహస్రాధిపతులు, శతాధిపతులు ఇచ్చిన బంగారాన్ని తీసుకొని, యెహోవా ముందు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా* ఉండడం కోసం ప్రత్యక్ష గుడారంలోకి దాన్ని తీసుకొచ్చారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి