కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 దినవృత్తాంతాలు 30
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 దినవృత్తాంతాలు విషయసూచిక

      • హిజ్కియా పస్కాను ఆచరించడం (1-27)

2 దినవృత్తాంతాలు 30:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 12:43; లేవీ 23:5; ద్వితీ 16:2; 2ది 35:1
  • +2ది 11:14, 16
  • +2ది 34:1, 6, 7

2 దినవృత్తాంతాలు 30:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 9:10, 11

2 దినవృత్తాంతాలు 30:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 29:34
  • +నిర్గ 12:18

2 దినవృత్తాంతాలు 30:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 18:29
  • +2ది 35:18

2 దినవృత్తాంతాలు 30:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “పరుగెత్తేవాళ్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 15:29; 1ది 5:26; 2ది 28:20, 21

2 దినవృత్తాంతాలు 30:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 29:8, 9

2 దినవృత్తాంతాలు 30:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:9
  • +ద్వితీ 12:5, 6; కీర్త 132:13
  • +2ది 29:10

2 దినవృత్తాంతాలు 30:9

అధస్సూచీలు

  • *

    లేదా “దయ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:49, 50
  • +ద్వితీ 30:1-3
  • +నిర్గ 34:6; కీర్త 86:5; మీకా 7:18
  • +2ది 15:2; యెష 55:7; యాకో 4:8

2 దినవృత్తాంతాలు 30:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “పరుగెత్తేవాళ్లు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 30:1
  • +2ది 36:15, 16

2 దినవృత్తాంతాలు 30:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 11:14, 16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 5/2023, పేజీలు 6-7

2 దినవృత్తాంతాలు 30:12

అధస్సూచీలు

  • *

    లేదా “ఒకే హృదయంతో.”

2 దినవృత్తాంతాలు 30:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 9:10, 11
  • +లేవీ 23:6

2 దినవృత్తాంతాలు 30:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 28:24
  • +2రా 18:22

2 దినవృత్తాంతాలు 30:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 1:5

2 దినవృత్తాంతాలు 30:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 29:34

2 దినవృత్తాంతాలు 30:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 30:1
  • +కీర్త 86:5

2 దినవృత్తాంతాలు 30:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 9:6, 10
  • +2ది 19:2, 3; ఎజ్రా 7:10

2 దినవృత్తాంతాలు 30:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “బాగుచేశాడు.”

2 దినవృత్తాంతాలు 30:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:5, 7; నెహె 8:10
  • +లేవీ 23:6
  • +2ది 29:25

2 దినవృత్తాంతాలు 30:22

అధస్సూచీలు

  • *

    లేదా “బుద్ధితో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:6
  • +లేవీ 3:1

2 దినవృత్తాంతాలు 30:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:65

2 దినవృత్తాంతాలు 30:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 35:7, 8
  • +2ది 29:34

2 దినవృత్తాంతాలు 30:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 30:11, 18
  • +నిర్గ 12:49

2 దినవృత్తాంతాలు 30:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:65, 66

2 దినవృత్తాంతాలు 30:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 6:23-26; ద్వితీ 10:8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 దిన. 30:1నిర్గ 12:43; లేవీ 23:5; ద్వితీ 16:2; 2ది 35:1
2 దిన. 30:12ది 11:14, 16
2 దిన. 30:12ది 34:1, 6, 7
2 దిన. 30:2సం 9:10, 11
2 దిన. 30:32ది 29:34
2 దిన. 30:3నిర్గ 12:18
2 దిన. 30:5న్యా 18:29
2 దిన. 30:52ది 35:18
2 దిన. 30:62రా 15:29; 1ది 5:26; 2ది 28:20, 21
2 దిన. 30:72ది 29:8, 9
2 దిన. 30:8నిర్గ 32:9
2 దిన. 30:8ద్వితీ 12:5, 6; కీర్త 132:13
2 దిన. 30:82ది 29:10
2 దిన. 30:91రా 8:49, 50
2 దిన. 30:9ద్వితీ 30:1-3
2 దిన. 30:9నిర్గ 34:6; కీర్త 86:5; మీకా 7:18
2 దిన. 30:92ది 15:2; యెష 55:7; యాకో 4:8
2 దిన. 30:102ది 30:1
2 దిన. 30:102ది 36:15, 16
2 దిన. 30:112ది 11:14, 16
2 దిన. 30:13సం 9:10, 11
2 దిన. 30:13లేవీ 23:6
2 దిన. 30:142ది 28:24
2 దిన. 30:142రా 18:22
2 దిన. 30:16లేవీ 1:5
2 దిన. 30:172ది 29:34
2 దిన. 30:182ది 30:1
2 దిన. 30:18కీర్త 86:5
2 దిన. 30:19సం 9:6, 10
2 దిన. 30:192ది 19:2, 3; ఎజ్రా 7:10
2 దిన. 30:21ద్వితీ 12:5, 7; నెహె 8:10
2 దిన. 30:21లేవీ 23:6
2 దిన. 30:212ది 29:25
2 దిన. 30:22లేవీ 23:6
2 దిన. 30:22లేవీ 3:1
2 దిన. 30:231రా 8:65
2 దిన. 30:242ది 35:7, 8
2 దిన. 30:242ది 29:34
2 దిన. 30:252ది 30:11, 18
2 దిన. 30:25నిర్గ 12:49
2 దిన. 30:261రా 8:65, 66
2 దిన. 30:27సం 6:23-26; ద్వితీ 10:8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 దినవృత్తాంతాలు 30:1-27

దినవృత్తాంతాలు రెండో గ్రంథం

30 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించేందుకు యెరూషలేములోని యెహోవా మందిరానికి రమ్మని+ హిజ్కియా ఇశ్రాయేలు, యూదా ప్రజలందరికీ+ కబురు పంపించాడు. అతను ఎఫ్రాయిము, మనష్షే వాళ్లకు+ ఉత్తరాలు కూడా రాసి పంపించాడు. 2 అయితే రాజు, అతని అధిపతులు, యెరూషలేములోని సమాజమంతా పస్కాను రెండో నెలలో ఆచరించాలని నిర్ణయించారు.+ 3 యాజకులు తగినంతమంది తమను తాము పవిత్రపర్చుకోలేదు,+ అలాగే యెరూషలేములో ప్రజలు సమకూడలేదు కాబట్టి వాళ్లు ఆ పండుగను సరైన సమయంలో ఆచరించలేకపోయారు.+ 4 ఈ ఏర్పాటు రాజుకూ, సమాజమంతటికీ సరైనదని అనిపించింది. 5 కాబట్టి, బెయేర్షెబా నుండి దాను+ వరకు ఇశ్రాయేలు ప్రాంతమంతటా ప్రకటన చేయించి, యెరూషలేములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా ఆచరించడానికి ప్రజల్ని ఆహ్వానించాలని వాళ్లు నిర్ణయించారు. ధర్మశాస్త్రం నిర్దేశించినట్టు, వాళ్లు ఒక సమూహంగా దాన్ని ఆచరించలేదు.+

6 అప్పుడు రాజాజ్ఞ ప్రకారం రాజు, అతని అధిపతులు రాసిన ఉత్తరాలు తీసుకొని వార్తాహరులు* ఇశ్రాయేలు, యూదా అంతటికీ వెళ్లి ఇలా చాటించారు: “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాముకు, ఇస్సాకుకు, ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగిరండి. అప్పుడు అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకున్న మిగిలినవాళ్ల దగ్గరికి ఆయన తిరిగొస్తాడు.+ 7 మీరు మీ పూర్వీకుల్లా, మీ సహోదరుల్లా ఉండకండి; వాళ్లు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా పట్ల నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. అందుకే ఆయన వాళ్ల మీదికి నాశనాన్ని తీసుకొచ్చాడు. మీరు దాన్ని కళ్లారా చూస్తున్నారు.+ 8 మీరు మీ పూర్వీకుల్లా మొండిగా ఉండకండి.+ యెహోవాకు లోబడండి, ఆయన శాశ్వతంగా పవిత్రపర్చిన ఆయన పవిత్రమైన స్థలానికి వచ్చి,+ మీ దేవుడైన యెహోవాను సేవించండి. అప్పుడు ఆయన కోపాగ్ని మీ మీద నుండి మళ్లుతుంది.+ 9 మీరు యెహోవా దగ్గరికి తిరిగొస్తే మీ సహోదరుల్ని, మీ కుమారుల్ని బందీలుగా తీసుకెళ్లినవాళ్లు వాళ్లమీద కరుణ చూపించి,+ వాళ్లను ఈ దేశానికి తిరిగి రానిస్తారు.+ ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా కనికరం,* కరుణ గల దేవుడు.+ మీరు ఆయన దగ్గరికి తిరిగొస్తే ఆయన తన ముఖాన్ని పక్కకు తిప్పుకోడు.”+

10 వార్తాహరులు* ఎఫ్రాయిము, మనష్షే, చివరికి జెబూలూను ప్రాంతమంతటా ఉన్న ఒక్కో నగరానికి వెళ్లారు.+ కానీ ప్రజలు వాళ్లను హేళన చేశారు, ఎగతాళి చేశారు.+ 11 అయితే ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకొని యెరూషలేముకు వచ్చారు.+ 12 సత్యదేవుని అనుగ్రహం యూదావాళ్ల మీద ఉండడంతో వాళ్లు యెహోవా మాట ప్రకారం రాజు, అధిపతులు ఆజ్ఞాపించినదాన్ని ఐక్యంగా* చేశారు.

13 రెండో నెలలో+ పులవని రొట్టెల పండుగ+ ఆచరించడానికి యెరూషలేములో చాలామంది ప్రజలు సమకూడారు; అది చాలా పెద్ద సమూహం. 14 వాళ్లు లేచి యెరూషలేములో ఉన్న బలిపీఠాల్ని, ధూపవేదికలన్నిటినీ+ తొలగించి+ వాటిని కిద్రోను లోయలో పడేశారు. 15 వాళ్లు రెండో నెల 14వ రోజున పస్కా బలి జంతువును వధించారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి, తమను తాము పవిత్రపర్చుకొని యెహోవా మందిరంలోకి దహనబలుల్ని తీసుకొచ్చారు. 16 సత్యదేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రం నిర్దేశించిన ప్రకారం వాళ్లు తమతమ స్థానాల్లో నిలబడ్డారు; యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తాన్ని తీసుకొని బలిపీఠం మీద చిలకరించారు.+ 17 తమను తాము పవిత్రపర్చుకోనివాళ్లు సమాజంలో చాలామంది ఉన్నారు; వాళ్లందర్నీ యెహోవా కోసం పవిత్రపర్చడానికి పస్కా బలి జంతువుల్ని వధించే బాధ్యత లేవీయులకు అప్పగించబడింది.+ 18 చాలామంది ప్రజలు ముఖ్యంగా ఎఫ్రాయిము, మనష్షే,+ ఇశ్శాఖారు, జెబూలూను ప్రజలు తమను తాము పవిత్రపర్చుకోలేదు. అయినా వాళ్లు ధర్మశాస్త్రంలో రాయబడినదానికి విరుద్ధంగా పస్కాను తిన్నారు. అయితే హిజ్కియా వాళ్ల కోసం ఇలా ప్రార్థించాడు: “మంచివాడైన యెహోవా+ క్షమించాలి, 19 పవిత్రతకు సంబంధించిన ప్రమాణం ప్రకారం తమను తాము పవిత్రపర్చుకోకపోయినా,+ తమ పూర్వీకుల దేవుడూ సత్యదేవుడూ అయిన యెహోవాను వెదకడానికి హృదయాన్ని సిద్ధం చేసుకున్న ప్రతీ ఒక్కర్ని+ ఆయన క్షమించాలి.” 20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని, ప్రజల్ని క్షమించాడు.*

21 అలా యెరూషలేములోని ఇశ్రాయేలీయులు ఎంతో సంతోషంగా+ ఏడురోజులు పులవని రొట్టెల పండుగను ఆచరించారు.+ లేవీయులు, యాజకులు ప్రతీరోజు యెహోవాను స్తుతించారు, తమ వాద్యాల్ని బిగ్గరగా వాయిస్తూ+ యెహోవాను స్తుతించారు. 22 అంతేకాదు, హిజ్కియా యెహోవాను వివేచనతో* సేవించిన లేవీయులందరితో మాట్లాడి, వాళ్లను ప్రోత్సహించాడు. వాళ్లు ఆ పండుగలో ఏడురోజుల పాటు తింటూ,+ సమాధాన బలులు+ అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు.

23 తర్వాత సమాజమంతా మరో ఏడురోజులు దాన్ని ఆచరించాలని నిర్ణయించింది. కాబట్టి వాళ్లు సంతోషంగా మరో ఏడురోజులు దాన్ని ఆచరించారు.+ 24 యూదా రాజైన హిజ్కియా సమాజం కోసం 1,000 ఎద్దుల్ని, 7,000 గొర్రెల్ని విరాళంగా ఇచ్చాడు. అధిపతులు సమాజం కోసం 1,000 ఎద్దుల్ని, 10,000 గొర్రెల్ని విరాళంగా ఇచ్చారు;+ పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రపర్చుకుంటూ ఉన్నారు.+ 25 యూదా సమాజమంతా, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన సమాజమంతా,+ ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన విదేశీయులు, యూదాలో నివసిస్తున్న విదేశీయులు+ సంతోషిస్తూ ఉన్నారు. 26 అప్పుడు యెరూషలేములో ఎంతో సంతోషం వెల్లివిరిసింది. ఎందుకంటే ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను రోజుల నుండి యెరూషలేములో అలాంటిది జరగలేదు.+ 27 చివర్లో లేవీయులైన యాజకులు నిలబడి ప్రజల్ని దీవించారు;+ దేవుడు వాళ్ల ప్రార్థన విన్నాడు, వాళ్ల ప్రార్థన ఆయన పవిత్ర నివాస స్థలమైన పరలోకానికి చేరింది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి