యోబు
12 అప్పుడు యోబు ఇలా అన్నాడు:
2 “నిజంగా, అన్నీ మీకే తెలుసు,
తెలివి మీతోపాటే అంతరించిపోతుంది!
3 అయితే నాకు కూడా అవగాహన ఉంది.
నేను మీకన్నా తక్కువవాణ్ణేం కాదు.
ఈ విషయాలు తెలియని వాళ్లెవరు?
నీతిమంతుణ్ణి, నిందలేనివాణ్ణి చూసి అంతా నవ్వుకుంటారు.
5 నిశ్చింతగా ఉన్నవాళ్లు విపత్తును హేళన చేస్తారు,
అది తడబడేవాళ్ల మీదికే వస్తుందని వాళ్లనుకుంటారు.
6 దోపిడీ దొంగల డేరాలు నెమ్మదిగా ఉన్నాయి,+
దేవునికి కోపం తెప్పించేవాళ్లు క్షేమంగా ఉన్నారు,+
వాళ్ల దేవుడు వాళ్ల చేతుల్లోనే ఉన్నాడు.
7 దయచేసి జంతువుల్ని అడుగు, అవి నీకు ఉపదేశిస్తాయి;
ఆకాశపక్షుల్ని అడుగు, అవి నీకు చెప్తాయి.
8 భూమి గురించి ఆలోచించు,* అది నీకు బోధిస్తుంది;
సముద్రంలోని చేపలు నీకు ప్రకటిస్తాయి.
9 యెహోవా చెయ్యే అవన్నీ చేసిందని
వీటిలో దేనికి తెలీదు?
14 ఆయన దేన్నైనా పడగొడితే, దాన్ని తిరిగి కట్టడం అసాధ్యం;+
ఆయన మూసినదాన్ని ఎవరూ తెరవలేరు.
15 ఆయన వర్షం కురిపించకపోతే, అన్నీ ఎండిపోతాయి;+
ఆయన వర్షం కురిపించినప్పుడు, నీళ్లు భూమిని ముంచెత్తుతాయి.+
18 రాజుల అధికారాన్ని కొట్టివేసి,+
వాళ్లను బానిసలుగా చేస్తాడు.
19 యాజకుల్ని వట్టికాళ్లతో నడిపిస్తాడు,+
బలంగా పాతుకుపోయిన వాళ్లను పడదోస్తాడు;+
20 నమ్మకమైన సలహాదారుల నోళ్లు మూసేస్తాడు,
వృద్ధుల* వివేకాన్ని తీసేస్తాడు;
21 ప్రముఖుల్ని అవమానాలపాలు చేస్తాడు,+
బలవంతుల్ని బలహీనులుగా చేస్తాడు;
22 చీకట్లోని లోతైన విషయాల్ని వెల్లడిచేస్తాడు,+
కటిక చీకటిని వెలుగులోకి తీసుకొస్తాడు;
23 దేశాల్ని గొప్పవిగా చేసి నాశనం చేస్తాడు;
దేశాల్ని విస్తరింపజేసి చెరలోకి తీసుకెళ్తాడు.
24 ప్రజల నాయకుల అవగాహనను తీసేసి,
వాళ్లు దారులు లేని పనికిరాని ప్రదేశాల్లో తిరిగేలా చేస్తాడు.+