యోబు
21 అప్పుడు యోబు ఇలా అన్నాడు:
2 “నేను చెప్పేది శ్రద్ధగా వినండి;
అదే మీరు నాకిచ్చే ఊరట.
3 నేను మాట్లాడతాను, ఓపిగ్గా ఉండండి;
తర్వాత మీరు నన్ను ఎగతాళి చేయవచ్చు.+
4 నేను మనిషికి ఫిర్యాదు చేస్తున్నానా?
అలాగైతే ఎప్పుడో నా ఓపిక నశించేది.
5 నన్ను చూసి ఆశ్చర్యపోండి;
మీ నోటి మీద చెయ్యి పెట్టుకోండి.
6 దాని గురించి ఆలోచించినప్పుడు నాకు ఆందోళనగా ఉంటుంది,
నా శరీరమంతా వణికిపోతుంది.
8 వాళ్ల పిల్లలు ఎప్పుడూ వాళ్ల కళ్లముందే ఉంటారు,
వాళ్లు తమ మనవళ్లను, మనవరాళ్లను చూస్తారు.
9 వాళ్ల ఇళ్లు ఏ భయం లేకుండా సురక్షితంగా ఉంటాయి,+
దేవుడు తన దండంతో వాళ్లను శిక్షించడు.
10 వాళ్ల ఎద్దులకు చాలా పిల్లలు ఉంటాయి;
వాళ్ల ఆవులకు గర్భపాతం కలగదు.
11 వాళ్ల మగపిల్లలు మందలా బయటికి వస్తారు,
వాళ్ల పిల్లలు గంతులు వేస్తారు.
14 దుష్టులు సత్యదేవునితో ఇలా అంటారు: ‘మమ్మల్ని ఇలా వదిలేయి!
నీ మార్గాల్ని తెలుసుకోవాలని మాకు లేదు.+
15 మేము ఆయన్ని సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు?+
ఆయనకు ప్రార్థించడం వల్ల మాకేం వస్తుంది?’+
16 అయితే, వాళ్ల సమృద్ధి వాళ్ల చేతుల్లో ఉండదని నాకు తెలుసు.+
నేను దుష్టుల్లా అస్సలు ఆలోచించను.*+
17 దుష్టుల దీపం ఎన్నిసార్లు ఆరిపోయింది?+
ఎన్నిసార్లు వాళ్లమీదికి విపత్తు వచ్చింది?
ఎన్నిసార్లు దేవుడు కోపంతో వాళ్లను నాశనం చేశాడు?
18 వాళ్లు ఎప్పుడైనా గాలికి ఎగిరిపోయే గడ్డిపోచలా,
సుడిగాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉన్నారా?
19 దేవుడు ఒకవ్యక్తి శిక్షను అతని కుమారుల కోసం దాచిపెడతాడు.
దేవుడు అతన్ని కూడా శిక్షించాలి, అతనికీ ఆ బాధ తెలియాలి.+
20 తన నాశనాన్ని అతను కళ్లారా చూడాలి,
సర్వశక్తిమంతుని ఉగ్రత గిన్నెలోనిది అతను తాగాలి.+
21 అతని నెలలు తక్కువ చేయబడితే,+
తాను పోయిన తర్వాత తన ఇంటివాళ్లకు ఏం జరుగుతుందో అతనెందుకు పట్టించుకుంటాడు?
23 ఒక వ్యక్తి నిశ్చింతగా, హాయిగా,
పూర్తిబలంతో ఉన్నప్పుడు చనిపోతాడు;+
24 అప్పటికి అతని తొడలు కొవ్వుపట్టి ఉంటాయి,
అతని ఎముకలు బలంగా ఉంటాయి.
25 ఇంకో వ్యక్తి ఎన్నో కష్టాలు అనుభవించి,
ఏ మంచీ చూడకుండానే చనిపోతాడు.
27 చూడండి! మీరు ఏం ఆలోచిస్తున్నారో,
నాకు కీడు చేయడానికి* ఏమేం కుట్రలు పన్నుతున్నారో+ నాకు బాగా తెలుసు.
28 ఎందుకంటే మీరు, ‘ఆ ప్రముఖుని ఇల్లు ఎక్కడ?
ఆ దుష్టుడు నివసించిన డేరా ఎక్కడ?’ అని అంటున్నారు.+
29 మీరు యాత్రికుల్ని అడగలేదా?
వాళ్లు గమనించిన వాటిని* మీరు జాగ్రత్తగా పరిశీలించలేదా?
30 విపత్తు రోజున దుష్టుడు దాచబడతాడని,
ఉగ్రత రోజున అతను కాపాడబడతాడని మీరు తెలుసుకోలేదా?
31 అతనికి ఎదురునిలిచి, అతని మార్గం గురించి అతన్ని ప్రశ్నించేదెవరు?
అతను చేసిన దాన్నిబట్టి అతనికి ప్రతీకారం చేసేదెవరు?
32 అతన్ని పాతిపెట్టినప్పుడు,
అతని సమాధికి కాపలా పెడతారు.
33 లోయలోని* మట్టిపెల్లలు అతనికి తియ్యగా ఉంటాయి,+
మనుషులంతా అతన్ని అనుసరిస్తారు,*+
అతని ముందు కూడా లెక్కలేనంతమంది వెళ్లిపోయారు.
34 అలాంటప్పుడు, ఎందుకీ అర్థంపర్థంలేని ఓదార్పులు?+
మీ మాటలన్నీ పచ్చి మోసం!”