యోబు
24 “సర్వశక్తిమంతుడు ఎందుకు ఒక తీర్పు రోజును నియమించట్లేదు?+
ఆయన గురించి తెలిసినవాళ్లు ఆ రోజును ఎందుకు చూడలేకపోతున్నారు?
4 పేదవాళ్లను దారిలో నుండి తోసేస్తారు;
భూమ్మీది నిస్సహాయులు వాళ్లకు కనిపించకుండా దాక్కోవాల్సి వస్తుంది.+
5 పేదవాళ్లు ఎడారిలో అడవి గాడిదల్లా+ ఆహారం వెతుక్కుంటూ తిరుగుతారు;
తమ పిల్లల కోసం ఎడారిలో ఆహారం వెతుకుతారు.
6 వాళ్లు ఇతరుల పొలంలో కోత* కోయాల్సి వస్తుంది,
దుష్టుల ద్రాక్షతోటలో పరిగె ఏరుకోవాల్సి వస్తుంది.
7 బట్టలు లేక రాత్రంతా వాళ్లు దిగంబరంగా పడుకుంటారు;+
చలికి కప్పుకోవడానికి వాళ్ల దగ్గర ఏమీ ఉండదు.
8 పర్వతాల మీద కురిసే వర్షాలకు వాళ్లు తడిసిముద్దౌతారు;
నిలువ నీడ లేక బండల్ని కౌగిలించుకుంటారు.
9 దుష్టులు తండ్రిలేని పిల్లవాణ్ణి తల్లి రొమ్ము నుండి లాగేస్తారు;+
పేదవాడి బట్టల్ని తాకట్టుగా తీసుకుంటారు.+
10 దానివల్ల వాళ్లు బట్టల్లేకుండా దిగంబరంగా తిరగాల్సి వస్తుంది,
ఆకలితో అలమటిస్తూ ధాన్యపు పనల్ని* మోయాల్సి వస్తుంది.
11 వాళ్లు ఎండవేళ కొండ ప్రాంతంలో రాతిగోడల మధ్య కష్టపడతారు;*
వాళ్లు ద్రాక్షతొట్లు తొక్కుతారు, అయినా దాహంతోనే ఉంటారు.+
12 చనిపోతున్నవాళ్లు నగరంలో మూల్గుతూ ఉన్నారు;
తీవ్రంగా గాయపడినవాళ్లు సహాయం కోసం అర్థిస్తున్నారు,+
కానీ దేవునికి అది తప్పు అనిపించదు.*
14 హంతకుడు ఉదయాన్నే లేస్తాడు;
అతను నిస్సహాయుల్ని, పేదవాళ్లను చంపుతాడు,+
అయితే రాత్రివేళ దొంగతనాలు చేస్తాడు.
తన ముఖాన్ని కప్పుకుంటాడు.
16 వాళ్లు చీకట్లో ఇళ్లలోకి చొరబడతారు;
పగలు తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండిపోతారు.
పగటి వెలుగు అంటే ఏంటో వాళ్లకు తెలీదు.+
17 వాళ్లకు పగలు కూడా కారుచీకటిలానే అనిపిస్తుంది.
కటిక చీకట్లోని భయాల గురించి వాళ్లకు బాగా తెలుసు.
18 కానీ వాళ్లు ప్రవాహంలో వేగంగా కొట్టుకుపోతారు.
వాళ్ల భూభాగం శపించబడుతుంది.+
వాళ్లు తమ ద్రాక్షతోటలకు తిరిగెళ్లరు.
20 వాళ్ల తల్లులు వాళ్లను మర్చిపోతారు; పురుగు వాళ్లను ఇష్టంగా తినేస్తుంది.
వాళ్లను ఎవ్వరూ గుర్తుచేసుకోరు.+
అవినీతిపరులు చెట్టులా పడగొట్టబడతారు.
21 వాళ్లు గొడ్రాళ్లను మింగేస్తారు,
విధవరాళ్లను బాధపెడతారు.
22 బలవంతుల్ని నిర్మూలించడానికి దేవుడు* తన శక్తిని ఉపయోగిస్తాడు;
వాళ్లు పైకి ఎదిగినా, ప్రాణాలతో ఉంటామనే నమ్మకం వాళ్లకు ఉండదు.
24 వాళ్లు కొంతకాలం హెచ్చించబడతారు, కానీ తర్వాత ఇక ఉండరు.+
వాళ్లు తగ్గించబడి,+ అందరిలాగే సమకూర్చబడతారు;
ధాన్యపు వెన్నుల్లా కోయబడతారు.
25 ఇప్పుడు, నేను అబద్ధికుణ్ణని ఎవరు నిరూపించగలరు?
నా మాటల్ని ఎవరు తప్పుపట్టగలరు?”