యోబు
39 “కొండమేకలు ఎప్పుడు ఈనతాయో నీకు తెలుసా?+
జింకలు పిల్లల్ని కనేటప్పుడు నువ్వు చూశావా?+
2 అవి ఎన్ని నెలలు మోస్తాయో నువ్వు లెక్కపెట్టావా?
అవి ఎప్పుడు కంటాయో నీకు తెలుసా?
3 అవి పిల్లల్ని కనేటప్పుడు నేలకు వంగుతాయి,
అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.
4 వాటి పిల్లలు బలంగా ఎదుగుతాయి, మైదానాల్లో పెరుగుతాయి;
అవి తల్లుల్ని విడిచి వెళ్లిపోతాయి, మళ్లీ రావు.
5 అడవి గాడిదను స్వేచ్ఛగా తిరగనిచ్చింది ఎవరు?+
దాని తాళ్లను విప్పింది ఎవరు?
6 నేను ఎడారి మైదానాన్ని దానికి ఇల్లుగా ఇచ్చాను,
ఉప్పు నేలను దానికి నివాసంగా చేశాను.
7 నగరంలోని కోలాహలాన్ని అది పట్టించుకోదు;
దాన్ని తోలేవాడి కేకల్ని వినిపించుకోదు.
8 అది మేత కోసం వెతుక్కుంటూ కొండల్లో తిరుగుతుంది,
పచ్చని మొక్కల కోసం చూస్తుంది.
9 అడవి ఎద్దు నీకు సేవచేస్తుందా?+
అది రాత్రిపూట నీ పశువుల కొట్టంలో ఉంటుందా?
10 నువ్వు అడవి ఎద్దుకు తాడు కట్టి, దానితో పొలం దున్నించగలవా?
లోయను చదును చేయడానికి అది నీ వెంట వస్తుందా?
11 దాని బలం గొప్పదని దాన్ని నమ్ముకుంటావా?
దానికి బరువైన పనులు అప్పగిస్తావా?
12 నీ పంటను ఇంటికి తెచ్చుకోవడానికి దానిమీద ఆధారపడతావా?
అది కళ్లం* దగ్గరికి నీ పంటను పోగుచేస్తుందా?
13 నిప్పుకోడి ఆనందంతో రెక్కలు ఆడిస్తుంది,
కానీ దాని రెక్కలు, ఈకలు సంకుబుడి కొంగకు ఉన్న లాంటివా?+
14 అది దాని గుడ్లను నేల మీద వదిలేస్తుంది,
మట్టిలో వాటిని వెచ్చగా ఉంచుతుంది.
15 అవి దేని కాలి కిందైనా పడి చితికిపోవచ్చని,
అడవి జంతువు వాటిని తొక్కేయవచ్చని అది మర్చిపోతుంది.
16 దాని పిల్లలు దానివి కావన్నట్టుగా కఠినంగా ప్రవర్తిస్తుంది;+
తన కష్టం వృథా అయిపోతుందనే భయం దానికి ఉండదు.
17 ఎందుకంటే దేవుడు దానికి తెలివిని, అవగాహనను ఇవ్వలేదు.
18 కానీ అది లేచి రెక్కలు ఆడించినప్పుడు
గుర్రాన్ని, దాని రౌతును చూసి ఎగతాళిగా నవ్వుతుంది.
19 గుర్రానికి బలాన్ని ఇచ్చేది నువ్వేనా?+
జూలుతో దాని మెడను కప్పేది నువ్వేనా?
20 నువ్వు దాన్ని మిడతలా గంతులు వేసేట్టు చేయగలవా?
దాని భీకరమైన సకిలింపు భయం పుట్టిస్తుంది.+
22 అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికీ బెదరదు.+
ఖడ్గాన్ని చూసి వెనక్కి తిరగదు.
23 అంబులపొది దానికి తగిలి గలగలమంటుంది,
ఈటె, బల్లెం తళతళ మెరుస్తాయి.
25 బూరను ఊదినప్పుడు, అది ‘ఆహా!’ అంటుంది.
అది దూరం నుండే యుద్ధ వాసనను పసిగడుతుంది,
సైన్యాధికారుల అరుపుల్ని, యుద్ధకేకల్ని వింటుంది.+
26 నీ అవగాహనను బట్టే డేగ రెక్కలు చాచి
దక్షిణం వైపు ఎగురుతుందా?