కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎస్తేరు 6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎస్తేరు విషయసూచిక

      • రాజు మొర్దెకైని సన్మానించాడు (1-14)

ఎస్తేరు 6:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 10:2

ఎస్తేరు 6:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:21, 23

ఎస్తేరు 6:4

అధస్సూచీలు

  • *

    లేదా “రాజభవనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 5:14
  • +ఎస్తే 4:11

ఎస్తేరు 6:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 3:1

ఎస్తేరు 6:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 3:2; 5:11

ఎస్తేరు 6:8

అధస్సూచీలు

  • *

    లేదా “తురాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 8:15

ఎస్తేరు 6:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 41:42, 43

ఎస్తేరు 6:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 2:5, 6

ఎస్తేరు 6:13

అధస్సూచీలు

  • *

    లేదా “జ్ఞానులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 5:10, 14

ఎస్తేరు 6:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 5:8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఎస్తే. 6:1ఎస్తే 10:2
ఎస్తే. 6:2ఎస్తే 2:21, 23
ఎస్తే. 6:4ఎస్తే 5:14
ఎస్తే. 6:4ఎస్తే 4:11
ఎస్తే. 6:5ఎస్తే 3:1
ఎస్తే. 6:6ఎస్తే 3:2; 5:11
ఎస్తే. 6:8ఎస్తే 8:15
ఎస్తే. 6:9ఆది 41:42, 43
ఎస్తే. 6:11ఎస్తే 2:5, 6
ఎస్తే. 6:13ఎస్తే 5:10, 14
ఎస్తే. 6:14ఎస్తే 5:8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎస్తేరు 6:1-14

ఎస్తేరు

6 ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు. దాంతో అతను చరిత్ర వృత్తాంతాల గ్రంథాన్ని+ తెప్పించుకున్నాడు, దాన్ని అతనికి చదివి వినిపించారు. 2 అందులో, రాజు దగ్గర ద్వారపాలకులుగా సేవచేసిన బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు ఆస్థాన అధికారులు అహష్వేరోషు రాజును చంపడానికి పన్నిన కుట్ర గురించి మొర్దెకై తెలియజేశాడని రాసివుంది.+ 3 అప్పుడు రాజు, “అలా చేసినందుకు మొర్దెకైని ఎలా సన్మానించారు, ఏ బహుమతులు ఇచ్చారు?” అని అడిగాడు. అందుకు రాజు వ్యక్తిగత సేవకులు, “⁠అలాంటివేవీ అతనికి ఇవ్వలేదు” అని జవాబిచ్చారు.

4 తర్వాత రాజు, “ఆవరణలో ఉన్నది ఎవరు?” అని అడిగాడు. ఆ సమయంలో, హామాను తాను సిద్ధం చేసిన కొయ్య మీద మొర్దెకైని వేలాడదీయించడం గురించి రాజుతో మాట్లాడడానికి+ రాజగృహ* బయటి ఆవరణలోకి+ వచ్చాడు. 5 రాజు సేవకులు, “ఆవరణలో నిల్చున్నది హామాను”+ అని జవాబిచ్చారు. అప్పుడు రాజు, “అతన్ని లోపలికి రమ్మనండి” అన్నాడు.

6 హామాను లోపలికి వచ్చినప్పుడు రాజు అతన్ని, “రాజు ఎవరినైనా సన్మానించాలనుకుంటే అతనికి ఏమేం చేయాలి?” అని అడిగాడు. అప్పుడు హామాను తన మనసులో, “రాజు నన్ను కాకుండా ఇంకెవర్ని సన్మానించాలనుకుంటాడు?” అని అనుకున్నాడు.+ 7 కాబట్టి హామాను రాజుతో ఇలా చెప్పాడు: “రాజు ఎవరినైనా సన్మానించాలనుకుంటే, 8 రాజు వేసుకునే రాజవస్త్రాన్ని,+ రాజు ఎక్కే గుర్రాన్ని తెప్పించాలి, ఆ గుర్రం తలమీద తలాటం* పెట్టాలి. 9 తర్వాత ఆ వస్త్రాన్ని, గుర్రాన్ని రాజు అధిపతుల్లోని ప్రముఖుల్లో ఒకరికి అప్పగించాలి, వాళ్లు రాజు సన్మానించాలనుకునే వ్యక్తికి ఆ వస్త్రం తొడిగి, అతన్ని ఆ గుర్రం మీద నగర వీధిలో ఊరేగించాలి. వాళ్లు అతని ముందు బిగ్గరగా, ‘రాజు సన్మానించాలనుకునే వ్యక్తికి ఇలాంటి సత్కారం జరుగుతుంది!’ అని చాటాలి.”+ 10 వెంటనే రాజు హామానుతో, “నువ్వు త్వరగా రాజవస్త్రాన్ని, గుర్రాన్ని తీసుకొని, రాజగృహ ద్వారం దగ్గర కూర్చునే యూదుడైన మొర్దెకైకి నువ్వు చెప్పినట్టే చేయి. నువ్వు చెప్పిన దానిలో ఏ ఒక్కటీ చేయడం మర్చిపోకు” అన్నాడు.

11 కాబట్టి హామాను రాజవస్త్రాన్ని, గుర్రాన్ని తీసుకొని, ఆ వస్త్రాన్ని మొర్దెకైకి+ తొడిగి, ఆ గుర్రం మీద అతన్ని నగర వీధిలో ఊరేగిస్తూ, “రాజు సన్మానించాలనుకునే వ్యక్తికి ఇలాంటి సత్కారం జరుగుతుంది!” అని అతని ముందు చాటాడు. 12 తర్వాత మొర్దెకై రాజగృహ ద్వారం దగ్గరికి తిరిగెళ్లిపోయాడు, కానీ హామాను తన ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ హడావిడిగా తన ఇంటికి వెళ్లిపోయాడు. 13 హామాను తనకు జరిగినదంతా తన భార్య జెరెషుకు,+ తన స్నేహితులందరికీ చెప్పినప్పుడు అతని సలహాదారులు,* అతని భార్య జెరెషు ఇలా అన్నారు: “ఎవరి ముందైతే నీ పతనం మొదలైందో ఆ మొర్దెకై యూదా వంశస్థుడైతే, నువ్వు అతని మీద గెలవలేవు; నువ్వు ఖచ్చితంగా అతని ముందు ఓడిపోతావు.”

14 వాళ్లు ఇంకా అతనితో మాట్లాడుతుండగానే, రాజు ఆస్థాన అధికారులు వచ్చి హామానును తొందరపెట్టి, ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు తీసుకెళ్లారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి