కీర్తనలు
కష్టాల వల్ల కృంగిపోయిన* వ్యక్తి యెహోవా ముందు తన బాధను చెప్పుకుంటూ చేసిన ప్రార్థన.+
2 నేను కష్టాల్లో ఉన్నప్పుడు నీ ముఖం పక్కకు తిప్పుకోకు.+
3 ఎందుకంటే, నా రోజులు పొగలా మాయమైపోతున్నాయి,
నా ఎముకలు కొలిమిలా కాలిపోతున్నాయి.+
4 నా హృదయం, సూర్యుడి వేడికి వాడిపోయిన గడ్డిలా తయారైంది,+
నేను భోజనం చేయడం కూడా మర్చిపోతున్నాను.
6 నేను ఎడారిలోని గూడబాతులా* ఉన్నాను;
శిథిలాల మధ్య నివసించే చిన్న గుడ్లగూబలా ఉన్నాను.
8 రోజంతా నా శత్రువులు నన్ను నిందిస్తూ ఉన్నారు.+
నన్ను ఎగతాళి* చేసేవాళ్లు నా పేరును శాపంగా ఉపయోగిస్తున్నారు.
9 నేను బూడిదను ఆహారంలా తింటున్నాను,+
నేను తాగేవాటిలో కన్నీళ్లు కలిశాయి;+
10 నీ కోపం వల్లే, నీ ఆగ్రహం వల్లే నాకీ పరిస్థితి వచ్చింది,
నన్ను అవతల పారేయడానికే నువ్వు నన్ను పైకెత్తావు.
13 నువ్వు ఖచ్చితంగా లేచి సీయోను మీద కరుణ చూపిస్తావు,+
దాని మీద అనుగ్రహం+ చూపించే సమయం ఇదే;
నియమిత సమయం వచ్చేసింది.+
15 దేశాలు యెహోవా పేరుకు భయపడతాయి,
భూరాజులందరూ నీ మహిమను గుర్తిస్తారు.+
19 ఆయన పవిత్రమైన తన ఉన్నత స్థలం నుండి కిందికి చూస్తున్నాడు,+
యెహోవా పరలోకం నుండి భూమిని చూస్తున్నాడు;
20 చెరసాలలో ఉన్నవాళ్ల నిట్టూర్పులు వినడానికి,+
మరణశిక్ష విధించబడిన వాళ్లను విడిపించడానికి ఆయన అలా చూస్తున్నాడు.+
21 దానివల్ల సీయోనులో యెహోవా పేరు,
యెరూషలేములో ఆయన స్తుతి ప్రకటించబడతాయి.+
22 అప్పుడు యెహోవాను సేవించడానికి
ఆయా దేశాల, రాజ్యాల ప్రజలు సమకూడతారు.+
23 సమయం రాకముందే ఆయన నా బలాన్ని తీసేశాడు;
నా రోజుల్ని తగ్గించాడు.
24 నేనిలా అన్నాను: “తరతరాలు జీవించే దేవా,+
అర్ధాయుష్షులోనే నన్ను చనిపోనివ్వకు.
25 చాలాకాలం క్రితం నువ్వు భూమికి పునాదులు వేశావు,
ఆకాశం నీ చేతి పనే.+
26 అవి నశించిపోతాయి, కానీ నువ్వు ఎప్పటికీ ఉంటావు;
వస్త్రంలా అవన్నీ చీకిపోతాయి.
బట్టల్లా నువ్వు వాటిని మార్చేస్తావు, అవి లేకుండాపోతాయి.
27 కానీ నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉంటావు, నీ సంవత్సరాలకు ముగింపు లేదు.+
28 నీ సేవకుల పిల్లలు సురక్షితంగా నివసిస్తారు,
వాళ్ల సంతానం నీ ముందు స్థిరపర్చబడుతుంది.”+