యెషయా
2 యెహోవా పవిత్రశక్తి ఆయన మీద నిలిచివుంటుంది,+
అది ఆయనకు తెలివిని,+ అవగాహనను ఇస్తుంది,
ఆ పవిత్రశక్తి వల్ల ఆయన మంచి సలహా ఇస్తాడు, బలవంతుడిగా ఉంటాడు,+
ఆ పవిత్రశక్తి వల్ల ఆయనకు చాలా జ్ఞానం, యెహోవా పట్ల భయభక్తులు* ఉంటాయి.
3 యెహోవా పట్ల భయభక్తులు* కలిగివుండడం అంటే ఆయనకు ఇష్టం.+
ఆయన కంటికి కనిపించేదాన్ని బట్టి తీర్పుతీర్చడు,
కేవలం చెవులతో విన్నదాన్ని బట్టి గద్దింపు ఇవ్వడు.+
4 ఆయన పక్షపాతం లేకుండా* దీనులకు తీర్పుతీరుస్తాడు,
భూమ్మీదున్న సాత్వికుల తరఫున న్యాయంగా గద్దింపు ఇస్తాడు.
6 తోడేలు గొర్రెపిల్లతో పాటు నివసిస్తుంది,*+
చిరుతపులి మేకపిల్లతో పాటు పడుకుంటుంది,
దూడ, సింహం, కొవ్విన జంతువు అన్నీ ఒకే చోట ఉంటాయి;*+
చిన్న పిల్లవాడు వాటిని తోలుతాడు.
7 ఆవు, ఎలుగుబంటి కలిసి మేస్తాయి,
వాటి పిల్లలు కలిసి పడుకుంటాయి.
ఎద్దు మేసినట్టు సింహం గడ్డి మేస్తుంది.+
8 పాలు తాగే పసిపిల్ల నాగుపాము పుట్టమీద ఆడుకుంటుంది,
పాలు విడిచిన పిల్లవాడు విషసర్పం పుట్టమీద చెయ్యి పెడతాడు.
9 నా పవిత్ర పర్వతమంతటి మీద
అవి హాని గానీ నాశనం గానీ చేయవు,+
ఎందుకంటే సముద్రం నీళ్లతో నిండివున్నట్టు
భూమి యెహోవా గురించిన జ్ఞానంతో నిండిపోతుంది.+
10 ఆ రోజు యెష్షయి వేరు+ జనాల కోసం ధ్వజంలా* నిలబడతాడు.+
11 ఆ రోజు యెహోవా తన ప్రజల్లో మిగిలినవాళ్లను అష్షూరు నుండి, ఐగుప్తు నుండి,+ పత్రోసు నుండి,+ కూషు నుండి,+ ఏలాము నుండి,+ షీనారు* నుండి, హమాతు నుండి, సముద్ర ద్వీపాల నుండి+ సమకూర్చడానికి రెండోసారి తన చెయ్యి అందిస్తాడు. 12 ఆయన దేశాల కోసం ఒక ధ్వజాన్ని* నిలబెట్టి చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని సమకూరుస్తాడు,+ అలాగే చెదిరిపోయిన యూదా ప్రజల్ని భూమి నలుమూలల నుండి సమకూరుస్తాడు.+
ఎఫ్రాయిము యూదా మీద అసూయపడదు,
యూదాకు ఎఫ్రాయిము పట్ల శత్రుభావం ఉండదు.+