కీర్తనలు
దావీదు కీర్తన.
26 యెహోవా, నేను యథార్థంగా నడుచుకున్నాను, నాకు తీర్పు తీర్చు.+
నేను యెహోవా మీద నమ్మకముంచాను, నేను ఊగిసలాడలేదు.+
6 యెహోవా, నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను,
నేను నీ బలిపీఠం చుట్టూ తిరుగుతాను.
7 నీకు బిగ్గరగా కృతజ్ఞతలు తెలపడానికి,+
నీ అద్భుతమైన పనులన్నిటి గురించి ప్రకటించడానికి అలా చేస్తాను.
9 పాపులతో పాటు నన్ను తుడిచేయకు,+
దౌర్జన్యం చేసేవాళ్లతో* పాటు నా ప్రాణం తీసేయకు,
10 వాళ్లు* అవమానకరమైన పనులు చేస్తున్నారు,
వాళ్ల కుడిచెయ్యి లంచాలతో నిండిపోయింది.
11 నేనైతే, యథార్థంగా నడుచుకుంటాను.
నన్ను రక్షించి,* నా మీద అనుగ్రహం చూపించు.