కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • మోలెకును పూజించడం; చనిపోయినవాళ్లను సంప్రదించడం (1-6)

      • పవిత్రులుగా ఉండండి, తల్లిదండ్రుల్ని ​గౌరవించండి (7-9)

      • లైంగిక పాపాలు చేసేవాళ్లకు మరణశిక్ష (10-21)

      • దేశంలో ఉండాలంటే పవిత్రంగా ఉండాలి (22-26)

      • చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను ​చంపేయాలి (27)

లేవీయకాండం 20:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:10

లేవీయకాండం 20:3

అధస్సూచీలు

  • *

    లేదా “చంపేస్తాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 5:11

లేవీయకాండం 20:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 13:6-9

లేవీయకాండం 20:5

అధస్సూచీలు

  • *

    లేదా “చంపేస్తాను.”

లేవీయకాండం 20:6

అధస్సూచీలు

  • *

    లేదా “ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తే.”

  • *

    లేదా “చంపేస్తాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:10-12; గల 5:19, 20; ప్రక 21:8
  • +లేవీ 20:27; అపొ 16:16
  • +1ది 10:13

లేవీయకాండం 20:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:44; 1పే 1:15, 16

లేవీయకాండం 20:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 12:13
  • +నిర్గ 31:13; లేవీ 21:8; 1థె 5:23; 2థె 2:13

లేవీయకాండం 20:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “రక్తానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 21:17; ద్వితీ 27:16; సామె 20:20; మత్త 15:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 24

లేవీయకాండం 20:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:18; 22:22; రోమా 7:3; 1కొ 6:9, 10

లేవీయకాండం 20:11

అధస్సూచీలు

  • *

    అక్ష., “మానాన్ని వెల్లడిచేశాడు.”

  • *

    అక్ష., “రక్తానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:8; ద్వితీ 27:20

లేవీయకాండం 20:12

అధస్సూచీలు

  • *

    అక్ష., “రక్తానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:15, 29

లేవీయకాండం 20:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “రక్తానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:5; లేవీ 18:22; న్యా 19:22; రోమా 1:26, 27; 1కొ 6:9, 10; యూదా 7

లేవీయకాండం 20:14

అధస్సూచీలు

  • *

    లేదా “అవమానకరమైన ప్రవర్తన; కామాతురత.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:17; ద్వితీ 27:23
  • +లేవీ 21:9

లేవీయకాండం 20:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:19; ద్వితీ 27:21

లేవీయకాండం 20:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “రక్తానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:23

లేవీయకాండం 20:17

అధస్సూచీలు

  • *

    లేదా “కొట్టివేయాలి.”

  • *

    అక్ష., “మానాన్ని వెల్లడిచేశాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:9; ద్వితీ 27:22

లేవీయకాండం 20:18

అధస్సూచీలు

  • *

    లేదా “చంపేయాలి.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1991, పేజీలు 24-25

లేవీయకాండం 20:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:12, 13

లేవీయకాండం 20:20

అధస్సూచీలు

  • *

    లేదా “పెదనాన్న; మామ.”

  • *

    అక్ష., “మానాన్ని వెల్లడిచేశాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:14

లేవీయకాండం 20:21

అధస్సూచీలు

  • *

    అంటే, సహోదరుడు ఇంకా బ్రతికుండగానే.

  • *

    అక్ష., “మానాన్ని వెల్లడిచేశాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:16; ద్వితీ 25:5

లేవీయకాండం 20:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 5:1
  • +ప్రస 12:13
  • +లేవీ 18:26, 28

లేవీయకాండం 20:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:3, 24; ద్వితీ 12:30
  • +ద్వితీ 9:5

లేవీయకాండం 20:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:17; 6:8; ద్వితీ 8:7-9; యెహె 20:6
  • +నిర్గ 19:5; 33:16; 1రా 8:53; 1పే 2:9

లేవీయకాండం 20:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:46, 47; ద్వితీ 14:4-20
  • +లేవీ 11:43

లేవీయకాండం 20:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 19:2; కీర్త 99:5; 1పే 1:15, 16; ప్రక 4:8
  • +ద్వితీ 7:6

లేవీయకాండం 20:27

అధస్సూచీలు

  • *

    లేదా “భవిష్యత్తు చెప్పే చెడ్డదూత పట్టిన.”

  • *

    అక్ష., “రక్తానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:18; లేవీ 19:31; 20:6; ద్వితీ 18:10-12; ప్రక 21:8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 20:2ద్వితీ 18:10
లేవీ. 20:3యెహె 5:11
లేవీ. 20:4ద్వితీ 13:6-9
లేవీ. 20:6ద్వితీ 18:10-12; గల 5:19, 20; ప్రక 21:8
లేవీ. 20:6లేవీ 20:27; అపొ 16:16
లేవీ. 20:61ది 10:13
లేవీ. 20:7లేవీ 11:44; 1పే 1:15, 16
లేవీ. 20:8ప్రస 12:13
లేవీ. 20:8నిర్గ 31:13; లేవీ 21:8; 1థె 5:23; 2థె 2:13
లేవీ. 20:9నిర్గ 21:17; ద్వితీ 27:16; సామె 20:20; మత్త 15:4
లేవీ. 20:10ద్వితీ 5:18; 22:22; రోమా 7:3; 1కొ 6:9, 10
లేవీ. 20:11లేవీ 18:8; ద్వితీ 27:20
లేవీ. 20:12లేవీ 18:15, 29
లేవీ. 20:13ఆది 19:5; లేవీ 18:22; న్యా 19:22; రోమా 1:26, 27; 1కొ 6:9, 10; యూదా 7
లేవీ. 20:14లేవీ 18:17; ద్వితీ 27:23
లేవీ. 20:14లేవీ 21:9
లేవీ. 20:15నిర్గ 22:19; ద్వితీ 27:21
లేవీ. 20:16లేవీ 18:23
లేవీ. 20:17లేవీ 18:9; ద్వితీ 27:22
లేవీ. 20:19లేవీ 18:12, 13
లేవీ. 20:20లేవీ 18:14
లేవీ. 20:21లేవీ 18:16; ద్వితీ 25:5
లేవీ. 20:22ద్వితీ 5:1
లేవీ. 20:22ప్రస 12:13
లేవీ. 20:22లేవీ 18:26, 28
లేవీ. 20:23లేవీ 18:3, 24; ద్వితీ 12:30
లేవీ. 20:23ద్వితీ 9:5
లేవీ. 20:24నిర్గ 3:17; 6:8; ద్వితీ 8:7-9; యెహె 20:6
లేవీ. 20:24నిర్గ 19:5; 33:16; 1రా 8:53; 1పే 2:9
లేవీ. 20:25లేవీ 11:46, 47; ద్వితీ 14:4-20
లేవీ. 20:25లేవీ 11:43
లేవీ. 20:26లేవీ 19:2; కీర్త 99:5; 1పే 1:15, 16; ప్రక 4:8
లేవీ. 20:26ద్వితీ 7:6
లేవీ. 20:27నిర్గ 22:18; లేవీ 19:31; 20:6; ద్వితీ 18:10-12; ప్రక 21:8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 20:1-27

లేవీయకాండం

20 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘ఇశ్రాయేలీయుల్లో గానీ ఇశ్రాయేలీయుల మధ్య నివసించే పరదేశుల్లో గానీ ఎవరైనా తన సంతానాన్ని మోలెకుకు సమర్పిస్తే అతన్ని ఖచ్చితంగా చంపేయాలి.+ దేశ ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. 3 నేను అతన్ని తిరస్కరిస్తాను, అతన్ని తన ప్రజల్లో నుండి కొట్టివేస్తాను.* ఎందుకంటే అతను తన సంతానాన్ని మోలెకుకు సమర్పించి నా పవిత్ర స్థలాన్ని మలినపర్చాడు,+ నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చాడు. 4 అతను తన సంతానాన్ని మోలెకుకు సమర్పిస్తున్నప్పుడు దేశ ప్రజలు దాన్ని చూసీచూడనట్టు వదిలేసి అతన్ని చంపకుండా ఉంటే,+ 5 నేనే అతన్ని, అతని కుటుంబాన్ని తిరస్కరిస్తాను. అతన్ని, అతనితోపాటు మోలెకును పూజించడం ద్వారా వ్యభిచారం చేసిన వాళ్లందర్నీ తమ ప్రజల్లో నుండి కొట్టివేస్తాను.*

6 “ ‘ఒక వ్యక్తి చనిపోయినవాళ్లతో మాట్లాడేవాళ్ల+ దగ్గరికి, భవిష్యత్తు చెప్పేవాళ్ల+ దగ్గరికి వెళ్లి నాకు నమ్మకద్రోహం చేస్తే,* నేను ఖచ్చితంగా అతన్ని తిరస్కరిస్తాను; అతన్ని తన ప్రజల్లో నుండి కొట్టివేస్తాను.*+

7 “ ‘మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని పవిత్రులవ్వాలి,+ ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను. 8 మీరు నా శాసనాల్ని పాటించాలి, వాటి ప్రకారం జీవించాలి.+ నేను మిమ్మల్ని పవిత్రపరుస్తున్న యెహోవాను.+

9 “ ‘ఎవరైనా తన తండ్రిని గానీ తల్లిని గానీ శపిస్తే, అతన్ని ఖచ్చితంగా చంపేయాలి.+ అతను తన తండ్రిని లేదా తల్లిని శపించాడు కాబట్టి అతని చావుకు* అతనే బాధ్యుడు.

10 “ ‘ఇంకొకరి భార్యతో వ్యభిచారం చేసే వ్యక్తిని, అంటే సాటిమనిషి భార్యతో వ్యభిచారం చేసే వ్యక్తిని ఖచ్చితంగా చంపేయాలి; వ్యభిచారం చేసిన ఆ పురుషుణ్ణి, స్త్రీని ఇద్దర్నీ చంపేయాలి.+ 11 తన తండ్రి భార్యతో పడుకునే వ్యక్తి తన తండ్రిని అవమానిస్తున్నాడు.*+ అలా పడుకున్న ఇద్దర్నీ ఖచ్చితంగా చంపేయాలి. వాళ్ల చావుకు* వాళ్లే బాధ్యులు. 12 ఒక వ్యక్తి తన కోడలితో పడుకుంటే, ఆ ఇద్దర్నీ ఖచ్చితంగా చంపేయాలి. వాళ్లు సహజ విరుద్ధమైన పని చేశారు. వాళ్ల చావుకు* వాళ్లే బాధ్యులు.+

13 “ ‘ఒక పురుషుడు, స్త్రీతో పడుకున్నట్టు పురుషునితో పడుకుంటే, వాళ్లిద్దరూ అసహ్యకరమైన పని చేశారు+ కాబట్టి వాళ్లను ఖచ్చితంగా చంపేయాలి. వాళ్ల చావుకు* వాళ్లే బాధ్యులు.

14 “ ‘ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లిచేసుకొని, ఆమె తల్లితో కూడా లైంగిక సంబంధం పెట్టుకుంటే, అది నీచమైన పని.*+ అతన్ని, ఆ ఇద్దర్నీ మంటల్లో కాల్చేయాలి.+ దానివల్ల, నీచమైన ప్రవర్తన మీ మధ్య కొనసాగకుండా ఉంటుంది.

15 “ ‘ఒక పురుషుడు జంతువుతో సంపర్కం చేస్తే, అతన్ని ఖచ్చితంగా చంపేయాలి, ఆ జంతువును కూడా చంపేయాలి.+ 16 ఒక స్త్రీ ఒక జంతువుతో సంపర్కం చేయడానికి దాని దగ్గరికి వెళ్తే+ ఆమెను, ఆ జంతువును చంపేయాలి. వాళ్లను ఖచ్చితంగా చంపేయాలి. వాళ్ల చావుకు* వాళ్లే బాధ్యులు.

17 “ ‘ఒక పురుషుడు తన సహోదరితో అంటే తన తండ్రి కూతురితో గానీ, తల్లి కూతురితో గానీ లైంగిక సంబంధం పెట్టుకుంటే; అతను ఆమె మానాన్ని, ఆమె అతని మానాన్ని చూస్తే అది అవమానకరమైన విషయం.+ వాళ్లిద్దర్నీ వాళ్ల ప్రజల కళ్లముందే చంపేయాలి.* అతను తన సహోదరిని అవమానించాడు.* అతను తన తప్పుకు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.

18 “ ‘ఒక పురుషుడు రుతుస్రావం జరుగుతున్న స్త్రీతో పడుకొని, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే, అతను, ఆమె ఇద్దరూ ఆమె రక్తస్రావ స్థానాన్ని బహిర్గతం చేశారు కాబట్టి, వాళ్లిద్దర్నీ తమ ప్రజల్లో నుండి కొట్టివేయాలి.*

19 “ ‘నీ తల్లి సహోదరితో గానీ తండ్రి సహోదరితో గానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలాచేస్తే, రక్తసంబంధిని అవమానించినట్టే.+ వాళ్లు తమ తప్పుకు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది. 20 తన చిన్నాన్న* భార్యతో పడుకునే వ్యక్తి తన చిన్నాన్నను అవమానిస్తున్నాడు.*+ వాళ్లిద్దరూ తమ పాపానికి జవాబు చెప్పాలి. వాళ్లిద్దర్నీ చంపేయాలి, వాళ్లకు పిల్లలు ఉండకూడదు. 21 ఒక వ్యక్తి తన సహోదరుడి భార్యను పెళ్లి చేసుకుంటే,* అది చాలా అసహ్యకరమైన విషయం.+ అతను తన సహోదరుణ్ణి అవమానిస్తున్నాడు.* వాళ్లకు పిల్లలు ఉండకూడదు.

22 “ ‘మీరు నా శాసనాలన్నిటినీ, నా న్యాయనిర్ణయాలన్నిటినీ పాటించాలి,+ వాటి ప్రకారం జీవించాలి.+ అలాచేస్తే, నేను మిమ్మల్ని ఏ దేశానికైతే తీసుకొస్తున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండా ఉంటుంది.+ 23 నేను మీ ముందు నుండి వెళ్లగొడుతున్న జనాల ఆచారాల ప్రకారం మీరు నడుచుకోకూడదు;+ ఎందుకంటే వాళ్లు ఆ పనులన్నీ చేశారు, వాళ్లంటే నాకు చాలా అసహ్యం.+ 24 అందుకే నేను మీతో, “మీరు వాళ్ల దేశాన్ని ఆస్తిగా పొందుతారు; పాలుతేనెలు ప్రవహించే ఆ దేశాన్ని నేను మీకు ఆస్తిగా ఇస్తాను.+ నేను మీ దేవుడైన యెహోవాను, మిమ్మల్ని ఆ జనాల నుండి వేరుచేసింది నేనే”+ అని చెప్పాను. 25 మీరు పవిత్రమైన జంతువును, అపవిత్రమైన జంతువును; పవిత్రమైన పక్షిని, అపవిత్రమైన పక్షిని వేరుచేయాలి.+ మీరు అపవిత్రంగా ఎంచాలని నేను వేరుచేసిన ఒక జంతువు వల్ల గానీ, పక్షి వల్ల గానీ, నేలమీద పాకే దేని వల్ల గానీ మిమ్మల్ని మీరు అసహ్యకరంగా తయారు చేసుకోకూడదు.+ 26 మీరు నాకు పవిత్రమైన ప్రజలుగా ఉండాలి, ఎందుకంటే యెహోవానైన నేను పవిత్రుణ్ణి;+ మిమ్మల్ని నా సొత్తుగా చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఇతర జనాల నుండి వేరుచేస్తున్నాను.+

27 “ ‘చనిపోయినవాళ్లను సంప్రదించే లేదా భవిష్యత్తు చెప్పే* ఏ పురుషుడినైనా, స్త్రీనైనా ఖచ్చితంగా చంపేయాలి.+ ప్రజలు వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ల చావుకు* వాళ్లే బాధ్యులు.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి