సామెతలు
21 రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువ లాంటిది.+
ఆయన తనకు నచ్చినవైపు దాన్ని తిప్పుతాడు.+
3 బలి అర్పించడం కన్నా
సరైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఇష్టం.+
4 గర్వంతో నిండిన కళ్లు, అహంకార హృదయం
దుష్టులకు దారి చూపే దీపం లాంటివి; కానీ అవి పాపం.+
5 శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి,*+
తొందరపాటుగా పనిచేసే వాళ్లంతా ఖచ్చితంగా పేదవాళ్లౌతారు.
7 దుష్టుల దౌర్జన్యమే వాళ్లను నాశనం చేస్తుంది,+
న్యాయంగా ప్రవర్తించడం వాళ్లకు ఇష్టముండదు.
8 అపరాధి దారి వంకరగా ఉంటుంది,
నిర్దోషి పనులు నిజాయితీగా ఉంటాయి.+
11 ఎగతాళి చేసేవాణ్ణి శిక్షించినప్పుడు, అనుభవం లేనివాడు తెలివి సంపాదిస్తాడు,
తెలివిగలవాడు లోతైన అవగాహనను పొందినప్పుడు, ఏంచేయాలో అతనికి తెలుస్తుంది.*+
12 నీతిమంతుడైన దేవుడు దుష్టుడి ఇంటిని గమనిస్తాడు;
ఆయన దుష్టుల్ని నాశనం చేస్తాడు.+
14 రహస్యంగా ఇచ్చిన బహుమతి కోపాన్ని చల్లారుస్తుంది,
చాటుగా ఇచ్చిన* లంచం తీవ్రమైన కోపాన్ని శాంతపరుస్తుంది.
15 నీతిమంతుడు న్యాయం చేయడంలో సంతోషిస్తాడు,+
అయితే అలవాటుగా కీడు చేసేవాళ్లకు అది భయంకరమైన విషయం.
16 లోతైన అవగాహనా మార్గం నుండి పక్కకు తొలిగేవాడు
చనిపోయినవాళ్ల గుంపుతో పాటు విశ్రమిస్తాడు.+
20 తెలివిగలవాళ్ల ఇంట్లో అమూల్యమైన సంపదలు, నూనె ఉంటాయి;
23 తన నోటిని, నాలుకను అదుపులో పెట్టుకునేవాడు
కష్టాల నుండి తనను తాను కాపాడుకుంటాడు.+
24 కోపంతో అహంకారంగా ప్రవర్తించేవాడిని
గర్విష్ఠి, అహంకారి, గొప్పలు చెప్పుకునేవాడు అంటారు.+
26 అతను రోజంతా అత్యాశతో అవీఇవీ కోరుకుంటూ ఉంటాడు,
అయితే నీతిమంతుడు ఏదీ దాచుకోకుండా అన్నీ ఇచ్చేస్తాడు.+
27 దుష్టుడు అర్పించే బలి అసహ్యమైనది.+
ఇక అతను దుర్బుద్ధితో* అర్పిస్తే అది ఇంకెంత అసహ్యంగా ఉంటుందో కదా!
30 యెహోవాకు వ్యతిరేకంగా నిలిచే తెలివి గానీ, వివేచన గానీ, సలహా గానీ లేదు.+