కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 రాజులు 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 రాజులు విషయసూచిక

      • రెహబాము కఠినంగా జవాబివ్వడం (1-15)

      • పది గోత్రాల తిరుగుబాటు (16-19)

      • యరొబాము ఇశ్రాయేలు రాజవ్వడం (20)

      • ఇశ్రాయేలుతో యుద్ధం చేయొద్దని ​రెహబాముకు చెప్పడం (21-24)

      • యరొబాము దూడ ఆరాధన (25-33)

1 రాజులు 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:6; యెహో 20:7, 9; న్యా 9:1, 2; అపొ 7:15, 16
  • +2ది 10:1-4

1 రాజులు 12:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:26, 40

1 రాజులు 12:4

అధస్సూచీలు

  • *

    లేదా “అణచివేసే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 8:11-18; 1రా 4:7

1 రాజులు 12:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 10:5-7

1 రాజులు 12:6

అధస్సూచీలు

  • *

    లేదా “వృద్ధుల్ని.”

1 రాజులు 12:8

అధస్సూచీలు

  • *

    లేదా “వృద్ధులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 10:8-11

1 రాజులు 12:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 10:12-15

1 రాజులు 12:13

అధస్సూచీలు

  • *

    లేదా “వృద్ధులు.”

1 రాజులు 12:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:31
  • +ద్వితీ 2:30; 2ది 22:7; రోమా 9:18

1 రాజులు 12:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “డేరాలకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 10:16, 17

1 రాజులు 12:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:12, 13; 2ది 11:13, 16

1 రాజులు 12:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 20:24; 1రా 4:6; 5:13, 14
  • +2ది 10:18, 19

1 రాజులు 12:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 17:21

1 రాజులు 12:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:30, 31
  • +1రా 11:12, 13; హోషే 11:12

1 రాజులు 12:21

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఎంపిక చేయబడిన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 11:1-4; 25:5

1 రాజులు 12:22

అధస్సూచీలు

  • *

    అక్ష., “సత్యదేవుని మనిషి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 12:5

1 రాజులు 12:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:30, 31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2018, పేజీలు 13-14

1 రాజులు 12:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 12:1
  • +ఆది 32:30; న్యా 8:13, 17

1 రాజులు 12:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:38

1 రాజులు 12:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:5, 6

1 రాజులు 12:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:4; 2రా 10:29
  • +నిర్గ 32:4, 8; 2ది 11:15, 16

1 రాజులు 12:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:8, 9; 28:19
  • +ఆది 14:14; ద్వితీ 34:1; న్యా 18:29; 20:1

1 రాజులు 12:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 10:31; 17:21-23

1 రాజులు 12:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:10; 1రా 13:33; 2ది 11:14; 13:9

1 రాజులు 12:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 23:34
  • +ఆమో 7:13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 రాజు. 12:1ఆది 12:6; యెహో 20:7, 9; న్యా 9:1, 2; అపొ 7:15, 16
1 రాజు. 12:12ది 10:1-4
1 రాజు. 12:21రా 11:26, 40
1 రాజు. 12:41స 8:11-18; 1రా 4:7
1 రాజు. 12:52ది 10:5-7
1 రాజు. 12:82ది 10:8-11
1 రాజు. 12:122ది 10:12-15
1 రాజు. 12:151రా 11:31
1 రాజు. 12:15ద్వితీ 2:30; 2ది 22:7; రోమా 9:18
1 రాజు. 12:162ది 10:16, 17
1 రాజు. 12:171రా 11:12, 13; 2ది 11:13, 16
1 రాజు. 12:182స 20:24; 1రా 4:6; 5:13, 14
1 రాజు. 12:182ది 10:18, 19
1 రాజు. 12:192రా 17:21
1 రాజు. 12:201రా 11:30, 31
1 రాజు. 12:201రా 11:12, 13; హోషే 11:12
1 రాజు. 12:212ది 11:1-4; 25:5
1 రాజు. 12:222ది 12:5
1 రాజు. 12:241రా 11:30, 31
1 రాజు. 12:251రా 12:1
1 రాజు. 12:25ఆది 32:30; న్యా 8:13, 17
1 రాజు. 12:261రా 11:38
1 రాజు. 12:27ద్వితీ 12:5, 6
1 రాజు. 12:28నిర్గ 20:4; 2రా 10:29
1 రాజు. 12:28నిర్గ 32:4, 8; 2ది 11:15, 16
1 రాజు. 12:29ఆది 12:8, 9; 28:19
1 రాజు. 12:29ఆది 14:14; ద్వితీ 34:1; న్యా 18:29; 20:1
1 రాజు. 12:302రా 10:31; 17:21-23
1 రాజు. 12:31సం 3:10; 1రా 13:33; 2ది 11:14; 13:9
1 రాజు. 12:32లేవీ 23:34
1 రాజు. 12:32ఆమో 7:13
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 రాజులు 12:1-33

రాజులు మొదటి గ్రంథం

12 ఇశ్రాయేలీయులందరూ రెహబామును రాజును చేయడానికి షెకెముకు+ రావడంతో అతను షెకెముకు వచ్చాడు.+ 2 నెబాతు కుమారుడైన యరొబాము ఆ సంగతి విన్నాడు (అతను సొలొమోను రాజు కారణంగా ఐగుప్తుకు పారిపోయి అక్కడే నివసిస్తున్నాడు),+ 3 అప్పుడు ప్రజలు యరొబామును పిలిపించారు. తర్వాత యరొబాము, ఇశ్రాయేలు సమాజమంతా రెహబాము దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: 4 “నీ తండ్రి మా కాడిని కఠినంగా చేశాడు.+ అయితే నీ తండ్రి నియమించిన కఠినమైన సేవను నువ్వు సులువుగా మారిస్తే, అతను మా మీద పెట్టిన బరువైన* కాడిని తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం.”

5 అందుకు అతను వాళ్లతో, “మీరు వెళ్లి మూడు రోజుల తర్వాత నా దగ్గరికి రండి” అన్నాడు. దాంతో ప్రజలు వెళ్లిపోయారు.+ 6 అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికున్నప్పుడు అతనికి సేవ చేసిన పెద్దల్ని* సంప్రదించి, “ఈ ప్రజలకు ఏం చెప్పాలో సలహా ఇవ్వండి” అని అడిగాడు. 7 వాళ్లు ఇలా చెప్పారు: “నువ్వు ఈ రోజు ఈ ప్రజలకు సేవకుడివై, వాళ్ల విన్నపాన్ని ఒప్పుకుని వాళ్లకు అనుకూలమైన జవాబు ఇస్తే, వాళ్లు ఎప్పుడూ నీ సేవకులుగా ఉంటారు.”

8 అయితే, అతను పెద్దలు* ఇచ్చిన సలహాను పట్టించుకోకుండా, తనతోపాటు పెరిగి ఇప్పుడు తనకు సేవ చేస్తున్న యువకుల్ని సలహా అడిగాడు.+ 9 అతను వాళ్లతో, “ ‘నీ తండ్రి మా మీద పెట్టిన కాడిని తేలిక చేయి’ అని నన్ను అడిగిన ఈ ప్రజలకు నేను ఏం చెప్పాలో సలహా ఇవ్వండి” అన్నాడు. 10 అతనితోపాటు పెరిగిన యువకులు అతనితో ఇలా అన్నారు: “ ‘నీ తండ్రి మా కాడిని భారంగా చేశాడు, కానీ నువ్వు దాన్ని తేలిక చేయి’ అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘నా చిటికెన వేలు నా తండ్రి నడుము కన్నా పెద్దదిగా ఉంటుంది. 11 నా తండ్రి మీ మీద బరువైన కాడిని మోపాడు, కానీ నేను దాన్ని ఇంకా బరువైనదిగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడు, కానీ నేను ముళ్ల కొరడాలతో శిక్షిస్తాను.’ ”

12 “మూడో రోజున నా దగ్గరికి రండి” అని రెహబాము రాజు చెప్పినట్టే, యరొబామూ మిగతా ప్రజలందరూ మూడో రోజున అతని దగ్గరికి వచ్చారు.+ 13 అయితే, పెద్దలు* ఇచ్చిన సలహాను పట్టించుకోకుండా రాజు ప్రజలకు కఠినంగా జవాబిచ్చాడు. 14 యువకులు ఇచ్చిన సలహా ప్రకారం అతను వాళ్లతో ఇలా అన్నాడు: “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు, నేను దాన్ని ఇంకా బరువుగా చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని మామూలు కొరడాలతో శిక్షించాడు, కానీ నేను ముళ్ల కొరడాలతో శిక్షిస్తాను.” 15 అలా రాజు ప్రజల మాట వినలేదు; యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి+ యెహోవాయే పరిస్థితుల్ని అలా మలుపు తిప్పాడు.+

16 రాజు తమ మాట వినలేదని ఇశ్రాయేలీయులందరూ గమనించినప్పుడు, వాళ్లు రాజుతో ఇలా అన్నారు: “దావీదుతో మాకు ఏ సంబంధమూ లేదు, యెష్షయి కుమారునిలో మాకు ఏ వాటా లేదు. ఇశ్రాయేలీయులారా, మీ దేవుళ్ల దగ్గరికి తిరిగెళ్లండి. దావీదూ, ఇక నీ ఇంటిని నువ్వే చూసుకో!” ఆ మాట అని ఇశ్రాయేలీయులు తమ ఇళ్లకు* వెళ్లిపోయారు.+ 17 అయితే రెహబాము యూదా నగరాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలీయుల మీద పరిపాలన కొనసాగించాడు.+

18 తర్వాత రెహబాము రాజు అదోరామును+ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించాడు; అతను వెట్టిపని చేయడానికి పిలిపించబడిన వాళ్ల మీద అధికారి. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. రెహబాము రాజు ఎలాగోలా తన రథం ఎక్కి యెరూషలేముకు పారిపోయాడు.+ 19 ఇశ్రాయేలీయులు ఈ రోజు వరకు దావీదు ఇంటివాళ్ల మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.+

20 యరొబాము తిరిగొచ్చాడని వినగానే ఇశ్రాయేలీయులందరూ అతన్ని సమాజం దగ్గరికి పిలిపించి, అతన్ని ఇశ్రాయేలు అంతటి మీద రాజును చేశారు.+ యూదా గోత్రం ఒక్కటే దావీదు ఇంటివాళ్లకు నమ్మకంగా ఉంది.+

21 రెహబాము యెరూషలేముకు వచ్చిన వెంటనే యూదా ఇంటివాళ్లందరిలో నుండి, బెన్యామీను గోత్రం నుండి 1,80,000 మంది శిక్షణ పొందిన* యోధుల్ని సమకూర్చాడు. సొలొమోను కుమారుడైన రెహబాము రాజరికాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం ఇశ్రాయేలు ఇంటివాళ్లతో యుద్ధం చేయడానికి అలా చేశాడు.+ 22 అప్పుడు సత్యదేవుని వాక్యం షెమయా+ ప్రవక్త* దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 23 “యూదా రాజైన సొలొమోను కుమారుడు రెహబాముతో, యూదా, బెన్యామీను ఇంటి వాళ్లందరితో, మిగతా ప్రజలందరితో ఇలా చెప్పు, 24 ‘యెహోవా చెప్పేదేమిటంటే: “మీరు మీ సహోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి వెళ్లకూడదు. మీలో ప్రతీ ఒక్కరు తమ ఇళ్లకు తిరిగెళ్లిపోవాలి, ఎందుకంటే నేనే ఇలా జరిగేలా చేశాను.” ’ ”+ దాంతో వాళ్లు యెహోవా మాటకు లోబడి, యెహోవా చెప్పినట్టు ఇళ్లకు వెళ్లిపోయారు.

25 తర్వాత యరొబాము ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని షెకెమును+ పటిష్ఠం చేసి అక్కడ నివసించాడు. అతను అక్కడి నుండి బయల్దేరి పెనూయేలును+ పటిష్ఠం చేశాడు. 26 యరొబాము తన హృదయంలో ఇలా అనుకున్నాడు: “ఇప్పుడు రాజ్యం దావీదు ఇంటివాళ్లకు తిరిగెళ్తుంది.+ 27 ఈ ప్రజలు యెరూషలేములోని యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి వెళ్తూ ఉంటే,+ వీళ్ల హృదయం కూడా తమ ప్రభువూ యూదా రాజూ అయిన రెహబామువైపు తిరుగుతుంది. అప్పుడు వాళ్లు నన్ను చంపి యూదా రాజైన రెహబాము దగ్గరికి తిరిగెళ్తారు.” 28 రాజు తన సలహాదారులతో సంప్రదించాక, రెండు బంగారు దూడల్ని తయారుచేయించి+ ప్రజలతో ఇలా అన్నాడు: “యెరూషలేముకు వెళ్లడం మీకు చాలా కష్టం. ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను తీసుకొచ్చిన నీ దేవుడు ఇదే.”+ 29 తర్వాత యరొబాము ఆ దూడల్లో ఒకదాన్ని బేతేలులో,+ మరోదాన్ని దానులో+ పెట్టించాడు. 30 అది ప్రజలు పాపం చేయడానికి కారణమైంది.+ వాళ్లు దూడను పూజించడానికి దాను వరకు వెళ్లడం మొదలుపెట్టారు.

31 యరొబాము ఉన్నత స్థలాల్లో పూజా మందిరాల్ని కట్టించి, లేవీయులుకాని సామాన్య ప్రజల్ని యాజకులుగా నియమించాడు.+ 32 అతను ఎనిమిదో నెల 15వ రోజున, యూదాలో జరుపుకునే పండుగలాంటి+ ఒక పండుగను కూడా ఏర్పాటు చేశాడు. బేతేలులో+ తాను చేయించిన బలిపీఠం మీద, తాను చేయించిన దూడలకు అతను బలులు అర్పించాడు; అంతేకాదు బేతేలులో తాను కట్టించిన ఉన్నత స్థలాల కోసం అతను యాజకుల్ని నియమించాడు. 33 అతను సొంతగా నిర్ణయించిన నెలలో అంటే ఎనిమిదో నెల 15వ రోజున, తాను బేతేలులో కట్టించిన బలిపీఠం మీద బలులు అర్పించడం మొదలుపెట్టాడు. అతను ఇశ్రాయేలు ప్రజల కోసం ఒక పండుగను ఏర్పాటు చేశాడు; అతను బలులు అర్పించడానికి, వాటి పొగను పైకిలేచేలా చేయడానికి బలిపీఠం ఎక్కాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి