కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • లోపంలేని వాటిని బలి అర్పించాలి (1)

      • మతభ్రష్టత్వాన్ని ఎలా నిర్మూలించాలి (2-7)

      • కష్టమైన వివాదాలు (8-13)

      • భవిష్యత్తు రాజు కోసం నిర్దేశాలు (14-20)

        • రాజు ధర్మశాస్త్ర ప్రతిని నకలు రాసుకోవాలి (18)

ద్వితీయోపదేశకాండం 17:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 15:21; మలా 1:8

ద్వితీయోపదేశకాండం 17:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:23; 13:6-9

ద్వితీయోపదేశకాండం 17:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:19
  • +ద్వితీ 13:12-15

ద్వితీయోపదేశకాండం 17:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 7:51

ద్వితీయోపదేశకాండం 17:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 13:6, 10

ద్వితీయోపదేశకాండం 17:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “నోట.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 18:16; యోహా 8:17; 1తి 5:19; హెబ్రీ 10:28
  • +సం 35:30; ద్వితీ 19:15

ద్వితీయోపదేశకాండం 17:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 13:5; 1కొ 5:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 7/2021, పేజీ 3

ద్వితీయోపదేశకాండం 17:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 35:11
  • +ద్వితీ 12:5; 1రా 3:16, 28; కీర్త 122:2, 5

ద్వితీయోపదేశకాండం 17:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 7:15, 16
  • +ద్వితీ 21:5

ద్వితీయోపదేశకాండం 17:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మలా 2:7
  • +ద్వితీ 12:32

ద్వితీయోపదేశకాండం 17:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 11:2; హెబ్రీ 10:28
  • +ద్వితీ 13:5; 1కొ 5:13

ద్వితీయోపదేశకాండం 17:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 13:11; 19:20

ద్వితీయోపదేశకాండం 17:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 8:5, 20; 10:19

ద్వితీయోపదేశకాండం 17:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 9:17; 10:24; 16:12, 13

ద్వితీయోపదేశకాండం 17:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 20:1; 2స 8:4; కీర్త 20:7; సామె 21:31
  • +యెష 31:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 3/2023, పేజీ 3

ద్వితీయోపదేశకాండం 17:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:1-3; నెహె 13:26
  • +యోబు 31:24, 28; 1తి 6:9

ద్వితీయోపదేశకాండం 17:18

అధస్సూచీలు

  • *

    లేదా “గ్రంథపు చుట్టలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:9, 26; 2రా 22:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2007, పేజీ 20

    5/1/1995, పేజీలు 12-13

ద్వితీయోపదేశకాండం 17:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 34:18
  • +కీర్త 1:2; 119:97

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2002, పేజీలు 12-17

    10/1/2000, పేజీలు 8-9

    5/1/1995, పేజీలు 12-13

ద్వితీయోపదేశకాండం 17:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1995, పేజీలు 12-13

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 17:1ద్వితీ 15:21; మలా 1:8
ద్వితీ. 17:2ద్వితీ 4:23; 13:6-9
ద్వితీ. 17:3ద్వితీ 4:19
ద్వితీ. 17:3ద్వితీ 13:12-15
ద్వితీ. 17:4యోహా 7:51
ద్వితీ. 17:5ద్వితీ 13:6, 10
ద్వితీ. 17:6మత్త 18:16; యోహా 8:17; 1తి 5:19; హెబ్రీ 10:28
ద్వితీ. 17:6సం 35:30; ద్వితీ 19:15
ద్వితీ. 17:7ద్వితీ 13:5; 1కొ 5:13
ద్వితీ. 17:8సం 35:11
ద్వితీ. 17:8ద్వితీ 12:5; 1రా 3:16, 28; కీర్త 122:2, 5
ద్వితీ. 17:91స 7:15, 16
ద్వితీ. 17:9ద్వితీ 21:5
ద్వితీ. 17:11మలా 2:7
ద్వితీ. 17:11ద్వితీ 12:32
ద్వితీ. 17:12సామె 11:2; హెబ్రీ 10:28
ద్వితీ. 17:12ద్వితీ 13:5; 1కొ 5:13
ద్వితీ. 17:13ద్వితీ 13:11; 19:20
ద్వితీ. 17:141స 8:5, 20; 10:19
ద్వితీ. 17:151స 9:17; 10:24; 16:12, 13
ద్వితీ. 17:16ద్వితీ 20:1; 2స 8:4; కీర్త 20:7; సామె 21:31
ద్వితీ. 17:16యెష 31:1
ద్వితీ. 17:171రా 11:1-3; నెహె 13:26
ద్వితీ. 17:17యోబు 31:24, 28; 1తి 6:9
ద్వితీ. 17:18ద్వితీ 31:9, 26; 2రా 22:8
ద్వితీ. 17:192ది 34:18
ద్వితీ. 17:19కీర్త 1:2; 119:97
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 17:1-20

ద్వితీయోపదేశకాండం

17 “నువ్వు నీ దేవుడైన యెహోవాకు లోపం ఉన్న లేదా గాయపడిన ఎద్దును గానీ, గొర్రెను గానీ అర్పించకూడదు; ఎందుకంటే నీ దేవుడైన యెహోవా దాన్ని అసహ్యించుకుంటాడు.+

2 “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న నగరాల్లో ఏదైనా ఒకదానిలో ఒక పురుషుడు గానీ, స్త్రీ గానీ నీ దేవుడైన యెహోవా దృష్టిలో చెడ్డపని చేస్తూ, ఆయన ఒప్పందాన్ని మీరుతూ కనిపించారనుకో;+ 3 అతను లేదా ఆమె పక్కదారి పట్టి వేరే దేవుళ్లను పూజిస్తూ, వాటికి లేదా సూర్యునికి గానీ, చంద్రునికి గానీ, ఆకాశ సైన్యమంతటికి గానీ మొక్కుతూ+ నేను ఆజ్ఞాపించనిదాన్ని చేస్తూ+ కనిపించారనుకో. 4 ఎవరైనా దాని గురించి నీకు చెప్పినప్పుడు లేదా నువ్వు దాని గురించి విన్నప్పుడు, ఆ విషయం గురించి పూర్తిగా దర్యాప్తు చేయాలి. ఇశ్రాయేలులో ఆ అసహ్యమైన పని నిజంగానే జరిగిందని తేలితే,+ 5 నువ్వు ఆ చెడ్డపని చేసిన పురుషుణ్ణి లేదా స్త్రీని నగర ద్వారాల దగ్గరికి తీసుకురావాలి; అతన్ని లేదా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి.+ 6 ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా*+ మాత్రమే అతన్ని లేదా ఆమెను చంపాలి. ఒకే ఒక్క వ్యక్తి సాక్ష్యం ఆధారంగా అతన్ని లేదా ఆమెను చంపకూడదు.+ 7 అతన్ని లేదా ఆమెను చంపడానికి ముందుగా ఆ సాక్షుల చేతులే పైకి లేవాలి, ఆ తర్వాతే ప్రజలందరి చేతులు లేవాలి. నువ్వు నీ మధ్య నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.+

8 “ఒకవేళ నీ నగరాల్లో ఒకదానిలో నువ్వు తీర్పు చెప్పలేనంత కష్టమైన వివాదం తలెత్తితే, అంటే రక్తం చిందించడానికి సంబంధించి గానీ,+ న్యాయపరమైన హక్కుకు సంబంధించి గానీ, ఏదైనా క్రూరమైన పనికి సంబంధించి గానీ వివాదం తలెత్తితే, లేదా వేరే గొడవలు తలెత్తితే, నువ్వు లేచి నీ దేవుడైన యెహోవా ఎంచుకునే చోటికి వెళ్లాలి.+ 9 నువ్వు లేవీయులైన యాజకుల దగ్గరికి, ఆ సమయంలో న్యాయాధిపతిగా సేవచేస్తున్న వ్యక్తి+ దగ్గరికి వెళ్లి వివాదాన్ని వాళ్ల ముందు పెట్టు. ఆ విషయంలో వాళ్లు న్యాయం చెప్తారు.+ 10 తర్వాత, యెహోవా ఎంచుకున్న చోటు నుండి వాళ్లు నీకు చెప్పినదాని ప్రకారం నువ్వు చర్య తీసుకోవాలి. వాళ్లు నీకు నిర్దేశించిన దానంతటి ప్రకారం చేసేలా నువ్వు జాగ్రత్తపడాలి. 11 వాళ్లు నీకు చూపించే చట్టం ప్రకారం, వాళ్లు చెప్పే న్యాయం ప్రకారం నువ్వు చర్య తీసుకోవాలి.+ వాళ్లు నీకు చెప్పే న్యాయం నుండి నువ్వు కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగకూడదు.+ 12 అయితే, నీ దేవుడైన యెహోవాకు పరిచారం చేస్తున్న యాజకుని మాటను గానీ, న్యాయాధిపతి మాటను గానీ వినకుండా ఎవరైనా అహంకారంగా ప్రవర్తిస్తే అతను చావాల్సిందే.+ నువ్వు ఇశ్రాయేలులో నుండి చెడుతనాన్ని నిర్మూలించాలి.+ 13 అప్పుడు ప్రజలందరూ దాని గురించి విని భయపడతారు, వాళ్లు ఇంకెప్పుడూ అహంకారంగా ప్రవర్తించరు.+

14 “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు అడుగుపెట్టి, దాన్ని స్వాధీనం చేసుకొని, అందులో నివసిస్తున్నప్పుడు, ‘నా చుట్టూ ఉన్న జనాలన్నిటిలాగే నేను కూడా ఒక రాజును నియమించుకుంటాను’ అని నువ్వు అనుకుంటే,+ 15 అప్పుడు నువ్వు నీ దేవుడైన యెహోవా ఎంచుకునే వ్యక్తినే రాజుగా నియమించాలి.+ నువ్వు నీ సహోదరుల్లో నుండే ఒకర్ని రాజుగా నియమించాలి. నీ సహోదరుడుకాని పరదేశిని నువ్వు నీ మీద రాజుగా నియమించుకోకూడదు. 16 అయితే, అతను ఎక్కువ గుర్రాల్ని సంపాదించుకోకూడదు+ లేదా ఇంకా ఎక్కువ గుర్రాల్ని సంపాదించడానికి ప్రజల్ని ఐగుప్తుకు తిరిగెళ్లేలా చేయకూడదు;+ ఎందుకంటే, ‘మీరు మళ్లీ ఎన్నడూ ఈ మార్గం గుండా తిరిగెళ్లకూడదు’ అని యెహోవా మీతో చెప్పాడు. 17 అంతేకాదు అతని హృదయం పక్కదారి పట్టకుండా ఉండేలా అతను ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు;+ అలాగే విస్తారంగా వెండిబంగారాల్ని సంపాదించుకోకూడదు.+ 18 అతను రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు, లేవీయులైన యాజకుల దగ్గర ఉండే ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొని తనకోసం ఒక పుస్తకంలో* నకలు రాసుకోవాలి.+

19 “అది అతని దగ్గర ఉండాలి, అతను తాను జీవించినన్ని రోజులు దాన్ని చదవాలి;+ అలా అతను తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకొని, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ, ఈ శాసనాల్ని పాటిస్తూ వాటి ప్రకారం జీవించగలుగుతాడు.+ 20 అప్పుడతను తన హృదయంలో, తన సహోదరుల కన్నా తాను గొప్పవాణ్ణని అనుకోకుండా ఉంటాడు, అందులోని ఆజ్ఞల నుండి కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తిరగకుండా ఉంటాడు. అలా అతను, అతని కుమారులు చాలాకాలం పాటు ఇశ్రాయేలీయుల మధ్య రాజ్య పరిపాలన చేస్తారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి