సామెతలు
28 ఎవరూ తరమకుండానే దుష్టుడు పారిపోతాడు,
నీతిమంతుడు సింహంలా ధైర్యంగా ఉంటాడు.+
2 దేశ ప్రజలు అపరాధం* చేస్తుంటే, అధిపతులు ఒకరి తర్వాత ఒకరు మారిపోతుంటారు,+
వివేచన, జ్ఞానం ఉన్న వ్యక్తి సహాయంతో అధిపతి* ఎక్కువకాలం పరిపాలిస్తాడు.+
3 దీనుల్ని మోసం చేసే పేదవాడు+
పంట అంతా నాశనం చేసే వర్షం లాంటివాడు.
4 ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేవాళ్లు దుష్టుల్ని పొగుడుతారు,
ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్లు వాళ్లతో పోరాడతారు.+
6 అవినీతి మార్గాల్ని అనుసరించే ధనవంతుడి కన్నా
యథార్థంగా నడుచుకునే పేదవాడు నయం.+
7 అవగాహన ఉన్న కుమారుడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు,
తిండిబోతులతో సహవాసం చేసేవాడు తన తండ్రికి అవమానం తీసుకొస్తాడు.+
8 వడ్డీతో,+ అక్రమ లాభంతో ఆస్తిని పెంచుకునేవాడు
పేదవాళ్ల మీద దయ చూపించేవాడి కోసం దాన్ని పోగుచేస్తున్నాడు.+
9 ధర్మశాస్త్రాన్ని వినడానికి ఇష్టపడనివాళ్ల ప్రార్థన అసహ్యం.+
10 నిజాయితీపరుణ్ణి మోసం చేసి చెడ్డ దారిలోకి లాగేవాడు
తాను తవ్విన గోతిలో తానే పడతాడు;+
ఏ నిందా లేనివాళ్లు మంచి ప్రతిఫలం పొందుతారు.+
12 నీతిమంతుడు గెలిచినప్పుడు గొప్ప ఘనత కలుగుతుంది,
దుష్టులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు.+
13 తన దోషాన్ని కప్పిపెట్టేవాడు వర్ధిల్లడు,*+
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడి మీద కరుణ చూపించబడుతుంది.+
15 నిస్సహాయుల మీద పరిపాలన చేసే దుష్టుడు
గుర్రుమనే సింహం లాంటివాడు,
ముందుకు దూకే ఎలుగుబంటి లాంటివాడు.+
16 వివేచనలేని నాయకుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు,
అక్రమ లాభాన్ని ద్వేషించేవాడు ఆయుష్షు పెంచుకుంటాడు.+
17 ప్రాణం తీసి రక్తాపరాధం మూటగట్టుకునేవాడు సమాధికి* చేరేవరకు పారిపోతూనే ఉంటాడు,+
ఎవ్వరూ అతనికి మద్దతు ఇవ్వకూడదు.
19 తన పొలాన్ని సాగుచేసే వాడికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది,
వ్యర్థమైన వాటిని వెంబడించేవాడు కటిక పేదరికంలో పడతాడు.+
21 పక్షపాతం చూపించడం మంచిదికాదు;+
రొట్టె ముక్క కోసం ఒక వ్యక్తి తప్పు చేసే అవకాశముంది.
24 అమ్మానాన్నల్ని దోచుకొని “అదేం తప్పు కాదు” అనేవాడు,+
నాశనం చేసేవాడికి భాగస్వామి.
27 పేదవాళ్లకు ఇచ్చేవాడికి ఏ లోటూ ఉండదు,+
వాళ్లను పట్టించుకోకుండా కళ్లు మూసుకునే వాడికి చాలా శాపాలు వస్తాయి.
28 దుష్టులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు,
వాళ్లు నశించిపోయినప్పుడు నీతిమంతులు ఎక్కువౌతారు.+