కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 25
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • దేశాలతో యెహోవా వ్యాజ్యం (1-38)

        • దేశాలు 70 ఏళ్లు బబులోనుకు సేవచేస్తాయి (11)

        • దేవుని ఉగ్రత అనే ద్రాక్షారసం గిన్నె (15)

        • దేశం నుండి దేశానికి విపత్తు (32)

        • యెహోవా చేత హతులైనవాళ్లు (33)

యిర్మీయా 25:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 24:1; యిర్మీ 46:2; దాని 1:1

యిర్మీయా 25:2

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రజలందరికి.”

యిర్మీయా 25:3

అధస్సూచీలు

  • *

    అక్ష., “పెందలకడే లేచి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:13; 13:10

యిర్మీయా 25:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “పెందలకడే లేచి.”

యిర్మీయా 25:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 55:7; యిర్మీ 18:11; 35:15; యెహె 18:30; 33:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 19

యిర్మీయా 25:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 19

యిర్మీయా 25:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:21; నెహె 9:26

యిర్మీయా 25:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 19

యిర్మీయా 25:9

అధస్సూచీలు

  • *

    అక్ష., “నెబుకద్రెజరును.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:6; 43:10
  • +యెష 5:26; యిర్మీ 1:15
  • +యెహె 26:7; 29:19; హబ 1:6
  • +ద్వితీ 28:49, 50; యిర్మీ 5:15; యెహె 7:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 19

యిర్మీయా 25:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 24:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2015, పేజీ 13

    3/1/1994, పేజీలు 19-20

    ప్రకటన ముగింపు, పేజీ 270

యిర్మీయా 25:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:20, 21; దాని 9:2; జెక 1:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 19-20

    ప్రకటన ముగింపు, పేజీ 270

యిర్మీయా 25:12

అధస్సూచీలు

  • *

    లేదా “శిక్షిస్తాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 30:3; ఎజ్రా 1:1, 2; యిర్మీ 29:10
  • +యెష 47:1; యిర్మీ 51:1; దాని 5:26, 30
  • +యెష 13:1, 19; 14:4, 23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 20

యిర్మీయా 25:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 20

యిర్మీయా 25:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 50:9; 51:27
  • +యెష 14:2; హబ 2:8
  • +కీర్త 137:8; యిర్మీ 50:29; 51:6, 24; ప్రక 18:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 20

యిర్మీయా 25:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీలు 206-207

    కావలికోట,

    3/1/1994, పేజీ 20

యిర్మీయా 25:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 51:7; విలా 4:21; యెహె 23:32-34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీలు 206-207

    కావలికోట,

    3/1/1994, పేజీ 20

యిర్మీయా 25:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 20-21

యిర్మీయా 25:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 51:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 20-21

యిర్మీయా 25:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 46:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 20-21

యిర్మీయా 25:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 47:1
  • +యిర్మీ 47:5

యిర్మీయా 25:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 49:17
  • +యిర్మీ 48:1
  • +యిర్మీ 49:1

యిర్మీయా 25:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 27:2, 3; 47:4

యిర్మీయా 25:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 49:8
  • +యిర్మీ 9:25, 26

యిర్మీయా 25:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 49:31, 32

యిర్మీయా 25:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 49:34
  • +యిర్మీ 51:11

యిర్మీయా 25:26

అధస్సూచీలు

  • *

    బాబెలుకు (బబులోనుకు) రహస్య పేరు అని అనిపిస్తుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 51:41

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 20-21

యిర్మీయా 25:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హబ 2:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 21

యిర్మీయా 25:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 21

యిర్మీయా 25:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:12, 14; దాని 9:18; హోషే 12:2
  • +యిర్మీ 49:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 21

యిర్మీయా 25:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 22

యిర్మీయా 25:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోవే 3:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 22

యిర్మీయా 25:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 34:2, 3; యిర్మీ 25:17
  • +జెఫ 3:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 22

యిర్మీయా 25:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 22

యిర్మీయా 25:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రకటన ముగింపు, పేజీలు 282-283

    కావలికోట,

    3/1/1994, పేజీలు 22-23

యిర్మీయా 25:35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 22-23

యిర్మీయా 25:36

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీలు 22-23

యిర్మీయా 25:37

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 23

యిర్మీయా 25:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 5:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1994, పేజీ 23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 25:12రా 24:1; యిర్మీ 46:2; దాని 1:1
యిర్మీ. 25:3యిర్మీ 7:13; 13:10
యిర్మీ. 25:5యెష 55:7; యిర్మీ 18:11; 35:15; యెహె 18:30; 33:11
యిర్మీ. 25:7ద్వితీ 32:21; నెహె 9:26
యిర్మీ. 25:9యిర్మీ 27:6; 43:10
యిర్మీ. 25:9యెష 5:26; యిర్మీ 1:15
యిర్మీ. 25:9యెహె 26:7; 29:19; హబ 1:6
యిర్మీ. 25:9ద్వితీ 28:49, 50; యిర్మీ 5:15; యెహె 7:24
యిర్మీ. 25:10యెష 24:7
యిర్మీ. 25:112ది 36:20, 21; దాని 9:2; జెక 1:12
యిర్మీ. 25:12ద్వితీ 30:3; ఎజ్రా 1:1, 2; యిర్మీ 29:10
యిర్మీ. 25:12యెష 47:1; యిర్మీ 51:1; దాని 5:26, 30
యిర్మీ. 25:12యెష 13:1, 19; 14:4, 23
యిర్మీ. 25:14యిర్మీ 50:9; 51:27
యిర్మీ. 25:14యెష 14:2; హబ 2:8
యిర్మీ. 25:14కీర్త 137:8; యిర్మీ 50:29; 51:6, 24; ప్రక 18:6
యిర్మీ. 25:16యిర్మీ 51:7; విలా 4:21; యెహె 23:32-34
యిర్మీ. 25:17యిర్మీ 1:10
యిర్మీ. 25:18యెష 51:17
యిర్మీ. 25:19యిర్మీ 46:2
యిర్మీ. 25:20యిర్మీ 47:1
యిర్మీ. 25:20యిర్మీ 47:5
యిర్మీ. 25:21యిర్మీ 49:17
యిర్మీ. 25:21యిర్మీ 48:1
యిర్మీ. 25:21యిర్మీ 49:1
యిర్మీ. 25:22యిర్మీ 27:2, 3; 47:4
యిర్మీ. 25:23యిర్మీ 49:8
యిర్మీ. 25:23యిర్మీ 9:25, 26
యిర్మీ. 25:24యిర్మీ 49:31, 32
యిర్మీ. 25:25యిర్మీ 49:34
యిర్మీ. 25:25యిర్మీ 51:11
యిర్మీ. 25:26యిర్మీ 51:41
యిర్మీ. 25:27హబ 2:16
యిర్మీ. 25:29యిర్మీ 7:12, 14; దాని 9:18; హోషే 12:2
యిర్మీ. 25:29యిర్మీ 49:12
యిర్మీ. 25:31యోవే 3:2
యిర్మీ. 25:32యెష 34:2, 3; యిర్మీ 25:17
యిర్మీ. 25:32జెఫ 3:8
యిర్మీ. 25:38హోషే 5:14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 25:1-38

యిర్మీయా

25 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలన నాలుగో సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి దేవుని వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది.+ అది బబులోను రాజు నెబుకద్నెజరు* పరిపాలనలో మొదటి సంవత్సరం. 2 యూదా ప్రజలందరి గురించి,* యెరూషలేము నివాసులందరి గురించి యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలు ఇవి:

3 “ఆమోను కుమారుడూ యూదా రాజూ అయిన యోషీయా పరిపాలనలోని 13వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు, ఈ 23 సంవత్సరాలు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చింది, నేను పదేపదే* మీతో మాట్లాడుతూ వచ్చాను, కానీ మీరు వినలేదు.+ 4 యెహోవా తన సేవకులైన ప్రవక్తలందర్నీ మీ దగ్గరికి పంపించాడు, వాళ్లను పదేపదే* పంపించాడు, కానీ మీరు వినలేదు, పట్టించుకోలేదు. 5 వాళ్లు ఇలా చెప్పేవాళ్లు: ‘దయచేసి మీరంతా మీ చెడ్డమార్గాల్ని, మీ చెడ్డపనుల్ని విడిచిపెట్టండి;+ అప్పుడు మీరు, చాలాకాలం క్రితం మీకూ మీ పూర్వీకులకూ యెహోవా ఇచ్చిన ఈ దేశంలో ఎక్కువకాలం పాటు నివసిస్తూ ఉంటారు. 6 వేరే దేవుళ్లను అనుసరించకండి, పూజించకండి, వాటికి వంగి నమస్కారం చేయకండి; మీ చేతులతో చేసినవాటితో నాకు కోపం తెప్పించకండి; లేదంటే నేను మీ మీదికి విపత్తు రప్పిస్తాను.’

7 “ ‘కానీ మీరు నా మాట వినలేదు. బదులుగా మీ చేతులతో చేసినవాటితో నాకు కోపం తెప్పించి, మీ మీదికి విపత్తు తెచ్చుకున్నారు’+ అని యెహోవా అంటున్నాడు.

8 “అందుకే సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ “మీరు నా మాటలకు లోబడలేదు కాబట్టి 9 నేను ఉత్తర దేశ కుటుంబాలన్నిటినీ, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును*+ రప్పిస్తున్నాను”+ అని యెహోవా అంటున్నాడు. “నేను వాళ్లను ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, ఈ చుట్టుపక్కల దేశాలన్నిటి మీదికి+ రప్పిస్తాను.+ నేను వాటిని సమూలనాశనం చేస్తాను, ప్రజలు వాటిని చూసి భయపడతారు, ఈలలు వేస్తారు. అవి ఎప్పటికీ పాడుబడ్డ స్థితిలోనే ఉంటాయి. 10 సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని, పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం, తిరుగలి చప్పుడు ఇక వాటిలో వినిపించకుండా చేస్తాను,+ దీపం వెలుగు కనిపించకుండా చేస్తాను. 11 ఈ దేశమంతా శిథిలాల కుప్పలా, భయంకరంగా తయారౌతుంది. ఈ దేశాలు బబులోను రాజును 70 సంవత్సరాలు సేవించాల్సి ఉంటుంది.” ’+

12 “ ‘అయితే 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత,+ నేను బబులోను రాజును, ఆ దేశాన్ని వాళ్ల దోషాన్ని బట్టి లెక్క అడుగుతాను’*+ అని యెహోవా అంటున్నాడు. ‘నేను కల్దీయుల దేశాన్ని ఎప్పటికీ పాడుబడిన స్థలంగా ఉండేలా చేస్తాను.+ 13 నేను ఆ దేశానికి వ్యతిరేకంగా పలికిన, దేశాలన్నిటి గురించి యిర్మీయా ప్రవచించిన, ఈ పుస్తకంలో రాయబడిన మాటలన్నిటినీ ఆ దేశం మీదికి రప్పిస్తాను. 14 వాళ్లను చాలా దేశాలవాళ్లు, గొప్పగొప్ప రాజులు+ బానిసలుగా చేసుకుంటారు;+ వాళ్ల పనుల్ని బట్టి, వాళ్లు తమ చేతులతో చేసినవాటిని బట్టి నేను వాళ్లకు ప్రతీకారం చేస్తాను.’ ”+

15 ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలా చెప్పాడు: “నా చేతిలో నుండి ఉగ్రత అనే ఈ ద్రాక్షారసం గిన్నెను తీసుకొని, నేను నిన్ను పంపించే దేశాలన్నిటితో దాన్ని తాగించు. 16 వాళ్లు తాగి, తూలుతారు; నేను వాళ్ల మధ్యకు పంపిస్తున్న ఖడ్గాన్ని బట్టి పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తారు.”+

17 కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి ఆ గిన్నె తీసుకుని, యెహోవా నన్ను పంపించిన దేశాలన్నిటితో దాన్ని తాగించాను.+ 18 ముందుగా యెరూషలేముతో, యూదా నగరాలతో,+ వాటి రాజులతో, వాటి అధిపతులతో దాన్ని తాగించాను. వాటిని, వాళ్లను నాశనం చేయాలని, భయంకరంగా మార్చాలని, ప్రజలు ఈలలు వేసేలా చేయాలని, శాపంగా చేయాలని అలా తాగించాను. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది; 19 తర్వాత ఐగుప్తు రాజు ఫరోతో, అతని సేవకులతో, అధిపతులతో, అతని ప్రజలందరితో,+ 20 వాళ్ల మధ్య నివసించే పరదేశులందరితో; ఊజు దేశపు రాజులందరితో; ఫిలిష్తీయుల+ దేశపు రాజులందరితో, అంటే అష్కెలోను+ రాజుతో, గాజా రాజుతో, ఎక్రోను రాజుతో, అష్డోదులో మిగిలినవాళ్ల రాజుతో; 21 ఎదోముతో,+ మోయాబుతో,+ అమ్మోనీయులతో;+ 22 తూరు రాజులందరితో, సీదోను రాజులందరితో,+ సముద్రంలోని ద్వీపాల రాజులతో; 23 దెదానుతో,+ తేమాతో, బూజుతో, కణతల పక్క వెంట్రుకలు గొరిగించుకున్న వాళ్లందరితో;+ 24 అరబీయుల+ రాజులందరితో, ఎడారిలో నివసించే రకరకాల ప్రజల రాజులందరితో; 25 జిమ్రీ రాజులందరితో, ఏలాము+ రాజులందరితో, మాదీయుల రాజులందరితో;+ 26 దగ్గర్లో గానీ దూరంలో గానీ ఉన్న ఉత్తర రాజులందరితో ఒకరి తర్వాత ఒకరితో, భూమ్మీదున్న ఇతర రాజ్యాలన్నిటితో దాన్ని తాగించాను; వాళ్ల తర్వాత షేషకు*+ రాజు దాన్ని తాగుతాడు.

27 “నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి: ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, “తాగండి, మత్తెక్కే దాకా తాగి కక్కుకోండి, పడిపోయి మళ్లీ లేవకండి.+ ఎందుకంటే, నేను మీ మధ్యకు ఖడ్గాన్ని పంపిస్తున్నాను.” ’ 28 ఒకవేళ వాళ్లు నీ చేతిలో నుండి ఆ గిన్నెను తీసుకుని తాగడానికి ఇష్టపడకపోతే నువ్వు వాళ్లతో ఇలా అనాలి: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “మీరు ఖచ్చితంగా దీన్ని తాగాలి! 29 ఎందుకంటే, నేను నా పేరు పెట్టబడిన నగరం మీదికే ముందుగా విపత్తు తీసుకొస్తుంటే,+ మీరు శిక్షను తప్పించుకుంటారా?” ’+

“ ‘మీరు శిక్షను తప్పించుకోరు, ఎందుకంటే భూనివాసులందరి మీదికి నేను ఖడ్గాన్ని రప్పిస్తున్నాను’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.

30 “నువ్వు వాళ్ల దగ్గర ఈ మాటలన్నీ ప్రవచించి, వాళ్లతో ఇలా అనాలి:

‘పైనుండి యెహోవా గర్జిస్తాడు,

తన పవిత్ర నివాస స్థలం నుండి ఆయన తన స్వరం వినిపిస్తాడు.

ఆయన తన నివాస స్థలం మీద బిగ్గరగా గర్జిస్తాడు.

ద్రాక్షల్ని తొక్కేవాళ్లలా అరుస్తూ,

భూనివాసులందరికీ వ్యతిరేకంగా విజయ గీతం పాడతాడు.’

31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘భూమి అంచుల వరకు ఒక శబ్దం మారుమోగుతుంది,

ఎందుకంటే, దేశాలతో యెహోవాకు ఒక వ్యాజ్యం ఉంది.

ఆయనే స్వయంగా మనుషులందరి మీద తీర్పు ప్రకటిస్తాడు.+

దుష్టుల్ని ఖడ్గానికి అప్పగిస్తాడు.’

32 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

‘ఇదిగో! దేశం నుండి దేశానికి విపత్తు వ్యాపిస్తుంది,+

భూమి సుదూర ప్రాంతాల నుండి భయంకరమైన తుఫాను బయల్దేరుతుంది.+

33 “ ‘ఆ రోజు యెహోవా చేత హతులైన వాళ్లు భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు పడి ఉంటారు. ఎవరూ వాళ్ల గురించి ఏడ్వరు, వాళ్లను పోగుచేయరు, పాతిపెట్టరు. వాళ్లు నేలమీద ఎరువు అవుతారు.’

34 కాపరులారా, ఏడ్వండి, కేకలు వేయండి!

మందలోని ప్రధానులారా, బూడిదలో పడి దొర్లండి,

ఎందుకంటే మిమ్మల్ని వధించే సమయం, మీరు చెదిరిపోయే సమయం వచ్చేసింది,

మీరు అమూల్యమైన పాత్రలా పగలగొట్టబడతారు!

35 కాపరులు పారిపోవడానికి స్థలం లేదు,

మందలోని ప్రధానులు తప్పించుకోలేరు.

36 ఇదిగో! కాపరుల ఆర్తనాదాలు,

మందలోని ప్రధానుల ఏడ్పులు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే, యెహోవా వాళ్ల పచ్చికబయళ్లను నాశనం చేస్తున్నాడు.

37 యెహోవా కోపాగ్ని వల్ల

ప్రశాంతమైన నివాస స్థలాలు నిర్జీవంగా తయారయ్యాయి.

38 ఆయన కొదమ సింహంలా తన విశ్రాంతి స్థలం నుండి బయల్దేరాడు,+

ఎందుకంటే క్రూరమైన ఖడ్గం వల్ల,

ఆయన కోపాగ్ని వల్ల

దేశం భయంకరంగా తయారైంది.”

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి