కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • యెహోవా దీవెనల్ని మళ్లీ గుర్తుచేయడం (1-9)

        • “రొట్టె వల్ల మాత్రమే జీవించడు” (3)

      • యెహోవాను మర్చిపోవద్దు (10-20)

ద్వితీయోపదేశకాండం 8:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 3:1, 2
  • +ఆది 15:18

ద్వితీయోపదేశకాండం 8:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 13:3; సామె 17:3
  • +నిర్గ 16:4; 20:20
  • +ద్వితీ 2:7

ద్వితీయోపదేశకాండం 8:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 4:4
  • +నిర్గ 16:3
  • +నిర్గ 16:31; కీర్త 78:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2004, పేజీలు 13-14

    8/15/1999, పేజీలు 25-26

    5/1/1994, పేజీ 3

ద్వితీయోపదేశకాండం 8:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 29:5; నెహె 9:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2004, పేజీ 26

ద్వితీయోపదేశకాండం 8:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 3:12; 1కొ 11:32; హెబ్రీ 12:5-7; ప్రక 3:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1994, పేజీ 3

ద్వితీయోపదేశకాండం 8:7

అధస్సూచీలు

  • *

    లేదా “నీటి వాగులు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:8; ద్వితీ 11:11, 12

ద్వితీయోపదేశకాండం 8:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2006, పేజీలు 16-17

    5/15/2000, పేజీలు 25, 27

ద్వితీయోపదేశకాండం 8:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 6:10-12

ద్వితీయోపదేశకాండం 8:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2006, పేజీ 28

    పరిచర్య పాఠశాల, పేజీ 20

ద్వితీయోపదేశకాండం 8:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 13:6

ద్వితీయోపదేశకాండం 8:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 9:4; 32:15
  • +కీర్త 106:21

ద్వితీయోపదేశకాండం 8:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:19; యిర్మీ 2:6
  • +సం 20:11

ద్వితీయోపదేశకాండం 8:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:2
  • +హెబ్రీ 12:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/1999, పేజీ 25

ద్వితీయోపదేశకాండం 8:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హోషే 12:8

ద్వితీయోపదేశకాండం 8:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 127:1; హోషే 2:8
  • +ద్వితీ 7:12

ద్వితీయోపదేశకాండం 8:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:25, 26; 30:17, 18; యెహో 23:12, 13

ద్వితీయోపదేశకాండం 8:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 9:11, 12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 8:1సామె 3:1, 2
ద్వితీ. 8:1ఆది 15:18
ద్వితీ. 8:2ద్వితీ 13:3; సామె 17:3
ద్వితీ. 8:2నిర్గ 16:4; 20:20
ద్వితీ. 8:2ద్వితీ 2:7
ద్వితీ. 8:3మత్త 4:4
ద్వితీ. 8:3నిర్గ 16:3
ద్వితీ. 8:3నిర్గ 16:31; కీర్త 78:24
ద్వితీ. 8:4ద్వితీ 29:5; నెహె 9:21
ద్వితీ. 8:5సామె 3:12; 1కొ 11:32; హెబ్రీ 12:5-7; ప్రక 3:19
ద్వితీ. 8:7నిర్గ 3:8; ద్వితీ 11:11, 12
ద్వితీ. 8:8సం 13:23
ద్వితీ. 8:10ద్వితీ 6:10-12
ద్వితీ. 8:12హోషే 13:6
ద్వితీ. 8:14ద్వితీ 9:4; 32:15
ద్వితీ. 8:14కీర్త 106:21
ద్వితీ. 8:15ద్వితీ 1:19; యిర్మీ 2:6
ద్వితీ. 8:15సం 20:11
ద్వితీ. 8:16ద్వితీ 8:2
ద్వితీ. 8:16హెబ్రీ 12:11
ద్వితీ. 8:17హోషే 12:8
ద్వితీ. 8:18కీర్త 127:1; హోషే 2:8
ద్వితీ. 8:18ద్వితీ 7:12
ద్వితీ. 8:19ద్వితీ 4:25, 26; 30:17, 18; యెహో 23:12, 13
ద్వితీ. 8:20దాని 9:11, 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 8:1-20

ద్వితీయోపదేశకాండం

8 “ఈ రోజు నేను నీకు ఇస్తున్న ప్రతీ ఆజ్ఞను నువ్వు జాగ్రత్తగా పాటించాలి. అలాచేస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు,+ నీ ప్రజల సంఖ్య పెరుగుతుంది, నీ పూర్వీకులకు యెహోవా ప్రమాణం చేసిన దేశంలోకి అడుగుపెట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటావు.+ 2 నీకు వినయం నేర్పించడానికీ, నీ హృదయంలో ఏముందో తెలుసుకునేలా+ అంటే నువ్వు ఆయన ఆజ్ఞల్ని పాటిస్తావో లేదో తెలుసుకునేలా నిన్ను పరీక్షించడానికీ+ నీ దేవుడైన యెహోవా నిన్ను ఈ 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించిన దారి అంతటినీ మర్చిపోకు.+ 3 ఆయన నీకు వినయం నేర్పించాడు; అంతేకాదు, మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ యెహోవా నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవిస్తాడు+ అని నువ్వు తెలుసుకునేలా ఆయన నిన్ను ఆకలితో ఉండనిచ్చి,+ నీకు గానీ నీ పూర్వీకులకు గానీ తెలియని మన్నాతో నిన్ను పోషించాడు.+ 4 ఈ 40 సంవత్సరాలు, నువ్వు వేసుకున్న బట్టలు పాతబడి చిరిగిపోలేదు, నీ కాళ్లు వాయలేదు.+ 5 ఒక వ్యక్తి తన కుమారుణ్ణి సరిదిద్దినట్టు, నీ దేవుడైన యెహోవా నిన్ను సరిదిద్దుతూ వచ్చాడని+ నీకు బాగా తెలుసు.

6 “నువ్వు నీ దేవుడైన యెహోవా మార్గాల్లో నడుస్తూ, ఆయనకు భయపడుతూ ఉండడం ద్వారా ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. 7 ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలోకి తీసుకొస్తున్నాడు.+ అది నీటి ప్రవాహాలు* ఉన్న దేశం; లోయ మైదానంలో, పర్వత ప్రాంతంలో బావులు, నీటి ఊటలు పొంగిపొర్లుతున్న దేశం; 8 అది గోధుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ చెట్లు ఉన్న దేశం;+ అది ఒలీవ నూనె, తేనె ఉన్న దేశం; 9 ఆ దేశంలో ఆహార కొరత అనేదే ఉండదు, అక్కడ నీకు ఏ లోటూ ఉండదు. ఆ దేశపు రాళ్లలో ఇనుము ఉంటుంది, అక్కడి కొండల నుండి నువ్వు రాగిని వెలికితీస్తావు.

10 “నువ్వు అక్కడ తిని, తృప్తి పొందిన తర్వాత, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నువ్వు ఆయన్ని స్తుతించాలి.+ 11 నేడు నేను నీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞల్ని, న్యాయనిర్ణయాల్ని, శాసనాల్ని పాటించడం మానేసి నీ దేవుడైన యెహోవాను మర్చిపోయే పరిస్థితి రాకుండా చూసుకో. 12 నువ్వు తిని, తృప్తి పొంది, శ్రేష్ఠమైన ఇళ్లు కట్టుకొని, వాటిలో నివసించినప్పుడు,+ 13 నీ పశువులూ మందలూ ఎక్కువయ్యి, నీ వెండిబంగారాలు పెరిగి, నీకు ప్రతీది సమృద్ధిగా ఉన్నప్పుడు, 14 నీ హృదయంలో గర్వం మొదలై+ నీ దేవుడైన యెహోవాను మర్చిపోయే పరిస్థితి రానివ్వకు. దాస్య గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చాడు;+ 15 విషసర్పాలూ తేళ్లూ తిరిగే, నీళ్లులేని ఎండిన ప్రదేశాలున్న భయంకరమైన మహా ఎడారి గుండా ఆయన నిన్ను నడిపించాడు.+ ఆయన చెకుముకి రాయి నుండి నీళ్లు ప్రవహించేలా చేశాడు;+ 16 నీ పూర్వీకులకు తెలియని మన్నాతో ఎడారిలో ఆయన నిన్ను పోషించాడు; నీకు వినయం నేర్పించడానికీ,+ భవిష్యత్తులో నీకు ప్రయోజనం చేకూరేలా నిన్ను పరీక్షించడానికీ ఆయన అలా చేశాడు.+ 17 ఒకవేళ నువ్వు నీ హృదయంలో, ‘నా సొంత శక్తితో, నా చేతి బలంతో నేను ఈ ఆస్తిని సంపాదించుకున్నాను’ అని అనుకుంటే,+ 18 అలా ఆస్తిని సంపాదించడానికి నీకు శక్తిని ఇస్తున్నది నీ దేవుడైన యెహోవాయే అన్న విషయం గుర్తుంచుకో.+ తాను నీ పూర్వీకులకు ప్రమాణం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చడానికే ఆయన అలా ఇస్తున్నాడు. నేటివరకు ఆయన ఆ ఒప్పందాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు.+

19 “ఒకవేళ నువ్వు ఎప్పుడైనా నీ దేవుడైన యెహోవాను మర్చిపోయి, వేరే దేవుళ్లను అనుసరించి, వాటిని పూజించి, వాటికి మొక్కితే మీరు ఖచ్చితంగా నాశనమౌతారని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.+ 20 మీరు మీ దేవుడైన యెహోవా స్వరం విననందువల్ల, మీ కళ్లముందు యెహోవా నాశనం చేస్తున్న జనాల్లాగే మీరూ నాశనమౌతారు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి