మీకా
7 అయ్యో నాకు శ్రమ!
ఎందుకంటే, వేసవికాల పండ్లను సమకూర్చాక,
ద్రాక్షల కోత ముగిసి మిగిలిన పండ్లను ఏరుకున్నాక,
తినడానికి ఒక్క ద్రాక్షగుత్తి గానీ,
నాకెంతో ఇష్టమైన మొదటి అంజూర పండ్లు గానీ
దొరకని వ్యక్తిలా నేనున్నాను.
2 భూమ్మీద విశ్వసనీయుడు అనేవాడే లేకుండా పోయాడు;
మనుషుల్లో నిజాయితీపరుడు ఒక్కడూ లేడు.+
వాళ్లందరూ రక్తం చిందించడానికి మాటు వేస్తున్నారు.+
ప్రతీ ఒక్కడు వలతో తన సహోదరుణ్ణి వేటాడుతున్నాడు.
3 చెడు చేయడంలో వాళ్ల చేతులు ఆరితేరాయి;+
అధిపతి బహుమానం కోరుతున్నాడు,
న్యాయమూర్తి లంచం అడుగుతున్నాడు,+
ప్రముఖుడు తన కోరికల్ని తెలియజేస్తున్నాడు,+
వాళ్లంతా కలిసి కుట్ర పన్నుతున్నారు.
4 వాళ్లలో శ్రేష్ఠుడు ముళ్లలా ఉన్నాడు,
వాళ్లలో అత్యంత నిజాయితీపరుడు ముళ్ల కంచె కన్నా ఘోరంగా ఉన్నాడు.
నీ కావలివాళ్లు చెప్పిన రోజు, నిన్ను లెక్క అడిగే రోజు వస్తుంది.+
అప్పుడు వాళ్లు కలవరపడతారు.+
5 సహచరుడి మీద నమ్మకం పెట్టుకోకండి,
సన్నిహిత స్నేహితుణ్ణి నమ్మకండి.+
కౌగిట్లో పడుకున్న స్త్రీతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
6 ఎందుకంటే, కుమారుడు తన తండ్రిని నీచంగా చూస్తాడు,
కూతురు తన తల్లి మీదికి,+
కోడలు అత్త మీదికి లేస్తుంది;+
ఒక మనిషి ఇంటివాళ్లే అతని శత్రువులుగా ఉంటారు.+
7 కానీ నేనైతే యెహోవా కోసం కనిపెట్టుకొనివుంటాను.+
నా రక్షకుడైన దేవుని కోసం ఓపిగ్గా వేచివుంటాను.+
నా దేవుడు నా మొర వింటాడు.+
8 నా శత్రువా,* నన్ను చూసి ఉల్లసించకు.
నేను పడిపోయాను, కానీ పైకి లేస్తాను;
నేను చీకట్లో నివసిస్తున్నాను, అయితే యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.
9 నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను,+
కాబట్టి, ఆయన నా వ్యాజ్యాన్ని వాదించి, నాకు న్యాయం తీర్చే వరకు,
నేను ఆయన కోపాన్ని భరిస్తాను.
ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు;
నేను ఆయన నీతిని చూస్తాను.
10 నా శత్రువు కూడా చూస్తుంది,
“నీ దేవుడైన యెహోవా ఎక్కడ?”+
అని నాతో అన్న ఆమె సిగ్గుపాలౌతుంది,
నా కళ్లు ఆమెను చూస్తాయి.
అప్పుడామె వీధుల్లో బురదలా తొక్కబడుతుంది.
11 ఆ రోజు నీ రాతి గోడలు కట్టబడతాయి;
ఆ రోజు నీ సరిహద్దు విస్తరిస్తుంది.*
12 ఆ రోజు వాళ్లు అష్షూరు నుండి, ఐగుప్తు నగరాల నుండి,
ఐగుప్తు నుండి నది* వరకు, సముద్రం నుండి సముద్రం వరకు, పర్వతం నుండి పర్వతం వరకు
ఉన్న ప్రాంతాలన్నిటి నుండి నీ దగ్గరికి వస్తారు.+
13 దేశం దాని నివాసుల వల్ల,
వాళ్లు చేసిన పనుల వల్ల నిర్మానుష్యం అవుతుంది.
14 నీ కర్రతో నీ ప్రజల్ని, నీ సొత్తైన మందను కాయి,+
అది ఒకప్పుడు అడవిలో పండ్ల తోట మధ్య ఒంటరిగా బ్రతికేది.
పూర్వకాలంలో మేసినట్టు వాటిని బాషానులో, గిలాదులో మేయనివ్వు.+
15 “నువ్వు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన రోజుల్లో నేను చేసినట్టే
మీకు అద్భుతమైన విషయాల్ని చూపిస్తాను.+
16 తమకు ఎంతో బలం ఉన్నప్పటికీ దేశాలు వాటిని చూసి సిగ్గుపడతాయి.+
వాళ్లు నోటిమీద చెయ్యి పెట్టుకుంటారు;
వాళ్ల చెవులకు ఏమీ వినిపించదు.
17 వాళ్లు పాముల్లా మట్టి నాకుతారు;+
భూమ్మీదున్న పాకే ప్రాణుల్లా* తమ కోటల్లో నుండి వణుకుతూ బయటికి వస్తారు.
వాళ్లు భయంతో మన దేవుడైన యెహోవా దగ్గరికి వస్తారు,
నీకు భయపడతారు.”+
ఆయన ఎల్లకాలం కోపం పెట్టుకోడు,
ఎందుకంటే, ఆయన విశ్వసనీయ ప్రేమ చూపించడంలో సంతోషిస్తాడు.+
19 ఆయన మళ్లీ మనమీద కరుణ చూపిస్తాడు;+ ఆయన మన తప్పుల్ని జయిస్తాడు.*
నువ్వు మా పాపాలన్నిటినీ సముద్ర లోతుల్లోకి పడేస్తావు.+
20 నువ్వు పూర్వకాలం నుండి మా పూర్వీకులకు ప్రమాణం చేసినట్టుగానే,
యాకోబుకు నమ్మకత్వం చూపిస్తావు,
అబ్రాహాముకు విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.+