కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 రాజులు 18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 రాజులు విషయసూచిక

      • ఏలీయా ఓబద్యాను, అహాబును కలవడం (1-18)

      • కర్మెలు దగ్గర ఏలీయా, బయలు ప్రవక్తలు (19-40)

        • ‘రెండు అభిప్రాయాల మధ్య ఊగిసలాట’ (21)

      • మూడున్నర సంవత్సరాల కరువు ముగియడం (41-46)

1 రాజులు 18:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 4:25; యాకో 5:17
  • +కీర్త 65:9, 10; యిర్మీ 14:22

1 రాజులు 18:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:26; ద్వితీ 28:24

1 రాజులు 18:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2006, పేజీ 20

1 రాజులు 18:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 16:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2006, పేజీ 20

1 రాజులు 18:5

అధస్సూచీలు

  • *

    లేదా “వాగులన్నిటి.”

1 రాజులు 18:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 1:8

1 రాజులు 18:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 17:2, 3

1 రాజులు 18:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 2:15, 16; మత్త 4:1; అపొ 8:39

1 రాజులు 18:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 18:4

1 రాజులు 18:15

అధస్సూచీలు

  • *

    అక్ష., “నేను ఎవరి ముందు నిలబడ్డానో ఆ.”

1 రాజులు 18:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:4; 1రా 9:9; 16:30-33

1 రాజులు 18:19

అధస్సూచీలు

  • *

    లేదా “పూజా కర్ర.” పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 16:33
  • +యెహో 19:26, 31

1 రాజులు 18:21

అధస్సూచీలు

  • *

    లేదా “రెండు ఊత కర్రలతో గెంతుతుంటారు?”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:11; హోషే 10:2; మత్త 12:30; 1కొ 10:21; 2కొ 6:14, 15
  • +నిర్గ 20:5; యెహో 24:15; 1స 7:3; కీర్త 100:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 46

    కావలికోట (అధ్యయన),

    3/2017, పేజీలు 14-15

    విశ్వాసం, పేజీలు 99-101

    కావలికోట,

    1/1/2008, పేజీ 19

    12/15/2005, పేజీలు 24-29

    7/1/2005, పేజీలు 30-31

    1/1/1998, పేజీ 30

1 రాజులు 18:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 19:9, 10

1 రాజులు 18:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 101

    కావలికోట,

    1/1/2008, పేజీ 19

1 రాజులు 18:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:31
  • +లేవీ 9:23, 24; ద్వితీ 4:24; న్యా 6:21; 1ది 21:26; 2ది 7:1

1 రాజులు 18:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:20; యిర్మీ 10:5; దాని 5:23; హబ 2:18, 19; 1కొ 8:4

1 రాజులు 18:27

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రయాణం చేస్తున్నాడేమో” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 41:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 101-102

    కావలికోట,

    1/1/2008, పేజీ 20

1 రాజులు 18:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1998, పేజీ 30

1 రాజులు 18:29

అధస్సూచీలు

  • *

    లేదా “ప్రవక్తల్లా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 44:19, 20

1 రాజులు 18:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 19:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 102

    కావలికోట,

    1/1/2008, పేజీ 20

    12/15/2005, పేజీ 26

1 రాజులు 18:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:28, 30; 35:10; యెష 48:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 102

    కావలికోట,

    1/1/2008, పేజీ 20

1 రాజులు 18:32

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక సీయ 7.33 లీటర్లతో (దాదాపు 10 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:25; ద్వితీ 27:6

1 రాజులు 18:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 22:9; లేవీ 1:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1998, పేజీలు 30-31

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీ 17

1 రాజులు 18:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీ 17

1 రాజులు 18:35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సర్వమానవాళి కొరకైన గ్రంథం, పేజీ 17

1 రాజులు 18:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:41
  • +ఆది 26:24
  • +ఆది 28:13
  • +సం 16:28; యోహా 11:42

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 104

    కావలికోట బ్రోషురు,

    1/1/2008, పేజీ 20

1 రాజులు 18:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 31:18; యెహె 33:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 104

    కావలికోట బ్రోషురు,

    1/1/2008, పేజీ 20

1 రాజులు 18:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 9:23, 24; న్యా 6:21; 2ది 7:1
  • +1రా 18:23, 24

1 రాజులు 18:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 5:20, 21; కీర్త 83:9
  • +ద్వితీ 13:1-5; 18:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 104-105

    కావలికోట,

    1/1/2008, పేజీలు 20-21

1 రాజులు 18:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 17:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 107, 109

1 రాజులు 18:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యాకో 5:17, 18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 107-108

1 రాజులు 18:43

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 108-111

1 రాజులు 18:44

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 109-112

    కావలికోట,

    4/1/2009, పేజీలు 25-26

1 రాజులు 18:45

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 12:18; యోబు 38:37
  • +యెహో 19:17, 18; 1రా 21:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 112

1 రాజులు 18:46

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 112-114

    కావలికోట,

    1/1/2012, పేజీ 14

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 రాజు. 18:1లూకా 4:25; యాకో 5:17
1 రాజు. 18:1కీర్త 65:9, 10; యిర్మీ 14:22
1 రాజు. 18:2లేవీ 26:26; ద్వితీ 28:24
1 రాజు. 18:41రా 16:31
1 రాజు. 18:72రా 1:8
1 రాజు. 18:101రా 17:2, 3
1 రాజు. 18:122రా 2:15, 16; మత్త 4:1; అపొ 8:39
1 రాజు. 18:131రా 18:4
1 రాజు. 18:18నిర్గ 20:4; 1రా 9:9; 16:30-33
1 రాజు. 18:191రా 16:33
1 రాజు. 18:19యెహో 19:26, 31
1 రాజు. 18:21యిర్మీ 2:11; హోషే 10:2; మత్త 12:30; 1కొ 10:21; 2కొ 6:14, 15
1 రాజు. 18:21నిర్గ 20:5; యెహో 24:15; 1స 7:3; కీర్త 100:3
1 రాజు. 18:221రా 19:9, 10
1 రాజు. 18:24న్యా 6:31
1 రాజు. 18:24లేవీ 9:23, 24; ద్వితీ 4:24; న్యా 6:21; 1ది 21:26; 2ది 7:1
1 రాజు. 18:26యెష 45:20; యిర్మీ 10:5; దాని 5:23; హబ 2:18, 19; 1కొ 8:4
1 రాజు. 18:27యెష 41:23
1 రాజు. 18:29యెష 44:19, 20
1 రాజు. 18:301రా 19:14
1 రాజు. 18:31ఆది 32:28, 30; 35:10; యెష 48:1
1 రాజు. 18:32నిర్గ 20:25; ద్వితీ 27:6
1 రాజు. 18:33ఆది 22:9; లేవీ 1:7, 8
1 రాజు. 18:36నిర్గ 29:41
1 రాజు. 18:36ఆది 26:24
1 రాజు. 18:36ఆది 28:13
1 రాజు. 18:36సం 16:28; యోహా 11:42
1 రాజు. 18:37యిర్మీ 31:18; యెహె 33:11
1 రాజు. 18:38లేవీ 9:23, 24; న్యా 6:21; 2ది 7:1
1 రాజు. 18:381రా 18:23, 24
1 రాజు. 18:40న్యా 5:20, 21; కీర్త 83:9
1 రాజు. 18:40ద్వితీ 13:1-5; 18:20
1 రాజు. 18:411రా 17:1
1 రాజు. 18:42యాకో 5:17, 18
1 రాజు. 18:451స 12:18; యోబు 38:37
1 రాజు. 18:45యెహో 19:17, 18; 1రా 21:1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 రాజులు 18:1-46

రాజులు మొదటి గ్రంథం

18 కొంతకాలం తర్వాత, కరువు వచ్చిన మూడో సంవత్సరంలో+ యెహోవా వాక్యం ఏలీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: “నువ్వు వెళ్లి అహాబుకు కనిపించు, నేను నేల మీద వర్షం కురిపించబోతున్నాను.”+ 2 దాంతో ఏలీయా అహాబుకు కనబడడానికి వెళ్లాడు, అప్పుడు సమరయలో కరువు తీవ్రంగా ఉంది.+

3 ఈలోపు అహాబు, రాజభవనాన్ని చూసుకునే ఓబద్యాను పిలిపించాడు. (ఓబద్యా యెహోవా పట్ల ఎంతో భయభక్తులు గలవాడు, 4 యెజెబెలు+ యెహోవా ప్రవక్తల్ని చంపుతున్నప్పుడు, ఓబద్యా ఒక్కో గుహలో 50 మంది చొప్పున 100 మంది ప్రవక్తల్ని దాచిపెట్టాడు; అతను వాళ్లకు ఆహారం, నీళ్లు ఇచ్చి పోషించాడు.) 5 అహాబు ఓబద్యాకు ఇలా చెప్పాడు: “దేశమంతటా ఉన్న ఊటలన్నిటి దగ్గరికి, లోయలన్నిటి* దగ్గరికి వెళ్లు. మన గుర్రాలు, కంచర గాడిదలు చావకుండా వాటికి సరిపడా గడ్డి మనకు దొరుకుతుందేమో; అప్పుడు కనీసం కొన్ని జంతువులైనా బ్రతికుంటాయి.” 6 కాబట్టి వాళ్లిద్దరూ తాము వెళ్లబోయే దేశాన్ని భాగాలుగా విభజించుకుని అహాబు ఒక దారిలో, ఓబద్యా ఇంకో దారిలో వెళ్లారు.

7 ఓబద్యా తన దారిలో వెళ్తుంటే, ఏలీయా అతన్ని కలవడానికి వచ్చాడు. ఓబద్యా వెంటనే అతన్ని గుర్తుపట్టి సాష్టాంగ నమస్కారం చేసి, “నువ్వు నా ప్రభువైన ఏలీయావే కదూ?” అన్నాడు.+ 8 అందుకు ఏలీయా అతనితో, “అవును, నేనే. వెళ్లి, ఏలీయా ఇక్కడ ఉన్నాడని నీ ప్రభువుతో చెప్పు” అన్నాడు. 9 కానీ ఓబద్యా ఇలా అన్నాడు: “నేనేమి పాపం చేశాను? అహాబు నీ సేవకుడినైన నన్ను చంపేలా అతని చేతికి నన్ను ఎందుకు అప్పగిస్తున్నావు? 10 నీ దేవుడైన యెహోవా జీవం తోడు, నా ప్రభువు నిన్ను వెదకడానికి మనుషుల్ని పంపించని దేశంగానీ రాజ్యంగానీ లేదు. ‘అతను ఇక్కడ లేడు’ అని ఆ దేశాలవాళ్లు, రాజ్యాలవాళ్లు చెప్పినప్పుడు, వాళ్లు నిజంగా నిన్ను చూడలేదని వాళ్లతో ప్రమాణం చేయించేవాడు.+ 11 నువ్వు ఇప్పుడు, ‘వెళ్లి, ఏలీయా ఇక్కడ ఉన్నాడని నీ ప్రభువుతో చెప్పు’ అని అంటున్నావు, 12 నేను నీ దగ్గర నుండి వెళ్లాక, యెహోవా పవిత్రశక్తి నిన్ను నాకు తెలియని ఒక స్థలానికి తీసుకెళ్తుంది.+ నేను అహాబుతో చెప్పాక, నువ్వు అతనికి కనిపించకపోతే అతను నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ సేవకుడినైన నేను చిన్నప్పటి నుండి యెహోవా పట్ల భయభక్తులు గలవాణ్ణి. 13 యెజెబెలు యెహోవా ప్రవక్తల్ని చంపుతున్నప్పుడు నేనేమి చేశానో, నేను ఒక్కో గుహలో 50 మంది చొప్పున 100 మంది యెహోవా ప్రవక్తల్ని దాచిపెట్టి వాళ్లకు ఏ విధంగా ఆహారం, నీళ్లు అందిస్తూ వచ్చానో+ నా ప్రభువైన నువ్వు వినలేదా? 14 కానీ నువ్వేమో నాతో, ‘వెళ్లి, ఏలీయా ఇక్కడ ఉన్నాడని నీ ప్రభువుతో చెప్పు’ అని అంటున్నావు. అతను నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు.” 15 అయితే ఏలీయా, “నేను సేవిస్తున్న* సైన్యాలకు అధిపతైన యెహోవా జీవం తోడు, ఈ రోజు నేను అతనికి కనిపిస్తాను” అన్నాడు.

16 కాబట్టి ఓబద్యా అహాబును కలవడానికి వెళ్లి, అతనికి విషయం చెప్పాడు. అహాబు ఏలీయాను కలవడానికి బయల్దేరాడు.

17 అహాబు ఏలీయాను చూడగానే, “ఇశ్రాయేలు మీదికి గొప్ప శ్రమ తీసుకొచ్చిన నువ్వు వచ్చేశావా?” అన్నాడు.

18 అందుకు ఏలీయా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు మీదికి గొప్ప శ్రమ తీసుకొచ్చింది నేను కాదు; యెహోవా ఆజ్ఞల్ని విడిచిపెట్టి, బయలు దేవుళ్లను అనుసరించి నువ్వూ నీ తండ్రి ఇంటివాళ్లే శ్రమ తీసుకొచ్చారు.+ 19 ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందర్నీ, అలాగే యెజెబెలు బల్ల దగ్గర భోజనం చేస్తున్న 450 మంది బయలు ప్రవక్తల్ని, అషేరాదేవి*+ 400 మంది ప్రవక్తల్ని నా దగ్గరికి కర్మెలు+ పర్వతం మీదికి పిలిపించు.” 20 కాబట్టి అహాబు ఇశ్రాయేలు ప్రజలందరికీ కబురు పంపించి, ప్రవక్తల్ని కర్మెలు పర్వతం మీద పోగుచేశాడు.

21 అప్పుడు ఏలీయా ప్రజలందరి దగ్గరికి వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య ఊగిసలాడుతుంటారు?*+ యెహోవా సత్యదేవుడైతే ఆయన్ని అనుసరించండి;+ ఒకవేళ బయలు సత్యదేవుడైతే అతన్ని అనుసరించండి!” అన్నాడు. కానీ ప్రజలు జవాబుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. 22 ఏలీయా ప్రజలతో ఇలా అన్నాడు: “యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలాను,+ కానీ బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. 23 మాకు రెండు కోడెదూడలు ఇవ్వండి. వాళ్లు ఒక కోడెదూడను తీసుకొని దాన్ని ముక్కలుగా కోసి కట్టెల మీద పెట్టాలి, కానీ దానికి నిప్పు అంటించకూడదు. నేను ఇంకో కోడెదూడను సిద్ధం చేసి దాన్ని కట్టెల మీద పెడతాను, కానీ దానికి నిప్పు అంటించను. 24 అప్పుడు మీరు మీ దేవుని+ పేరున ప్రార్థన చేయాలి, నేను యెహోవా పేరున ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్నిని పంపించి జవాబు ఇస్తాడో ఆయనే సత్యదేవుడు.”+ దానికి ప్రజలందరూ, “నువ్వు చెప్పింది బాగుంది” అన్నారు.

25 అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలతో ఇలా అన్నాడు: “మీరు ఎక్కువమంది ఉన్నారు కాబట్టి ముందు మీరే ఒక కోడెదూడను ఎంచుకొని దాన్ని సిద్ధం చేయండి. తర్వాత మీ దేవుని పేరున ప్రార్థన చేయండి, కానీ మీరు దానికి నిప్పు అంటించకూడదు.” 26 దాంతో వాళ్లు తమకు ఇవ్వబడిన కోడెదూడను తీసుకుని, సిద్ధం చేశారు. వాళ్లు, “బయలా, మాకు జవాబివ్వు” అంటూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బయలు పేరున ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఏ స్వరం వినిపించలేదు, ఎవ్వరూ జవాబివ్వలేదు.+ వాళ్లు తాము కట్టిన బలిపీఠం చుట్టూ గంతులు వేస్తూ ఉన్నారు. 27 దాదాపు మధ్యాహ్న సమయంలో ఏలీయా వాళ్లను ఎగతాళి చేస్తూ, “ఇంకా గట్టిగా అరవండి! ఎంతైనా అతను దేవుడు కదా!+ బహుశా అతను ఏదైనా ఆలోచనలో మునిగిపోయాడేమో లేదా కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడేమో.* లేక నిద్రపోతున్నాడేమో, అతన్ని ఎవరైనా నిద్ర లేపాలేమో!” అన్నాడు. 28 వాళ్లు గట్టిగట్టిగా కేకలు వేస్తూ, తమ ఆచారం ప్రకారం, ఒళ్లంతా బాగా రక్తం కారే వరకు తమ శరీరాల్ని కత్తులతో, ఈటెలతో కోసుకున్నారు. 29 మధ్యాహ్న సమయం దాటిపోయింది, సాయంత్రం ధాన్యార్పణ అర్పించే సమయం వరకు వాళ్లు పిచ్చిపట్టిన వాళ్లలా* ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ ఏ స్వరం వినిపించలేదు, ఎవ్వరూ జవాబివ్వలేదు; ఎవ్వరూ వాళ్లను పట్టించుకోలేదు.+

30 చివరికి ఏలీయా ప్రజలందరితో, “నా దగ్గరికి రండి” అన్నాడు. కాబట్టి ప్రజలందరూ అతని దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏలీయా పడగొట్టబడివున్న యెహోవా బలిపీఠాన్ని బాగుచేశాడు.+ 31 ఆ తర్వాత ఏలీయా, “ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా ఎవరికైతే చెప్పాడో, ఆ యాకోబు+ కుమారుల గోత్రాల లెక్క ప్రకారం 12 రాళ్లను తీసుకున్నాడు. 32 ఏలీయా ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టాడు.+ అతను బలిపీఠం చుట్టూ ఒక కందకం తవ్వించాడు, అది రెండు సీయ కొలతల* విత్తనాలు నాటేంత పెద్ద స్థలం. 33 ఆ తర్వాత అతను కట్టెల్ని చక్కగా పేర్చి, కోడెదూడను ముక్కలుగా కోసి, ఆ కట్టెల మీద ఉంచాడు.+ తర్వాత ఏలీయా, “నాలుగు పెద్ద కుండల నిండా నీళ్లు నింపి దహనబలి మీద, కట్టెల మీద పోయండి” అని చెప్పాడు. 34 ఆ తర్వాత, “మళ్లీ అలాగే చేయండి” అని చెప్పాడు, వాళ్లు అలాగే చేశారు. ఏలీయా ఇంకోసారి, “మూడోసారి అలాగే చేయండి” అని చెప్పాడు, కాబట్టి వాళ్లు మూడోసారి కూడా అలాగే చేశారు. 35 దాంతో నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లాయి, అతను కందకాన్ని కూడా నీళ్లతో నింపాడు.

36 దాదాపు సాయంత్రం ధాన్యార్పణ అర్పించే సమయంలో,+ ఏలీయా ప్రవక్త ముందుకొచ్చి ఇలా ప్రార్థించాడు: “యెహోవా, అబ్రాహాముకు,+ ఇస్సాకుకు,+ ఇశ్రాయేలుకు దేవా, ఇశ్రాయేలులో నువ్వు దేవుడివని, నేను నీ సేవకుడినని, నీ మాట ప్రకారమే నేను ఇవన్నీ చేశానని ఈ రోజు తెలియజేయి.+ 37 యెహోవా, నాకు జవాబివ్వు! యెహోవా అనే నువ్వే సత్యదేవుడివని, నువ్వు వాళ్ల హృదయాల్ని మళ్లీ నీ వైపుకు తిప్పుతున్నావని+ ఈ ప్రజలు తెలుసుకునేలా నాకు జవాబివ్వు.”

38 అప్పుడు యెహోవా పంపించిన అగ్ని దిగివచ్చి దహనబలిని, కట్టెల్ని, రాళ్లను, మట్టిని దహించివేసింది;+ కందకంలోని నీళ్లను ఎండిపోజేసింది.+ 39 ప్రజలందరూ దాన్ని చూసి వెంటనే సాష్టాంగపడి, “యెహోవాయే సత్యదేవుడు! యెహోవాయే సత్యదేవుడు!” అన్నారు. 40 అప్పుడు ఏలీయా, “బయలు ప్రవక్తల్ని పట్టుకోండి! వాళ్లలో ఒక్కర్ని కూడా తప్పించుకోనివ్వకండి!” అని ప్రజలకు చెప్పాడు. వెంటనే ప్రజలు వాళ్లను పట్టుకున్నారు, ఏలీయా వాళ్లను కీషోను వాగు+ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ వాళ్లను వధించాడు.+

41 తర్వాత ఏలీయా అహాబుతో, “నువ్వు వెళ్లి తిని తాగు, ఎందుకంటే కుండపోత వర్షం శబ్దం వినిపిస్తోంది” అన్నాడు.+ 42 కాబట్టి అహాబు తిని తాగడానికి వెళ్లిపోయాడు. ఏలీయా కర్మెలు పర్వత శిఖరం మీదికి వెళ్లి మోకాళ్లూని, తన తలను మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.+ 43 అప్పుడు ఏలీయా తన సేవకుడితో, “దయచేసి వెళ్లి, సముద్రం వైపు చూడు” అని చెప్పాడు. అతను పైకి ఎక్కి చూసి, “అక్కడ ఏమీ లేదు” అని చెప్పాడు. ఏలీయా ఏడుసార్లు, “వెళ్లి చూడు” అని చెప్పాడు. 44 ఏడోసారి అతని సేవకుడు, “ఇదిగో! మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి లేస్తూ ఉంది” అని చెప్పాడు. అప్పుడు ఏలీయా అతనితో ఇలా అన్నాడు: “నువ్వు అహాబు దగ్గరికి వెళ్లి, ‘రథాన్ని సిద్ధం చేసుకుని వెళ్లు! లేకపోతే నువ్వు కుండపోత వర్షంలో చిక్కుకుంటావు!’ అని చెప్పు.” 45 ఈలోగా ఆకాశం మేఘాలతో చీకటిమయమైంది, గాలి వీచింది, కుండపోతగా వర్షం కురిసింది;+ అహాబు రథమెక్కి ప్రయాణిస్తూ యెజ్రెయేలుకు+ చేరుకున్నాడు. 46 అయితే యెహోవా చెయ్యి ఏలీయాను బలపర్చడంతో అతను తన వస్త్రాన్ని నడుము చుట్టూ కట్టుకొని పరుగెత్తుకుంటూ అహాబు కన్నా ముందే యెజ్రెయేలుకు చేరుకున్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి