కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 దినవృత్తాంతాలు 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 దినవృత్తాంతాలు విషయసూచిక

      • యెహోయాదా జోక్యం చేసుకోవడం; యెహోయాషును రాజును చేయడం (1-11)

      • అతల్యా చంపబడడం (12-15)

      • యెహోయాదా తెచ్చిన మార్పులు (16-21)

2 దినవృత్తాంతాలు 23:1

అధస్సూచీలు

  • *

    అంటే, 100 మంది మీద అధిపతులు.

  • *

    లేదా “సంధి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 11:4

2 దినవృత్తాంతాలు 23:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 8:14

2 దినవృత్తాంతాలు 23:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 5:3
  • +2స 7:8, 12; 1రా 2:4; 9:5; కీర్త 89:20, 29

2 దినవృత్తాంతాలు 23:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 11:5-8; 1ది 9:22-25; 26:1
  • +1ది 24:3

2 దినవృత్తాంతాలు 23:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 7:1
  • +1రా 7:12

2 దినవృత్తాంతాలు 23:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 23:28, 32

2 దినవృత్తాంతాలు 23:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “అతను బయటికి వెళ్లినప్పుడు, అతను లోపలికి వచ్చినప్పుడు.”

2 దినవృత్తాంతాలు 23:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 11:9-12
  • +1ది 24:1; 26:1

2 దినవృత్తాంతాలు 23:9

అధస్సూచీలు

  • *

    లేదా “కేడెములను.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 26:26, 27; 2ది 5:1
  • +2స 8:7
  • +2రా 11:4

2 దినవృత్తాంతాలు 23:10

అధస్సూచీలు

  • *

    లేదా “విసిరే ఆయుధాలు.”

2 దినవృత్తాంతాలు 23:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 11:2
  • +ద్వితీ 17:18
  • +1స 10:1, 24

2 దినవృత్తాంతాలు 23:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 11:13-16

2 దినవృత్తాంతాలు 23:13

అధస్సూచీలు

  • *

    లేదా “సంకేతం ఇస్తున్నారు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 23:1
  • +1రా 1:39, 40

2 దినవృత్తాంతాలు 23:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 11:17, 18; 2ది 34:1, 31

2 దినవృత్తాంతాలు 23:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 10:27, 28
  • +ద్వితీ 12:3; 2ది 34:1, 4
  • +ద్వితీ 13:5; 1రా 18:40

2 దినవృత్తాంతాలు 23:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:38; సం 28:2
  • +1ది 23:6, 30, 31

2 దినవృత్తాంతాలు 23:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 9:26; 26:1, 13

2 దినవృత్తాంతాలు 23:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 11:9
  • +1రా 7:7
  • +2రా 11:19, 20

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 దిన. 23:12రా 11:4
2 దిన. 23:22ది 8:14
2 దిన. 23:32స 5:3
2 దిన. 23:32స 7:8, 12; 1రా 2:4; 9:5; కీర్త 89:20, 29
2 దిన. 23:42రా 11:5-8; 1ది 9:22-25; 26:1
2 దిన. 23:41ది 24:3
2 దిన. 23:51రా 7:1
2 దిన. 23:51రా 7:12
2 దిన. 23:61ది 23:28, 32
2 దిన. 23:82రా 11:9-12
2 దిన. 23:81ది 24:1; 26:1
2 దిన. 23:91ది 26:26, 27; 2ది 5:1
2 దిన. 23:92స 8:7
2 దిన. 23:92రా 11:4
2 దిన. 23:112రా 11:2
2 దిన. 23:11ద్వితీ 17:18
2 దిన. 23:111స 10:1, 24
2 దిన. 23:122రా 11:13-16
2 దిన. 23:132ది 23:1
2 దిన. 23:131రా 1:39, 40
2 దిన. 23:162రా 11:17, 18; 2ది 34:1, 31
2 దిన. 23:172రా 10:27, 28
2 దిన. 23:17ద్వితీ 12:3; 2ది 34:1, 4
2 దిన. 23:17ద్వితీ 13:5; 1రా 18:40
2 దిన. 23:18నిర్గ 29:38; సం 28:2
2 దిన. 23:181ది 23:6, 30, 31
2 దిన. 23:191ది 9:26; 26:1, 13
2 దిన. 23:202రా 11:9
2 దిన. 23:201రా 7:7
2 దిన. 23:202రా 11:19, 20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 దినవృత్తాంతాలు 23:1-21

దినవృత్తాంతాలు రెండో గ్రంథం

23 ఏడో సంవత్సరంలో, యెహోయాదా ధైర్యంగా ప్రవర్తించాడు. అతను శతాధిపతులతో,* అంటే యెరోహాము కుమారుడైన అజర్యాతో, యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతో, ఓబేదు కుమారుడైన అజర్యాతో, అదాయా కుమారుడైన మయశేయాతో, జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతో ఒక ఒప్పందం* చేశాడు.+ 2 అప్పుడు వాళ్లు యూదా అంతటికీ వెళ్లి యూదా నగరాలన్నిట్లో నుండి లేవీయుల్ని,+ ఇశ్రాయేలు పూర్వీకుల కుటుంబాల పెద్దల్ని సమకూర్చారు. వాళ్లు యెరూషలేముకు వచ్చినప్పుడు, 3 ఆ సమాజమంతా సత్యదేవుని మందిరంలో రాజుతో ఒక ఒప్పందం చేసింది.+ తర్వాత యెహోయాదా వాళ్లతో ఇలా అన్నాడు:

“ఇదిగో! దావీదు కుమారుల గురించి యెహోవా వాగ్దానం చేసినట్టు రాజు కుమారుడు పరిపాలిస్తాడు.+ 4 మీరు ఏమి చేయాలంటే: విశ్రాంతి రోజున పని చేయడానికి వచ్చే యాజకుల్లో, లేవీయుల్లో మూడోవంతు మంది ద్వారపాలకులుగా+ ఉండాలి;+ 5 ఇంకో మూడోవంతు మంది రాజభవనం+ దగ్గర, మరో మూడోవంతు మంది పునాది ద్వారం దగ్గర కాపలా కాయాలి; ప్రజలందరూ యెహోవా మందిర ప్రాంగణాల్లో+ ఉంటారు. 6 పరిచారం చేస్తున్న యాజకుల్ని, లేవీయుల్ని+ తప్ప యెహోవా మందిరంలోకి ఎవ్వర్నీ రానివ్వొద్దు. వాళ్లు ప్రతిష్ఠించబడినవాళ్లు కాబట్టి లోపలికి రావచ్చు; ప్రజలందరూ యెహోవా పట్ల తమ బాధ్యతను నెరవేర్చాలి. 7 లేవీయుల్లో ప్రతీ ఒక్కరు ఆయుధాలు చేతపట్టుకుని రాజుకు అన్నివైపులా కాపలా కాయాలి. ఎవరైనా మందిరంలోకి ప్రవేశిస్తే వాళ్లు చంపబడతారు. రాజు ఎక్కడికి వెళ్లినా* మీరు అతని వెంట ఉండాలి.”

8 లేవీయులు, యూదావాళ్లందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినట్టే చేశారు. కాబట్టి వాళ్లలో ప్రతీ ఒక్కరు విశ్రాంతి రోజున పని చేస్తున్న తమ మనుషుల్ని, అలాగే విశ్రాంతి రోజున పనికి వెళ్లాల్సిన అవసరం లేని తమ మనుషుల్ని వెంటబెట్టుకొని వెళ్లారు.+ ఎందుకంటే యాజకుడైన యెహోయాదా ఆయా విభాగాలవాళ్లకు+ తమ బాధ్యతల నుండి సెలవు ఇవ్వలేదు. 9 తర్వాత యాజకుడైన యెహోయాదా, సత్యదేవుని మందిరంలో+ ఉన్న దావీదు రాజు ఈటెల్ని, చిన్న డాళ్లను,* గుండ్రటి డాళ్లను+ శతాధిపతులకు+ ఇచ్చాడు. 10 తర్వాత ఆయుధాలు* చేతపట్టుకొని ఉన్న వాళ్లందర్నీ అతను మందిరం కుడివైపు నుండి ఎడమవైపు వరకు, బలిపీఠం పక్కన, మందిరం పక్కన, రాజు చుట్టూ నిలబెట్టించాడు. 11 అప్పుడు వాళ్లు రాజు కుమారుణ్ణి+ బయటికి తీసుకొచ్చి అతని తలమీద కిరీటాన్ని, దేవుని ధర్మశాస్త్ర గ్రంథపు చుట్టను+ పెట్టి అతన్ని రాజును చేశారు. యెహోయాదా, అతని కుమారులు అతన్ని అభిషేకించారు. తర్వాత వాళ్లు, “రాజు దీర్ఘకాలం జీవించాలి!” అని అరిచారు.+

12 ప్రజలు పరుగెత్తుతున్న శబ్దం, రాజును స్తుతిస్తున్న శబ్దం విన్నప్పుడు అతల్యా వెంటనే యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.+ 13 అక్కడ ప్రవేశ ద్వారం దగ్గర రాజు స్తంభం పక్కన నిలబడి ఉండడం ఆమె చూసింది. అధిపతులు,+ బాకాలు ఊదేవాళ్లు రాజు పక్కన ఉన్నారు, దేశంలోని ప్రజలందరూ సంతోషిస్తూ+ బాకాలు ఊదుతున్నారు. సంగీత వాద్యాలు పట్టుకొని ఉన్న గాయకులు స్తుతి పాటల్ని నిర్దేశిస్తున్నారు.* అప్పుడు అతల్యా తన బట్టలు చింపుకొని, “కుట్ర! కుట్ర!” అని అరిచింది. 14 కానీ యాజకుడైన యెహోయాదా, సైన్యం మీద నియమించబడిన శతాధిపతుల్ని బయటికి రప్పించి ఇలా ఆజ్ఞాపించాడు: “పంక్తుల మధ్య నుండి ఆమెను బయటికి తీసుకెళ్లండి, ఎవరైనా ఆమె వెనక వస్తే వాళ్లను కత్తితో చంపండి!” అయితే, “యెహోవా మందిరంలో ఆమెను చంపొద్దు” అని అతను చెప్పాడు. 15 దాంతో వాళ్లు ఆమెను పట్టుకున్నారు; రాజభవనానికి చెందిన గుర్రపు ద్వార ప్రవేశం దగ్గరికి తీసుకురాగానే ఆమెను చంపేశారు.

16 అప్పుడు యెహోయాదా, యెహోవా ప్రజలుగా కొనసాగుతామని తనకూ, ప్రజలందరికీ, రాజుకూ మధ్య ఒప్పందం చేశాడు.+ 17 తర్వాత ప్రజలందరూ బయలు గుడికి వచ్చి దాన్ని పడగొట్టారు,+ దాని బలిపీఠాల్ని, దాని విగ్రహాల్ని ముక్కలుముక్కలు చేశారు;+ బయలు పూజారైన మత్తానును బలిపీఠాల ఎదురుగా చంపారు.+ 18 ఆ తర్వాత యెహోయాదా యెహోవా మందిరాన్ని చూసుకునే బాధ్యతను, యెహోవా మందిర పర్యవేక్షణ కోసం దావీదు విభాగాలుగా నియమించిన యాజకుల, లేవీయుల చేతికి అప్పగించాడు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్టు+ యెహోవాకు అర్పించాల్సిన దహనబలుల్ని దావీదు నిర్దేశం ప్రకారం ఉల్లాసంగా పాటలు పాడుతూ అర్పించాలని అలా నియమించాడు.+ 19 అంతేకాదు, ఏవిధంగానైనా అపవిత్రులైనవాళ్లు యెహోవా మందిరంలోకి ప్రవేశించకుండా దాని ద్వారాల దగ్గర ద్వారపాలకుల్ని+ కూడా ఉంచాడు. 20 తర్వాత అతను శతాధిపతుల్ని,+ ప్రముఖుల్ని, ప్రజల పాలకుల్ని, దేశ ప్రజలందర్నీ వెంటబెట్టుకొని యెహోవా మందిరం నుండి రాజును తీసుకెళ్లాడు. వాళ్లు పైద్వారం గుండా రాజభవనానికి వచ్చి, రాజును రాజ్య సింహాసనం+ మీద కూర్చోబెట్టారు.+ 21 అతల్యా కత్తితో చంపబడింది కాబట్టి దేశ ప్రజలందరూ సంతోషించారు, నగరం ప్రశాంతంగా ఉంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి