కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • దానియేలు 10
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

దానియేలు విషయసూచిక

      • దేవుని దూత దానియేలు దగ్గరికి రావడం (1-21)

        • మిఖాయేలు దేవదూతకు సహాయం చేయడం (13)

దానియేలు 10:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎజ్రా 1:1, 2; యెష 45:1; దాని 1:21; 6:28
  • +దాని 1:7; 4:8

దానియేలు 10:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “హిద్దెకెలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:14

దానియేలు 10:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 19:14

దానియేలు 10:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 1:16
  • +యెహె 1:5, 7

దానియేలు 10:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 6:17; అపొ 9:7

దానియేలు 10:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 7:28; 8:27

దానియేలు 10:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 8:18

దానియేలు 10:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:9; ప్రక 1:17

దానియేలు 10:11

అధస్సూచీలు

  • *

    లేదా “ఎంతో ప్రియమైనవాడివి; చాలా విలువైనవాడివి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 9:23; 10:19

దానియేలు 10:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రక 1:17
  • +దాని 9:23

దానియేలు 10:13

అధస్సూచీలు

  • *

    లేదా “మొదటి శ్రేణి అధిపతైన.”

  • *

    “దేవుని వంటి వాడు ఎవడు?” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎఫె 6:12
  • +దాని 10:21; 12:1; యూదా 9; ప్రక 12:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2012, పేజీ 28

దానియేలు 10:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 2:28
  • +దాని 8:17, 26; 12:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    5/2020, పేజీ 3

దానియేలు 10:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 6:7; యిర్మీ 1:9
  • +దాని 10:8

దానియేలు 10:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:22
  • +యెష 6:5

దానియేలు 10:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 10:10

దానియేలు 10:19

అధస్సూచీలు

  • *

    లేదా “ఎంతో ప్రియమైనవాడా; చాలా విలువైనవాడా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 9:22, 23; 10:11
  • +ప్రక 1:17
  • +న్యా 6:23

దానియేలు 10:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 10:13

దానియేలు 10:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +దాని 12:1
  • +దాని 10:13; యూదా 9; ప్రక 12:7, 8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

దాని. 10:1ఎజ్రా 1:1, 2; యెష 45:1; దాని 1:21; 6:28
దాని. 10:1దాని 1:7; 4:8
దాని. 10:4ఆది 2:14
దాని. 10:5ప్రక 19:14
దాని. 10:6యెహె 1:16
దాని. 10:6యెహె 1:5, 7
దాని. 10:72రా 6:17; అపొ 9:7
దాని. 10:8దాని 7:28; 8:27
దాని. 10:9దాని 8:18
దాని. 10:10యిర్మీ 1:9; ప్రక 1:17
దాని. 10:11దాని 9:23; 10:19
దాని. 10:12ప్రక 1:17
దాని. 10:12దాని 9:23
దాని. 10:13ఎఫె 6:12
దాని. 10:13దాని 10:21; 12:1; యూదా 9; ప్రక 12:7, 8
దాని. 10:14దాని 2:28
దాని. 10:14దాని 8:17, 26; 12:4
దాని. 10:16యెష 6:7; యిర్మీ 1:9
దాని. 10:16దాని 10:8
దాని. 10:17న్యా 6:22
దాని. 10:17యెష 6:5
దాని. 10:18దాని 10:10
దాని. 10:19దాని 9:22, 23; 10:11
దాని. 10:19ప్రక 1:17
దాని. 10:19న్యా 6:23
దాని. 10:20దాని 10:13
దాని. 10:21దాని 12:1
దాని. 10:21దాని 10:13; యూదా 9; ప్రక 12:7, 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
దానియేలు 10:1-21

దానియేలు

10 పారసీక రాజైన కోరెషు పరిపాలనలోని+ మూడో సంవత్సరంలో, బెల్తెషాజరు+ అని పిలవబడిన దానియేలుకు ఒక సందేశం అందింది; ఆ సందేశం సత్యమైనది, అది ఒక గొప్ప పోరాటానికి సంబంధించినది. అతను ఆ సందేశాన్ని బాగా అర్థం చేసుకున్నాడు, తాను చూసినదాన్ని గ్రహించాడు.

2 ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలపాటు దుఃఖిస్తూ ఉన్నాను. 3 ఆ మూడు వారాలపాటు నేను ఎలాంటి మంచి ఆహారం తినలేదు; మాంసం గానీ, ద్రాక్షారసం గానీ నా నోట్లోకి వెళ్లలేదు; నా ఒంటికి నూనె రాసుకోలేదు. 4 మొదటి నెల, 24వ రోజున నేను టైగ్రిస్‌* మహా నది+ ఒడ్డున ఉండగా, 5 తలెత్తి చూసినప్పుడు నార వస్త్రాలు వేసుకున్న ఒక మనిషి కనిపించాడు,+ అతని నడుముకు ఉపాజు మేలిమి బంగారంతో చేసిన దట్టీ ఉంది. 6 అతని శరీరం లేతపచ్చ రాయిలా+ మెరుస్తూ ఉంది, అతని రూపం మెరుపులా ఉంది, అతని కళ్లు మండుతున్న దీపాల్లా ఉన్నాయి; అతని చేతులు, పాదాలు మెరుగుపెట్టిన రాగిలా+ ఉన్నాయి, అతని మాటల శబ్దం చాలామంది ప్రజల శబ్దంలా ఉంది. 7 దానియేలు అనే నేను ఒక్కడినే ఆ దర్శనం చూశాను; నాతో ఉన్న మనుషులు దర్శనాన్ని చూడలేదు.+ వాళ్లు చాలా భయపడిపోయి, పరుగెత్తుకొని వెళ్లి దాక్కున్నారు.

8 అప్పుడు నేను ఒక్కడినే మిగిలిపోయాను; నేను ఈ గొప్ప దర్శనం చూసినప్పుడు నాలో శక్తి ఏమాత్రం మిగల్లేదు, నా ముఖం బాగా పాలిపోయింది; నాకున్న బలమంతా పోయింది.+ 9 అప్పుడు అతను మాట్లాడుతున్న శబ్దం నాకు వినబడింది; కానీ అతను మాట్లాడుతుండగా, నేను నేలమీద ముఖం పెట్టి గాఢనిద్రలోకి వెళ్లిపోయాను.+ 10 అప్పుడు ఒక చెయ్యి నన్ను ముట్టుకుని+ కదపడంతో నేను నా చేతుల మీద, మోకాళ్ల మీద నిలబడ్డాను. 11 అతను నాతో ఇలా అన్నాడు:

“దానియేలూ, నువ్వు ఎంతో అమూల్యమైనవాడివి,*+ నేను నీకు చెప్పబోయే మాటల్ని శ్రద్ధగా విను. నువ్వు లేచి నిలబడు, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు.”

అతను ఆ మాట అన్నప్పుడు నేను లేచి వణుకుతూ నిలబడ్డాను.

12 అతను నాతో ఇలా అన్నాడు: “దానియేలూ, భయపడకు.+ అవగాహన పొందాలని, నీ దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవాలని నువ్వు నిశ్చయించుకున్న మొదటి రోజు నుండే ఆయన నీ ప్రార్థనలు వింటున్నాడు, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను.+ 13 అయితే పారసీక రాజ్యాధిపతి+ 21 రోజులపాటు నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధాన అధిపతుల్లో ఒకడైన* మిఖాయేలు*+ నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో నేను అక్కడే పారసీక రాజుల పక్కన ఉన్నాను. 14 చివరి రోజుల్లో నీ ప్రజలకు ఏం సంభవిస్తుందో+ నువ్వు గ్రహించేలా సహాయం చేయడానికి నేను వచ్చాను, ఎందుకంటే అది భవిష్యత్తులో జరగబోయేదానికి సంబంధించిన దర్శనం.”+

15 అతను నాకు ఈ మాటలు చెప్పినప్పుడు, నేను నా ముఖాన్ని నేలవైపు వంచాను, నేను ఏమీ మాట్లాడలేకపోయాను. 16 అప్పుడు మనిషిలా ఉన్న అతను నా పెదాల్ని ముట్టుకున్నాడు;+ అప్పుడు నేను నోరు తెరిచి నా ముందు నిలబడివున్న అతనితో ఇలా అన్నాను: “నా ప్రభూ, ఆ దర్శనాన్ని బట్టి నేను వణుకుతున్నాను, నాలో శక్తి లేదు.+ 17 మరి నీ సేవకుడినైన నేను నా ప్రభువుతో ఎలా మాట్లాడగలను?+ ఇప్పుడు నాలో శక్తి లేదు, నాకు ఊపిరాడడం లేదు.”+

18 మనిషిలా ఉన్న అతను మళ్లీ నన్ను ముట్టుకుని, నన్ను బలపర్చాడు.+ 19 అప్పుడు అతను ఇలా అన్నాడు: “ఎంతో అమూల్యమైనవాడా,*+ భయపడకు,+ కంగారుపడకు.+ నిబ్బరంగా ఉండు, అవును నిబ్బరంగా ఉండు.” అతను మాట్లాడుతుండగా నేను బలం పొంది అతనితో ఇలా అన్నాను: “నువ్వు నన్ను బలపర్చావు, ఇప్పుడు నా ప్రభువు నాతో మాట్లాడవచ్చు.”

20 అతను ఇలా అన్నాడు: “నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇప్పుడు నేను పారసీక అధిపతితో పోరాడడానికి తిరిగెళ్తాను.+ నేను వెళ్లిపోయినప్పుడు గ్రీసు అధిపతి వస్తాడు. 21 అయితే సత్య గ్రంథంలో రాయబడివున్న విషయాల్ని నీకు చెప్తాను. నీ అధిపతైన+ మిఖాయేలు తప్ప ఈ విషయంలో నాకు బలంగా మద్దతిచ్చేవాళ్లు ఇంకెవ్వరూ లేరు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి