కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 రాజులు 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 రాజులు విషయసూచిక

      • యరొబాముకు వ్యతిరేకంగా అహీయా ప్రవచనం (1-20)

      • రెహబాము యూదాను పరిపాలించడం (21-31)

        • షీషకు దాడి (25, 26)

1 రాజులు 14:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:30, 31

1 రాజులు 14:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:1; 1స 4:3

1 రాజులు 14:5

అధస్సూచీలు

  • *

    లేదా “నువ్వు ఆమెకు ఫలానా విధంగా చెప్పాలి.”

1 రాజులు 14:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:30, 31; 12:20

1 రాజులు 14:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 12:16
  • +1రా 15:5; అపొ 13:22

1 రాజులు 14:9

అధస్సూచీలు

  • *

    లేదా “లోహపు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 27:15; 2ది 11:15
  • +నెహె 9:26

1 రాజులు 14:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 15:25-29

1 రాజులు 14:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీ 244

    కావలికోట,

    1/1/2011, పేజీ 21

    7/1/2005, పేజీ 31

    4/1/1995, పేజీ 12

1 రాజులు 14:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 15:25-29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం I, పేజీలు 133-134

1 రాజులు 14:15

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    అంటే, యూఫ్రటీసు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 12:3
  • +ద్వితీ 8:7-9; 29:28; యెహో 23:15; 2రా 17:6
  • +2రా 15:29; 18:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    యెషయా ప్రవచనం I, పేజీలు 133-134

1 రాజులు 14:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 12:28-30; 13:33, 34

1 రాజులు 14:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 12:15; 13:3

1 రాజులు 14:20

అధస్సూచీలు

  • *

    అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 13:20
  • +1రా 15:25

1 రాజులు 14:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:24; ద్వితీ 12:5, 6; 1రా 8:16, 17
  • +కీర్త 78:68; 132:13
  • +1రా 11:1; 2ది 12:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2011, పేజీ 10

1 రాజులు 14:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:7
  • +యెష 65:2

1 రాజులు 14:23

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 65:7
  • +ద్వితీ 12:2, 3; యెష 57:5; యిర్మీ 2:20; హోషే 4:13
  • +లేవీ 26:1

1 రాజులు 14:24

అధస్సూచీలు

  • *

    లేదా “మగవేశ్యలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 23:17, 18; 1రా 15:11, 12; 22:46; 2రా 23:7; హోషే 4:14

1 రాజులు 14:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 11:40
  • +2ది 12:2-4

1 రాజులు 14:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 7:51; 15:18; 2రా 18:14, 15; 24:12, 13
  • +1రా 10:16, 17; 2ది 12:9-11

1 రాజులు 14:27

అధస్సూచీలు

  • *

    అక్ష., “పరుగెత్తేవాళ్ల.”

1 రాజులు 14:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 27:24; 2ది 12:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2009, పేజీ 32

1 రాజులు 14:31

అధస్సూచీలు

  • *

    అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”

  • *

    అబీయా అని కూడా పిలవబడ్డాడు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 12:13
  • +మత్త 1:7

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 రాజు. 14:21రా 11:30, 31
1 రాజు. 14:4యెహో 18:1; 1స 4:3
1 రాజు. 14:71రా 11:30, 31; 12:20
1 రాజు. 14:81రా 12:16
1 రాజు. 14:81రా 15:5; అపొ 13:22
1 రాజు. 14:9ద్వితీ 27:15; 2ది 11:15
1 రాజు. 14:9నెహె 9:26
1 రాజు. 14:101రా 15:25-29
1 రాజు. 14:141రా 15:25-29
1 రాజు. 14:15ద్వితీ 12:3
1 రాజు. 14:15ద్వితీ 8:7-9; 29:28; యెహో 23:15; 2రా 17:6
1 రాజు. 14:152రా 15:29; 18:11
1 రాజు. 14:161రా 12:28-30; 13:33, 34
1 రాజు. 14:192ది 12:15; 13:3
1 రాజు. 14:202ది 13:20
1 రాజు. 14:201రా 15:25
1 రాజు. 14:21నిర్గ 20:24; ద్వితీ 12:5, 6; 1రా 8:16, 17
1 రాజు. 14:21కీర్త 78:68; 132:13
1 రాజు. 14:211రా 11:1; 2ది 12:13
1 రాజు. 14:221రా 11:7
1 రాజు. 14:22యెష 65:2
1 రాజు. 14:23యెష 65:7
1 రాజు. 14:23ద్వితీ 12:2, 3; యెష 57:5; యిర్మీ 2:20; హోషే 4:13
1 రాజు. 14:23లేవీ 26:1
1 రాజు. 14:24ద్వితీ 23:17, 18; 1రా 15:11, 12; 22:46; 2రా 23:7; హోషే 4:14
1 రాజు. 14:251రా 11:40
1 రాజు. 14:252ది 12:2-4
1 రాజు. 14:261రా 7:51; 15:18; 2రా 18:14, 15; 24:12, 13
1 రాజు. 14:261రా 10:16, 17; 2ది 12:9-11
1 రాజు. 14:291ది 27:24; 2ది 12:15
1 రాజు. 14:312ది 12:13
1 రాజు. 14:31మత్త 1:7
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 రాజులు 14:1-31

రాజులు మొదటి గ్రంథం

14 ఆ సమయంలో యరొబాము కుమారుడైన అబీయాకు జబ్బు చేసింది. 2 కాబట్టి యరొబాము తన భార్యకు ఇలా చెప్పాడు: “దయచేసి లేచి, నువ్వు యరొబాము భార్యవని ఎవరూ గుర్తుపట్టకుండా మారువేషం వేసుకుని షిలోహుకు వెళ్లు. ఇదిగో! అక్కడ అహీయా ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రజల మీద నేను రాజును అవుతానని నాతో చెప్పింది అతనే.+ 3 పది రొట్టెలు, అప్పాలు, ఒక జాడీ తేనె తీసుకుని అతని దగ్గరికి వెళ్లు. మన బాబుకి ఏమి జరుగుతుందో అతను నీకు చెప్తాడు.”

4 యరొబాము భార్య తన భర్త చెప్పినట్టే చేసింది. ఆమె లేచి షిలోహుకు+ వెళ్లి అహీయా ఇంటికి వచ్చింది. అహీయా కళ్లు తిన్నగా చూస్తున్నాయి, కానీ వయసు మీద పడడం వల్ల అతనికి ఏమీ కనిపించడం లేదు.

5 అయితే యెహోవా అహీయాతో ఇలా అన్నాడు: “ఇదిగో యరొబాము కుమారుడికి జబ్బు చేసింది, కాబట్టి అతని భార్య తన కుమారుడి గురించి నీ దగ్గర విచారణ చేయడానికి వస్తోంది. నువ్వు ఆమెకు ఏం చెప్పాలో నీకు చెప్తాను.* ఆమె మారువేషంలో నీ దగ్గరికి వస్తుంది.”

6 ఆమె గుమ్మం లోపలికి వస్తున్నప్పుడు, ఆమె అడుగుల చప్పుడు వినగానే అహీయా ఇలా అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా. నువ్వు ఎందుకు మారువేషం వేసుకున్నావు? నీకు కఠినమైన సందేశం చెప్పమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. 7 వెళ్లి యరొబాముతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నిన్ను నీ ప్రజల్లో నుండి ఎంచుకుని, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా చేశాను.+ 8 దావీదు ఇంటివాళ్ల నుండి రాజ్యాన్ని తీసేసి నీకు ఇచ్చాను.+ కానీ నువ్వు నా సేవకుడైన దావీదులాంటి వాడివి కాలేదు. అతను నా దృష్టికి ఏది మంచిదో అదే చేస్తూ, నా ఆజ్ఞల్ని పాటించి, తన నిండు హృదయంతో నన్ను అనుసరించాడు.+ 9 కానీ నువ్వు నీకు ముందున్న వాళ్లందరికన్నా ఘోరమైన పనులు చేశావు; నువ్వు వేరే దేవుణ్ణి, పోత* విగ్రహాల్ని చేయించుకుని నాకు కోపం తెప్పించావు,+ నన్ను విడిచిపెట్టేశావు.+ 10 అందుకే నేను యరొబాము ఇంటి మీదికి విపత్తు తీసుకొస్తున్నాను. ఇశ్రాయేలులో నిస్సహాయులు, బలహీనులతో సహా యరొబాము ఇంట్లోని ప్రతీ మగవాణ్ణి నేను నిర్మూలిస్తాను; ఒకడు పేడ పూర్తిగా పోయేంతవరకు ఊడ్చినట్టు నేను యరొబాము ఇంటిని పూర్తిగా ఊడ్చేస్తాను!+ 11 యరొబాముకు చెందినవాళ్లు ఎవరైనా నగరంలో చనిపోతే కుక్కలు వాళ్లను తింటాయి; పొలంలో చనిపోతే ఆకాశపక్షులు వాళ్లను తింటాయి, యెహోవాయే ఈ మాట చెప్పాడు.” ’

12 “ఇప్పుడు లేచి, నీ ఇంటికి వెళ్లు. నువ్వు నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ బాబు చనిపోతాడు. 13 ఇశ్రాయేలు ప్రజలందరూ అతని గురించి దుఃఖిస్తారు, అతన్ని పాతిపెడతారు. యరొబాము కుటుంబంలో ఆ అబ్బాయి ఒక్కడే సమాధి చేయబడతాడు; ఎందుకంటే యరొబాము ఇంటివాళ్లలో అతని ఒక్కడిలోనే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏదో మంచిని చూశాడు. 14 యెహోవా ఇశ్రాయేలు మీద ఒక రాజును నియమిస్తాడు, అతను సమయం వచ్చినప్పుడు యరొబాము ఇంటిని నాశనం చేస్తాడు.+ కావాలనుకుంటే దేవుడు ఇప్పుడే ఆ పని చేయగలడు. 15 ఇశ్రాయేలు ప్రజలు పూజా కర్రల్ని*+ చేసుకుని యెహోవాకు కోపం తెప్పించారు కాబట్టి యెహోవా ఇశ్రాయేలును కొడతాడు, అప్పుడు అది నీళ్ల మీద అటూఇటూ కదలాడే రెల్లులా అవుతుంది. ఆయన వాళ్ల పూర్వీకులకు ఇచ్చిన ఈ మంచి దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని పూర్తిగా పెరికివేసి,+ వాళ్లను నది* అవతలి వైపుకు చెదరగొడతాడు.+ 16 యరొబాము చేసిన పాపాలవల్ల, అతను ఇశ్రాయేలీయులతో చేయించిన పాపంవల్ల+ ఆయన ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టేస్తాడు.”

17 అప్పుడు యరొబాము భార్య లేచి తన దారిన వెళ్లింది, ఆమె తిర్సాకు వచ్చింది. ఆమె ఇంటి గడప దగ్గరికి వస్తుండగా బాబు చనిపోయాడు. 18 యెహోవా తన సేవకుడైన అహీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట ప్రకారం వాళ్లు ఆ బాబును పాతిపెట్టారు, ఇశ్రాయేలు ప్రజలందరూ అతని గురించి దుఃఖించారు.

19 యరొబాము మిగతా చరిత్ర, అంటే అతను ఎలా యుద్ధం చేశాడో,+ ఎలా పరిపాలించాడో ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 20 యరొబాము పరిపాలించిన కాలం 22 సంవత్సరాలు, తర్వాత అతను చనిపోయాడు.*+ అతని కుమారుడైన నాదాబు అతని స్థానంలో రాజయ్యాడు.+

21 యూదాలో, సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నాడు. రాజైనప్పుడు రెహబాముకు 41 ఏళ్లు. యెహోవా ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో తన పేరును ఉంచడానికి+ ఎంచుకున్న యెరూషలేము+ నగరంలో అతను 17 సంవత్సరాలు పరిపాలించాడు. రెహబాము తల్లి అమ్మోనీయురాలైన నయమా.+ 22 యూదావాళ్లు యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నారు.+ తాము చేసిన పాపాలవల్ల వాళ్లు తమ పూర్వీకులకన్నా ఎక్కువగా ఆయనకు కోపం తెప్పించారు.+ 23 వాళ్లు కూడా ఎత్తైన ప్రతీ కొండమీద,+ పచ్చని ప్రతీ చెట్టు కింద+ ఉన్నత స్థలాలు, పూజా స్తంభాలు, పూజా కర్రలు*+ చేసుకుంటూ ఉన్నారు. 24 ఆలయ వేశ్యలు* కూడా దేశంలో ఉండేవాళ్లు.+ ఇశ్రాయేలీయులు తమ ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన దేశాలు చేసిన అసహ్యకరమైన పనులన్నిటిని చేశారు.

25 రెహబాము రాజు పరిపాలన ఐదో సంవత్సరంలో, ఐగుప్తు రాజైన షీషకు+ యెరూషలేము మీదికి వచ్చాడు.+ 26 అతను యెహోవా మందిరంలోని ఖజానాల్ని, రాజభవనంలోని ఖజానాల్ని కొల్లగొట్టాడు.+ సొలొమోను చేయించిన బంగారు డాళ్లన్నిటితో పాటు ప్రతీదాన్ని తీసుకెళ్లిపోయాడు.+ 27 కాబట్టి రెహబాము రాజు వాటి స్థానంలో రాగి డాళ్లను చేయించి, రాజభవన ద్వారాన్ని కాపలా కాస్తున్న కాపలాదారుల* అధిపతుల చేతికి వాటిని అప్పగించాడు. 28 రాజు యెహోవా మందిరానికి వచ్చినప్పుడల్లా కాపలాదారులు వాటిని మోసుకుంటూ వచ్చేవాళ్లు; తర్వాత వాటిని కాపలాదారుల గదిలో తిరిగి పెట్టేవాళ్లు.

29 రెహబాము మిగతా చరిత్ర, అంటే అతను చేసినవన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి.+ 30 రెహబాముకు, యరొబాముకు మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి. 31 తర్వాత రెహబాము చనిపోయాడు,* అతన్ని దావీదు నగరంలో అతని పూర్వీకులతో పాటు పాతిపెట్టారు. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు.+ అతని స్థానంలో అతని కుమారుడు అబీయాము*+ రాజయ్యాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి