సామెతలు
2 లోతైన అవగాహనగల సేవకుడు అవమానకరంగా ప్రవర్తించే కుమారుడి మీద పరిపాలిస్తాడు,
సహోదరుల్లో ఒకడిలా అతను వారసత్వ ఆస్తిని పంచుకుంటాడు.
5 పేదవాళ్లను అవమానించేవాడు వాళ్ల సృష్టికర్తను అవమానిస్తున్నాడు,+
ఎదుటివాడి కష్టాన్ని చూసి సంతోషించేవాడు తప్పకుండా శిక్షించబడతాడు.+
7 తెలివితక్కువవాడు నిజాయితీగా* మాట్లాడితే వింతగా ఉంటుంది.+
అలాంటిది పరిపాలకుడు* అబద్ధాలు మాట్లాడితే ఇంకెంత విడ్డూరంగా ఉంటుంది!+
8 బహుమతి దాని యజమానికి అమూల్యమైన* రాయి లాంటిది;+
అతను ఎక్కడికి వెళ్లినా అది అతనికి విజయం చేకూరుస్తుంది.+
9 దోషాన్ని క్షమించేవాడు* ప్రేమను వెతుకుతున్నాడు,+
జరిగినదాన్ని మళ్లీమళ్లీ ఎత్తేవాడు ప్రాణ స్నేహితుల్ని విడదీస్తాడు.+
10 మూర్ఖుణ్ణి వంద దెబ్బలు కొట్టినా ప్రయోజనం ఉండదు,+
అవగాహన ఉన్నవాణ్ణి ఒక్కసారి గద్దించినా ఎంతో ప్రయోజనం ఉంటుంది.+
11 చెడ్డవాడు తిరుగుబాటునే కోరుకుంటాడు,
అతన్ని శిక్షించడానికి క్రూరదూత పంపించబడతాడు.+
12 తన తెలివితక్కువతనాన్ని నమ్ముకునే మూర్ఖుణ్ణి ఎదుర్కోవడం కన్నా
పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కోవడం మంచిది.+
13 మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి ఇంటినుండి కీడు తొలగిపోదు.+
14 గొడవ మొదలైతే ప్రవాహ* ద్వారాన్ని తెరిచినట్టే;*
గొడవ మొదలవ్వకముందే అక్కడి నుండి వెళ్లిపో.+
15 దుష్టుణ్ణి నిర్దోషి అని తీర్పుతీర్చేవాడు, నీతిమంతుణ్ణి దోషి అని తీర్పుతీర్చేవాడు+
ఇద్దరూ యెహోవాకు అసహ్యం.
18 వివేకం లేనివాడు ఇతరుల అప్పుకు హామీగా* ఉంటానని
తన పొరుగువాళ్ల ముందు చేతులు కలిపి ఒప్పందం చేసుకుంటాడు.+
19 గొడవను ప్రేమించేవాడు అపరాధాన్ని ప్రేమిస్తున్నాడు.+
తన గుమ్మాన్ని ఎత్తుగా చేసేవాడు నాశనాన్ని ఆహ్వానిస్తున్నాడు.+
21 మూర్ఖుణ్ణి కన్నవాడికి దుఃఖం కలుగుతుంది;
వివేకం లేనివాడి తండ్రికి సంతోషం ఉండదు.+
25 మూర్ఖుడు తన తండ్రిని దుఃఖపెడతాడు,
తనను కన్న తల్లికి వేదన కలిగిస్తాడు.+
26 నీతిమంతులకు శిక్ష* విధించడం మంచిదికాదు,
గౌరవనీయుల్ని కొట్టడం సరికాదు.
28 మౌనంగా ఉంటే తెలివితక్కువవాడు కూడా తెలివిగలవాడిగా ఎంచబడతాడు,
తన పెదాలు మూసుకునేవాడు వివేచన గలవాడిగా ఎంచబడతాడు.