కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • న్యాయాధిపతులు 16
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

న్యాయాధిపతులు విషయసూచిక

      • గాజాలో సమ్సోను (1-3)

      • సమ్సోను, దెలీలా (4-22)

      • సమ్సోను ప్రతీకారం, మరణం (23-31)

న్యాయాధిపతులు 16:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/15/2005, పేజీ 27

న్యాయాధిపతులు 16:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2004, పేజీలు 15-16

న్యాయాధిపతులు 16:4

అధస్సూచీలు

  • *

    లేదా “వాగు దగ్గర.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:18

న్యాయాధిపతులు 16:5

అధస్సూచీలు

  • *

    లేదా “ఒప్పించి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 14:15

న్యాయాధిపతులు 16:7

అధస్సూచీలు

  • *

    లేదా “స్నాయువులతో.”

న్యాయాధిపతులు 16:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 15:14

న్యాయాధిపతులు 16:10

అధస్సూచీలు

  • *

    లేదా “చిన్నచూపు చూసి.”

న్యాయాధిపతులు 16:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:9

న్యాయాధిపతులు 16:13

అధస్సూచీలు

  • *

    లేదా “మగ్గం నిలువు పోగులతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:7, 11

న్యాయాధిపతులు 16:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 14:16
  • +న్యా 16:7, 11, 13

న్యాయాధిపతులు 16:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 14:17

న్యాయాధిపతులు 16:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా తల్లి గర్భంలో ఉన్నప్పటి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 6:5; న్యా 13:5, 7

న్యాయాధిపతులు 16:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:5

న్యాయాధిపతులు 16:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:9, 12, 14

న్యాయాధిపతులు 16:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 13:5

న్యాయాధిపతులు 16:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 5:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2003, పేజీ 25

న్యాయాధిపతులు 16:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 15:4, 5
  • +న్యా 15:7, 8, 15, 16

న్యాయాధిపతులు 16:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:32
  • +న్యా 14:5, 6, 19; 15:14
  • +న్యా 16:21

న్యాయాధిపతులు 16:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 16:27
  • +న్యా 14:19; 15:7, 8, 15, 16

న్యాయాధిపతులు 16:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 13:2
  • +న్యా 13:8
  • +న్యా 2:16; 15:20

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

న్యాయా. 16:4న్యా 16:18
న్యాయా. 16:5న్యా 14:15
న్యాయా. 16:9న్యా 15:14
న్యాయా. 16:12న్యా 16:9
న్యాయా. 16:13న్యా 16:7, 11
న్యాయా. 16:15న్యా 14:16
న్యాయా. 16:15న్యా 16:7, 11, 13
న్యాయా. 16:16న్యా 14:17
న్యాయా. 16:17సం 6:5; న్యా 13:5, 7
న్యాయా. 16:18న్యా 16:5
న్యాయా. 16:20న్యా 16:9, 12, 14
న్యాయా. 16:22న్యా 13:5
న్యాయా. 16:231స 5:4
న్యాయా. 16:24న్యా 15:4, 5
న్యాయా. 16:24న్యా 15:7, 8, 15, 16
న్యాయా. 16:28హెబ్రీ 11:32
న్యాయా. 16:28న్యా 14:5, 6, 19; 15:14
న్యాయా. 16:28న్యా 16:21
న్యాయా. 16:30న్యా 16:27
న్యాయా. 16:30న్యా 14:19; 15:7, 8, 15, 16
న్యాయా. 16:31న్యా 13:2
న్యాయా. 16:31న్యా 13:8
న్యాయా. 16:31న్యా 2:16; 15:20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
న్యాయాధిపతులు 16:1-31

న్యాయాధిపతులు

16 ఒకసారి సమ్సోను గాజాకు వెళ్లి, అక్కడ ఒక వేశ్యను చూసి ఆమె దగ్గరికి వెళ్లాడు. 2 “సమ్సోను ఇక్కడికి వచ్చాడు” అని గాజా ప్రజలకు తెలిసింది. కాబట్టి వాళ్లు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, నగర ద్వారం దగ్గర రాత్రంతా అతని కోసం కాపు కాశారు. వాళ్లు, “తెల్లవారాక అతన్ని చంపుదాం” అనుకుని రాత్రంతా అక్కడే చప్పుడు చేయకుండా ఉన్నారు.

3 అయితే సమ్సోను మధ్యరాత్రి వరకు అక్కడే పడుకున్నాడు. తర్వాత అతను లేచి నగరం తలుపుల్ని, వాటి రెండు ద్వారబంధాల్ని పట్టుకుని అడ్డ గడియతోపాటు వాటిని ఊడబీకాడు. అతను వాటిని తన భుజాల మీద వేసుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం మీదికి మోసుకెళ్లాడు.

4 ఆ తర్వాత, అతను శోరేకు లోయలో* ఒక స్త్రీని ప్రేమించాడు, ఆమె పేరు దెలీలా.+ 5 కాబట్టి ఫిలిష్తీయుల పాలకులు ఆమె దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “అతన్ని మాయ చేసి,*+ అతనికి అంత గొప్ప శక్తి ఎక్కడి నుండి వస్తుందో, అతన్ని మేము ఎలా ఓడించి బంధించాలో, ఎలా లొంగదీసుకోవాలో కనుక్కో. అలా చేయడానికి నీకు ఒక్కొక్కరం 1,100 వెండి రూకలు ఇస్తాం.”

6 తర్వాత దెలీలా సమ్సోనుతో, “నీకు అంత గొప్ప శక్తి ఎక్కడి నుండి వస్తుంది? నిన్ను వేటితో కట్టి లొంగదీసుకోవచ్చు? దయచేసి నాకు చెప్పు” అంది. 7 దానికి సమ్సోను, “ఎండని ఏడు పచ్చి వింటి తీగలతో* నన్ను బంధిస్తే, నేను బలహీనమైపోయి మామూలు మనిషిలా అవుతాను” అని చెప్పాడు. 8 కాబట్టి ఫిలిష్తీయుల పాలకులు ఎండని ఏడు పచ్చి వింటి తీగల్ని ఆమెకు తెచ్చి ఇచ్చారు, ఆమె వాటితో సమ్సోనును బంధించింది. 9 అప్పుడు వాళ్లు లోపలి గదిలో కొంతమందిని మాటు వేయించారు. ఆమె, “సమ్సోనూ! ఫిలిష్తీయులు వచ్చేశారు” అని అరిచింది. దాంతో సమ్సోను, మంట తగలగానే నూలుపోగు తెగిపోయినంత సులభంగా ఆ వింటి తీగల్ని తెంచేసుకున్నాడు.+ అలా అతని శక్తి వెనకున్న రహస్యం బయటపడలేదు.

10 అప్పుడు దెలీలా సమ్సోనుతో, “ఇదిగో! నువ్వు నన్ను వెర్రిదాన్ని చేసి* నాకు అబద్ధాలు చెప్పావు. దయచేసి నిన్ను వేటితో బంధించవచ్చో చెప్పు” అంది. 11 అందుకు సమ్సోను ఆమెతో, “ఏ పనికీ ఉపయోగించని కొత్త తాళ్లతో నన్ను బంధిస్తే, నేను బలహీనమైపోయి మామూలు మనిషిలా అవుతాను” అన్నాడు. 12 దాంతో దెలీలా కొత్త తాళ్లను తీసుకుని వాటితో అతన్ని బంధించి, “సమ్సోనూ! ఫిలిష్తీయులు వచ్చేశారు” అని అరిచింది. (ఈలోగా వాళ్లు లోపలి గదిలో కొంతమందిని మాటు వేయించారు.) అప్పుడు సమ్సోను తన చేతులకున్న తాళ్లను దారాల్లా తెంచేసుకున్నాడు.+

13 తర్వాత దెలీలా సమ్సోనుతో, “ఇప్పటి దాకా నువ్వు నన్ను వెర్రిదాన్ని చేసి అబద్ధాలు చెప్పావు.+ నిన్ను వేటితో బంధించవచ్చో నాకు చెప్పు” అంది. అందుకు సమ్సోను ఆమెతో, “నువ్వు నా తలకున్న ఏడు జడల్ని మగ్గం దారంతో* అల్లితే నేను బలహీనుణ్ణి అయిపోతాను” అన్నాడు. 14 కాబట్టి దెలీలా సమ్సోను జడల్ని మేకుతో దిగ్గొట్టి, “సమ్సోనూ, ఫిలిష్తీయులు వచ్చేశారు!” అని అరిచింది. అప్పుడు సమ్సోను నిద్ర నుండి లేచి మగ్గం మేకును, మగ్గం దారాన్ని ఊడదీసుకున్నాడు.

15 అప్పుడు దెలీలా సమ్సోనుతో, “నీకు నామీద నమ్మకమే లేనప్పుడు ‘నిన్ను ప్రేమిస్తున్నాను’+ అని నాతో ఎలా అనగలుగుతున్నావు? ఈ మూడుసార్లు నువ్వు నన్ను వెర్రిదాన్ని చేశావు, నీకు అంత గొప్ప శక్తి ఎక్కడి నుండి వస్తుందో నువ్వు నాకు చెప్పలేదు”+ అంది. 16 ఆమె ప్రతీరోజు అతన్ని విసిగిస్తూ ఒత్తిడి చేస్తుండడంతో, చనిపోవాలనుకునేంతగా అతని ప్రాణం విసిగిపోయింది.+ 17 చివరికి సమ్సోను అంతా ఆమెకు చెప్పేశాడు: “ఇప్పటివరకు నా తలమీద మంగలికత్తి పడలేదు, ఎందుకంటే నేను పుట్టినప్పటి* నుండి దేవునికి నాజీరుగా ఉన్నాను.+ ఎవరైనా నా జుట్టును కత్తిరిస్తే నా శక్తి పోతుంది, నేను బలహీనమైపోయి మిగతావాళ్లలా అవుతాను.”

18 సమ్సోను తన మనసులో ఉన్నదంతా చెప్పాడని దెలీలాకు అర్థమైనప్పుడు ఆమె వెంటనే ఫిలిష్తీయుల పాలకుల్ని పిలిపించింది.+ “ఈసారి రండి, అతను తన మనసులో ఉన్నదంతా నాకు చెప్పాడు” అని వాళ్లకు కబురు పంపించింది. దాంతో ఫిలిష్తీయుల పాలకులు డబ్బు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చారు. 19 ఆమె తన ఒడిలో సమ్సోనును నిద్రపుచ్చి, ఒక మనిషిని పిలిచి అతని చేత సమ్సోను తలమీద ఉన్న ఏడు జడల్ని కత్తిరించింది. తర్వాత, అతని శక్తి వెళ్లిపోతుండడంతో అతను ఆమె అదుపులోకి వచ్చాడు. 20 అప్పుడు ఆమె, “సమ్సోనూ! ఫిలిష్తీయులు వచ్చేశారు” అని అరిచింది. సమ్సోను నిద్ర లేచి, “నేను ఎప్పటిలాగే వెళ్లి తప్పించుకుంటాను”+ అని అనుకున్నాడు. కానీ యెహోవా తనను విడిచిపెట్టాడని సమ్సోనుకు తెలియలేదు. 21 కాబట్టి ఫిలిష్తీయులు సమ్సోనును పట్టుకుని, అతని కళ్లు పీకేశారు. తర్వాత అతన్ని గాజాకు తీసుకొచ్చి, రెండు రాగి సంకెళ్లతో బంధించారు. అతను చెరసాలలో తిరుగలి తిప్పేవాడయ్యాడు. 22 అయితే కత్తిరించబడిన అతని తలవెంట్రుకలు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి.+

23 ఫిలిష్తీయుల పాలకులు తమ దేవుడైన దాగోనుకు+ పెద్ద ఎత్తున బలి అర్పించడానికి, సంబరాలు చేసుకోవడానికి ఒకచోట సమకూడారు. వాళ్లు, “మన దేవుడు మన శత్రువైన సమ్సోనును మన చేతికి అప్పగించాడు” అని చెప్పుకున్నారు. 24 ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని చూసినప్పుడు, తమ దేవుణ్ణి ఇలా స్తుతించారు: “మన దేశాన్ని సర్వనాశనం చేసి,+ మనలో చాలామందిని చంపిన+ మన శత్రువును మన దేవుడు మన చేతికి అప్పగించాడు.”

25 వాళ్ల హృదయాలు ఉల్లాసంగా ఉండడంతో వాళ్లు, “మనకు కొంచెం వినోదం అందించడానికి సమ్సోనును పిలిపించండి” అన్నారు. దాంతో వాళ్లు తమను ఆనందింపజేయడం కోసం సమ్సోనును చెరసాల నుండి పిలిపించారు; అతన్ని రెండు స్తంభాల మధ్య నిలబెట్టారు. 26 అప్పుడు సమ్సోను తన చెయ్యి పట్టుకొని ఉన్న అబ్బాయితో, “నేను ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలకు ఆనుకునేలా నన్ను వాటిని తాకనివ్వు” అన్నాడు. 27 (ఆ సమయంలో ఆ గుడి స్త్రీపురుషులతో నిండిపోయి ఉంది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడే ఉన్నారు. దాని పైకప్పు మీద దాదాపు 3,000 మంది స్త్రీపురుషులు ఉన్నారు; సమ్సోనును ఎగతాళి చేస్తుండగా వాళ్లు చూస్తూ ఉన్నారు.)

28 సమ్సోను+ అప్పుడు యెహోవాను ఇలా వేడుకున్నాడు: “సర్వోన్నత ప్రభువా, యెహోవా, దయచేసి నన్ను గుర్తుచేసుకో; దేవా, దయచేసి ఈ ఒక్కసారి నన్ను శక్తిమంతుణ్ణి చేయి;+ నా రెండు కళ్లలో ఒకదాని విషయంలో ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోనివ్వు.”+

29 తర్వాత సమ్సోను, గుడికి ఆధారంగా మధ్యలో ఉన్న రెండు స్తంభాల్ని పట్టుకున్నాడు. అతను కుడిచేతిని ఒక స్తంభం మీద, ఎడమచేతిని ఇంకో స్తంభం మీద ఆనించాడు. 30 అప్పుడు సమ్సోను, “ఫిలిష్తీయులతో పాటు నన్ను చనిపోనివ్వు!” అని అరిచి, తన పూర్తి బలంతో వాటిని నెట్టాడు. దాంతో గుడి కూలి అందులో ఉన్న పాలకుల మీద, ప్రజలందరి మీద పడింది.+ అలా, సమ్సోను తాను బ్రతికున్న రోజుల్లో కన్నా తాను చనిపోతున్నప్పుడు ఎక్కువమందిని చంపాడు.+

31 తర్వాత సమ్సోను సహోదరులు, అతని తండ్రి ఇంటివాళ్లందరూ వచ్చి అతని మృతదేహాన్ని తీసుకెళ్లారు. వాళ్లు జొర్యా,+ ఎష్తాయోలు మధ్యలో ఉన్న అతని తండ్రి మానోహ+ సమాధిలో అతన్ని పాతిపెట్టారు. సమ్సోను ఇశ్రాయేలులో 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి