కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • రోమీయులు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

రోమీయులు విషయసూచిక

      • విశ్వాసం వల్ల అబ్రాహాము నీతిమంతునిగా తీర్పు తీర్చబడ్డాడు (1-12)

        • అబ్రాహాము విశ్వాసం చూపించే వాళ్లకు తండ్రి (11)

      • విశ్వాసం వల్ల పొందిన వాగ్దానం (13-25)

రోమీయులు 4:3

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

  • *

    లేదా “లెక్కించాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:6; గల 3:6; యాకో 2:23

రోమీయులు 4:4

అధస్సూచీలు

  • *

    లేదా “అపారదయ చూపించడం.”

రోమీయులు 4:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 2:15, 16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2023, పేజీ 3

రోమీయులు 4:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2023, పేజీలు 3-6

రోమీయులు 4:7

అధస్సూచీలు

  • *

    లేదా “కప్పబడినవాళ్లు.”

రోమీయులు 4:8

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 32:1, 2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2023, పేజీ 3

రోమీయులు 4:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 3:30
  • +రోమా 4:3

రోమీయులు 4:11

అధస్సూచీలు

  • *

    లేదా “ముద్రగా; హామీగా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1, 2, 11
  • +రోమా 4:16; గల 3:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 14

రోమీయులు 4:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +గల 3:29

రోమీయులు 4:13

అధస్సూచీలు

  • *

    లేదా “కొత్త లోకానికి.”

  • *

    అక్ష., “విత్తనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:1-3; 17:5, 6; 22:17, 18
  • +హెబ్రీ 11:8

రోమీయులు 4:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 3:20; 5:20; 2కొ 3:7
  • +రోమా 5:13

రోమీయులు 4:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 3:24
  • +రోమా 9:8; గల 3:29
  • +రోమా 4:11

రోమీయులు 4:17

అధస్సూచీలు

  • *

    లేదా “లేనివాటిని ఉన్నట్టుగా పిలిచే” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:5

రోమీయులు 4:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:5; హెబ్రీ 11:17, 18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2023, పేజీలు 6-7

    కావలికోట,

    6/15/2008, పేజీ 30

రోమీయులు 4:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:17
  • +ఆది 18:11; హెబ్రీ 11:11, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2001, పేజీ 21

రోమీయులు 4:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2001, పేజీ 21

రోమీయులు 4:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:19

రోమీయులు 4:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 15:6; యాకో 2:23

రోమీయులు 4:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 15:4

రోమీయులు 4:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:24; 13:30; 1పే 1:21

రోమీయులు 4:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 20:28
  • +యెష 53:11, 12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

రోమా. 4:3ఆది 15:6; గల 3:6; యాకో 2:23
రోమా. 4:5గల 2:15, 16
రోమా. 4:8కీర్త 32:1, 2
రోమా. 4:9రోమా 3:30
రోమా. 4:9రోమా 4:3
రోమా. 4:11ఆది 17:1, 2, 11
రోమా. 4:11రోమా 4:16; గల 3:7
రోమా. 4:12గల 3:29
రోమా. 4:13ఆది 12:1-3; 17:5, 6; 22:17, 18
రోమా. 4:13హెబ్రీ 11:8
రోమా. 4:15రోమా 3:20; 5:20; 2కొ 3:7
రోమా. 4:15రోమా 5:13
రోమా. 4:16రోమా 3:24
రోమా. 4:16రోమా 9:8; గల 3:29
రోమా. 4:16రోమా 4:11
రోమా. 4:17ఆది 17:5
రోమా. 4:18ఆది 15:5; హెబ్రీ 11:17, 18
రోమా. 4:19ఆది 17:17
రోమా. 4:19ఆది 18:11; హెబ్రీ 11:11, 12
రోమా. 4:21హెబ్రీ 11:19
రోమా. 4:22ఆది 15:6; యాకో 2:23
రోమా. 4:23రోమా 15:4
రోమా. 4:24అపొ 2:24; 13:30; 1పే 1:21
రోమా. 4:25మత్త 20:28
రోమా. 4:25యెష 53:11, 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
రోమీయులు 4:1-25

రోమీయులు

4 అలాగైతే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఏమి దొరికిందని చెప్పాలి? 2 ఉదాహరణకు, అబ్రాహాము తాను చేసిన పనుల వల్ల నీతిమంతునిగా తీర్పు తీర్చబడి ఉంటే, అతనికి గొప్పలు చెప్పుకునే అవకాశం ఉండేది, కానీ దేవుని ముందు కాదు. 3 లేఖనం ఏమి చెప్తోంది? “అబ్రాహాము యెహోవా* మీద విశ్వాసం ఉంచాడు, దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.”*+ 4 పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం బహుమతి* అవ్వదు, అది అతని హక్కు అవుతుంది. 5 మరోవైపున, తన సొంత పనుల మీద ఆధారపడకుండా, భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్పుతీర్చే దేవుని మీద విశ్వాసం ఉంచే వ్యక్తి, తన విశ్వాసం వల్ల నీతిమంతునిగా ఎంచబడతాడు.+ 6 ఒక వ్యక్తి పనులు పూర్తిగా ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేకపోయినా దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచితే, అతని సంతోషం ఎలా ఉంటుందో దావీదు కూడా చెప్పాడు: 7 “తమ అక్రమాలు, పాపాలు క్షమించబడినవాళ్లు* సంతోషంగా ఉంటారు; 8 ఎవరి పాపాన్నైతే యెహోవా* అస్సలు గుర్తుపెట్టుకోడో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”+

9 ఈ సంతోషం కేవలం సున్నతి చేయించుకున్నవాళ్లకు మాత్రమే కలుగుతుందా, లేక సున్నతి చేయించుకోనివాళ్లకు కూడానా?+ “అబ్రాహాము చూపించిన విశ్వాసం వల్లే దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు”+ అని మనం ముందే అనుకున్నాం. 10 దేవుడు అతన్ని ఎప్పుడు నీతిమంతునిగా ఎంచాడు? సున్నతి చేయించుకున్న తర్వాతనా? చేయించుకోక ముందా? దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచే సమయానికి అతను ఇంకా సున్నతి చేయించుకోని స్థితిలోనే ఉన్నాడు. 11 అయితే దేవుడు అతన్ని సున్నతి చేయించుకోమన్నాడు. సున్నతి చేయించుకోని స్థితిలో ఉన్నప్పుడు అతను చూపించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడనడానికి సున్నతి గుర్తుగా* ఉంది.+ అలా అబ్రాహాము, సున్నతి చేయించుకోని స్థితిలో విశ్వాసం చూపించే వాళ్లందరికీ తండ్రి అయ్యాడు;+ దేవుడు వాళ్లను కూడా నీతిమంతులుగా ఎంచుతాడు; 12 అంతేకాదు, అబ్రాహాము సున్నతి చేయించుకున్నవాళ్లకు కూడా తండ్రి అయ్యాడు; సున్నతి ఆచారాన్ని పాటించేవాళ్లకు మాత్రమే కాదు, సున్నతి చేయించుకోని స్థితిలో ఉన్నప్పుడు మన తండ్రి అబ్రాహాము+ చూపించిన విశ్వాసపు అడుగుజాడల్లో సక్రమంగా నడిచేవాళ్లకు కూడా అతను తండ్రి అయ్యాడు.

13 అబ్రాహాము ఒక లోకానికి* వారసుడు అవుతాడనే వాగ్దానాన్ని అతను గానీ అతని సంతానం* గానీ ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల పొందలేదు.+ కానీ, అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి+ దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచడం వల్లే ఆ వాగ్దానాన్ని పొందాడు. 14 ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్లు వారసులైతే, విశ్వాసం వృథా అవుతుంది, వాగ్దానం రద్దౌతుంది. 15 వాస్తవానికి, ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని దేవుని ఆగ్రహానికి గురిచేస్తుంది.+ అయితే ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం అనేది కూడా ఉండదు.+

16 అబ్రాహాము తన విశ్వాసం కారణంగా వాగ్దానాన్ని పొందాడు, అది దేవుని అపారదయకు+ రుజువు. కాబట్టి అబ్రాహాము సంతానం*+ కూడా ఆ వాగ్దానాన్ని పొందింది. ధర్మశాస్త్రాన్ని పాటించినవాళ్లు మాత్రమే కాకుండా, మనందరికీ తండ్రైన+ అబ్రాహాము చూపించినలాంటి విశ్వాసం చూపించినవాళ్లు కూడా ఆ వాగ్దానాన్ని పొందారు. 17 (లేఖనాల్లో కూడా ఇలా రాసివుంది: “నిన్ను అనేక దేశాల ప్రజలకు తండ్రిగా నియమించాను.”)+ చనిపోయినవాళ్లను బ్రతికించే దేవుని మీద, ఇంకా నెరవేరనివి ఇప్పటికే నెరవేరినట్టు మాట్లాడే* దేవుని మీద అబ్రాహాము విశ్వాసం ఉంచాడు, ఆయన నుండి ఆ వాగ్దానాన్ని పొందాడు. 18 నిరీక్షించడానికి ఆధారం లేకపోయినా, అతను నిరీక్షించాడు; “నీ సంతానం* కూడా అంతమంది అవుతారు”+ అని చెప్పబడిన మాటకు అనుగుణంగా తాను అనేక దేశాల ప్రజలకు తండ్రి అవుతానని అతను విశ్వసించాడు. 19 అతని విశ్వాసం బలహీనపడలేదు కానీ, అతను (దాదాపు 100 ఏళ్ల వయసులో ఉన్నందువల్ల)+ చనిపోయినట్టుగా ఉన్న తన శరీరం గురించి, పిల్లల్ని కనే స్థితిలో లేని శారా+ గురించి ఆలోచించాడు. 20 అయినా దేవుని వాగ్దానం ఉన్నందువల్ల అతను విశ్వాసం కోల్పోలేదు; తన విశ్వాసం వల్ల శక్తిమంతుడయ్యాడు, దేవుణ్ణి మహిమపర్చాడు, 21 చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే సామర్థ్యం కూడా దేవునికి ఉందని అబ్రాహాము పూర్తిగా నమ్మాడు.+ 22 “దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.”+

23 “దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు” అనే మాట కేవలం అతని కోసం మాత్రమే రాయబడలేదు.+ 24 కానీ, దేవుడు నీతిమంతులుగా ఎంచబోతున్న మన కోసం కూడా రాయబడింది. ఎందుకంటే మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి బ్రతికించిన దేవుని మీద మనం నమ్మకం ఉంచుతున్నాం.+ 25 యేసు మన పాపాల కోసం మరణానికి అప్పగించబడ్డాడు,+ మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడేందుకు+ బ్రతికించబడ్డాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి