కీర్తనలు
గీతం. దావీదు శ్రావ్యగీతం.
108 దేవా, నా హృదయం స్థిరంగా ఉంది.
నా పూర్తి సామర్థ్యంతో* పాట పాడతాను, సంగీతం వాయిస్తాను.+
2 తంతివాద్యమా, మేలుకో; వీణా,* నువ్వు కూడా మేలుకో.+
నేను వేకువను నిద్ర లేపుతాను.
3 యెహోవా, దేశదేశాల ప్రజల మధ్య నిన్ను స్తుతిస్తాను,
దేశాల మధ్య నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను.*
4 ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ గొప్పది, అది ఆకాశమంత ఉన్నతమైనది,+
నీ నమ్మకత్వం మేఘాల్ని తాకుతుంది.
5 దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చించబడాలి;
నీ మహిమ భూమంతా నిండిపోవాలి.+
6 నువ్వు ప్రేమించేవాళ్లు రక్షించబడేలా
నీ కుడిచేతితో మమ్మల్ని కాపాడి, నాకు జవాబివ్వు.+
7 దేవుడు తన పవిత్రతను బట్టి* ఇలా అన్నాడు:
9 మోయాబు నేను కాళ్లు కడుక్కునే పాత్ర.+
ఎదోము మీదికి నా చెప్పు విసిరేస్తాను.+
ఫిలిష్తియను జయించి విజయోత్సాహంతో కేకలు వేస్తాను.”+
10 ప్రాకారంగల నగరానికి నన్ను ఎవరు తీసుకెళ్తారు?
ఎదోము వరకు నన్ను ఎవరు నడిపిస్తారు?+
11 దేవా, నువ్వే మమ్మల్ని నడిపిస్తావు;
కానీ నువ్వు మమ్మల్ని తిరస్కరించావు,
ఇప్పుడు నువ్వు మా సైన్యాలతో పాటు బయల్దేరడం లేదు.+