హోషేయ
4 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా ఏం చెప్తున్నాడో వినండి,
దేశ నివాసుల మీద యెహోవాకు ఒక వ్యాజ్యం ఉంది,+
ఎందుకంటే దేశంలో సత్యం గానీ, విశ్వసనీయ ప్రేమ గానీ, దేవుని గురించిన జ్ఞానం గానీ లేవు.+
2 అబద్ధ ప్రమాణాలు, అబద్ధాలు,+ హత్యలు,+
దొంగతనాలు, వ్యభిచారం+ దేశంలో పెచ్చుపెరిగిపోయాయి,
రక్తపాతం వెంట రక్తపాతం జరుగుతోంది.+
3 అందుకే దేశం దుఃఖిస్తుంది,+
దానిలోని నివాసులందరూ కృశించిపోతారు;
అడవి జంతువులు, ఆకాశపక్షులు,
సముద్రంలోని చేపలు కూడా నశించిపోతాయి.
4 “అయినా ఏ వ్యక్తీ ఎదురు వాదించకూడదు, గద్దించకూడదు,+
ఎందుకంటే, నీ ప్రజలు యాజకునితో వాదించే వాళ్లలా ఉన్నారు.+
5 కాబట్టి మీరు రాత్రివేళ తడబడినట్టు పట్టపగలే తడబడతారు,
ప్రవక్త కూడా మీతోపాటు తడబడతాడు.
నేను మీ తల్లిని నాశనం చేస్తాను.
6 జ్ఞానం ఏమాత్రం లేనందువల్ల నా ప్రజలు నాశనమౌతారు.
మీరు జ్ఞానాన్ని తిరస్కరించారు కాబట్టి,+
నాకు యాజకునిగా సేవ చేయకుండా నేను కూడా మిమ్మల్ని తిరస్కరిస్తాను;
మీ దేవుని ధర్మశాస్త్రాన్ని* మీరు మర్చిపోయారు కాబట్టి,+
నేను కూడా మీ కుమారుల్ని మర్చిపోతాను.
7 వాళ్ల సంఖ్య ఎక్కువైన కొద్దీ, నాకు వ్యతిరేకంగా వాళ్లు చేసిన పాపాలు కూడా ఎక్కువౌతూ వచ్చాయి.+
నేను వాళ్ల మహిమను అవమానంగా మారుస్తాను.*
8 వాళ్లు* నా ప్రజల పాపాల్ని ఆహారంగా చేసుకుంటున్నారు,
ప్రజలు ఇంకా ఇంకా తప్పులు చేయాలని వాళ్లు కోరుకుంటున్నారు.
9 ప్రజల పరిస్థితి, యాజకుల పరిస్థితి ఒకేలా ఉంటుంది;
నేను వాళ్ల మార్గాల విషయంలో వాళ్లను లెక్క అడుగుతాను,
వాళ్ల పనుల పర్యవసానాల్ని వాళ్ల మీదికి తెస్తాను.+
10 వాళ్లు తింటారు, కానీ తృప్తి ఉండదు.+
విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు,* కానీ వాళ్ల సంఖ్య పెరగదు,+
ఎందుకంటే వాళ్లు యెహోవాను ఏమాత్రం లెక్కచేయలేదు.
12 నా ప్రజలు తమ చెక్క విగ్రహాల్ని సంప్రదిస్తారు,
తమ చేతి కర్ర* చెప్పింది చేస్తారు;
ఎందుకంటే, వ్యభిచార* మనసు వాళ్లను దారితప్పేలా చేస్తుంది,
తమ వ్యభిచారం* వల్ల వాళ్లు తమ దేవునికి లోబడడం లేదు.
13 పర్వత శిఖరాల మీద వాళ్లు బలులు అర్పిస్తారు,+
కొండల మీద తమ బలుల పొగ పైకిలేచేలా చేస్తారు,
సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, ప్రతీ మహా వృక్షం కింద బలులు అర్పిస్తారు.+
వాటి నీడ మంచిదని అలా చేస్తారు.
అందుకే, మీ కూతుళ్లు వేశ్యల్లా ప్రవర్తిస్తున్నారు,
మీ కోడళ్లు వ్యభిచారం చేస్తున్నారు.
14 వేశ్యల్లా ప్రవర్తిస్తున్నందుకు మీ కూతుళ్లను,
వ్యభిచారం చేస్తున్నందుకు మీ కోడళ్లను నేను లెక్క అడగను.
ఎందుకంటే, మగవాళ్లు వేశ్యలతో వెళ్తున్నారు,
ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తున్నారు;
అవగాహన లేని అలాంటివాళ్లు+ నాశనమౌతారు.
16 ఎందుకంటే, మొండి ఎద్దులా ఇశ్రాయేలు ప్రజలు మొండిగా తయారయ్యారు.+
పచ్చిక మైదానంలో* మగ గొర్రెపిల్లను మేపినట్టు యెహోవా వాళ్లను మేపాలా?
17 ఎఫ్రాయిము విగ్రహాల్ని హత్తుకున్నాడు.+
అతన్ని అలా వదిలేయండి!
దాని పరిపాలకులు అవమానాన్ని ఎంతగానో ప్రేమిస్తారు.+
19 గాలి తన రెక్కలతో దాన్ని చుట్టేస్తుంది,*
వాళ్లు తమ బలుల్ని బట్టి సిగ్గుపడతారు.”