కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 1
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • ఆకాశాన్ని, భూమిని సృష్టించడం (1, 2)

      • ఆరు రోజుల్లో భూమిని సిద్ధం చేయడం (3-31)

        • 1వ రోజు: వెలుగు; పగలు, రాత్రి (3-5)

        • 2వ రోజు: విశాలం (6-8)

        • 3వ రోజు: ఆరిన నేల, మొక్కలు (9-13)

        • 4వ రోజు: ఆకాశ జ్యోతులు (14-19)

        • 5వ రోజు: చేపలు, పక్షులు (20-23)

        • 6వ రోజు: భూజంతువులు, ​మనుషులు (24-31)

ఆదికాండం 1:1

అధస్సూచీలు

  • *

    అంటే, నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్రవీధులు మొదలైనవి ఉన్న విశ్వం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 102:25; యెష 42:5; 45:18; రోమా 1:20; హెబ్రీ 1:10; ప్రక 4:11; 10:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు వచనాల వివరణ, ఆర్టికల్‌ 2

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 6

    తేజరిల్లు!,

    No. 3 2021 పేజీ 10

    10/2006, పేజీ 19

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2019 పేజీ 5

    కావలికోట,

    2/15/2011, పేజీలు 6-7

    2/15/2007, పేజీలు 5-6

    బైబిలు సందేశం, పేజీ 4

ఆదికాండం 1:2

అధస్సూచీలు

  • *

    లేదా “పొంగిపొర్లుతున్న జలాల్ని.”

  • *

    లేదా “దేవుని పవిత్రశక్తి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 8:27, 28
  • +కీర్త 33:6; యెష 40:26
  • +కీర్త 104:5, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 6

    తేజరిల్లు!,

    No. 3 2021 పేజీ 10

    కావలికోట,

    2/15/2007, పేజీలు 5-6

ఆదికాండం 1:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 45:7; 2కొ 4:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2020, పేజీ 1

    కావలికోట,

    2/15/2011, పేజీ 8

    2/15/2007, పేజీ 6

    1/1/2004, పేజీలు 28-29

ఆదికాండం 1:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 8:22

ఆదికాండం 1:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 1:20
  • +2పే 3:5

ఆదికాండం 1:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 7:11; సామె 8:27, 28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2020, పేజీ 1

ఆదికాండం 1:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 38:8, 11; కీర్త 104:6-9; 136:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    No. 3 2021 పేజీ 10

    కావలికోట,

    2/15/2007, పేజీ 6

ఆదికాండం 1:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 95:5
  • +సామె 8:29
  • +ద్వితీ 32:4

ఆదికాండం 1:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 82

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2020, పేజీ 1

    కావలికోట,

    2/15/2007, పేజీ 6

ఆదికాండం 1:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 104:14

ఆదికాండం 1:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 104:19
  • +ద్వితీ 4:19
  • +ఆది 8:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2011, పేజీ 8

    2/15/2007, పేజీ 6

ఆదికాండం 1:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 136:7, 8
  • +కీర్త 8:3; యిర్మీ 31:35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 82

    కావలికోట,

    2/15/2007, పేజీ 6

    1/1/2004, పేజీలు 28-29

ఆదికాండం 1:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 74:16

ఆదికాండం 1:20

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “ప్రాణం” చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2020, పేజీలు 1-2

ఆదికాండం 1:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 6

ఆదికాండం 1:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 9:6; కీర్త 104:25

ఆదికాండం 1:24

అధస్సూచీలు

  • *

    లేదా “కదిలే జంతువుల్ని.” వీటిలో సరీసృపాలు, పైన పేర్కొన్న జంతువులకు భిన్నమైన జంతువులు ఉన్నాయని తెలుస్తోంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 2:19

ఆదికాండం 1:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 6

ఆదికాండం 1:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 8:30; యోహా 1:3; కొలొ 1:16
  • +1కొ 11:7
  • +ఆది 5:1; యాకో 3:9
  • +ఆది 9:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 44

    బైబిలు వచనాల వివరణ, ఆర్టికల్‌ 27

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 6

    కావలికోట (సార్వజనిక),

    No. 2 2018 పేజీ 12

    కావలికోట,

    1/1/2009, పేజీ 27

    1/1/2004, పేజీ 30

    2/15/2002, పేజీ 4

    11/15/2000, పేజీ 25

    6/1/1992, పేజీలు 16-17

    గొప్ప బోధకుడు, పేజీ 22

    “ఇదిగో” బ్రోషుర్‌, పేజీ 13

ఆదికాండం 1:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 139:14; మత్త 19:4; మార్కు 10:6; 1కొ 11:7, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    12/2023, పేజీ 18

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 6

    కావలికోట (సార్వజనిక),

    No. 1 2019 పేజీ 10

    కావలికోట (సార్వజనిక),

    No. 2 2018 పేజీ 12

    మనం నేర్చుకోవచ్చు, పేజీ 53

    బైబిలు బోధిస్తోంది, పేజీలు 48-49

    కావలికోట,

    7/1/2013, పేజీ 3

    2/15/2011, పేజీ 9

    1/1/2009, పేజీ 27

    7/1/2005, పేజీలు 4-5

    6/1/2002, పేజీ 9

    7/15/1997, పేజీలు 4-5

    2/1/1997, పేజీలు 9-10, 12

    6/15/1994, పేజీ 12

    4/1/1994, పేజీ 25

    “ఇదిగో” బ్రోషుర్‌, పేజీ 13

ఆదికాండం 1:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:1
  • +ఆది 2:15
  • +కీర్త 8:4, 6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2023, పేజీలు 5-6

    కావలికోట (అధ్యయన),

    12/2022, పేజీలు 28-29

    కావలికోట (అధ్యయన),

    8/2021, పేజీ 2

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 25

    కావలికోట (సార్వజనిక),

    No. 3 2019 పేజీలు 6-7

    కావలికోట (అధ్యయన),

    8/2018, పేజీలు 19-20

    కావలికోట (అధ్యయన),

    8/2016, పేజీ 9

    కావలికోట,

    5/15/2006, పేజీలు 4-5

    4/15/2004, పేజీ 4

    11/15/2000, పేజీ 25

    4/15/1999, పేజీలు 8-9

    7/15/1998, పేజీ 15

    7/1/1991, పేజీ 21

    3/1/1990, పేజీలు 23-25, 28

    “ఇదిగో” బ్రోషుర్‌, పేజీ 14

ఆదికాండం 1:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:3; కీర్త 104:14; అపొ 14:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1990, పేజీలు 23-24

ఆదికాండం 1:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 147:9; మత్త 6:26

ఆదికాండం 1:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:4; కీర్త 104:24; 1తి 4:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    “దేవుని ప్రేమ”, పేజీ 196

    కావలికోట,

    7/1/2011, పేజీ 11

    1/1/2008, పేజీలు 14-15

    11/15/1999, పేజీలు 4-5

    3/1/1990, పేజీలు 24-25

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 1:1కీర్త 102:25; యెష 42:5; 45:18; రోమా 1:20; హెబ్రీ 1:10; ప్రక 4:11; 10:6
ఆది. 1:2సామె 8:27, 28
ఆది. 1:2కీర్త 33:6; యెష 40:26
ఆది. 1:2కీర్త 104:5, 6
ఆది. 1:3యెష 45:7; 2కొ 4:6
ఆది. 1:5ఆది 8:22
ఆది. 1:6ఆది 1:20
ఆది. 1:62పే 3:5
ఆది. 1:7ఆది 7:11; సామె 8:27, 28
ఆది. 1:9యోబు 38:8, 11; కీర్త 104:6-9; 136:6
ఆది. 1:10కీర్త 95:5
ఆది. 1:10సామె 8:29
ఆది. 1:10ద్వితీ 32:4
ఆది. 1:12కీర్త 104:14
ఆది. 1:14కీర్త 104:19
ఆది. 1:14ద్వితీ 4:19
ఆది. 1:14ఆది 8:22
ఆది. 1:16కీర్త 136:7, 8
ఆది. 1:16కీర్త 8:3; యిర్మీ 31:35
ఆది. 1:18కీర్త 74:16
ఆది. 1:20ఆది 2:19
ఆది. 1:22నెహె 9:6; కీర్త 104:25
ఆది. 1:24ఆది 2:19
ఆది. 1:26సామె 8:30; యోహా 1:3; కొలొ 1:16
ఆది. 1:261కొ 11:7
ఆది. 1:26ఆది 5:1; యాకో 3:9
ఆది. 1:26ఆది 9:2
ఆది. 1:27కీర్త 139:14; మత్త 19:4; మార్కు 10:6; 1కొ 11:7, 9
ఆది. 1:28ఆది 9:1
ఆది. 1:28ఆది 2:15
ఆది. 1:28కీర్త 8:4, 6
ఆది. 1:29ఆది 9:3; కీర్త 104:14; అపొ 14:17
ఆది. 1:30కీర్త 147:9; మత్త 6:26
ఆది. 1:31ద్వితీ 32:4; కీర్త 104:24; 1తి 4:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 1:1-31

ఆదికాండం

1 మొదట్లో దేవుడు ఆకాశాన్ని,* భూమిని సృష్టించాడు.+

2 భూమి ఖాళీగా, పనికిరాకుండా ఉండేది; చీకటి అగాధ జలాల్ని*+ కమ్ముకొని ఉండేది; దేవుని చురుకైన శక్తి*+ నీళ్ల మీద+ అటూఇటూ కదులుతూ ఉండేది.

3 దేవుడు, “వెలుగు కలగాలి” అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది.+ 4 ఆ తర్వాత, దేవుడు వెలుగును చూసినప్పుడు అది బాగుంది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు. 5 దేవుడు వెలుగును పగలు అని, చీకటిని రాత్రి+ అని పిలిచాడు. సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది మొదటి రోజు.

6 తర్వాత దేవుడు, “జలాల మధ్య విశాలం+ ఏర్పడాలి; ఆ జలాలు, ఈ జలాలు వేరవ్వాలి” అన్నాడు.+ 7 ఆ తర్వాత దేవుడు విశాలాన్ని చేసి, దానికి కింద ఉన్న జలాల్ని దానికి పైనున్న జలాల నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు.+ అది అలాగే జరిగింది. 8 దేవుడు ఆ విశాలాన్ని ఆకాశం అని పిలిచాడు. సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది రెండో రోజు.

9 తర్వాత దేవుడు, “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకచోటికి చేరాలి, ఆరిన నేల కనిపించాలి” అన్నాడు.+ అది అలాగే జరిగింది. 10 దేవుడు ఆరిన నేలను భూమి అని,+ ఒకచోటికి చేరిన జలాల్ని సముద్రాలు అని పిలిచాడు.+ దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది.+ 11 తర్వాత దేవుడు, “భూమి వాటివాటి జాతుల ప్రకారం గడ్డిని, మొక్కల్ని, చెట్లను మొలిపించాలి. మొక్కలు విత్తనాల్ని, చెట్లు విత్తనాలున్న పండ్లను ఇస్తాయి” అన్నాడు. అది అలాగే జరిగింది. 12 అప్పుడు భూమి వాటివాటి జాతుల ప్రకారం గడ్డిని, మొక్కల్ని,+ చెట్లను మొలిపించడం మొదలుపెట్టింది. మొక్కలు విత్తనాల్ని, చెట్లు విత్తనాలున్న పండ్లను ఇచ్చాయి. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 13 సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది మూడో రోజు.

14 తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “పగటిని, రాత్రిని వేరు చేయడానికి+ ఆకాశ విశాలంలో జ్యోతులు+ కలగాలి; అవి కాలాల్ని, రోజుల్ని, సంవత్సరాల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.+ 15 భూమ్మీద ప్రకాశించడానికి అవి ఆకాశ విశాలంలో జ్యోతులుగా ఉంటాయి.” అది అలాగే జరిగింది. 16 దేవుడు రెండు గొప్ప జ్యోతుల్ని చేశాడు. వాటిలో పెద్ద జ్యోతినేమో పగటిని ఏలడానికి,+ చిన్న జ్యోతినేమో రాత్రిని ఏలడానికి చేశాడు, అలాగే నక్షత్రాల్ని కూడా చేశాడు.+ 17 అవి భూమ్మీద ప్రకాశించడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో పెట్టాడు; 18 అంతేకాదు పగటినీ రాత్రినీ ఏలడానికి, వెలుగునూ చీకటినీ వేరు చేయడానికి+ దేవుడు వాటిని అలా పెట్టాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 19 సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది నాలుగో రోజు.

20 తర్వాత దేవుడు, “జలాలు జలచరాలతో* నిండిపోవాలి; ఎగిరే ప్రాణులు భూమికి పైన ఆకాశ విశాలంలో ఎగరాలి” అన్నాడు.+ 21 దేవుడు గొప్ప సముద్ర జీవుల్ని, నీళ్లలో కదిలే ప్రాణుల్ని, అలాగే నీళ్లలో గుంపులుగుంపులుగా తిరిగే ప్రాణుల్ని వాటివాటి జాతుల ప్రకారం సృష్టించాడు; అలాగే రెక్కలతో ఎగిరే ప్రతీ ప్రాణిని దానిదాని జాతి ప్రకారం సృష్టించాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 22 ఇక అప్పుడు దేవుడు వాటిని ఇలా దీవించాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువయ్యి, సముద్ర జలాల్ని నింపండి;+ భూమ్మీద ఎగిరే ప్రాణుల సంఖ్య పెరగాలి.” 23 సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది ఐదో రోజు.

24 తర్వాత దేవుడు, “భూమి వాటివాటి జాతుల ప్రకారం జీవుల్ని పుట్టించాలి; సాధు జంతువుల్ని, పాకే జంతువుల్ని,* అడవి జంతువుల్ని వాటివాటి జాతుల ప్రకారం పుట్టించాలి” అన్నాడు.+ అది అలాగే జరిగింది. 25 దేవుడు వాటివాటి జాతుల ప్రకారం అడవి జంతువుల్ని, వాటివాటి జాతుల ప్రకారం సాధు జంతువుల్ని, వాటివాటి జాతుల ప్రకారం పాకే జంతువులన్నిటినీ చేశాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది.

26 తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “మన+ స్వరూపంలో,+ మనలా+ మనిషిని తయారుచేద్దాం. వాళ్లు సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, సాధు జంతువుల్ని, భూమినంతటినీ, అలాగే భూమ్మీద కదిలే ప్రతీ పాకే జంతువును ఏలాలి.”+ 27 దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు, దేవుని స్వరూపంలో అతన్ని సృష్టించాడు; పురుషునిగా, స్త్రీగా వాళ్లను సృష్టించాడు.+ 28 అంతేకాదు దేవుడు వాళ్లను దీవిస్తూ ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి,+ దాన్ని లోబర్చుకోండి;+ సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, భూమ్మీద కదిలే ప్రతీ జీవిని ఏలండి.”+

29 తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “భూమంతటా ఉన్న విత్తనాలుగల ప్రతీ మొక్కను, విత్తనాలుగల పండ్లున్న ప్రతీ చెట్టును నేను మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారంగా ఉంటాయి.+ 30 భూమ్మీదున్న ప్రతీ అడవి జంతువుకు, ఆకాశంలో ఎగిరే ప్రతీ ప్రాణికి, భూమ్మీద జీవంతో కదిలే ప్రతీదానికి పచ్చని మొక్కలన్నిటినీ నేను ఆహారంగా ఇచ్చాను.”+ అది అలాగే జరిగింది.

31 ఆ తర్వాత దేవుడు తాను చేసిన ప్రతీదాన్ని చూసినప్పుడు, ఇదిగో! అది చాలా బాగుంది.+ సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది ఆరో రోజు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి