కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 27
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • ఇస్సాకు దీవెనను యాకోబు పొందడం (1-29)

      • దీవెన కోసం ఏశావు ప్రయత్నిస్తాడు కానీ పశ్చాత్తాపపడడు (30-40)

      • యాకోబు మీద ఏశావు శత్రుభావం (41-46)

ఆదికాండం 27:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:28

ఆదికాండం 27:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:27

ఆదికాండం 27:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:30

ఆదికాండం 27:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:28

ఆదికాండం 27:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:30, 31

ఆదికాండం 27:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:13, 43

ఆదికాండం 27:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/15/2004, పేజీ 11

ఆదికాండం 27:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:25; 27:23

ఆదికాండం 27:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:21

ఆదికాండం 27:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:8, 43

ఆదికాండం 27:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:23, 26

ఆదికాండం 27:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:25; 27:11

ఆదికాండం 27:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:9

ఆదికాండం 27:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:31-33; రోమా 9:10-12
  • +ఆది 27:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2007, పేజీ 30

    10/1/2007, పేజీ 31

ఆదికాండం 27:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:11, 12

ఆదికాండం 27:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:16

ఆదికాండం 27:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 11:20

ఆదికాండం 27:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 48:10

ఆదికాండం 27:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:27; 27:15

ఆదికాండం 27:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 11:11
  • +సం 13:26, 27
  • +ఆది 27:37; ద్వితీ 7:13

ఆదికాండం 27:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:23
  • +ఆది 12:1, 3; 28:1, 3; 31:42; యెహె 25:12, 13

ఆదికాండం 27:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 27:3

ఆదికాండం 27:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:25, 31; హెబ్రీ 12:16

ఆదికాండం 27:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 12:16, 17

ఆదికాండం 27:36

అధస్సూచీలు

  • *

    “మడిమెను పట్టుకునేవాడు; ఇంకొకరి స్థానాన్ని లాక్కునేవాడు” అని అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:26; 32:28; హోషే 12:3
  • +ఆది 25:32-34
  • +ఆది 27:28

ఆదికాండం 27:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:23; 27:29; రోమా 9:10, 12
  • +ద్వితీ 33:28

ఆదికాండం 27:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 12:16, 17

ఆదికాండం 27:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 24:4; హెబ్రీ 11:20

ఆదికాండం 27:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 32:6; సం 20:18
  • +ఆది 25:23; 2స 8:14; మలా 1:2, 3
  • +2రా 8:20; 2ది 28:17

ఆదికాండం 27:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆమో 1:11
  • +ఆది 35:28, 29

ఆదికాండం 27:42

అధస్సూచీలు

  • *

    లేదా “నిన్ను చంపాలని ఆలోచిస్తూ తనను తాను సముదాయించుకుంటున్నాడు.”

ఆదికాండం 27:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 28:5

ఆదికాండం 27:46

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 26:34, 35; 28:8
  • +ఆది 24:2, 3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    9/15/2006, పేజీలు 21-22

    7/15/1995, పేజీ 13

    8/1/1993, పేజీలు 7-8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 27:1ఆది 25:28
ఆది. 27:3ఆది 25:27
ఆది. 27:5ఆది 27:30
ఆది. 27:6ఆది 25:28
ఆది. 27:7ఆది 27:30, 31
ఆది. 27:8ఆది 27:13, 43
ఆది. 27:11ఆది 25:25; 27:23
ఆది. 27:12ఆది 27:21
ఆది. 27:13ఆది 27:8, 43
ఆది. 27:15ఆది 25:23, 26
ఆది. 27:16ఆది 25:25; 27:11
ఆది. 27:17ఆది 27:9
ఆది. 27:19ఆది 25:31-33; రోమా 9:10-12
ఆది. 27:19ఆది 27:4
ఆది. 27:21ఆది 27:11, 12
ఆది. 27:22ఆది 27:16
ఆది. 27:23హెబ్రీ 11:20
ఆది. 27:26ఆది 48:10
ఆది. 27:27ఆది 25:27; 27:15
ఆది. 27:28ద్వితీ 11:11
ఆది. 27:28సం 13:26, 27
ఆది. 27:28ఆది 27:37; ద్వితీ 7:13
ఆది. 27:29ఆది 25:23
ఆది. 27:29ఆది 12:1, 3; 28:1, 3; 31:42; యెహె 25:12, 13
ఆది. 27:30ఆది 27:3
ఆది. 27:32ఆది 25:25, 31; హెబ్రీ 12:16
ఆది. 27:34హెబ్రీ 12:16, 17
ఆది. 27:36ఆది 25:26; 32:28; హోషే 12:3
ఆది. 27:36ఆది 25:32-34
ఆది. 27:36ఆది 27:28
ఆది. 27:37ఆది 25:23; 27:29; రోమా 9:10, 12
ఆది. 27:37ద్వితీ 33:28
ఆది. 27:38హెబ్రీ 12:16, 17
ఆది. 27:39యెహో 24:4; హెబ్రీ 11:20
ఆది. 27:40ఆది 32:6; సం 20:18
ఆది. 27:40ఆది 25:23; 2స 8:14; మలా 1:2, 3
ఆది. 27:402రా 8:20; 2ది 28:17
ఆది. 27:41ఆమో 1:11
ఆది. 27:41ఆది 35:28, 29
ఆది. 27:43ఆది 28:5
ఆది. 27:46ఆది 26:34, 35; 28:8
ఆది. 27:46ఆది 24:2, 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 27:1-46

ఆదికాండం

27 ఇస్సాకు ముసలివాడై అతని కంటిచూపు బాగా మందగించినప్పుడు, తన పెద్ద కుమారుడు ఏశావును తన దగ్గరికి పిలిచి,+ “నా కుమారుడా!” అన్నాడు. దానికి ఏశావు, “చెప్పు నాన్నా!” అన్నాడు. 2 అప్పుడు ఇస్సాకు ఇలా అన్నాడు: “నేను ముసలివాణ్ణి అయిపోయాను, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలీదు. 3 కాబట్టి ఇప్పుడు నువ్వు దయచేసి నీ ఆయుధాల్ని అంటే నీ అంబులపొదిని, విల్లును తీసుకొని అడవికి వెళ్లి నాకోసం ఒక జంతువును వేటాడి తీసుకురా.+ 4 దానితో నాకిష్టమైన రుచిగల వంటకం తయారుచేసి నా దగ్గరికి తీసుకురా. నేను దాన్ని తిని, చనిపోకముందే నిన్ను దీవిస్తాను.”

5 ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రిబ్కా వింటూ ఉంది. తర్వాత ఏశావు ఒక జంతువును వేటాడి తేవడానికి అడవికి వెళ్లాడు.+ 6 అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబుతో ఇలా అంది:+ “ఇప్పుడే మీ నాన్న మీ అన్న ఏశావుతో ఇలా అంటుంటే విన్నాను: 7 ‘నాకోసం ఏదోక జంతువును వేటాడి తీసుకొచ్చి, రుచికరమైన వంటకాన్ని తయారుచేయి. నేను దాన్ని తిని, చనిపోకముందే యెహోవా ఎదుట నిన్ను దీవిస్తాను.’+ 8 నా కుమారుడా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విని, నేను చెప్పినట్టు చేయి.+ 9 దయచేసి, వెళ్లి మందలో నుండి రెండు శ్రేష్ఠమైన మేకపిల్లల్ని తీసుకురా. నేను వాటితో మీ నాన్నకు నచ్చే విధంగా రుచికరమైన వంటకం చేస్తాను. 10 నువ్వు దాన్ని మీ నాన్న దగ్గరికి తీసుకెళ్లు. అప్పుడు మీ నాన్న దాన్ని తిని, తాను చనిపోకముందే నిన్ను దీవిస్తాడు.”

11 యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా అన్నాడు: “నా అన్న ఏశావు ఒంటినిండా వెంట్రుకలే,+ నేనేమో నున్నగా ఉంటాను. 12 ఒకవేళ నాన్న నన్ను తడిమి చూస్తే+ ఎలా? అప్పుడు నేను అతన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా ఉంటుంది; దానివల్ల నేను దీవెనను కాదు, శాపాన్ని కొనితెచ్చుకుంటాను.” 13 దానికి ఆమె యాకోబుతో ఇలా అంది: “నా కుమారుడా, ఆ శాపం నా మీదికి రానివ్వు. నువ్వైతే నేను చెప్పినట్టు చేయి, వెళ్లి వాటిని తీసుకురా.”+ 14 కాబట్టి అతను వెళ్లి వాటిని తీసుకొచ్చి వాళ్లమ్మకు ఇచ్చాడు. ఆమె వాళ్ల నాన్నకు నచ్చేలా రుచికరమైన వంటకం చేసింది. 15 ఆ తర్వాత రిబ్కా తన ఇంట్లో నుండి తన పెద్ద కుమారుడు ఏశావు వస్త్రాల్లో శ్రేష్ఠమైనవి తీసుకొచ్చి, తన చిన్న కుమారుడు యాకోబుకు తొడిగింది.+ 16 అంతేకాదు ఆ మేకపిల్లల చర్మాల్ని తెచ్చి యాకోబు చేతుల మీద, మెడ మీద కప్పింది.+ 17 తర్వాత ఆమె తాను చేసిన రుచికరమైన వంటకాన్ని, రొట్టెను తన కుమారుడు యాకోబుకు ఇచ్చింది.+

18 అప్పుడు యాకోబు లోపలున్న వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి, “నాన్నా!” అన్నాడు. దానికి అతను, “చెప్పు బాబు, నువ్వు ఎవరు?” అన్నాడు. 19 యాకోబు అతనితో ఇలా అన్నాడు: “నేను నీ పెద్ద కుమారుడు ఏశావును.+ నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. దయచేసి లేచి కూర్చో, నేను వేటాడి తెచ్చిన మాంసాన్ని తిని, నన్ను దీవించు.”+ 20 అప్పుడు ఇస్సాకు తన కుమారుణ్ణి, “నా కుమారుడా, అది నీకు ఇంత త్వరగా ఎలా దొరికింది?” అని అడిగాడు. దానికి అతను, “నీ దేవుడైన యెహోవా దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు” అన్నాడు. 21 అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దయచేసి నా దగ్గరికి రా, నిన్ను తడిమి నువ్వు నిజంగా నా కుమారుడు ఏశావువో కాదో తెలుసుకుంటాను” అన్నాడు.+ 22 దాంతో అతను వాళ్ల నాన్న ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఇస్సాకు అతన్ని తడిమి చూసి, “గొంతు యాకోబు గొంతు, కానీ చేతులేమో ఏశావు చేతులు”+ అన్నాడు. 23 అతని చేతులు వాళ్ల అన్న ఏశావు చేతుల్లా వెంట్రుకలతో నిండివుండడంతో ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేదు. కాబట్టి అతన్ని దీవించాడు.+

24 ఇస్సాకు అతన్ని, “నువ్వు నిజంగా నా కుమారుడు ఏశావువేనా?” అని అడిగాడు. అందుకు అతను, “అవును, నేను ఏశావునే” అన్నాడు. 25 అప్పుడు ఇస్సాకు ఇలా అన్నాడు: “నా కుమారుడా, నువ్వు అడవిలో వేటాడి తెచ్చిన మాంసంలో కొంచెం నాకు పెట్టు; తర్వాత నేను నిన్ను దీవిస్తాను.” దాంతో అతను దాన్ని తెచ్చి ఇస్సాకుకు పెట్టాడు, ఇస్సాకు తిన్నాడు. ఆ తర్వాత అతను ద్రాక్షారసాన్ని కూడా తెచ్చాడు, ఇస్సాకు తాగాడు. 26 అప్పుడు వాళ్ల నాన్న ఇస్సాకు అతనితో, “నా కుమారుడా, దయచేసి దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు.+ 27 దాంతో అతను ఇస్సాకు దగ్గరికి వచ్చి అతనికి ముద్దు పెట్టాడు. అప్పుడు ఇస్సాకు అతను వేసుకున్న వస్త్రాల సువాసన చూసి,+ అతన్ని దీవిస్తూ ఇలా అన్నాడు:

“ఇదిగో, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన పొలం సువాసనలా ఉంది. 28 సత్యదేవుడు నీకు ఆకాశపు మంచును,+ సారవంతమైన నేలల్ని,+ విస్తారమైన ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని+ ఇవ్వాలి. 29 జనాలు నీకు సేవ చేయాలి, దేశాలు నీకు వంగి నమస్కారం చేయాలి. నువ్వు నీ సహోదరులకు యజమానిగా ఉండు, నీ తల్లి కుమారులు నీకు వంగి నమస్కారం చేయాలి.+ నిన్ను శపించే ప్రతీ ఒక్కరు శపించబడాలి, నిన్ను దీవించే ప్రతీ ఒక్కరు దీవించబడాలి.”+

30 ఇస్సాకు యాకోబును దీవించడం పూర్తయ్యి, అతను వాళ్ల నాన్న దగ్గర నుండి అలా వెళ్లాడో లేదో, అతని అన్న ఏశావు వేట నుండి తిరిగొచ్చాడు.+ 31 ఏశావు కూడా రుచికరమైన వంటకం తయారు చేసి వాళ్ల నాన్న దగ్గరికి తీసుకొచ్చి, ఇలా అన్నాడు: “నాన్నా, లేచి నేను తెచ్చిన మాంసం కొంచెం తిని, నన్ను దీవించు.” 32 దాంతో వాళ్ల నాన్న ఇస్సాకు అతన్ని, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. దానికి అతను, “నేను ఏశావును, నీ పెద్ద కుమారుణ్ణి” అన్నాడు.+ 33 అప్పుడు ఇస్సాకు భయంకరంగా వణికిపోతూ, “మరి, ఇంతకుముందు జంతువును వేటాడి నా దగ్గరికి తెచ్చింది ఎవరు? నువ్వు రాకముందే నేను దాన్ని తిన్నాను, అతన్ని దీవించాను. అతను ఖచ్చితంగా దీవించబడిన వాడిగా ఉంటాడు!” అన్నాడు.

34 వాళ్ల నాన్న మాటలు విన్నప్పుడు ఏశావు విపరీతమైన బాధతో బోరున ఏడుస్తూ, “నాన్నా, నన్ను కూడా దీవించు!” అన్నాడు.+ 35 కానీ ఇస్సాకు, “నీ తమ్ముడు నా దగ్గరికి వచ్చి నన్ను మోసం చేసి నీకు రావాల్సిన దీవెనను తీసుకెళ్లిపోయాడు” అన్నాడు. 36 దానికి ఏశావు, “అందుకే కదా, వాడికి యాకోబు* అని పేరు పెట్టింది! ఈ రెండుసార్లు వాడు నా స్థానాన్ని లాక్కున్నాడు.+ ముందేమో నా జ్యేష్ఠత్వపు హక్కును చేజిక్కించుకున్నాడు,+ ఇప్పుడేమో నాకు రావాల్సిన దీవెనను తీసుకెళ్లిపోయాడు!”+ అన్నాడు. తర్వాత ఏశావు ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు నాకోసం ఒక్క దీవెనను కూడా ఉంచలేదా?” 37 కానీ ఇస్సాకు ఏశావుతో ఇలా అన్నాడు: “ఇదిగో, నేను అతన్ని నీ మీద యజమానిగా నియమించాను;+ అతని సహోదరులందర్నీ అతనికి సేవకులుగా ఇచ్చాను; అతనికి ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని ఇచ్చాను.+ నా కుమారుడా, నీకు ఇవ్వడానికి ఇంక నా దగ్గర ఏమి మిగిలింది?”

38 ఏశావు వాళ్ల నాన్నతో, “నాన్నా, నీ దగ్గర కేవలం ఆ ఒక్క దీవెనే ఉందా? నన్ను కూడా దీవించు నాన్నా!” అన్నాడు. ఆ మాట అని ఏశావు బోరున ఏడుస్తూ కన్నీరుమున్నీరు అయ్యాడు.+ 39 అప్పుడు వాళ్ల నాన్న ఇస్సాకు అతనితో ఇలా అన్నాడు:

“ఇదిగో, నీ నివాసం సారవంతమైన నేలలకు, ఆకాశపు మంచుకు దూరంగా ఉంటుంది.+ 40 నువ్వు నీ కత్తి వల్లే బ్రతుకుతావు.+ నువ్వు నీ తమ్ముడికి సేవ చేస్తావు.+ కానీ నువ్వు విసిగిపోయినప్పుడు, నీ మెడ మీది నుండి అతని కాడిని విరగ్గొడతావు.”+

41 అయితే, వాళ్ల నాన్న ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన దీవెనను బట్టి ఏశావు యాకోబు మీద పగ పెంచుకున్నాడు.+ ఏశావు తన హృదయంలో ఇలా అనుకుంటూ ఉన్నాడు: “మా నాన్న గురించి ఏడ్వాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయి.+ ఆ తర్వాత, నేను నా తమ్ముడు యాకోబును చంపేస్తా.” 42 ఏశావు మాటల గురించి రిబ్కాకు తెలిసినప్పుడు, ఆమె వెంటనే తన చిన్న కుమారుడు యాకోబును పిలిపించి, అతనితో ఇలా అంది: “ఇదిగో! నీ అన్న ఏశావు నిన్ను చంపి నీ మీద పగతీర్చుకోవాలని అనుకుంటున్నాడు.* 43 నా కుమారుడా, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి. లేచి, హారానులో ఉన్న నా సహోదరుడు లాబాను దగ్గరికి పారిపో.+ 44 నీ అన్న కోపం చల్లారేవరకు కొంతకాలం అక్కడే ఉండు. 45 నీ అన్నకు నీమీద ఉన్న కోపం తగ్గి, నువ్వు అతనికి చేసింది అతను మర్చిపోయిన తర్వాత, నేను నిన్ను అక్కడి నుండి పిలిపిస్తాను. ఒకేరోజు నేను మీ ఇద్దర్నీ ఎందుకు పోగొట్టుకోవాలి?”

46 ఆ తర్వాత రిబ్కా ఇస్సాకుతో ఇలా అంటూ ఉంది: “హేతు కూతుళ్ల వల్ల నా ప్రాణం విసిగిపోయింది.+ యాకోబు కూడా హేతు కూతుళ్లలో ఒకర్ని, అంటే ఈ దేశంలో ఉంటున్న వీళ్లలాంటి ఒకర్ని పెళ్లి చేసుకుంటే, ఇక నేను బ్రతికి ఏం లాభం?”+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి