సామెతలు
2 నీతిమంతులు ఎక్కువైనప్పుడు ప్రజలు సంతోషిస్తారు,
దుష్టుడు పరిపాలించినప్పుడు ప్రజలు నిట్టూరుస్తారు.+
3 తెలివిని ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపెడతాడు,
వేశ్యలతో సహవాసం చేసేవాడు ఆస్తిని దుబారా చేస్తాడు.
4 న్యాయంతో రాజు దేశాన్ని సుస్థిరం చేస్తాడు,+
లంచాలు తీసుకునేవాడు దాన్ని నాశనం చేస్తాడు.
5 తన పొరుగువాణ్ణి పొగడ్తలతో ముంచెత్తేవాడు
అతని పాదాల కోసం వల పరుస్తున్నాడు.+
6 చెడ్డవాడు తన అపరాధం వల్ల ఉరిలో చిక్కుకుంటాడు,
నీతిమంతుడు సంతోషంతో కేకలు వేస్తూ ఆనందిస్తాడు.+
7 నీతిమంతుడు పేదవాళ్ల హక్కుల గురించి ఆలోచిస్తాడు,
దుష్టుడికి అలాంటి పట్టింపు ఉండదు.+
9 తెలివిగలవాడు తెలివితక్కువవాడితో వాదన పెట్టుకుంటే
తిట్టుకోవడం, ఎగతాళి చేసుకోవడమే ఉంటాయి తప్ప మనశ్శాంతి ఉండదు.
12 పరిపాలకుడు అబద్ధాల్ని పట్టించుకుంటే
అతని సేవకులంతా చెడ్డవాళ్లుగా ఉంటారు.+
13 పేదవాడికి, అణచివేసేవాడికి మధ్య ఈ పోలిక ఉంది:
ఆ ఇద్దరి కళ్లకూ యెహోవాయే వెలుగు ఇస్తున్నాడు.*
15 బెత్తం,* గద్దింపు తెలివిని కలిగిస్తాయి,+
అదుపులో పెట్టని పిల్లవాడు తన తల్లికి అవమానం తీసుకొస్తాడు.
16 చెడ్డవాళ్లు ఎక్కువైతే, అపరాధం ఎక్కువౌతుంది,
అయితే నీతిమంతులు వాళ్ల పతనాన్ని చూస్తారు.+
17 నీ కుమారుణ్ణి క్రమశిక్షణలో పెడితే, అతను నీకు విశ్రాంతినిస్తాడు;
నీ ప్రాణానికి ఎంతో సంతోషం తీసుకొస్తాడు.+
18 దర్శనం* లేని చోట ప్రజలు అదుపులేకుండా ప్రవర్తిస్తారు,+
అయితే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు.+
19 సేవకుడు మాటలకు లొంగడు,
అతనికి అర్థమైనాసరే లోబడడు.+
20 తొందరపడి మాట్లాడేవాణ్ణి చూశావా?+
అతనికన్నా తెలివితక్కువవాడు త్వరగా బాగుపడతాడు.+
21 సేవకుణ్ణి చిన్నప్పటి నుండి గారాబం చేస్తే
చివరికి అతను కృతజ్ఞతలేని వాడిగా తయారౌతాడు.
22 కోపిష్ఠి గొడవలు రేపుతాడు;
ముక్కోపి చాలా అపరాధాలు చేస్తాడు.+
24 దొంగతో చేరేవాడు తన ప్రాణాన్ని ద్వేషిస్తున్నాడు.