కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 8
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • అహరోనును, అతని కుమారుల్ని ​యాజకులుగా ప్రతిష్ఠించడం (1-36)

లేవీయకాండం 8:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:4; 39:33, 41
  • +నిర్గ 30:23-25
  • +నిర్గ 29:1, 2

లేవీయకాండం 8:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2014, పేజీలు 8-9

లేవీయకాండం 8:7

అధస్సూచీలు

  • *

    లేదా “అల్లిన దట్టీని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:39
  • +నిర్గ 39:27, 29
  • +నిర్గ 39:22
  • +నిర్గ 28:6; 39:2
  • +నిర్గ 28:8; 29:5; 39:20

లేవీయకాండం 8:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:15; 39:9
  • +నిర్గ 28:30

లేవీయకాండం 8:9

అధస్సూచీలు

  • *

    లేదా “పవిత్రమైన కిరీటాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:6; 39:27, 28
  • +నిర్గ 28:36; 39:30

లేవీయకాండం 8:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:26-28

లేవీయకాండం 8:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:4, 7; 30:30; 40:13; లేవీ 21:10; కీర్త 133:2

లేవీయకాండం 8:13

అధస్సూచీలు

  • *

    లేదా “చుట్టాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 28:40; 29:8, 9

లేవీయకాండం 8:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:10-14; లేవీ 4:3, 4; 16:6

లేవీయకాండం 8:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +హెబ్రీ 9:21, 22

లేవీయకాండం 8:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:8, 9

లేవీయకాండం 8:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 4:11, 12; 16:27

లేవీయకాండం 8:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:15-18; లేవీ 1:4

లేవీయకాండం 8:21

అధస్సూచీలు

  • *

    ఇది మోకాలు కింది భాగాన్ని సూచిస్తోంది.

  • *

    లేదా “శాంతపర్చే.”

లేవీయకాండం 8:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 8:33
  • +నిర్గ 29:19, 20

లేవీయకాండం 8:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2014, పేజీలు 9-10

లేవీయకాండం 8:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2014, పేజీలు 9-10

లేవీయకాండం 8:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:22-25

లేవీయకాండం 8:26

అధస్సూచీలు

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టె.

  • *

    వడ ఆకారంలో ఉన్న రొట్టె.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 2:4
  • +నిర్గ 29:1, 2

లేవీయకాండం 8:28

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

లేవీయకాండం 8:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 7:29, 30
  • +నిర్గ 29:26, 27; లేవీ 7:34, 35

లేవీయకాండం 8:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 30:30
  • +సం 3:2, 3
  • +నిర్గ 29:21

లేవీయకాండం 8:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 6:28
  • +నిర్గ 29:31, 32; 1కొ 9:13

లేవీయకాండం 8:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:34

లేవీయకాండం 8:33

అధస్సూచీలు

  • *

    లేదా “మీ చేతుల్ని అధికారంతో నింపడానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:30, 35; సం 3:2, 3

లేవీయకాండం 8:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:36; లేవీ 17:11

లేవీయకాండం 8:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 29:37
  • +సం 1:53

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 8:2నిర్గ 28:4; 39:33, 41
లేవీ. 8:2నిర్గ 30:23-25
లేవీ. 8:2నిర్గ 29:1, 2
లేవీ. 8:6నిర్గ 29:4
లేవీ. 8:7నిర్గ 28:39
లేవీ. 8:7నిర్గ 39:27, 29
లేవీ. 8:7నిర్గ 39:22
లేవీ. 8:7నిర్గ 28:6; 39:2
లేవీ. 8:7నిర్గ 28:8; 29:5; 39:20
లేవీ. 8:8నిర్గ 28:15; 39:9
లేవీ. 8:8నిర్గ 28:30
లేవీ. 8:9నిర్గ 29:6; 39:27, 28
లేవీ. 8:9నిర్గ 28:36; 39:30
లేవీ. 8:10నిర్గ 30:26-28
లేవీ. 8:12నిర్గ 29:4, 7; 30:30; 40:13; లేవీ 21:10; కీర్త 133:2
లేవీ. 8:13నిర్గ 28:40; 29:8, 9
లేవీ. 8:14నిర్గ 29:10-14; లేవీ 4:3, 4; 16:6
లేవీ. 8:15హెబ్రీ 9:21, 22
లేవీ. 8:16లేవీ 4:8, 9
లేవీ. 8:17లేవీ 4:11, 12; 16:27
లేవీ. 8:18నిర్గ 29:15-18; లేవీ 1:4
లేవీ. 8:22లేవీ 8:33
లేవీ. 8:22నిర్గ 29:19, 20
లేవీ. 8:24నిర్గ 24:6
లేవీ. 8:25నిర్గ 29:22-25
లేవీ. 8:26లేవీ 2:4
లేవీ. 8:26నిర్గ 29:1, 2
లేవీ. 8:29లేవీ 7:29, 30
లేవీ. 8:29నిర్గ 29:26, 27; లేవీ 7:34, 35
లేవీ. 8:30నిర్గ 30:30
లేవీ. 8:30సం 3:2, 3
లేవీ. 8:30నిర్గ 29:21
లేవీ. 8:31లేవీ 6:28
లేవీ. 8:31నిర్గ 29:31, 32; 1కొ 9:13
లేవీ. 8:32నిర్గ 29:34
లేవీ. 8:33నిర్గ 29:30, 35; సం 3:2, 3
లేవీ. 8:34నిర్గ 29:36; లేవీ 17:11
లేవీ. 8:35నిర్గ 29:37
లేవీ. 8:35సం 1:53
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 8:1-36

లేవీయకాండం

8 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “అహరోనును, అతనితోపాటు అతని కుమారుల్ని, వాళ్ల వస్త్రాల్ని,+ అభిషేక తైలాన్ని,+ పాపపరిహారార్థ బలి ఎద్దును, రెండు పొట్టేళ్లను, పులవని రొట్టెల గంపను+ తీసుకొని, 3 ఇశ్రాయేలీయులందర్నీ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర సమావేశపర్చు.”

4 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు, ఇశ్రాయేలీయులందరు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర సమావేశమయ్యారు. 5 అప్పుడు మోషే వాళ్లందరితో, “యెహోవా మనల్ని ఇలా చేయమని ఆజ్ఞాపించాడు” అని అన్నాడు. 6 తర్వాత మోషే అహరోనును, అతని కుమారుల్ని దగ్గరికి తీసుకొచ్చి నీళ్లతో స్నానం చేయించాడు.+ 7 తర్వాత మోషే అహరోనుకు చొక్కా+ తొడిగి, దట్టీ+ కట్టి, దానిమీద చేతుల్లేని నిలువుటంగీని,+ ఏఫోదును+ తొడిగి, ఆ ఏఫోదు కదలకుండా ఉండేలా దాని దట్టీని* కట్టాడు.+ 8 ఆ తర్వాత అతనికి వక్షపతకాన్ని+ కట్టి, దానిలో ఊరీము, తుమ్మీములను పెట్టాడు.+ 9 తర్వాత అతని తలమీద తలపాగా పెట్టి,+ సమర్పణకు గుర్తుగా ఉన్న పవిత్రమైన మెరిసే బంగారు రేకును*+ దానిమీద కట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

10 తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకొని గుడారాన్ని, దానిలో ఉన్న వాటన్నిటినీ అభిషేకించి+ పవిత్రపర్చాడు. 11 ఆ తర్వాత అతను ఆ అభిషేక తైలంలో కొంచెం తీసుకొని బలిపీఠం మీద ఏడుసార్లు చిమ్మి, ఆ బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటినీ, గంగాళాన్ని, దాని పీఠాన్ని అభిషేకించి వాటిని పవిత్రపర్చాడు. 12 చివరిగా, అతను కొంత అభిషేక తైలాన్ని అహరోను తలమీద పోసి, అతన్ని అభిషేకించి పవిత్రపర్చాడు.+

13 ఆ తర్వాత మోషే అహరోను కుమారుల్ని దగ్గరికి తీసుకొచ్చి వాళ్లకు చొక్కాలు తొడిగి, దట్టీలు కట్టి, తలపాగాలు పెట్టాడు.*+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

14 తర్వాత అతను పాపపరిహారార్థ బలి ఎద్దును తీసుకొచ్చాడు. అప్పుడు అహరోను, అతని కుమారులు ఆ పాపపరిహారార్థ బలి ఎద్దు తలమీద చేతులు పెట్టారు.+ 15 మోషే దాన్ని వధించి, దాని రక్తాన్ని తన వేలితో తీసుకొని+ బలిపీఠానికి అన్నివైపులా ఉన్న కొమ్ములకు పూసి, ఆ బలిపీఠాన్ని పాపం నుండి శుద్ధి చేశాడు. మిగిలిన రక్తాన్ని అతను బలిపీఠం అడుగుభాగాన పోశాడు. బలిపీఠం మీద ప్రాయశ్చిత్తం చేసేలా దాన్ని పవిత్రపర్చడానికి అలా చేశాడు. 16 ఆ తర్వాత అతను దాని పేగుల మీదున్న కొవ్వంతటినీ, కాలేయం మీదున్న కొవ్వును, రెండు మూత్రపిండాల్ని, వాటి కొవ్వును తీసుకున్నాడు. తర్వాత మోషే బలిపీఠం మీద పొగ పైకిలేచేలా వాటిని కాల్చాడు.+ 17 తర్వాత అతను ఆ ఎద్దులో మిగిలిన భాగాన్ని, దాని చర్మాన్ని, దాని మాంసాన్ని, దాని పేడను పాలెం బయట అగ్నితో కాల్చేయమని చెప్పాడు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

18 తర్వాత అతను దహనబలి పొట్టేలును దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు తలమీద చేతులు పెట్టారు.+ 19 మోషే దాన్ని వధించి, దాని రక్తాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాడు. 20 అతను ఆ పొట్టేలును ముక్కలుగా కోశాడు. మోషే దాని తలను, దాని ముక్కల్ని, మూత్రపిండాల చుట్టూ ఉన్న కొవ్వును తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు. 21 అతను దాని పేగుల్ని, కాళ్లను* నీళ్లతో కడిగాడు. మోషే మొత్తం పొట్టేలును బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు. అది దహనబలి, ఇంపైన* సువాసన. అది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

22 ఆ తర్వాత అతను రెండో పొట్టేలును, అంటే ప్రతిష్ఠాపన పొట్టేలును+ తీసుకొచ్చాడు. అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు తలమీద చేతులు పెట్టారు.+ 23 మోషే దాన్ని వధించి, దాని రక్తంలో కొంచెం తీసుకొని, అహరోను కుడిచెవి తమ్మెకు, అతని కుడిచేతి బొటనవేలుకు, కుడికాలి బొటనవేలుకు పూశాడు. 24 తర్వాత మోషే అహరోను కుమారుల్ని ముందుకు తీసుకొచ్చి, కొంచెం రక్తాన్ని వాళ్ల కుడిచెవి తమ్మెలకు, కుడిచేతి బొటనవేళ్లకు, కుడికాలి బొటనవేళ్లకు పూశాడు; కానీ మిగిలిన రక్తాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాడు.+

25 తర్వాత అతను దాని కొవ్వును, కొవ్విన తోకను, పేగుల మీదున్న కొవ్వంతటినీ, కాలేయం మీదున్న కొవ్వును, రెండు మూత్రపిండాల్ని, వాటి కొవ్వును, కుడికాలును తీసుకున్నాడు.+ 26 ఆ తర్వాత అతను యెహోవా ముందున్న పులవని రొట్టెల గంపలో నుండి ఒక భక్ష్యాన్ని,*+ నూనె పట్టించిన పిండితో చేసిన ఒక భక్ష్యాన్ని,*+ ఒక అప్పడాన్ని తీసుకున్నాడు. తర్వాత అతను వాటిని ఆ కొవ్వు మీద, ఆ కుడికాలి మీద పెట్టాడు. 27 ఆ తర్వాత అతను వాటన్నిటినీ అహరోను చేతుల్లో, అతని కుమారుల చేతుల్లో పెట్టి, యెహోవా ముందు అల్లాడించే అర్పణగా వాటిని ముందుకు, వెనుకకు కదిలించాడు. 28 తర్వాత మోషే వాళ్ల చేతుల్లో నుండి వాటిని తీసుకొని, బలిపీఠంపై ఉన్న దహనబలి మీద పెట్టి పొగ పైకిలేచేలా కాల్చాడు. అది ప్రతిష్ఠాపన బలి, ఇంపైన* సువాసన. అది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.

29 ఆ తర్వాత మోషే దాని ఛాతి భాగాన్ని తీసుకొని యెహోవా ముందు అల్లాడించే అర్పణగా దాన్ని ముందుకు, వెనుకకు కదిలించాడు.+ ప్రతిష్ఠాపన పొట్టేలులోని ఆ భాగం మోషేది అయ్యింది. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.+

30 మోషే అభిషేక తైలంలో+ కొంచెం, బలిపీఠం మీదున్న రక్తంలో కొంచెం తీసుకొని అహరోను మీద, అతని వస్త్రాల మీద, అతనితో ఉన్న అతని కుమారుల మీద, వాళ్ల వస్త్రాల మీద చిమ్మాడు. అలా అతను అహరోనును, అతని వస్త్రాల్ని, అతని కుమారుల్ని,+ వాళ్ల వస్త్రాల్ని పవిత్రపర్చాడు.+

31 తర్వాత మోషే అహరోనుకు, అతని కుమారులకు ఇలా చెప్పాడు: “దాని మాంసాన్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర ఉడకబెట్టండి.+ అక్కడ మీరు ఆ మాంసాన్ని ప్రతిష్ఠాపన గంపలోని రొట్టెలతోపాటు తింటారు. ఎందుకంటే ‘అహరోను, అతని కుమారులు దాన్ని తింటారు’ అని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు.+ 32 మిగిలిన మాంసాన్ని, రొట్టెల్ని మీరు అగ్నితో కాల్చేస్తారు.+ 33 మీరు ఏడురోజుల వరకు, అంటే మిమ్మల్ని ప్రతిష్ఠించే రోజులు ముగిసే వరకు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నుండి బయటికి వెళ్లకూడదు. ఎందుకంటే మిమ్మల్ని యాజకులుగా ప్రతిష్ఠించడానికి* ఏడురోజులు పడుతుంది.+ 34 మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి మనం ఈ రోజు చేసినట్టే మిగిలిన రోజుల్లో కూడా చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు.+ 35 మీరు చనిపోకుండా ఉండేలా ఏడురోజుల పాటు రాత్రింబగళ్లు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరే ఉండి,+ యెహోవా మీకు అప్పగించిన బాధ్యతల్ని నిర్వర్తించాలి;+ ఎందుకంటే అలా చేయాలని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు.”

36 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన వాటన్నిటినీ అహరోను, అతని కుమారులు చేశారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి