యెషయా
ఫలవంతమైన కొండ ప్రాంతంలో నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉండేది.
2 అతను నేలను తవ్వి రాళ్లను తీసి పారేశాడు.
తర్వాత అతను ద్రాక్షకాయలు కాస్తాయని ఎదురుచూస్తూ ఉన్నాడు,
కానీ అది పనికిరాని ద్రాక్షల్ని మాత్రమే కాసింది.+
మరైతే, నేను ద్రాక్షల కోసం ఎదురుచూసినప్పుడు
అది అడవి ద్రాక్షల్ని మాత్రమే ఎందుకు కాసింది?
5 ఇప్పుడు నేను నా ద్రాక్షతోటకు ఏం చేస్తానో
దయచేసి మీకు చెప్పనివ్వండి:
నేను దాని కంచెను తీసేస్తాను,
అది కాల్చేయబడుతుంది.+
నేను దాని రాతిగోడను కూలగొడతాను,
అది తొక్కబడుతుంది.
ముళ్లపొదలు, కలుపు మొక్కలు అందులో ఏపుగా పెరుగుతాయి.+
దానిమీద వర్షం కురిపించొద్దని నేను మేఘాలకు ఆజ్ఞాపిస్తాను.+
ఆయన న్యాయం కోసం చూస్తూ వచ్చాడు,+
కానీ అన్యాయమే కనిపించింది!
నీతి కోసం చూస్తూ వచ్చాడు,
కానీ రోదనే వినిపించింది!”+
8 దేశంలో మీరు మాత్రమే నివసించేలా,
స్థలం అనేదే మిగలకుండా పోయేవరకు
ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంటిని ఆక్రమిస్తూ
ఒక పొలానికి ఇంకో పొలాన్ని కలుపుకుంటూ+ పోతున్న మీకు శ్రమ!+
9 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా ప్రమాణం చేయడం నేను విన్నాను:
గొప్పగా, అందంగా ఉన్న చాలా ఇళ్లు పాడైపోతాయి;
వాటిని చూసి ప్రజలు జడుసుకుంటారు,
వాటిలో ఒక్కరు కూడా నివసించరు.+
10 పది ఎకరాల* ద్రాక్షతోట నుండి ఒక్క బాత్ కొలత* ద్రాక్షారసమే వస్తుంది;
ఒక హోమర్ కొలత* విత్తనాలు నాటితే, ఒక్క ఈఫా* ధాన్యమే పండుతుంది.+
11 మద్యం తాగాలని పొద్దున్నే లేచేవాళ్లకు శ్రమ!+
మత్తెక్కేలా చాలా రాత్రి వరకు మద్యం తాగుతూ ఉండేవాళ్లకు శ్రమ!
12 వాళ్ల విందుల్లో వీణ,* తంతివాద్యం,
కంజీర,* పిల్లనగ్రోవి,* ద్రాక్షారసం ఉంటాయి;
కానీ వాళ్లు యెహోవా కార్యాల గురించి ఆలోచించరు,
ఆయన చేతి పనుల్ని చూడరు.
13 కాబట్టి నా ప్రజలు చెరలోకి వెళ్తారు,
ఎందుకంటే వాళ్లకు జ్ఞానం లేదు;+
వాళ్ల ఘనులు ఆకలితో బాధపడతారు,+
వాళ్ల ప్రజలందరు దాహంతో ఎండిపోతారు.
14 కాబట్టి సమాధి* పెద్దదిగా తయారైంది
అది అపరిమితంగా నోరు తెరిచింది;+
దాని వైభవం,* దాని సమూహాలు, దాని అల్లరి, అలాగే ఉత్సాహధ్వని
అందులోకి దిగిపోతాయి.
15 మనిషి అణచివేయబడతాడు,
అతను తగ్గించబడతాడు,
గర్విష్ఠుల తలలు వంచబడతాయి.
16 సైన్యాలకు అధిపతైన యెహోవా తన తీర్పు* ద్వారా హెచ్చించబడతాడు;
సత్యదేవుడు, పవిత్రుడైన దేవుడు+ నీతి+ ద్వారా తనను తాను పవిత్రపర్చుకుంటాడు.
17 గొర్రెపిల్లలు తమ పచ్చికబయళ్లలో మేసినట్టు అక్కడ మేస్తాయి;
బాగా మేపబడిన జంతువులు ఒకప్పుడు మేసిన నిర్జన ప్రదేశాల్లో పరదేశులు ఆహారం తింటారు.
18 మోసమనే తాళ్లతో తమ దోషాన్ని,
బండి తాళ్లతో తమ పాపాన్ని లాగేవాళ్లకు శ్రమ;
19 వాళ్లు ఇలా అంటారు: “ఆయన్ని తన పనిని వేగవంతం చేయనివ్వండి;
మనం చూడగలిగేలా అది త్వరగా జరగాలి.
20 మంచిని చెడు అని, చెడును మంచి అని చెప్పేవాళ్లకు,+
వెలుగు స్థానంలో చీకటిని, చీకటి స్థానంలో వెలుగును ఉంచేవాళ్లకు,
తీపి స్థానంలో చేదును, చేదు స్థానంలో తీపిని పెట్టేవాళ్లకు శ్రమ!
22 మద్యం తాగే విషయంలో వీరులుగా ఉన్నవాళ్లకు,
మద్యపానీయాలు కలపడంలో నిపుణులైన వాళ్లకు+ శ్రమ!
23 లంచం తీసుకొని దుష్టుణ్ణి విడిచిపెట్టే వాళ్లకు,+
నీతిమంతులకు న్యాయం చేయని వాళ్లకు శ్రమ!+
24 అగ్ని కొయ్యకాలును* కాల్చేసినట్టు,
ఎండుగడ్డి మంటల్లో కాలిపోయినట్టు,
వాళ్ల వేరు కుళ్లిపోతుంది,
వాళ్ల పూలు ధూళిలా చెదిరిపోతాయి;
ఎందుకంటే వాళ్లు సైన్యాలకు అధిపతైన యెహోవా ధర్మశాస్త్రాన్ని* తిరస్కరించారు,
ఇశ్రాయేలు పవిత్ర దేవుని మాటను అగౌరవపర్చారు.+
25 అందుకే యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంటుంది,
ఆయన తన చేతిని వాళ్లకు వ్యతిరేకంగా చాపి వాళ్లను శిక్షిస్తాడు.+
పర్వతాలు కంపిస్తాయి,
వాళ్ల శవాలు వీధుల్లో పెంటలా పడివుంటాయి.+
ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,
వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.
26 దూర దేశాన్ని+ పిలవడానికి ఆయన ఒక ధ్వజాన్ని* నిలబెట్టాడు;
భూమి కొనల నుండి వాళ్లను రప్పించడానికి ఆయన ఈల వేశాడు;+
ఇదిగో! వాళ్లు శరవేగంతో దూసుకొస్తున్నారు.+
27 వాళ్లలో ఎవరూ అలసిపోలేదు, ఎవరూ తడబడడం లేదు.
ఎవరూ మగతగా లేరు, ఎవరూ నిద్రపోరు.
వాళ్ల నడుము చుట్టూ ఉన్న దట్టీ ఇంకా బిగించే ఉంది,
వాళ్ల చెప్పుల తాళ్లు తెగిపోలేదు.
28 వాళ్ల బాణాలన్నీ వాడిగలవి,
వాళ్ల విల్లులన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి.
వాళ్ల గుర్రాల డెక్కలు చెకుముకి రాళ్లలా ఉన్నాయి,
వాళ్ల చక్రాలు సుడిగాలిలా ఉన్నాయి.+
వాళ్లు గుర్రుమంటూ తమ వేటను పట్టుకుంటారు,
దాన్ని లాక్కెళ్తున్నప్పుడు విడిపించేవాళ్లు ఎవరూ ఉండరు.
30 ఆ రోజున సముద్రం ఘోషించినట్టు+
వాళ్లు దాన్ని చూసి గర్జిస్తారు.
ఎవరైనా దేశాన్ని చూసినప్పుడు దుఃఖం, అంధకారం కనిపిస్తాయి;
మేఘాల వల్ల చివరికి వెలుగు కూడా చీకటైపోయింది.+