కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల కార్యాలు విషయసూచిక

      • ఎఫెసులో పౌలు; కొంతమంది మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం (1-7)

      • పౌలు బోధించడం (8-10)

      • చెడ్డదూతల ప్రభావం ఉన్నా మంచి ఫలితాలు (11-20)

      • ఎఫెసులో అలజడి (21-41)

అపొస్తలుల కార్యాలు 19:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:24; 1కొ 3:5, 6
  • +1కొ 16:8, 9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 160

అపొస్తలుల కార్యాలు 19:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 2:38

అపొస్తలుల కార్యాలు 19:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 18:24, 25

అపొస్తలుల కార్యాలు 19:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోహా 1:15, 30
  • +మత్త 3:11; మార్కు 1:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 110

    యేసే మార్గం, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 19:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీ 29

అపొస్తలుల కార్యాలు 19:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 8:14, 17
  • +అపొ 2:1, 4; 10:45, 46; 1కొ 12:8, 10

అపొస్తలుల కార్యాలు 19:8

అధస్సూచీలు

  • *

    లేదా “తర్కిస్తూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 17:2
  • +అపొ 1:3; 28:30, 31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రజల్ని ప్రేమిద్దాం, పాఠం 7

అపొస్తలుల కార్యాలు 19:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 9:1, 2; 22:4
  • +మత్త 10:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రజల్ని ప్రేమిద్దాం, పాఠం 7

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 161-162

    కొత్త లోక అనువాదం, పేజీ 1838

అపొస్తలుల కార్యాలు 19:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ప్రజల్ని ప్రేమిద్దాం, పాఠం 7

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2018), 12/2018, పేజీ 8

    కావలికోట,

    12/15/2008, పేజీలు 17-18

    8/15/2007, పేజీ 10

అపొస్తలుల కార్యాలు 19:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 14:3

అపొస్తలుల కార్యాలు 19:12

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మార్కు 6:56; అపొ 5:15
  • +మత్త 10:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 162

అపొస్తలుల కార్యాలు 19:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 16:18

అపొస్తలుల కార్యాలు 19:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 8:28, 29; మార్కు 1:23, 24; లూకా 4:33, 34
  • +అపొ 16:16, 17

అపొస్తలుల కార్యాలు 19:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:10, 11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 162-163

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 24

    కావలికోట (అధ్యయన),

    4/2019, పేజీలు 22-23

    కావలికోట,

    9/1/1994, పేజీ 26

    1/1/1991, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 19:20

అధస్సూచీలు

  • *

    అనుబంధం A5 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 6:7; 12:24; కొలొ 1:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2001, పేజీలు 10, 12-13

అపొస్తలుల కార్యాలు 19:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1కొ 16:5
  • +అపొ 20:22
  • +అపొ 23:11

అపొస్తలుల కార్యాలు 19:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 16:1, 2
  • +2తి 4:20

అపొస్తలుల కార్యాలు 19:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 9:1, 2; 19:9; 22:4
  • +2కొ 1:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 163

అపొస్తలుల కార్యాలు 19:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 16:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1990, పేజీ 31

అపొస్తలుల కార్యాలు 19:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 158

అపొస్తలుల కార్యాలు 19:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 17:29; 1కొ 8:4
  • +ఎఫె 1:1

అపొస్తలుల కార్యాలు 19:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 161, 163

    కావలికోట,

    5/1/1990, పేజీ 31

అపొస్తలుల కార్యాలు 19:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 20:4; కొలొ 4:10; ఫిలే 23, 24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2007, పేజీ 10

అపొస్తలుల కార్యాలు 19:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 164

అపొస్తలుల కార్యాలు 19:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 163-164

అపొస్తలుల కార్యాలు 19:35

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 19:38

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 19:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 19:39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 19:40

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీ 30

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

అపొ. 19:1అపొ 18:24; 1కొ 3:5, 6
అపొ. 19:11కొ 16:8, 9
అపొ. 19:2అపొ 2:38
అపొ. 19:3అపొ 18:24, 25
అపొ. 19:4యోహా 1:15, 30
అపొ. 19:4మత్త 3:11; మార్కు 1:4
అపొ. 19:6అపొ 8:14, 17
అపొ. 19:6అపొ 2:1, 4; 10:45, 46; 1కొ 12:8, 10
అపొ. 19:8అపొ 17:2
అపొ. 19:8అపొ 1:3; 28:30, 31
అపొ. 19:9అపొ 9:1, 2; 22:4
అపొ. 19:9మత్త 10:14
అపొ. 19:11అపొ 14:3
అపొ. 19:12మార్కు 6:56; అపొ 5:15
అపొ. 19:12మత్త 10:1
అపొ. 19:13అపొ 16:18
అపొ. 19:15మత్త 8:28, 29; మార్కు 1:23, 24; లూకా 4:33, 34
అపొ. 19:15అపొ 16:16, 17
అపొ. 19:19ద్వితీ 18:10, 11
అపొ. 19:20అపొ 6:7; 12:24; కొలొ 1:6
అపొ. 19:211కొ 16:5
అపొ. 19:21అపొ 20:22
అపొ. 19:21అపొ 23:11
అపొ. 19:22అపొ 16:1, 2
అపొ. 19:222తి 4:20
అపొ. 19:23అపొ 9:1, 2; 19:9; 22:4
అపొ. 19:232కొ 1:8
అపొ. 19:24అపొ 16:16
అపొ. 19:26అపొ 17:29; 1కొ 8:4
అపొ. 19:26ఎఫె 1:1
అపొ. 19:29అపొ 20:4; కొలొ 4:10; ఫిలే 23, 24
అపొ. 19:38అపొ 19:24
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • క్రైస్తవ గ్రీకు లేఖనాలులో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 19:1-41

అపొస్తలుల కార్యాలు

19 అపొల్లో+ కొరింథులో ఉన్నప్పుడు పౌలు సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ ఎఫెసుకు+ వచ్చాడు. అక్కడ అతను కొంతమంది శిష్యుల్ని చూసి, 2 “మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రశక్తిని పొందారా?”+ అని అడిగాడు. వాళ్లు, “పవిత్రశక్తి గురించి అసలు మేమెప్పుడూ వినలేదు” అన్నారు. 3 అప్పుడు పౌలు, “మరైతే మీరు ఎలాంటి బాప్తిస్మం తీసుకున్నారు?” అని అడిగాడు. వాళ్లు, “మేము యోహాను బోధ ప్రకారం బాప్తిస్మం తీసుకున్నాం”+ అన్నారు. 4 దానికి పౌలు ఇలా అన్నాడు: “యోహాను తన తర్వాత వస్తున్న వ్యక్తి మీద,+ అంటే యేసు మీద విశ్వాసం ఉంచమని ప్రజలకు చెప్తూ పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం ఇచ్చాడు.”+ 5 ఆ మాటలు విన్నాక వాళ్లు ప్రభువైన యేసు పేరున బాప్తిస్మం తీసుకున్నారు. 6 పౌలు వాళ్లమీద తన చేతులు ఉంచినప్పుడు, వాళ్లమీదికి పవిత్రశక్తి వచ్చింది.+ దాంతో వాళ్లు వేరే భాషల్లో మాట్లాడడం, ప్రవచించడం మొదలుపెట్టారు.+ 7 వాళ్లంతా దాదాపు 12 మంది పురుషులు.

8 పౌలు సమాజమందిరంలోకి వెళ్లి+ దేవుని రాజ్యం గురించి ప్రసంగాలిస్తూ, చర్చిస్తూ,* ప్రజల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ధైర్యంగా మాట్లాడాడు.+ అలా మూడు నెలలపాటు చేశాడు. 9 అయితే కొంతమంది నమ్మడానికి మొండిగా నిరాకరించారు, ప్రభువు మార్గాన్ని+ ప్రజల ముందు దూషించారు. దాంతో పౌలు వాళ్లను విడిచిపెట్టి+ శిష్యుల్ని తనతోపాటు తీసుకెళ్లాడు. అతను తురన్ను పాఠశాల సభా భవనంలో రోజూ ప్రసంగాలిస్తూ ఉన్నాడు. 10 అతను రెండు సంవత్సరాల పాటు అలా చేశాడు. దానివల్ల ఆసియా ప్రాంతంలో ఉన్నవాళ్లందరూ అంటే యూదులు, గ్రీకువాళ్లు ప్రభువు వాక్యాన్ని విన్నారు.

11 అలాగే దేవుడు పౌలు ద్వారా ఎన్నో గొప్పగొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు.+ 12 చివరికి పౌలు శరీరాన్ని తాకిన చేతి రుమాళ్లను, నడికట్లను కూడా ప్రజలు రోగుల దగ్గరికి తీసుకెళ్లేవాళ్లు.+ అప్పుడు వాళ్లు బాగయ్యేవాళ్లు, చెడ్డదూతలు* బయటికి వచ్చేసేవాళ్లు.+ 13 అయితే, చెడ్డదూతల్ని వెళ్లగొడుతూ తిరిగే కొంతమంది యూదులు కూడా, “పౌలు ప్రకటిస్తున్న యేసు అధికారంతో నేను ఆజ్ఞాపిస్తున్నాను”+ అని అంటూ చెడ్డదూతలు పట్టినవాళ్ల మీద ప్రభువైన యేసు పేరును ఉపయోగించడానికి ప్రయత్నించేవాళ్లు. 14 స్కెవ అనే యూదుల ముఖ్య యాజకుడి ఏడుగురు కుమారులు కూడా అలా చేసేవాళ్లు. 15 కానీ ఆ చెడ్డదూత, “నాకు యేసు తెలుసు,+ పౌలు తెలుసు.+ కానీ మీరెవరు?” అని వాళ్లతో అన్నాడు. 16 అప్పుడు చెడ్డదూత పట్టిన వ్యక్తి వాళ్ల మీదికి ఎగిరి దూకి, వాళ్లందర్నీ లొంగదీసుకొని, వాళ్ల మీద గెలిచాడు. దాంతో వాళ్లు బట్టలు లేకుండా, గాయాలతో ఆ ఇంటినుండి పారిపోయారు. 17 ఈ విషయం గురించి ఎఫెసులో ఉన్నవాళ్లందరికీ అంటే యూదులకు, గ్రీకువాళ్లకు తెలిసింది. దాంతో అందరికీ భయం పట్టుకుంది. అంతేకాదు, యేసు ప్రభువు పేరుకు మహిమ కలుగుతూ వచ్చింది. 18 విశ్వాసులైన వాళ్లలో చాలామంది వచ్చి తమ పాపాల్ని అందరిముందు ఒప్పుకునేవాళ్లు, తాము చేసిన చెడ్డపనుల గురించి చెప్పేవాళ్లు. 19 నిజానికి, ఇంద్రజాలం చేసేవాళ్లలో చాలామంది తమ పుస్తకాల్ని ఒకచోటికి తీసుకొచ్చి అందరిముందు వాటిని కాల్చేశారు.+ వాటి ఖరీదు లెక్కేసినప్పుడు, అది 50,000 వెండి నాణేలు అని తేలింది. 20 అలా యెహోవా* వాక్యం ఎంతో గొప్ప రీతిలో వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది.+

21 ఇవి జరిగాక పౌలు మాసిదోనియ,+ అకయ గుండా ప్రయాణించి యెరూషలేముకు వెళ్లాలని+ నిర్ణయించుకున్నాడు. “యెరూషలేముకు వెళ్లాక, రోముకు కూడా వెళ్లాలి”+ అని అతను అనుకున్నాడు. 22 కాబట్టి అతను తనకు సహాయం చేసేవాళ్లలో ఇద్దర్ని అంటే తిమోతిని,+ ఎరస్తును+ మాసిదోనియకు పంపించాడు. పౌలు మాత్రం కొంతకాలం ఆసియా ప్రాంతంలోనే ఉండిపోయాడు.

23 ఆ సమయంలో, ప్రభువు మార్గం+ గురించి పెద్ద అలజడి రేగింది.+ 24 దేమేత్రి అనే వెండి పనివాడు అర్తెమి ఆలయం లాంటి చిన్నచిన్న వెండి ఆలయాలు తయారుచేస్తూ ఆ పని చేసేవాళ్లకు చాలా లాభాలు తెచ్చిపెట్టాడు.+ 25 అతను వాళ్లను, అలాంటి పని చేసే ఇతరుల్ని పోగుచేసి ఇలా అన్నాడు: “స్నేహితులారా, ఈ వ్యాపారం వల్లే మనం చాలా డబ్బు సంపాదిస్తున్నామని మీకు బాగా తెలుసు. 26 అయితే ఈ పౌలు, చేతులతో చేసిన దేవుళ్లు అసలు దేవుళ్లే కాదని+ చెప్తూ ఎఫెసులోనే+ కాకుండా దాదాపు ఆసియా ప్రాంతమంతటా చాలామందిని ఒప్పించాడు, వాళ్లు అతని మాటలు నమ్మారు. దీని గురించి మీరు చూస్తున్నారు, వింటున్నారు. 27 దీన్ని ఇలాగే కొనసాగనిస్తే, మనం చేస్తున్న ఈ వ్యాపారానికి చెడ్డపేరు వస్తుంది. అంతేకాదు, అర్తెమి మహాదేవి ఆలయానికి విలువే లేకుండా పోతుంది. ఆసియా ప్రాంతం అంతటా మాత్రమే కాకుండా భూమంతటా పూజించబడుతున్న అర్తెమి వైభవం కూడా నశించిపోతుంది.” 28 ఆ మాటలు వినగానే వాళ్లు కోపంతో ఊగిపోతూ, “ఎఫెసీయుల దేవత అర్తెమి గొప్పది!” అని అరవడం మొదలుపెట్టారు.

29 దాంతో ఆ నగరమంతా అయోమయంతో నిండిపోయింది, వాళ్లంతా కలిసి ఒక్కసారిగా నాటకశాలలోకి దూసుకొచ్చి పౌలు ప్రయాణ సహవాసులు, మాసిదోనియ వాళ్లు అయిన గాయియును, అరిస్తార్కును+ తమతో పాటు ఈడ్చుకొని వచ్చారు. 30 అప్పుడు పౌలు లోపలున్న ప్రజల దగ్గరికి వెళ్లాలని అనుకున్నాడు, కానీ శిష్యులు అతన్ని వెళ్లనివ్వలేదు. 31 పౌలుతో స్నేహంగా ఉన్న కొంతమంది పండుగల, ఆటల అధికారులు కూడా పౌలుకు కబురు పంపి, ఆ నాటకశాలలోకి వెళ్లే సాహసం చేయొద్దని అతన్ని వేడుకున్నారు. 32 అప్పుడు అక్కడున్న ప్రజలంతా అయోమయంలో ఉన్నారు, కొంతమంది ఒకలా ఇంకొంతమంది ఇంకోలా కేకలు వేస్తున్నారు. అయితే వాళ్లలో చాలామందికి అసలు వాళ్లు అక్కడికి ఎందుకొచ్చారో కూడా తెలీదు. 33 కాబట్టి యూదులు అలెక్సంద్రును ముందుకు తోస్తుండగా ప్రజలు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అతను ప్రజల్ని నిశ్శబ్దంగా ఉండమని చేతితో సైగ చేసి, ప్రజలకు తన వాదన వినిపించాలని అనుకున్నాడు. 34 కానీ అతను యూదుడని గుర్తుపట్టినప్పుడు వాళ్లందరూ ముక్తకంఠంతో, “ఎఫెసీయుల దేవత అర్తెమి గొప్పది!” అని కేకలు వేయడం మొదలుపెట్టారు. వాళ్లు అలా దాదాపు రెండు గంటలపాటు అరిచారు.

35 చివరికి ఆ నగర ముఖ్య అధికారి ప్రజల్ని శాంతపర్చి ఇలా అన్నాడు: “ఎఫెసు ప్రజలారా, అర్తెమి మహాదేవికి, ఆకాశం నుండి పడిన ప్రతిమకు ఎఫెసీయుల నగరం కాపలాదారు అని తెలియని మనిషి ఎవరు? 36 ఈ విషయాల్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండండి, దూకుడుగా ప్రవర్తించకండి. 37 ఎందుకంటే మీరు ఇక్కడికి తీసుకొచ్చిన మనుషులు గుళ్లను దోచేవాళ్లు కాదు, మన దేవతను దూషించేవాళ్లు కూడా కాదు. 38 కాబట్టి దేమేత్రికి+ గానీ, అతనితో ఉన్న పనివాళ్లకు గానీ ఎవరితోనైనా సమస్య ఉంటే, అందుకోసం న్యాయస్థానాలు ఉన్నాయి, స్థానిక అధిపతులు* ఉన్నారు. వాళ్ల ముందు తమ ఆరోపణలు వినిపించవచ్చు. 39 ఇది కాకుండా మీకు వేరే ఆరోపణలు ఏమైనా ఉంటే, అవి చట్టప్రకారం సభలో నిర్ణయించబడాలి. 40 ఈ రోజు జరిగిన విషయాల వల్ల మన మీద తిరుగుబాటు నేరం ఆరోపించబడే ప్రమాదముంది. ఎందుకంటే ఈ అల్లరిమూక ఎందుకు అలజడి రేపిందని అడిగితే, మనం కారణం చెప్పలేం.” 41 ఈ మాటలు చెప్పి అతను వాళ్లను పంపించేశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి