పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం యోబు విషయసూచిక యోబు విషయసూచిక 1 యోబు యథార్థత, సంపద (1-5) యోబు ఉద్దేశాల్ని సాతాను ప్రశ్నించాడు (6-12) యోబు ఆస్తిని, పిల్లల్ని కోల్పోయాడు (13-19) యోబు దేవుణ్ణి నిందించలేదు (20-22) 2 యోబు ఉద్దేశాల్ని సాతాను మళ్లీ ప్రశ్నించాడు (1-5) యోబు శరీరాన్ని మొత్తడానికి సాతానును అనుమతించడం (6-8) యోబు భార్య, “దేవుణ్ణి దూషించి చచ్చిపో!” అంది (9, 10) యోబు ముగ్గురు సహచరులు రావడం (11-13) 3 యోబు తాను పుట్టిన రోజును శపించడం (1-26) తాను ఎందుకు బాధపడుతున్నానని ప్రశ్నించడం (20, 21) 4 ఎలీఫజు మొదటిసారి మాట్లాడడం (1-21) అతను యోబు యథార్థతను హేళన చేశాడు (7, 8) అతను ఒక అదృశ్యశక్తి సందేశాన్ని చెప్పాడు (12-17) ‘దేవుడు తన సేవకుల్ని నమ్మడు’ (18) 5 ఎలీఫజు ఇంకా మాట్లాడడం (1-27) ‘దేవుడు తెలివిగలవాళ్లు తమ కుట్రలో తామే చిక్కుకునేలా చేస్తాడు’ (13) ‘దేవుడు ఇచ్చే క్రమశిక్షణను యోబు తిరస్కరించకూడదు’ (17) 6 యోబు జవాబు (1-30) బాధతో అరవడాన్ని సమర్థించుకున్నాడు (2-6) అతన్ని ఓదార్చేవాళ్లు మోసగాళ్లు (15-18) “నిజాయితీగా మాట్లాడే మాటలు బాధపెట్టవు!” (25) 7 యోబు జవాబు కొనసాగుతుంది (1-21) జీవితం బలవంతపు సేవ లాంటిది (1, 2) “నన్నెందుకు గురిగా చేసుకున్నావు?” (20) 8 బిల్దదు మొదటిసారి మాట్లాడడం (1-22) యోబు కుమారులు పాపం చేశారని ఆరోపించడం (4) ‘నువ్వు స్వచ్ఛంగా జీవించివుంటే దేవుడు నిన్ను కాపాడతాడు’ (6) యోబు భక్తిహీనుడని ఆరోపించడం (13) 9 యోబు జవాబు (1-35) మనిషి దేవునితో పోరాడలేడు (2-4) ‘దేవుడు పరిశోధించలేని వాటిని చేస్తాడు’ (10) దేవునితో ఎవరూ వాదించలేరు (32) 10 యోబు జవాబు కొనసాగుతుంది (1-22) ‘దేవుడు నాతో ఎందుకు పోరాడుతున్నాడు?’ (2) యోబుకు, దేవునికి మధ్య తేడా (4-12) ‘నాకు కాస్త ఉపశమనం దొరకాలి’ (20) 11 జోఫరు మొదటిసారి మాట్లాడడం (1-20) యోబు మాటలు వ్యర్థమైనవని నిందించడం (2, 3) చెడు చేయొద్దని యోబుకు చెప్పడం (14) 12 యోబు జవాబు (1-25) “నేను మీకన్నా తక్కువవాణ్ణేం కాదు” (3) ‘నన్ను చూసి నవ్వుకుంటున్నారు’ (4) ‘తెలివి దేవుని దగ్గర ఉంది’ (13) దేవుడు న్యాయమూర్తులు, రాజుల కన్నా గొప్పవాడు (17, 18) 13 యోబు జవాబు కొనసాగుతుంది (1-28) ‘నేను దేవునితోనే మాట్లాడతాను’ (3) “మీరంతా పనికిరాని వైద్యులు” (4) “నేను నిర్దోషినని నాకు తెలుసు” (18) దేవుడు తనను ఎందుకు శత్రువులా చూస్తున్నాడని అడిగాడు (24) 14 యోబు జవాబు కొనసాగుతుంది (1-22) మనిషి కష్టాలతో కొంతకాలమే బ్రతుకుతాడు (1) “చెట్టుకు కూడా ఒక ఆశ ఉంటుంది” (7) ‘నువ్వు నన్ను సమాధిలో దాచిపెడితే ఎంత బావుంటుంది!’ (13) “మనిషి చనిపోతే మళ్లీ బ్రతకగలడా?” (14) తన చేతుల పనిని చూడాలని దేవుడు ఎంతో కోరుకుంటాడు (15) 15 ఎలీఫజు రెండోసారి మాట్లాడడం (1-35) యోబుకు దైవభయం లేదని ఆరోపించడం (4) యోబు అహంకారి అని నిందించడం (7-9) ‘దేవుడు తన దూతల్ని నమ్మట్లేదు’ (15) ‘వేదనలు పడేవాడు దుష్టుడు’ (20-24) 16 యోబు జవాబు (1-22) “మీరు నన్ను ఓదార్చే బదులు నా బాధను పెంచుతున్నారు!” (2) దేవుడు తనను గురిగా పెట్టుకున్నాడని చెప్పడం (12) 17 యోబు జవాబు కొనసాగుతుంది (1-16) “ఎగతాళి చేసేవాళ్లు నన్ను చుట్టుముట్టారు” (2) ‘ఆయన నన్ను సామెతగా చేశాడు’ (6) “సమాధే నా ఇల్లు అవుతుంది” (13) 18 బిల్దదు రెండోసారి మాట్లాడడం (1-21) పాపులకు వచ్చే పర్యవసానాల్ని వర్ణించాడు (5-20) యోబుకు దేవుడు తెలీదని ఆరోపించాడు (21) 19 యోబు జవాబు (1-29) తన “స్నేహితుల” గద్దింపుల్ని తిరస్కరించాడు (1-6) అందరూ తనను వదిలేశారని అన్నాడు (13-19) “నా విమోచకుడు సజీవుడు” (25) 20 జోఫరు రెండోసారి మాట్లాడడం (1-29) యోబు తనను అవమానించినట్టు భావించాడు (2, 3) యోబు దుష్టుడని ఆరోపించాడు (5) పాపం చేయడం యోబుకు ఇష్టమని అన్నాడు (12, 13) 21 యోబు జవాబు (1-34) ‘దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు?’ (7-13) “ఓదార్చేవాళ్ల” నిజస్వరూపం బయటపెట్టాడు (27-34) 22 ఎలీఫజు మూడోసారి మాట్లాడడం (1-30) “మనిషి వల్ల దేవునికి వచ్చే లాభం ఏంటి?” (2, 3) యోబు స్వార్థపరుడని, అన్యాయస్థుడని నిందించాడు (6-9) ‘దేవుని దగ్గరికి తిరిగొస్తే మళ్లీ పూర్వస్థితికి వస్తావు’ (23) 23 యోబు జవాబు (1-17) తన వ్యాజ్యాన్ని దేవుని ముందు పెట్టాలని కోరుకున్నాడు (1-7) దేవుణ్ణి కనుగొనలేకపోయానని అన్నాడు (8, 9) “నేను పక్కకు తిరగకుండా ఆయన దారిలోనే నడిచాను” (11) 24 యోబు జవాబు కొనసాగుతుంది (1-25) ‘దేవుడు ఎందుకు ఒక తీర్పు రోజును నియమించట్లేదు?’ (1) దేవుడు దుష్టత్వాన్ని అనుమతిస్తున్నాడని అనడం (12) పాపం చేసేవాళ్లకు చీకటి అంటే ఇష్టం (13-17) 25 బిల్దదు మూడోసారి మాట్లాడడం (1-6) ‘మనిషి దేవుని ముందు నిర్దోషిగా ఎలా ఉండగలడు?’ (4) మనిషి యథార్థత వ్యర్థమని చెప్పాడు (5, 6) 26 యోబు జవాబు (1-14) “శక్తిలేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు!” (1-4) ‘దేవుడు భూమిని ఏ ఆధారం లేకుండా వేలాడదీశాడు’ (7) ‘దేవుని మార్గాల అంచులు మాత్రమే’ (14) 27 యోబు యథార్థంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు (1-23) “నా యథార్థతను విడిచిపెట్టను” (5) భక్తిహీనులకు ఆశ ఉండదు (8) “ఇంత వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు?” (12) దుష్టులకు చివరికి ఏమీ ఉండదు (13-23) 28 భూమ్మీది సంపదలకు, తెలివికి మధ్య తేడాను యోబు వివరించడం (1-28) ఖనిజాలు తీయడానికి మనిషి చేసే ప్రయత్నాలు (1-11) తెలివి ముత్యాల కన్నా విలువైనది (18) యెహోవాకు భయపడడమే నిజమైన తెలివి (28) 29 తనకు కష్టాలు రాకముందున్న మంచి రోజుల్ని యోబు గుర్తుచేసుకున్నాడు (1-25) నగర ద్వారం దగ్గర గౌరవించబడ్డాడు (7-10) న్యాయంగా జీవించిన రోజులు (11-17) ప్రతీఒక్కరు అతని సలహా వినేవాళ్లు (21-23) 30 మారిన తన పరిస్థితిని యోబు వివరించడం (1-31) పనికిమాలినవాళ్లు ఎగతాళి చేస్తున్నారు (1-15) దేవుని నుండి ఏ సహాయం లేనట్టు అనిపించడం (20, 21) ‘నా చర్మం నల్లబడింది’ (30) 31 యోబు తన యథార్థతను సమర్థించుకోవడం (1-40) “నా కళ్లతో ఒప్పందం చేసుకున్నాను” (1) దేవుడు తనను త్రాసులో కొలవాలని అడిగాడు (6) వ్యభిచారం చేసేవాడు కాదు (9-12) డబ్బును ప్రేమించేవాడు కాదు (24, 25) విగ్రహాల్ని పూజించేవాడు కాదు (26-28) 32 యువకుడైన ఎలీహు మాట్లాడడం మొదలుపెట్టాడు (1-22) యోబు మీద, అతని సహచరుల మీద కోప్పడ్డాడు (2, 3) మాట్లాడేముందు గౌరవంతో వేచివున్నాడు (6, 7) వయసు వల్లే ఒక వ్యక్తి తెలివిగలవాడు అవ్వడు (9) ఎలీహు మాట్లాడడానికి ఆత్రంగా ఉన్నాడు (18-20) 33 యోబు స్వనీతిని బట్టి ఎలీహు గద్దించాడు (1-33) విమోచన క్రయధనం దొరికింది (24) యౌవన బలం తిరిగొస్తుంది (25) 34 దేవుని న్యాయాన్ని, మార్గాల్ని ఎలీహు సమర్థించాడు (1-37) దేవుడు తనకు న్యాయం చేయలేదని యోబు అన్నాడు (5) సత్యదేవుడు ఎన్నడూ చెడుగా ప్రవర్తించడు (10) యోబుకు జ్ఞానం లేదు (35) 35 యోబు వాదన తప్పు అని ఎలీహు అన్నాడు (1-16) తాను దేవుని కన్నా నీతిమంతుణ్ణి అని యోబు అన్నాడు (2) దేవుడు ఎత్తులో ఉంటాడు, పాపం ఆయన మీద ప్రభావం చూపించదు (5, 6) యోబు దేవుని కోసం వేచివుండాలి (14) 36 దేవుని గొప్పతనాన్ని ఎలీహు ఘనపర్చాడు (1-33) లోబడితే వర్ధిల్లుతారు; భక్తిహీనులు తిరస్కరించబడతారు (11-13) ‘దేవుని లాంటి ఉపదేశకుడు ఎవరు?’ (22) యోబు దేవుణ్ణి ఘనపర్చాలి (24) “మనం గ్రహించగలిగే దానికన్నా దేవుడు చాలా గొప్పవాడు” (26) దేవుడు వర్షాన్ని, ఉరుముల్ని అదుపుచేస్తాడు (27-33) 37 ప్రకృతి శక్తులు దేవుని గొప్పతనాన్ని వెల్లడి చేస్తున్నాయి (1-24) దేవుడు మనుషుల పనుల్ని ఆపేయగలడు (7) ‘దేవుని అద్భుతమైన పనుల గురించి ఆలోచించు’ (14) దేవుణ్ణి అర్థంచేసుకోవడం మన శక్తికి మించింది (23) ఏ మనిషీ తాను తెలివిగలవాడినని అనుకోకూడదు (24) 38 మనిషి ఎంత తక్కువవాడో యెహోవా నేర్పించాడు (1-41) ‘భూమి సృష్టించబడినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు?’ (4-6) దేవుని కుమారులు సంతోషంగా పాటలు పాడారు (7) ప్రకృతిలో ఉన్నవాటి గురించి ప్రశ్నలు (8-32) “ఆకాశ నియమాలు” (33) 39 మనిషికి తెలిసింది ఎంత తక్కువో జంతు సృష్టి చూపిస్తుంది (1-30) కొండమేకలు, జింకలు (1-4) అడవి గాడిద (5-8) అడవి ఎద్దు (9-12) నిప్పుకోడి (13-18) గుర్రం (19-25) డేగ, గద్ద (26-30) 40 యెహోవా అడిగిన మరికొన్ని ప్రశ్నలు (1-24) తాను ఏమీ చెప్పలేనని యోబు ఒప్పుకున్నాడు (3-5) “నా న్యాయాన్ని నువ్వు ప్రశ్నిస్తావా?” (8) దేవుడు బహేమోత్ బలాన్ని వర్ణించడం (15-24) 41 దేవుడు అద్భుతమైన లివ్యాతన్‌ను వర్ణించడం (1-34) 42 యోబు యెహోవాకు జవాబివ్వడం (1-6) ముగ్గురు సహచరుల్ని గద్దించడం (7-9) యెహోవా యోబును మళ్లీ పూర్వస్థితికి తీసుకొచ్చాడు (10-17) యోబు కుమారులు, కూతుళ్లు (13-15)