కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 7/15 పేజీ 26
  • పరిపాలక సభలో కొత్త సభ్యుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభలో కొత్త సభ్యుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిపాలక సభ యొక్క క్రొత్త సభ్యులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పరిపాలక సభలో క్రొత్త సభ్యులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • పరిపాలక సభలో కొత్త సభ్యుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • చరిత్ర సృష్టించిన కూటం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 7/15 పేజీ 26

పరిపాలక సభలో కొత్త సభ్యుడు

యెహోవాసాక్షుల పరిపాలక సభలో సేవచేసేందుకు కొత్త సభ్యుడు ఎంపికయ్యాడని 2012 సెప్టెంబరు 5, బుధవారం ఉదయం అమెరికా, కెనడా బెతెల్‌ కుటుంబాల్లో ప్రకటన చేశారు. 2012 సెప్టెంబరు 1 నుండి సహోదరుడు మార్క్‌ సాండర్సన్‌ పరిపాలక సభ సభ్యునిగా సేవచేయడం మొదలుపెట్టాడు.

సహోదరుడు సాండర్సన్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సాన్‌ డీగోలో ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు, 1975 ఫిబ్రవరి 9న బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత 1983 సెప్టెంబరు 1 నుండి కెనడాలోని సస్కత్‌చెవాన్‌లో పయినీరుగా సేవ చేయడం మొదలుపెట్టాడు. 1990 డిసెంబరులో, అమెరికాలో పరిచర్య శిక్షణా పాఠశాల (ఇప్పుడు ‘ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల’) ఏడవ తరగతి నుండి పట్టభద్రుడయ్యాడు. సహోదరుడు సాండర్సన్‌ 1991 ఏప్రిల్‌లో కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌ అనే ద్వీపంలో ప్రత్యేక పయినీరుగా నియమితుడయ్యాడు. ప్రత్యామ్నాయ ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేశాక ఆయన 1997 ఫిబ్రవరిలో కెనడా బెతెల్‌లో సేవ చేసేందుకు ఆహ్వానాన్ని అందుకున్నాడు. 2000 నవంబరులో, ఆయనను అమెరికాలోని బ్రాంచి కార్యాలయానికి పంపించారు. అక్కడ ఆయన హాస్పిటల్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌లో, ఆ తర్వాత సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌లో సేవచేశాడు.

బ్రాంచి కమిటీ సభ్యుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలకు సహోదరుడు సాండర్సన్‌ 2008 సెప్టెంబరులో హాజరయ్యాడు. ఆ తర్వాత ఆయనను ఫిలిప్పీన్స్‌ బ్రాంచి కమిటీ సభ్యునిగా నియమించారు. 2010 సెప్టెంబరులో ఆయనను తిరిగి అమెరికాకు ఆహ్వానించారు. అక్కడ ఆయన పరిపాలక సభలోని సర్వీస్‌ కమిటీకి సహాయకునిగా సేవచేశాడు.

ప్రస్తుతం పరిపాలక సభలోని సభ్యులు

వెనక వరుసలో ఎడమ నుండి కుడికి: డి. హెచ్‌. స్ప్లేన్‌, ఆంథనీ మారిస్‌ III, డి. మార్క్‌ సాండర్సన్‌, జెఫ్రీ డబ్ల్యు. జాక్సన్‌, ఎమ్‌.ఎస్‌. లెట్‌. ముందటి వరుసలో ఎడమ నుండి కుడికి: ఎస్‌. ఎఫ్‌. హెర్డ్‌, జి. లోష్‌, జి. హెచ్‌. పియర్స్‌. పరిపాలక సభలోని సభ్యులందరూ అభిషిక్త క్రైస్తవులే.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి