శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
మార్చి 11తో ఆరంభమగు వారము
పాట 92 (51)
10 ని: స్థానిక ప్రకటనలు. మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. సమయము అనుమతించుకొలది ప్రస్తుత పత్రికలను స్థానిక ప్రాంతములో అందించు మార్గములను సూచించుము. ఈ వారాంతములో ప్రాంతీయ సేవలో పాల్గొనుటను ప్రోత్సహించుము.
15 ని: “ ‘రమ్ము!’ అను ఆహ్వానమును నిర్భయముగా అందించుము.” ప్రశ్నా సమాధానముల చర్చ మరియు ప్రదర్శనలు. సాంవత్సరిక వచనమైన ప్రకటన 22:17 యొక్క అన్వయింపును ఉన్నతపరచుచు మన రాజ్య పరిచర్యలోని సమాచారమును పూర్తిచేయుము. స్థానిక ప్రాంతములో ప్రస్తుత సాహిత్య అందింపును అందించు మార్గములను చూపు క్లుప్తమైన ప్రదర్శనను అందించుము.
10 ని: “కీర్తనయందు యెహోవాను స్తుతించుట” శీర్షికపై ఆధారపడి ప్రోత్సాహకర ప్రసంగము. ఈ సాయంకాల కార్యక్రమములోని పాటలను శీర్షికలోని అంశములను వివరించుటకు ఉపయోగించుము.
10 ని: స్థానిక అవసరములు. లేక ది వాచ్‌టవర్ 1990 అక్టోబరు 15, లోని “వై పర్స్యూ రైచస్నెస్?” పై ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో కా ఆగస్టు 1, 1990 లోని “దాచబడిన ధనమును వెదకునట్లు వెదకుచుండుము.)
పాట 20 (103) మరియు ముగింపు ప్రార్థన.
మార్చి 18తో ఆరంభమగు వారము
పాట 193 (22)
10 ని: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు. స్థానిక అవసరములను తీర్చుటలో సంఘము చూపిన ఔదార్యమునకు మెప్పును వ్యక్తపరచుము. పంపబడిన చందాల విషయములో సొసైటి ముట్టినట్లు వ్యక్తపరచినవాటిని సహోదరులకు తెలియజేయుము. వచ్చేవారపు సేవాకూటమునకు ప్రతిఒక్కరిని లివ్ ఫరెవర్ పుస్తకపు కాపీని తెచ్చుకొనుమని సహోదరులకు గుర్తు చేయుము.
20 ని: “సువార్తనందించుట—వీధిసాక్ష్యము ద్వారా” ప్రశ్నాసమాధానములు. ప్రచారకులు ఈ వారపు వీధి సాక్ష్యములో ఉపయోగించగలుగు అంశములను వివరించు క్లుప్తమైన రెండు లేక మూడు ప్రదర్శనలను అక్కడక్కడ చొప్పించుము.
15 ని: ఆక్సిలరీ పయినీరుగా సేవచేయుటకు పథకములను వేసుకొనుము. ఏప్రిల్ మరియు మే లేక రెండు మాసములలో పయినీర్లుగా చేయుటకు యిష్టపడువారి కొరకు సహాయకరమగు సమాచారముతో ప్రోత్సాహకర ప్రసంగము. ఆక్సిలరీ పయినీరు సేవనుగూర్చి ప్రకటనలలోని భాగమును సూచించుము. ప్రత్యేక కార్యక్రమ సమయములో పయినీరు సేవను చేయువారికి ప్రోత్సాహకరంగా మరియు సహాయకరంగా సంఘము మరియు వ్యక్తిగతముగా ప్రచారకులు ఏ ఏర్పాటులు చేయగలరో వివరించుము. కూటము అయిపోయిన వెంటనే ఆక్సిలరీ పయినీరు సేవకై దరఖాస్తులను కోరువారికి ఇవ్వగలగునట్లు వాటిని సిద్ధముగా కలిగియుండుము. మార్చి 30న జరుగు జ్ఞాపకార్థ ఆచరణకు మరియు ఏప్రిల్ 7 ప్రత్యేక బహిరంగ ప్రసంగమునకు ప్రజలను ఆహ్వానించుటకై ప్రత్యేక ప్రయత్నములు చేయబడునని చెప్పవచ్చును.
పాట 130 (58) మరియు ముగింపు ప్రార్థన.
మార్చి 25తో ఆరంభమగు వారము
పాట 71 (92)
10 ని: స్థానిక ప్రకటనలు. ప్రశ్నాభాగము. వారి సంఘము యొక్క సరైన పేపరును, మరియు అందరిని కాకపోయిన కొందరివైన పెద్దల పేర్లను తెలిసికొనియుండు అవసరతను సూచించుము. ఈ వారంతములో ప్రాంతీయసేవలో పూర్తిగా భాగము వహించుటను ప్రోత్సహించి ప్రస్తుత పత్రికలనుండి మాట్లాడదగు అంశములను సూచించుము.
15 ని: “యెహోవాసాక్షులుగా మన రాజ్య పరిచర్యను నెరవేర్చుట” మంచి అర్హుడైన బోధకుడగు సహోదరుడు అందించబడిన సమాచారమును చర్చించి మన పరిచర్యను వృద్ధి చేసికొనుటకు సూచించబడిన భాగముల ఉపయోగమును ప్రదర్శించును.
20 ని: ఏప్రిల్‌లో సేవకొరకు సిద్ధపడుము. ఏప్రిల్ మాసములో మనము లివ్‌ఫరెవర్ పుస్తకమును అందించుము. ఈ వారాంతములో ప్రచురణను అందించుటకు ఈ క్రింది సూచనలలో కొన్నిటిని చర్చించుము. క్రైస్తవులు కానివారికి అందించునపుడు అధ్యాయములు 7, 11, లేక 19 నుండి ఏ అంశములను మీరు ఉపయోగించగలరు? 11, 33, 100, 128, 131, 156, 157, 161 లేక 162 పేజీలలోని దృష్టాంతములను ప్రస్తుత సంభాషణ అంశమునకు ఎట్లు ముడిపెట్టుదువు? బహుశా పేజి అడుగున ఉన్న ప్రశ్నలు మీరు పుస్తకములో చూపదలిచిన అంశమును ఉన్నతపరచుటకు ఉపయోగించవచ్చును. ఈ పుస్తకపు అందింపును ప్రదర్శించుము.
పాట 211 (105) మరియు ముగింపు ప్రార్థన.
ఏప్రిల్ 1తో ఆరంభమగు వారము
10 ని: స్థానిక ప్రకటనలు మరియు దైవపరిపాలనా వార్తలు. తగిన పత్రికా అందింపులను సూచించి, ప్రదర్శించుము. ఈ వారంతములో ప్రాంతీయసేవలో పాల్గొనుటను ప్రోత్సహించుము.
15 ని: “హౌ జెహోవా ప్రాస్పర్స్ హిజ్ వర్క్.” ది వాచ్‌టవర్ 1990 డిశంబరు 1, పేజీలు 22-25 లోని శీర్షికపై ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: కా సెప్టెంబరు 1, 1990 “యెహోవాకు మనమెట్లు తిరిగి చెల్లింతుము?”)
20 ని: “రమ్ము!” అని చెప్పుటద్వారా భ్యూవ్యాప్తమైన ఆనందములో పాల్గొనుము. 1991 జనవరి 1, వాచ్‌టవర్‌లో చూపబడిన శీర్షికల ఆధారముగా ప్రసంగము, ఇంటర్వ్యూలు, అనుభవములు. (ప్రాంతీయ భాషలో: కా ఏప్రిల్ 1, 1991) అదే ఆనందమును ప్రతిబింబించు స్థానికంగా ఆసక్తిగల ప్రచారకుల అనుభవములు వ్యక్తముచేసిన భావములతోపాటు ది వాచ్‌టవర్ సమాచారమునుండి ప్రోత్సాహకరమగు ఉత్సాహవంతమైన ప్రసంగము.
పాట 63 (32) మరియు ముగింపు ప్రార్థన.