కీర్తనయందు యెహోవాను స్తుతించుట
1 దయచేసి మీ కీర్తనల పుస్తకమును వెనుక అట్టతోగల చివరిపేజీకి తెరవండి. మీరు ఏమి చూస్తారు? యెహోవా పరిశుద్ధ ఆలయములో లేవీయుల గాయకుల బృందము నోర్లు విశాలముగా తెరచి ఉత్సాహముతో పాడుచున్నారు. పాటపాడుయనునది యెహోవా ఆలయములో సత్యారాధనయందు ఒక ప్రాముఖ్యమైన భాగమైయున్నది. రాజైన దావీదు కాలములో ఆలయమందు సేవించు వారిలో 10 శాతము కంటె ఎక్కువమంది సంగీతముతో యెహోవాను స్తుతించుటకు నియమించబడిరి. ఆ సంఖ్యలో 288 మంది శిక్షణపొందిన గాయకులు. అందరూ “ప్రవీణులు.” వారు తమ గాత్రమును గంభీరముగా తీసుకున్నారని నీవు నిశ్చయత కలిగియుండవచ్చును.—1 దిన. 23:3, 5; 25:7.
2 క్రైస్తవకాలముల కొచ్చినట్లయిన, యేసు మరియు ఆయన అపొస్తలులు ప్రభువురాత్రి భోజనమైన తరువాత ఒక కీర్తన పాడినట్లు మనము తెలుసుకొందుము. (మార్కు 14:26) మరియు అపొస్తులుడైన పౌలు దేవునికి స్తుతులను పాడుడి అని మనకు పదేపదే చెప్పుచున్నాడు. కొలొస్సయులు 3:16, NWలో ఆయన ఇలా వ్రాసెను: “సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో యెహోవాను గూర్చి గానముచేయుచు సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.”—ఎఫెసీయులు 5:19, 20ని కూడా చూడుము.
3 రాజ్య పాటలను పాడుట యెహోవాను మనము స్తుతించు మార్గములలో ఒక మార్గము. కావున మనము మన పూర్ణ హృదయములో పాడవద్దా? అట్లు చేసినప్పుడు మనము యెహోవాకు స్తుతిని చెల్లించెదము. ఆయన మన ప్రార్థనలను వినునట్లే ఆయనను గూర్చి పాడు మన పాటలను కూడా ఆయన వినును. నిజముగా మనము బిగ్గరగా బయటకు పాడినప్పుడు ఇతరులకు మనము ఆనందమును కలుగజేయగలము. మనకై మనమును ప్రయోజనము కలుగజేసుకొందుము.
4 పాటలలోనున్న చక్కని మాటలను తలంచుము. ఇవి నిజముగా “ఒకరినొకరము బోధించుకొనుటకును, బుద్ధిచెప్పుకొనుటకును” సహాయకరమైయున్నవి. మన కీర్తనలు ఎంతటి మంచి ఉపదేశమును కలిగియున్నవి! ఆ ఉపదేశమును గంభీరముగా తీసుకొనుట ద్వారా అది ఆత్మఫలమును సాగుచేసికొనుటకు సహాయపడి, దాని ద్వారా లోక సంబంధమైన మరియు శరీరసంబంధమైన ప్రభావములు మనలో అమర్యాదగా జొరబడకుండా చేయుటకు సహాయపడును. ‘మన హృదయములలో గానము చేయుట’ యెహోవాను నిర్భయముగాను మరియు ఉత్సాహముగాను సేవించుటకు మనలను ప్రోత్సహించును.
5 కూటములలో పాటను పాడుటకు మంచి ప్రారంభమును కలిగియుండులాగున అధ్యక్షుడు పాటయొక్క సంఖ్యనేగాక దాని అంశమును లేక పేరును ప్రకటించవచ్చును. అప్పుడప్పుడు ఆ పాటకు లేఖనాధారము మరియు అందించబడబోవు సమాచారమునకు దానికి గల సంబంధమునుగూర్చి తెలియజేసి వ్యాఖ్యానించవచ్చును.
6 కింగ్డమ్ మెలొడీస్ మరియు మన పాటల పియానో కేసెట్స్ కూడా ఈ పాటలతో మంచి పరిచయమేర్పరచుకొనుటకు మన కుటుంబములకు సహాయపడగల మంచి సాధనములు, వాటితో కలిసి పాడుటకు మనము వాటిని ఉపయోగించుటయనునది మన పాటలతో ఎక్కువ పరిచయమేర్పరచుకొనుటకు ఆనందదాయకమైన మార్గమైయుండును.
7 పాటద్వారా మన ప్రేమగల పరలోకపు తండ్రిని స్తుతించు మన కర్తవ్యమును గూర్చి లేఖనములు పదేపదే మనకు గుర్తు చేయుచున్నవి. కావున మనము పూర్ణాత్మతో అట్లు చేయుదము. ఆవిధముగా మన మధ్యలోకి వచ్చు క్రొత్త వారికి హృదయమును ఉప్పొంగజేయు సాక్ష్యమును ఇవ్వగలము. అవును పురాతన కాలపు దావీదువలెనే యెహోవాకు పాటపాడి ఆయనకు స్తుతిగానము చేయుదము.—కీర్తన. 108:1-3.