కుటుంబమునకు ఇండెక్స్ ఎట్లు ప్రయోజనమునివ్వగలదు
1 కుటుంబ సభ్యులనుగూర్చి మాట్లాడుచు 1 తిమోతి 5:4 ఇట్లనుచున్నది: “మొదట తమ యింటి వారియెడల దైవభక్తి కనుపరచుటకు నేర్చుకొననిమ్ము.” నిజమే, కుటుంబసభ్యులతో మన వ్యవహారముల సంబంధముగా దైవభక్తిని అభ్యసించుట నేర్చుకొనవలసినదే. కుటుంబ సభ్యులయెడల లక్ష్యము చూపుట క్రైస్తవ కర్తవ్యములలో ఒక భాగము గనుక, ఈ విషయములో మనకు దైవిక నడిపింపు అవసరము. కుటుంబ జీవితములో తలయెత్తు వివిధ పరిస్థితులకు నడిపింపును కనుగొను నిమిత్తము వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ మనకు సహాయపడగలదు.
2 ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహము చేసుకొన్నప్పుడు ఒక కుటుంబము ఉనికిలోనికి వచ్చును. (ఆది. 2:24) మీరు వివాహమునుగూర్చి తీవ్రముగా ఆలోచించుచున్నారా? “వివాహము” అనే ముఖ్యశీర్షిక క్రింద “జతను ఎంచుకొనుట” అనే ఉపశీర్షికను చూడగలరు. కొన్నిసార్లు కష్టతరమగు ఈ ప్రయత్నమునకు సహాయకరమైన సలహాకొరకు ఇందలి సూచన మిమ్మును నడుపును. ఆ ఇండెక్స్‌లో “భర్తపాత్ర” మరియు “భార్యపాత్ర” అనే ఉపశీర్షికలుకూడ కలవు. ప్రతిదానిలోను వివాహము చేసికొనబోయెడి వారికి, యిప్పటికే వివాహితులైన వారికి ప్రయోజనకరమగు సమాచారమునకు నడుపు సూచనలు ఇవ్వబడెను. అదనంగా, “పరస్పర సంభాషణ” “సన్నిహితత్వము” మరియు “సమాధానము” అనే ఉపశీర్షికలుకూడ వివాహమును ధృఢపరచునట్టి సమాచారమును చూపును. సమస్యలు తలయెత్తినప్పుడు, “సమస్యలు” అనే ఉపశీర్షిక వీటిని పరిష్కరించుకొనగలగు ప్రభావవంతమైన సలహాకు మిమ్మును నడుపును.
3 పిల్లలు యెహోవాయిచ్చు స్వాస్థ్యము. (కీర్త. 127:3) తల్లిదండ్రులు తమ పిల్లలను “యెహోవాయొక్క శిక్షలోను బోధలోను” ఎలా పెంచగలరు? (ఎఫె. 6:4) యెహోవా తన వాక్యముద్వారాను, నమ్మకమును బుద్ధిమంతుడైన తరగతిద్వారాను అందిస్తున్న నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులకు తమ పిల్లల భావాలు, వారి అవసరతనుగూర్చిన పరిజ్ఞానముండాలి. ఇండెక్స్ నందు “పిల్లలు” “యౌవనులు” అను ముఖ్యశీర్షికలనుండి సహాయకరమగు హెచ్చరికలు మరియు సలహాలు కనుగొనవచ్చును. మరి యౌవనుల హృదయములలో యెహోవా శాసనములను నాటుట విషయమేమి? “పిల్లవానికి తర్ఫీదు” అనే శీర్షిక. యెహోవాతో వ్యక్తిగత సంబంధమును పెంచుకొనుటకు వారికి ఎలా సహాయపడాలి. సత్యము కొరకు అపేక్షను ఎలా పెంపొందించాలి అను వాటితోపాటు పిల్లలను పెంచు ప్రతివిధమైన రూపమును గూర్చిన గ్రాహ్యమగు చర్చకు నడుపును.—1 పేతు. 2:2.
4 ముందుగా ఏర్పాటు చేయబడిన కుటుంబ బైబిలు చర్చలు కుటుంబవిజయానికి అతిప్రాముఖ్యమైయున్నవి. (ద్వితీ. 6:6-9; యెష. 54:13; ఎఫె. 5:25, 26) “కుటుంబములు” అనే శీర్షికక్రింద ఆనందదాయకమైన బైబిలు చర్చల కొరకైన యోచనలకు సూచనలివ్వబడెను. ప్రస్తుత ఇండెక్స్‌లో “బైబిలు పఠనము” అనే ఉపశీర్షిక క్రింద “ఆనందదాయకము చేయుట” “ఆసక్తికరంగా చేయుట” అనే ఉపశీర్షికలున్నవి. మరియు యెహోవాసాక్షుల జీవితగాధలను అప్పుడప్పుడు ఎందుకు పరిశీలించకూడదు? “పూర్తికాల పరిచర్య” అనే శీర్షికక్రింద “నేనెన్నడు విచారించని ఒక ఎంపిక” “నా హృదయకోరికను పొందగలుగుట” అనే పేర్లు కలిగిన జీవితగాధలకు మీరు మరల్చబడుదురు. అంతేకాదు అట్టి వృత్తాంతములు “మిషనరీలు” అనుదానిక్రింద పేర్కొనబడినవి. వీటన్నింటినిగూర్చి పూర్తిగా “యెహోవాసాక్షుల జీవితగాధలు” అను దానిలో పేర్కొనబడినవి.
5 కుటుంబజీవిత సలహాలను, తలంపులను సమకూర్చుకొనుటకు వాచ్‌టవర్ బ్లికేషన్స్ ఇండెక్స్ ఒక అద్భుతమైన పరికరము. కుటుంబపరిధిలో మీ బాధ్యతలను నిర్వర్తించుటలో గొప్ప ఆనందమును పొందులాగున అది మీకు సహాయపడును గాక.