వర్షాకాలములో అత్యంత దైవిక పరిపాలనా ప్రయోజనమును పొందుట
1 భవిష్యత్తుకొరకు సిద్ధపడు వారిదే భవిష్యత్తు అని చెప్పబడినది. కార్యసాధన భావనకు వచ్చునట్లు మనము మన సమయమును ఉపయోగించగోరినయెడల మనము ముందుగానే పథకము వేసికొనవలెను. ఇండియాలో అనేక ప్రాంతములందు వర్షాకాలము జూలైలో ప్రారంభమగును. ఈ కాలమందు మన సమయమును శ్రేష్టమైన దైవిక పరిపాలనా ఉపయోగము చేయు నిమిత్తము మనమిప్పుడు ఏ పథకములు వేయవచ్చును?
2 మార్చి 30న జ్ఞాపకార్థ దినమునకు క్రొత్తగా ఆసక్తిగల వ్యక్తులు అనేకులు హాజరైనారు. వారి ఆత్మీయ పురోభివృద్ధి ఎక్కువగా వారు మననుండి పొందు సహాయముపై ఆధారపడియుండును. జిల్లా సమావేశమునకు హాజరగుట వారికి ఆశీర్వాదకరమైయుండును. దానివలన కలుగు అనేక ఆత్మీయ ప్రయోజనములనుగూర్చి వారికి తెలియజేసి, ప్రయాణయేర్పాట్లలో వారికి సహాయపడి, బహుశ మనతో లేక యితరులతో కలిసివెళ్లడానికి వారిని ఆహ్వానించవచ్చును.
3 సమావేశమునకు హాజరగుట తటస్థసాక్ష్యమిచ్చుటకు అదనపు అవకాశములను తెరచును. క్రొత్త సాహిత్యములను కూడ తీసికొని వెళ్లుట ముందుగా పథకము వేయుటలో చేర్చవలెను. పెట్రోలు స్టేషన్లలో, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే వారికి, ఆలాగే ప్రజారవాణా వాహనములను నడుపువారికి మనము సాక్ష్యమియ్యవచ్చును. ఉల్లాసవంతమైన అనుభవాలను పొందుటకు ఇది శ్రేష్టమైన మార్గము.
4 సంవత్సరాంతములో సమావేశములు జరుగుచున్నచోట అనేకమంది యౌవనులు తమ సెలవుదినములను సమావేశ దినములకు జత చేస్తారు. సంపూర్ణమైన వినోదము ప్రయోజనకరమైనను, ఈ ఖాళీసమయములో కొంతభాగాన్ని సాక్ష్యపుపనిలో అనగా ఆ సహాయపయనీరువంటి పనిలో ఎక్కువ భాగము వహించుటకు ఉపయోగించవచ్చునా? తమ పిల్లలు పథకములు వేయునట్లు తల్లిదండ్రులు వారికి ఇప్పుడే సహాయము చేయవలెను. వివిధ కుటుంబములకు చెందిన పిల్లలు దానిలో భాగము వహించి ఒక గుంపువలె కలిసి పనిచేయవచ్చును. దానిలో పాలుపొందలేకపోవుచున్న ఇతరులు ఎక్కువ సేవచేయుటకు, ముఖ్యముగా వారు మధ్యలో సేవయందు భాగము వహించుటకు కృషిచేయవలెను.
5 కొందరికి తమ లౌకిక ఉద్యోగములందు సెలవు లభించి ఇతరప్రాంతములకు ప్రయాణించుదురు. అచ్చట స్థానికంగావున్న సంఘమునకు హాజరగుటకు, సేవయందు భాగము వహించుటకు పథకములు వేస్తే మంచి పరస్పర ప్రోత్సాహము లభించగలదు. బహు అరుదుగా పనిచేసే ప్రాంతమునకు మీరు వెళ్లుచుండవచ్చును. అచ్చట అరుదుగా రాజ్యవర్తమానమును విను ప్రజలకు సాక్ష్యమిచ్చే అవకాశము మీకు లభించును.
6 అనేక యౌవనులు ఇటీవల పట్టభద్రులై ఉండవచ్చు లేదా త్వరలోనే పట్టభద్రులు కావచ్చును. జీవితములలో తమ గమ్యములనుగూర్చి తీవ్రమైన యోచన చేయుటకిది అవకాశమిచ్చుచున్నది. దైవిక పరిపాలనా గమ్యములపై తమ భవిష్యత్తు పథకములను వేయు యౌవనులు నిశ్చయముగా ఆశీర్వదించబడుదురు. (1 యోహా. 2:15-17) రెగ్యులర్ పయనీరు సేవను చేపట్టు నిర్ణయము, అనేక ప్రత్యేక ఆధిక్యతలతో కూడిన సంతృప్తిదాయకమైన జీవనవిధానమునకు నడుపగలదు.
7 మనలో అనేకమందికి లభ్యమగు అదనపు సమయముండును. ‘మన కొరకు అనుకూల సమయమును సంపాదించుకొనుటలో’ జ్ఞానయుక్తముగా ప్రవర్తించుదుము. (ఎఫె. 5:15, 16 NW) యెహోవా సేవలో నిమగ్నమైయుండు పథకములు మనకును, ఇతరులకును శాశ్వత ప్రయోజనములను తెచ్చును.—1 తిమో. 4:15, 16.