ప్రశ్నాభాగము
• దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలయందు విద్యార్థులు ఎంత తరచుగా నియామకములను కలిగియుంటారు?
దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల యొక్క ఒకానొక ముఖ్య ఉద్దేశ్యము బహిరంగ ప్రసంగీకులను వృద్ధిచేయుటయై యున్నది. అందుచేతనే, దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల పట్టికలో అనేక ప్రసంగములు సహోదరులకే నియమించబడినవి.
అయినను, యెహోవా ప్రజలందరికి క్రైస్తవ పరిచర్యలో ప్రభావితమగు ప్రచారకులుగా ఉపదేశకులుగా తర్ఫీదునిచ్చుట, పాఠశాలయొక్క మరొక ప్రాముఖ్యమైన ఉద్దేశ్యమైయున్నది. ఈ హేతువుచేత సహోదరీలుకూడ అందు పాలుపొందుట సమంజసమైయున్నది.
పాఠశాలనుండి పూర్తి ప్రయోజనమును పొందుటకు, అందులో చేరియున్నవారు విద్యార్థి నియామకములను క్రమముగా పొందవలెను. కనీసం ప్రతి మూడు నెలలకు ఒక్కసారైనా ప్రతి విద్యార్థికి ఒక నియామకముండవలెనని సలహా ఇవ్వబడినది. ప్రాంతీయ పరిస్థితులు అనుమతిస్తే సహోదరులకు అదనపు నియామకములనివ్వవలెను. ఉపదేశ ప్రసంగములను బైబిలు ఉన్నతాంశములను క్రమముగా ఇచ్చుచున్న పెద్దలకు, విద్యార్థి ప్రసంగములను కూడ ఇవ్వనవసరములేదు.
దాదాపు అర్థ శతాబ్దమునుండి, లక్షలాదిమంది రాజ్య వర్తమానమును అందించుటలో బాగుగా మాట్లాడుట ఎట్లో నేర్చుకొనుటకు, ఆత్మీయ పురోభివృద్ధి సాధించుటకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల సహాయపడినది. యెహోవానుండి లభించుచున్న ఇట్టి అద్భుతమైన ఏర్పాటును పూర్తిగా వినియోగించుకొనమని అందరు ప్రోత్సహించబడుచున్నారు. దేవునికి అంగీకృతమైన వారిగా మనలను సమర్పించుకొనుటకు “సత్యవాక్యమును చేపట్టుటలో సిగ్గుపడనక్కరలేని” పనివానిగా ఉండుట మన గురియై యుండవలెను.—2 తిమో. 2:15.