కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/92 పేజీ 2
  • జనవరి కొరకైన సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి కొరకైన సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఉపశీర్షికలు
  • జనవరి 6తో ఆరంభమగు వారము
  • జనవరి 13తో ఆరంభమగు వారము
  • జనవరి 20తో ఆరంభమగు వారము
  • జనవరి 27తో ఆరంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1992
km 1/92 పేజీ 2

జనవరి కొరకైన సేవా కూటములు

జనవరి 6తో ఆరంభమగు వారము

పాట 168 (84)

15 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసికొనబడిన ప్రకటనలు. “రాజ్య పరిచర్య పాఠశాల దైవపరిపాలనా విద్యను అందించును.” ఇటీవలి పత్రికలలోనుండి ప్రాంతీయసేవలో ఉపయోగింపబడగల ప్రత్యేక అంశములను ప్రస్తావించుము. శనివారపు పత్రికనందించు పనికి మద్దతునిమ్మని ప్రోత్సహించుము.

18 ని: “లివ్‌ ఫరెవర్‌ పుస్తకముతో నిజమైన జ్ఞానమును ప్రకటించుము.” ప్రశ్నాజవాబుల పరిశీలన. ప్రచురణతో పరిచయము కలిగియుండు ప్రాముఖ్యతను నొక్కితెల్పుము.

12 ని: స్థానిక అవసరతలు లేక “డు యు డినై సిన్‌ఫుల్‌ టెండెన్సీస్‌?” ది వాచ్‌టవర్‌, 1991, ఆగష్టు 15, పై ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: “బాప్తిస్మము తీసికొనిన క్రైస్తవులుగా దైవభక్తిని వెంటాడుము,” కావలికోట, 1990, జూలై 1.

పాట 31 (3) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 13తో ఆరంభమగు వారము

పాట 166 (90)

5 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలను చేర్చుము.

25 ని: “సువార్తనందించుట—ఇంటింటి సేవలో వివిధ రీతులను ఉపయోగించుట ద్వారా.” ప్రేక్షకులు పాల్గొనుటతో దీనిని ఒక చర్చగా నిర్వహించుము. 4, 5 పేరాలను పరిశీలించునప్పుడు, రీజనింగ్‌ పుస్తకమునుండి లేక 1988, జూలై 15 వాచ్‌టవర్‌ నుండి రెండు విభిన్న ఉపోద్ఘాతములను ఉపయోగించుచు సులభముగా, సూటిగా సమీపించుటను ప్రదర్శించుము. మీ ప్రాంతమునకు అభ్యాసకరమైన ఉపోద్ఘాతములను ఎంపిక చేసికొనుము.

15 ని: ప్రశ్నా భాగము. ఒక పెద్ద దీనిని నిర్వహించును. బాప్తిస్మములయొద్ద మన ప్రవర్తనకు ఎందుకు శ్రద్ధనివ్వవలెను మరియు అది ఎట్లు యెహోవా మీద, రాజ్య వర్తమానము మీద ప్రతిబింబించునో నొక్కితెల్పుము.

పాట 196 (16) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 20తో ఆరంభమగు వారము

పాట 169 (32)

10 ని: స్థానిక ప్రకటనలు. సంఘము ఇచ్చిన విరాళము ముట్టినట్లు సొసైటి తెల్పిన విషయముతోపాటు సంఘలెక్కల నివేదికను చేర్చుము.

20 ని: “యెహోవా సేవలో పనిరద్దీగా యుండుట.” ప్రశ్నా జవాబుల చర్చ. నలుగురు సభ్యుల కుటుంబముతో ప్రదర్శన. 1992 క్యాలండరును ఉపయోగించి, ఫిబ్రవరిలో తమ కాలపట్టికను తండ్రి కుటుంబముతో చర్చించును. ప్రాంతీయ సేవకు ఏ దినములు కేటాయించవలెను, కుటుంబములోని ప్రతివ్యక్తితో తానెట్లు పనిచేయవలెనో ఆయన ఆలోచించును.

15 ని: “పయినీరు సేవ—గొప్ప దీవెనలను తెచ్చు సేవ.” ప్రశ్నా జవాబుల విచారణ. ఇద్దరు పయినీర్లను పరిచయము చేయుము. పయినీరు సేవలో ప్రవేశించుటకు వారెటువంటి ఆటంకములను అధిగమించిరి? వారి పయినీరు సేవను విజయవంతము చేసికొనుటకు వారికేమి సహాయము చేసినది? తమ స్వంత పరిస్థితులను ప్రార్థనాపూర్వకముగా ఆలోచించుమని అందరిని ప్రోత్సహించుము.

పాట 40 (31) మరియు ముగింపు ప్రార్థన.

జనవరి 27తో ఆరంభమగు వారము

పాట 197 (22)

10 ని: స్థానిక ప్రకటనలు. ప్రస్తుత పత్రికల అందింపులను ప్రదర్శించుము.

20 ని: “రాజ్య విస్తరణయందు పాలుపంచుకొనుట.” అనుబంధ పుటలలోని శీర్షికను చర్చించుట. మధ్యమధ్యలో తమకు ప్రత్యేకముగా ప్రయోజనమిచ్చిన సొసైటి ప్రచురణలయెడల తమ ప్రశంసపూర్వకమైన, లేక ప్రాంతీయ సేవలో వాటిని ఉపయోగించుటను గూర్చిన క్లుప్త అనుభవములను తెలియజేయు సహోదరుల వ్యాఖ్యానములను చేర్చుము.

15 ని: “రీడ్‌ టు ఎక్స్‌ప్యాండ్‌ యువర్‌ హారిజోన్స్‌.” దైవపరిపాలనా పాఠశాల కాపరి నిర్వహించవలెను. ఈ ప్రసంగము అవేక్‌! 1991, జూలై 22, పుటలు 25-7 పై ఆధారపడి, మంచి చదువరులుగా ఉండవలసిన అవసరతను నొక్కితెల్పును. కేవలము అనర్గళముగా చదువుట మాత్రమే సరిపోదని; మనము మంచి అవగాహనను వృద్ధిచేసికొనుటను ప్రశంసించవలెనని ప్రేక్షకులకు సహాయము చేయుము. (ప్రాంతీయ భాషలో: “దేవుని వాక్యము సత్యము.” కావలికోట, నవంబరు 1, 1991.)

పాట 201 (102) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి