ఫిబ్రవరి కొరకైన సేవా కూటములు
ఫిబ్రవరి 3తో ఆరంభమగు వారము
పాట 201 (102)
5 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు.
20 ని: “ప్రపంచవ్యాప్త భద్రత సమీపముగా ఉన్నదని అందరు తెలిసికొందురు గాక.” క్లుప్త పరిచయము తర్వాత, సమయము అనుమతించు కొలది ప్రతి సంభాషణా విధానమును పరిశీలించి బహుగా సిద్ధపడిన ప్రచారకులచే వాటి ఉపయోగమును ప్రదర్శించుము. సాధ్యమైనట్లయిన, 4వ పేరాను ఒక యౌవనుడు ప్రదర్శించుట మంచిది. 5వ పేరాలోని సంభాషణా విధానము గృహస్థుని మదిలో కనీసము ఒక ఆసక్తికరమైన లేఖన తలంపును కల్గించుటకు ప్రచారకునికి అవకాశమిచ్చును. 4వ పేజీలో సూచింపబడిన పరిచయములను మరియు వాటిలోని ఒక సంభాషణా విధానమును ఉపయోగించుటకు సహోదరులను స్నేహపూర్వకముగా ప్రోత్సహించుము.
20 ని: “హౌటు హెల్ప్ డిప్రెస్‌డ్ వన్స్ రీగెయిన్ జాయ్.” 1990, మార్చి 15, వాచ్‌టవర్, 26-30 పుటలలోని శీర్షికపై ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: 1990, అక్టోబరు 1, కావలికోట, “మిమ్ములను సంతోషపర్చగల్గే పని.”)
పాట 30 (117) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 10తో ఆరంభమగు వారము
పాట 126 (25)
5 ని: స్థానిక ప్రకటనలు.
10 ని: “ప్రాంతీయ సేవ కొరకు సిద్ధపడుటకు ఒక అభ్యాససిద్ధమైన మార్గం.” ప్రేక్షకులతో శీర్షికను చర్చించుము, ఆ పిమ్మట, ఈ విధముగా చేయుట తమకు ప్రయోజనమివ్వగల విధానములపై ప్రత్యేక వ్యాఖ్యానములు చేయుటకు ముందుగనే ఏర్పాటుచేసికొనిన ముగ్గురు లేక నలుగురు ప్రచారకులను అడుగుము. ఉదాహరణకు, వివిధ రకములైన అందింపులు, స్థానిక ప్రాంతమునకు అనుగుణ్యముగా అవలంబించగల విధానములు, మెత్తదనం, (Flexibility) లేక అందింపులో ప్రచారకులు ఆనందముపొందు అంశములను ఎంపికచేసికొనుటకు ఈ విధమైన మార్గం అనుమతించునని వారు వ్యాఖ్యానించవచ్చును. ప్రాంతీయ సేవ కొరకైన కూటములకు వారి మన రాజ్య పరిచర్య ప్రతిని తీసికొనిరమ్మని ప్రచారకులను ప్రోత్సహించుము.
20 ని: “గృహస్థులు వినునట్లుచేయుట కొరకైన ఉపోద్ఘాతములు.” స్థానిక ప్రాంత విధానమును క్లుప్తముగా విచారించుము. గృహస్థులకు ఏ విషయములు ప్రాముఖ్యము? స్థానికముగా సఫలముకాగల ఉపోద్ఘాతములు మరియు అందింపులపై దృష్టి కేంద్రీకరించుము. బాగుగా సిద్ధపడిన ప్రచారకుడు ఈ ప్రసంగమును ప్రదర్శించి ప్రత్యేక ధరకు పీస్ అండ్ సెక్యూరిటీ పుస్తకము (పాత సంచిక) లేక మరేదైనా పాత పుస్తకము అందించునట్లు చేయుము. శీర్షికలో సూచింపబడినట్లుగా ప్రచారకుడు తన ప్రసంగమును సిద్ధపర్చు కొనవలెను. ఆ తర్వాత పాఠశాల-వయస్సున్న యౌవనుడు అదే ప్రసంగమును ప్రదర్శించి పత్రికలు అందించుటతో దానిని ముగించును. ప్రాంతీయ సేవలో ఈ పద్ధతిని ప్రయత్నించుమని అందరిని ప్రోత్సహించుము.
10 ని: స్థానిక అవసరతలు లేక “ఆటిట్యూడ్ ఆఫ్ ట్రూ క్రిస్టియన్స్ టువార్డ్ ది వరల్డ్ అండ్ పీపుల్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్.” రీజనింగ్ పుస్తకము, పుటలు 437-8పై ఆధారపడి పెద్దచే ప్రసంగము.
పాట 130 (58) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 17తో ఆరంభమగు వారము
పాట 176 (1)
10 ని: స్థానిక ప్రకటనలు మరియు దైవ పరిపాలనా వార్తలు. సంఘలెక్కల తనిఖీ నివేదికను, విరాళములు అందినట్లు వచ్చిన సమాచారమును చేర్చుము.
15 ని: పయినీరు సేవ నా కొరకా? ఈ దేశములో ప్రచారకులందరిలో 5 శాతము మంది క్రమ పయినీర్లుగా ఉన్నారు. పోల్చుటకు స్థానిక అంకెలను పేర్కొనుము. త్వరలోనే ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేయు యౌవనస్థులతో సహా, మనలోని అనేకులు పూర్తికాల సేవ కొరకు వీలుకల్గించు కొనగలమా? ముగ్గురు క్రమ పయినీర్లను, ఒక యౌవనుని, ఒక గృహిణిని, మరియు ఉద్యోగ విరమణచేసిన వ్యక్తిని పరిచయము చేయుము. (ఒకవేళ ఈ క్రమ పయినీర్లు అందుబాటులో లేనట్లయిన, సహాయ పయినీర్లను లేక పయినీర్లుగా సేవచేసిన ప్రచారకులను ఉపయోగించవచ్చును.) ఆర్ధిక విషయములను విచారించుము. మీ ప్రాంతములో ఏ విధములైన పార్ట్‌టైం పనులు లభ్యమగును? తమ జీవనము గడుపుటకు ప్రతివారు ఏమిచేయుచున్నారు? ఖరీదైన అలవాట్ల విషయమై వారెటువంటి మార్పులు చేసికొనియున్నారు? కావలసిన గంటలను చేరుకొనుటకు సమయపట్టికను ఆలోచించుము. ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నవా? వారెట్లు ఎదుర్కొనుచున్నారు? వారింకా ఎటువంటి సవాళ్లను విజయవంతముగా ఎదుర్కొనిరి? పరిచయములు క్రియాత్మకముగా ప్రోత్సాహకరముగా ఉండవలెను. ఇంకా ఎక్కువమంది పూర్తికాల సేవ చేపట్టుటకు తీర్మానించుకొనులాగున వ్యక్తిగత పరిస్థితులను పరిశీలించు కొనవలెనని స్నేహపూర్వకముగా ప్రేక్షకులకు విన్నవించుము.
20 ని: తలిదండ్రులలో ఒక్కరే ఉన్నవారు తమ పిల్లలకు ఎట్లు సహాయపడగలరు. క్లుప్త ఉపోద్ఘాతము తర్వాత, ఒక తల్లి యిద్దరు పిల్లలతో కలిసి ప్రాంతీయ సేవకు సిద్ధపడుటను గూర్చిన ప్రదర్శన. క్రితమెన్నటికంటే సంస్థలో ఈనాడు తలిదండ్రులలో ఒక్కరే ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. తిమోతి తల్లి మరియు అవ్వ అతనికి సత్యము నేర్పిన విధము తలిదండ్రులందరు పాటించుటకు ఒక చక్కని మాదిరి నిచ్చుచున్నది. (2 తిమో. 1:5; 3:14, 15) ప్రదర్శన: తల్లి, టీనేజ్ కుమార్తె, ఇంకా చిన్నమ్మాయి సాయంకాల భోజనము అయిన తర్వాత, వంటగదిలో బల్లయొద్ద కూర్చొనియుందురు. పాత్రల సంగతి చూచుటకు ముందు సేవ కొరకైన తమ అందింపులను ఒకసారి చూచెదమని, తాను గృహస్థురాలిగా ఉందునని తల్లి చెప్పును. చిన్నకుమార్తె మన రాజ్య పరిచర్య 4వ పేజీలోని ఒక పరిచయమును ఎన్నుకొని తనతల్లితో సంభాషించును. చక్కగా చేసినందుకు తల్లి ఆమెను ఆప్యాయముగా మెచ్చుకొని సొసైటి సూచించిన లేఖనము చదువుమని అడుగును. చిన్నమ్మాయి వెంటనే యెషయా 9:6, 7 తీసి చదువును. ఆ పిదప తల్లి ఆమె పుస్తకములను ఎట్లు అందించునని పెద్దకుమార్తెను అడుగును. ఆ కుమార్తె మన రాజ్య పరిచర్య 1వ పేజీలోని ఒక సంభాషణా విధానమును ఎంపిక చేసికొని తన తల్లితో దానిని సంభాషించును. తల్లి ఆమెనుకూడ మెచ్చుకొని ప్రాంతీయ సేవలో పుస్తకములను అందించుటకు వీలుగా పరిచయములను, సంభాషణా విధానములను అభ్యాసము చేయుమని తన యిద్దరి కుమార్తెలను ప్రోత్సహించును. తాము కొంతసేపు అభ్యాసము చేసిన పిదప తాము పాత్రల సంగతి చూసెదమని ఆ కుమార్తెలు చెప్పుదురు. సంఘమందలి కుటుంబములన్నియు తమ పిల్లలకు ప్రేమపూర్వకముగా సహాయము చేయవలెనని ప్రోత్సహించుచు పెద్ద ఈ భాగమును ముగించును.
పాట 183 (73) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 24తో ఆరంభమగు వారము
పాట 192 (10)
15 ని: పెద్ద స్థానిక ప్రకటనలుచేసి ఆ పిమ్మట స్థానిక అవసరతలను పరిశీలించును. సమయము అనుమతించు కొలది, తాజా పత్రికలనుండి వివిధరకములైన మాట్లాడదగు అంశములను చర్చించుము. మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలో సూచించబడిన పరిచయములు, సంభాషణా విధానములలో ఒకదానితో చక్కగా ముడిపెట్టగల దానిని ఎంచుకొనుము. ఆ తర్వాత బాగుగా సిద్ధపడిన ప్రచారకుడు పరిచయమును, సంభాషణా విధానమును ఉపయోగించి, పూర్తి ప్రసంగమునిచ్చుచు పత్రికలు అందించుటను ప్రదర్శించుము. ప్రజలను సంభాషణలోనికి దించి సూచింపబడిన అందింపులను ఉపయోగించుట ద్వారా, మన వర్తమానము యెడల ప్రజల హృదయములలో ఆసక్తి రేపుట కష్టము కాదని సూచించుము.
18 ని: “పునర్దర్శనముల బాధ్యతను అంగీకరించుము.” ప్రశ్నాజవాబులు. పునర్దర్శనములు చేయుటలో అందరు పూర్తిగా భాగము వహించవలెనని స్నేహపూర్వకముగా ప్రోత్సహించుము. వచ్చేవారము సేవా కూటములో పునర్దర్శనములందు ఏమిచెప్పవలెనో చర్చించబడును గనుక అందరు తిరిగి హాజరు కావలెనని ప్రోత్సహించుము.
12 ని: రీజనింగ్ పుస్తకము, పుటలు 25-6నుండి “అబార్షన్” అను అంశముయొక్క చర్చ. అది ఈనాడు ఎట్లు వార్తలకెక్కినది, లక్షలాది మందికి ఎట్లు బహు ఆసక్తికరమైన సంగతిగా తయారైనదో చూపించుచు, అంశమును క్లుప్తముగా పరిచయము చేసిన తర్వాత, ఒక సహోదరి బైబిలు పఠనము జరిగించు సెట్టింగును పరిచయము చేయుము. ఆ క్రొత్త బైబిలు విద్యార్థిని సహోదరితో, తాను గర్భవతినను విషయమై ఎట్లు బహుచింతను కలిగియున్నదో వివరించును. కుటుంబ ఆర్ధిక పరిస్థితి మంచిగా లేనందున, తానెంత బాధపడుచున్నదో ఆమె వివరించును. ఆమె లోకసంబంధమైన బంధువులు వెంటనే గర్భస్రావము చేయించుకొమ్మని ఆమెను బలవంత పెట్టుచున్నారు. ఇంకా జన్మించని శిశువును యెహోవా ఎలా దృష్టించుచున్నాడు మరియు ఆయన గర్భస్రావము సరియైనదని ఆయన యెంచునా అని చూచుటకు లేఖనములను పరిశోధించుటకు రీజనింగ్ పుస్తకము చూద్దామని సహోదరి సూచించును. ఆ తర్వాత వారు 25-6 పేజీలలోని ప్రశ్నలను, లేఖనములను, ఇతర వ్యాఖ్యానములను చర్చించుదురు. తర్కించుటకు, జీవముయొక్క పవిత్రతను గుణగ్రహించుటకు సహోదరి విద్యార్థినికి సహాయము చేయవలెను.
పాట 164 (73) మరియు ముగింపు ప్రార్థన.
మార్చి 2తో ఆరంభమగు వారము
పాట 92 (51)
10 ని: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్, మే నెలలందు సహాయ పయినీరు సేవ చేయుటకు ఇప్పుడే పథకములు వేసికొనుమని ప్రచారకులను ప్రోత్సహించుము. ప్రాంతీయసేవలో మరియెక్కువగా పాల్గొనుటకు తాముచేయగల్గిన ఏర్పాట్లు ఏమైనాకలవా అని చూచుకొనుటకు, ఏప్రిల్, మే నెలలలో సెలవునందుండు కుటుంబములను ఆలాగే యౌవనులను ప్రోత్సహించుము.
20 ని: “తిరిగి సందర్శించినప్పుడు మీరేమి చెప్పుదురు?” ప్రేక్షకులతో చర్చించుము మరియు పేరాలను విచారించుచుండగా వాటిలోని సూచనలను ప్రదర్శించుటకు ప్రచారకులను సిద్ధముచేయుము. ఈ క్లుప్త ప్రదర్శనలను ముందుగానే అభ్యాసము చేసికొనవలెను.
15 ని: “లెండింగ్ మనీ టు ఫెల్లో క్రిస్టియన్స్.” 1991, అక్టోబరు 15, వాచ్‌టవర్, 25-8 పుటలలోని శీర్షికపై అధారపడి పెద్దచే ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: 1990, అక్టోబరు 1, కావలికోట, లోని లాటరీ టిక్కెట్లపై పాఠకులనుండి ప్రశ్నలు.)
పాట 147 (38) మరియు ముగింపు ప్రార్థన.