కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/92 పేజీ 2
  • జూన్‌ కొరకు సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ కొరకు సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఉపశీర్షికలు
  • జూన్‌ 8తో ప్రారంభమగు వారము
  • జూన్‌ 15తో ప్రారంభమగు వారము
  • జూన్‌ 22తో ప్రారంభమగు వారము
  • జూన్‌ 29తో ప్రారంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1992
km 6/92 పేజీ 2

జూన్‌ కొరకు సేవా కూటములు

జూన్‌ 8తో ప్రారంభమగు వారము

పాట 72 (58)

10 నిమి: స్థానిక ప్రకటనలు, మరియు మన రాజ్య పరిచర్య నుండి ప్రకటనలు. ఈ వారాంతములో సేవకు రమ్మని ప్రచారకులను ప్రోత్సహించుము.

20 నిమి: “జూన్‌లో కావలికోట అందించుట” శీర్షికయొక్క ప్రశ్నా సమాధానముల చర్చ. ప్రతి సంచిక 2వ పేజీ పైభాగములో వివరించబడిన కావలికోట ఉద్దేశ్యమును చర్చలో చేర్చుము. ఈ వారం ప్రాంతీయసేవలో ఉపయోగించగల పత్రికల ఆధారంగా ఇతర అందింపు ప్రసంగములను సూచించవచ్చును. సాధ్యమైన ప్రతిచోట చందాకట్టుటకు ఆహ్వానించటంలోని ప్రాముఖ్యతను నొక్కిచూపుము.

15 నిమి: “ప్రారంభ మాటలు భేదాన్ని చూపగలవు.” ప్రేక్షకులతో శీర్షికను చర్చించుము. వారు ఇటీవలి మన రాజ్యపరిచర్య సంచికలలోని ఉపోద్ఘాతములను ఉపయోగించి చూశారా? వాటిలో చాలావరకు రీజనింగ్‌ పుస్తకములోనుండి తీసికొనబడినవే. స్థానిక ప్రాంతంలో ఏ ఉపోద్ఘాతములు ఎక్కువ ఫలవంతంగా ఉన్నట్లు వారు కనుగొన్నారు? ప్రచారకులు ఎప్పుడు వారి ప్రాంతీయ సేవ ఉపోద్ఘాతములను సిద్ధపడి, వాటిని అభ్యాసం చేస్తారు? స్థానికంగా ఎక్కువ ఫలవంతంగావున్న రెండు లేక మూడు క్లుప్తమైన ఉపోద్ఘాతములను ప్రదర్శించుము.

పాట 32 (10), ముగింపు ప్రార్థన.

జూన్‌ 15తో ప్రారంభమగు వారము

పాట 9 (82)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: “ఫలవంతమైన పునర్దర్శనములను చేయండి.” శీర్షికలోని కీలకమైన అంశములను ప్రేక్షకులతో చర్చించుము. పునర్దర్శనముద్వారా మరికొంత ఆసక్తిని పురికొల్పిన క్లుప్తమైన ఇటీవలి అనుభవమును చేర్చుము. స్థానిక ప్రాంతములో ఇటీవల ఆసక్తిచూపినవారిని తిరిగి దర్శించేందుకు సిద్ధపడుటకై ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులకు పుస్తక పఠన నిర్వాహకుడు ఎట్లు సహాయముచేయునో ప్రదర్శించుటకు చివరి ఆరు నుండి ఎనిమిది నిమిషములను ఉపయోగించుము.

20 నిమి: “యథార్థత ఏ మూల్యముతో?”—ది వాచ్‌టవర్‌, ఆగస్టు 15, 1990, పేజీలు 10-15. (ప్రాంతీయ భాష: కావలికోట, జూలై 1, 1991.) అభ్యాసయోగ్యమైన స్థానిక అన్వయింపుతో కూడిన ప్రసంగము.

పాట 65 (36), ముగింపు ప్రార్థన.

జూన్‌ 22తో ప్రారంభమగు వారము

పాట 202 (18)

10 నిమి: స్థానిక ప్రకటనలు, అక్కౌంట్స్‌ రిపోర్టు, విరాళములు ముట్టినట్లు తెల్పిన వివరములను చేర్చుము. సొసైటి ప్రపంచవ్యాప్త పనికి, స్థానిక సంఘానికి అందించిన విరాళముల నిమిత్తము సంఘాన్ని మెచ్చుకొనుము.

20 నిమి: “ఆత్మీయ గమ్యములు వెంటాడునట్లు ప్రోత్సహించుము.” ఒక పెద్ద ప్రేక్షకులతో కలిసి చర్చించే భాగం. పేరా 6ను పరిశీలించిన తరువాత ఆత్మీయగమ్యములను చేరుకొనుటకు ఇవ్వబడిన ప్రోత్సాహమునకు ప్రత్త్యుత్తరమిచ్చిన మాదిరికరమైన యౌవన ప్రచారకుని ఇంటర్వూచేయుము. ఆయన లేక ఆమె ఎలా ప్రోత్సహించబడ్డారు? పేరా 7ను పరిశీలించునప్పుడు యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ పుస్తకములో 22, 38, 39 అధ్యాయములను పునఃపరిశీలించుట ద్వారా తల్లిదండ్రులకు, యౌవనులకు లభించు ఆచరణాత్మకమైన ప్రయోజనములను సూచించుము.

15 నిమి: “ప్రశ్నా భాగము” పై పెద్ద ఇచ్చే ప్రసంగము.

పాట 213 (85), ముగింపు ప్రార్థన.

జూన్‌ 29తో ప్రారంభమగు వారము

పాట 220 (19)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. చందా సేకరణనుండి పొందిన అనుభవాలు. (సంఘములో పత్రిక చందాలను నిర్వహించే సహోదరుని సహాయముతో వీటిని ముందుగానే ఏర్పాటు చేసికొనుము).

15 నిమి: మత భ్రష్టత్వమునుండి మిమ్మును మీరు కాపాడుకొనండి. బల్లయొద్ద కూర్చొని పెద్ద మరియు ప్రచారకుని మధ్య చర్చజరుగును. ప్రచారకుడు మతభ్రష్టుల సాహిత్యమును చదువుతున్న ఒకరిని తాను సేవలో కలిశానని వివరిస్తాడు. పెద్దతో ఆ ప్రచారకుడు గృహస్థుడు నిష్కపటంగా ప్రశ్నలడిగాడని చెప్తాడు. ప్రచారకుడు, గృహస్థుడు ఇవ్వజూపిన అబద్ధమత మతభ్రష్ట సాహిత్యాన్ని తిరస్కరిస్తాడు, గాని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానము ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు. పెద్ద ప్రచారకునియొక్క మంచి స్వభావానికి, క్రియలకు మెచ్చుకుంటాడు. మతభ్రష్టులు వ్రాసినదానిని లేక చెప్పిన దానిని చర్చించే బదులు ఆయా విషయములపై రీజనింగ్‌ పుస్తకములో ఉన్న ప్రకారము లేఖన సంబంధమైన దృక్పథమునకు ధ్యానమిచ్చుట జ్ఞానయుక్తము. ఇద్దరూ కలసి పేజీలు 34-37 లను చర్చిస్తారు. సమయం లభించుకొలది, మతభ్రష్టత్వ నిర్వచనమును గూర్చి, పెద్ద అక్షరాలలోవున్న ఉపశీర్షికను, ఎన్నికచేయబడిన కీలక వచనమును వారు చర్చించునపుడు చర్చ ఉత్సాహవంతంగా, ప్రోత్సాహకరంగా ఉండవలెను. పఠనముకొరకు మనకు అందుబాటులోవున్న నిర్మాణాత్మకమైన, ప్రోత్సాహకరమైన సమాచారముపై అనుకూలమైన వ్యాఖ్యానములతో చర్చ ముగించుము. ఇంటివారితో నిర్మాణాత్మకమైన సమాచారమును పంచుకొనుము. అతడు నిష్కపటియైతే సత్యముయొక్క సరళతకును, మతభ్రష్టుల క్లిష్ట ధోరణికి మధ్యగల తారతమ్యమును గమనించగలడు. మతభ్రష్టుల ఆలోచనను సమాచారమును తిరస్కరించుట ద్వారా యెహోవాయెడలను, ఆయన దృశ్యసంస్థయెడలను మన యథార్థతను ప్రదర్శించెదము.

20 నిమి: “అనుదిన ఆత్మీయాహారము క్రైస్తవ కుటుంబమునకు తప్పక అవసరము.” సమాచారమును ప్రశ్నా సమాధానములతో చర్చించుట.

పాట 108 (95), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి