బైబిలు పఠనమును ప్రారంభించు గురితో తిరిగి వెళ్లుట
1 ఆసక్తిగల వ్యక్తిని మొదట కనుగొనిన తర్వాత, ఆ యాసక్తిని సజీవంగా నిలపాలంటే మనకు చురుకుదనము అవసరము. పునర్దర్శనములు చేయుట జీవమును కాపాడు బైబిలు చర్చలు, బైబిలు పఠనములకు నడుపగలవు. ఫలవంతమైన పునర్దర్శనములను చేయుటకు ఇవ్వబడిన సూచనలను పరిశీలించండి.
మొదటి సారి దర్శించి వచ్చునప్పుడు, చివరలో, మరలా దర్శించుటకు వీలుగా మీరు ఇలా అడగవచ్చును:
◼ “బైబిలు, దేవునివలన ప్రేరేపించబడినదా లేదా అని మీరెప్పుడైనా ఆలోచించారా?” మరలా తిరిగివెళ్లినప్పుడు మీరు ఇలా చెప్పవచ్చును: “నేను గతసారి వచ్చినప్పుడు బైబిలు ప్రేరేపితమైనదా, కాదా అనే ప్రశ్న లేవదీయబడింది. అయితే ఇందుకు విస్తారమైన సాక్ష్యమున్నది. ఈ ప్రశ్నను నేను తిరిగి పునఃపరిశీలించినప్పుడు నేను చూసిన ఒక ఆసక్తికరమైన సంగతిని మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను.” రీజనింగ్ పుస్తకము 60వ పేజివైపు త్రిప్పి సబ్ హెడ్డింగ్ క్రిందనున్న “ఎవిడెన్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్” భాగమును చదవండి.
2 బైబిలు ఈనాడు మనకు ఆచరణయోగ్యమైనదా? బైబిలు ఆచరణయోగ్యమైనది కావాలంటే అది దాని ప్రయోజనములను రుజువుగా చూపించవలెను.
పునర్దర్శనమును ప్రారంభించుటకు మీరు ఇలా అడుగవచ్చును:
◼ “బైబిలు సలహా ఒక వ్యక్తి ప్రవర్తనపై ఎట్లు ప్రభావము చూపవలెను?” ఎఫెసీయులు 4:23, 24లో పౌలు చెప్పినది బైబిలు మన జీవితములో ఎంత శక్తివంతమైన ప్రభావాన్ని కలిగియుండగలదో చూపుతుంది.” ది బైబిల్ గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకములో 175వ పేజి 1వ పేరా చివరి భాగమునుండి ఆ లేఖనమును నేరుగా చదవండి. పిమ్మట 163వ పేజినందలి చిత్రములనుండి తామేమి గమనిస్తున్నారో యింటివారిని అడగండి. “జ్ఞానుల సహవాసముచేయువాడు జ్ఞానవంతుడగును, మూర్ఖుల సహవాసముచేయువాడు చెడిపోవును.” తరువాత 163వ పేజి 2వ పేరా చివరి వరుసను చదువుము. “బైబిలు యొక్క నిరంతర జ్ఞానము, ఏ మానవులకంటెను ఉన్నతంగా మానవ సమస్యలను వివేకయుక్తంగా పరిశీలిస్తుంది. అదే, దానియొక్క ఉన్నతమూలమును రుజువుపరచుచున్నది. నేను మరలా తిరిగివచ్చినప్పుడు, బైబిలు ప్రేరేపితమైనదనుటకు ఇతర సాక్ష్యాన్ని చర్చిద్దాము.”
3 మనమెందుకు బైబిలును చదువవలెను? ది బైబిల్—గాడ్స్వర్డ్ ఆర్ మ్యాన్స్ అను పుస్తకమునుండే ఈ ప్రశ్నను చర్చించుటవలన అది బైబిలు పఠనమునకు దారితీయవచ్చును.
సంభాషణను ప్రారంభించుటకు మీరు ఇలా చెప్పవచ్చును:
◼ “నేడు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నందున, వారు ఏదైనా నమ్మదగిన నడిపింపును పొందగలమా అని తలంచుచున్నారు. ఈ విషయంలో బైబిలు ఆచరణాత్మకమైన సహాయమునకు, ప్రోత్సాహమునకు, అపరిమితమైన మూలమని నేను కనుగొన్నాను. కీర్తన 1:1, 2లో వ్రాయబడిన వాగ్దానమును మీకు చూపించాలని ఉంది. [చదివి, లేఖనముపై క్లుప్తముగా వ్యాఖ్యానించుము.] ది బైబిల్—గాడ్స్వర్డ్ ఆర్ మ్యాన్స్? పుస్తకము బైబిలు నమ్మదగినదనుటలో మన విశ్వాసమును పెంచుతుంది. అందులోని ఆచరణాత్మకమైన సలహాలపైకి మన అవధానమును మరల్చుతూ, అవి మన జీవితములో ఎట్లు అన్వయించగలవో చూపుతుంది. ఉదాహరణకు 170వ పేజి, 23 పేరాగ్రాఫ్ పైన ‘ప్రిన్స్పల్స్ దట్ రియల్లీ వర్క్’ అను సబ్హెడ్డింగ్ను గమనించండి. తర్వాత 23-26 పేరాగ్రాఫ్లను ఉపయోగిస్తూ బైబిలు పఠన ఏర్పాటును ప్రదర్శించుము. “వచ్చేవారం, బైబిలు నుండి ప్రయోజనము పొందాలంటే మనమేమిచేయాలనే దాన్నిగూర్చి మీతో చర్చిస్తాను.”
4 ప్రస్తుతం భూమిపైనున్న సర్వజనాంగములలో ఇవ్వబడుతున్న సంపూర్ణమైన సాక్ష్యములో పాల్గొనుటకు మిగిలివున్న సమయమును వివేకయుక్తంగా ఉపయోగించండి. (అపొ. 20:21ను పోల్చుము.) బైబిలు పఠనమును ప్రారంభించు గురితో మనము పునర్దర్శనములను చేయుటవలన, మనము ప్రకటించేవారికి అది నిత్యజీవము కాగలదు.